రామదాసు అని పిలువబడే కంచెర్ల గోపన్న భక్తిసంగీతమునకు కాణాచి. తఱువాతి కాలములోని త్యాగరాజువలె రామదాసు కూడ తన సర్వస్వాన్ని ఆ శ్రీరామునికే అర్పించాడు. ఆ రాములవారిని స్మరించాడు, నిందించాడు, స్తుతించాడు. రామదాసు ఎన్ని కీర్తనలను వ్రాసినాడో మనకు తెలియదు. సుమారు 250 – 300 అని అంచనా. ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము కొన్ని రామదాసు కీర్తనలలోని ఛందస్సును అందరికి తెలియబరచడమే.
రచయిత వివరాలు
పూర్తిపేరు: జెజ్జాల కృష్ణ మోహన రావుఇతరపేర్లు: J K Mohana Rao
సొంత ఊరు: మదరాసు
ప్రస్తుత నివాసం: ఫ్రెడరిక్, మేరీలాండ్, అ.సం.రా.
వృత్తి:
ఇష్టమైన రచయితలు: అందరు మహానుభావులు
హాబీలు: సాహిత్యము, సంగీతము, ముగ్గులు
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు.
జెజ్జాల కృష్ణ మోహన రావు రచనలు
ఈ ట్రిబొనాచ్చి సంఖ్యలను మొట్టమొదట అగ్రనోమోఫ్ అను శాస్త్రజ్ఞుడు 1914లో ప్రస్తావించెను. కాని అంతకుముందే ఏనుగుల జనసంఖ్యను వివరించుటకై ఛాల్స్ డార్విన్ తన కొడుకైన జార్జ్ హోవర్డ్ డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతమును గ్రహించెను. ఇది ఒక మేధోప్రహేళిక.
నేడు తెలుగులో వందకుపైన గౙల్ రచయితలు ఉన్నారని అంచనా. కాని ఆ గౙలులలో గౙల్ ఛందస్సు మాత్రము మృగతృష్ణగా మిగిలినది. ఈ పరిస్థితి ఎందుకు తెలుగు గౙలులకు అనే ప్రశ్నకు గౙల్ ఛందస్సు విదేశీయము, మన తెలుగు భాషకు సరిపోదు అన్నది ఒక ముఖ్య వాదము. ఇందులో ఇసుమంత కూడ సత్యము లేదు. అసలు ఈవాదమును లేవనెత్తినవారు గౙల్ ఛందములను చదివినారా అనే సందేహము కలుగుతుంది.
అరబ్బీ, పారసీక కవిత్వములో ముఖ్యమైన ప్రక్రియలు నాలుగు: అవి గజల్, ఖసీదా, మస్నవీ, రుబాయి. చాలమందికి గజల్, రుబాయీలు పరిచయమే. వీటిలో ఒక పాదమును మిస్రా అంటారు; రెండు పాదములను శేర్ అంటారు. రెండు శేర్‌లు ఒక రుబాయీ. అనగా రుబాయీ ఒక చతుష్పది. అరబ్ భాషలో అర్బా అంటే నాలుగు అని అర్థము.
ఒకటి నుండి 26 అక్షరముల వఱకు 184217726 వృత్తములు సాధ్యము. అందులో కొన్ని వృత్తములకు ఒకే గణము పదేపదే వచ్చునట్లు అమరికలు ఉంటాయి. అన్ని మ-గణములతో విద్యున్మాల, య-గణములతో భుజంగప్రయాతము, ర-గణములతో స్రగ్విణి, స-గణములతో దుర్మిల, తగణములతో పద్మనాభ, జ-గణములతో మౌక్తికదామ, భ-గణములతో మానిని, నగణములతో చంద్రమాల వంటి వృత్తములు ఉన్నాయి.
సంతోష సన్నివేశములకు, త్వరితగతిని సూచించుటకు, ప్రాసానుప్రాసలను ఉపయోగించి గానయోగ్యముగా నుండు వృత్తములలో మానిని, కవిరాజవిరాజితములు అత్యుత్తమ శ్రేణికి చెందినవి. నేను కొన్ని సంవత్సరములుగా పరిశోధించి కనుగొన్న విశేషమేమంటే, తాళవృత్తములను మాత్రాగణములకు తగినట్లు పదములను ఎన్నుకొని వ్రాసినప్పుడు అవి గానయోగ్యముగా నుండి ఛందస్సు సంగీత సాహిత్యముల రెండు ముఖములని తెలుపుతుంది.
పాదములోని మాత్రల విఱుపు, పదముల విఱుపు పద్యములకు ఒక క్రొత్త విధమైన అందమైన అద్భుతమైన నడకను ప్రసాదిస్తుంది. లేకపోతే పద్యమనే చట్రములో పదాడంబరముతో వచనమును వ్రాసినట్లు ఉంటుంది. ఛందస్సు శారదాదేవి రెండు స్వరూపములైన సంగీత సాహిత్యములకు ప్రతీక. సంగీతము లేని సాహిత్యము బధిరత్వమే, సాహిత్యము లేని సంగీతము అంధత్వమే. అప్పుడే ఛందస్సు పాత్ర సార్థకమవుతుంది.
కన్నడ తెలుగు భాషలు గురు లఘువుల భావమును సంస్కృత ప్రాకృత ఛందస్సులనుండి గ్రహించినది. రెండు, మూడు, నాలుగు గురువుల ప్రస్తారమువలన దేశి ఛందస్సులోని గణములను గ్రహించుకొన్నవి. వీటి అసలు పేరులు రతి, మదన, బాణ లేక శర గణములు.
సంస్కృత వృత్తములను ఏవిధముగా ఎనిమిది త్రిక గణములతో, నాలుగు రెండక్షరముల గణములతో, రెండు ఏకాక్షరపు గణములతో వివరించగలమో, అదే విధముగా దేశి ఛందపు వృత్తములను కూడ బ్రహ్మ, విష్ణు గణములతో, ఒక గురువు, రెండు లఘువులతో వివరించ వీలగును.
జావాలో సంస్కృత పదములతో కూడుకొన్న ప్రాచీన జావాభాషలో కావ్యములను వ్రాసినారు అక్కడి కవులు. వీటిని కాకవిన్ అంటారు. కాకవిన్ రామాయణము మొట్టమొదట వెలువడినది. అది సంస్కృత ఛందములలో వ్రాయబడినది. అంతే కాదు, అక్కడి కవులు, లాక్షణికులు క్రొత్త ఛందములను కూడ కల్పించినారు.
కావున నా సూచన ఏమనగా ఋ-కారమునకు యతి బహుళము చేయవలయునని. అనగా రి-కారము, రు-కారము రెండింటితో చెల్లించుటకు శాస్త్రబద్ధముగా అనుమతి నొసగవలెనని. ఈ శాస్త్రసమ్మతి విశ్వవిద్యాలయముల ద్వారా, భాషాశాస్త్రజ్ఞులద్వారా, పండితులద్వారా, ప్రభుత్వము ద్వారా జరుగవలయును. అంతేకాక విలోమ ఉపయోగమును కూడ బహిష్కరించవలెను.
సామాన్యముగా ఉదాహరణములలో ప్రతి విభక్తికి మొదటి పద్యము ఒక వృత్తము, తఱువాత కళికోత్కళికలుగా రగడ భేదములను వ్రాయవలెను. అంతములో ఒక సార్వ విభక్తిక పద్యముండును. కళికోత్కళికలు లేక కూడ ఉదాహరణములను కొందఱు కవులు వ్రాసిరి. దేవీనవరాత్రుల పండుగ సమయములో అలాటి ఉదాహరణమును ఒకదానిని నేను వ్రాసినాను. దేవికి ఆర్య అని కూడ పేరు, కావున ఈ పద్యములను ఆర్యాభేదములలో వ్రాసినాను. కావున ఇది ఆర్యోదాహరణము!
బడిలో చదువుకొనేటప్పుడు మనము ఉత్పలమాలకు గణములు భ/ర/న/భ/భ/ర/వ, శార్దూలవిక్రీడితమునకు గణములు మ/స/జ/స/త/త/గ, ఇలా చదువుకొని జ్ఞాపకములో పెట్టుకొనేవాళ్ళము. ఒక్కొక్కప్పుడు అనిపించేది మఱేదైనా సులభ మార్గము ఉంటే బాగుంటుందని. సార్థకనామ గణాక్షర వృత్తములలో ఈ ఇబ్బంది ఉండదు. గణముల పేరులు వృత్తముల పేరులో ఉంటాయి.
త్రిభంగి అంటే మూడు భంగములు గలది. భంగము అంటే ఇక్కడ విఱుపు. అనగా పాదము స్పష్టముగా మూడు విఱుపులతో నుండాలి. ఈ విఱుపులకు అంత్యప్రాస కూడ ఉంచుట వాడుక. సామాన్యముగా మూడు అంత్యప్రాసలు ఉంటాయి. ఈ త్రిభంగి పుట్టు పూర్వోత్తరాలు సరిగా తెలియవు.
ప్రతి వృత్తమునకు ఒక విలోమ వృత్తము గలదు. అవి రెండు ఆ ఛందపు సంపూర్ణత్వమును సూచిస్తాయి. సంస్కృతములో పద్యపు పాదము గుర్వంతము. కాని ద్రావిడ భాషలలో దేశి ఛందస్సులో పాదములు ఎక్కువగా లఘ్వంతములు. ఇది విలోమ గీతులలో ప్రస్ఫుటము.
తెలుగులో అంత్యప్రాస రగడలకు తప్పనిసరి. మిగిలిన ఛందములకు ఐచ్ఛికము. కొందఱు ద్విపదకు కూడ పాటిస్తారు. రగడలకు, ద్విపదలకు పాదాంత విరామయతి నియతము అన్న మాటను మఱువరాదు ఈ సందర్భములో.
వనమయూరములాటి వృత్తములు తమిళములోని తేవారములో గలవు. తెలుగులో పంచమాత్రల ద్విపదలయ కూడ ఇట్టిదే. కన్నడములో కర్ణాట చతుష్పది అమరిక కూడ ఇట్టిదే. వీటిలో మూడు పంచమాత్రలు, ఒక త్రిమాత్ర ఉంటాయి. పాదాంత యతివలన, త్రిమాత్రను కొనసాగించి వనమయూరపు లయను సృష్టించ వీలగును. నాగవర్మ, జయకీర్తులకు తెలుగు ద్విపద పరిచితమై ఉండుటకు అవకాశము ఉన్నది.
సీసము అనే పదము శీర్షకమునుండి జనించినది. శీర్షకమును శీర్షము అని కూడ అంటారు. ఈ శీర్షక, శీర్ష పదములు సీసకము, సీసములుగా మారినవి తెలుగులో. సీసపద్యమునందలి సీసమునకు లోహవిశేషమైన సీసమునకు ఏ సంబంధము లేదు. శీర్షకము అనే ఛందస్సును మనము నాట్యశాస్త్రములో చదువవచ్చును. దీని ప్రకారము ఎనిమిది వృత్తములలో ఏదైన ఒకదానిని, లేక ఒకటికంటే ఎక్కువ వృత్తములను వ్రాసి చివర ఒక గీతిని రచించినప్పుడు అది శీర్షకము అనబడును.
ఈ పుస్తకము ఎందుకు ముఖ్యమైనదో అనే విషయమును పరిశీలిద్దామా? సంస్కృతములో మనకు దొఱికిన కావ్యములలో ఇది పురాతనమైనది. అంటే అంతకు ముందు కావ్యాలు ఉన్నాయో లేవో మనకు తెలియదు. బహుశా ఉండి ఉండవచ్చును. అవి ఏలాగుంటాయి అన్నది ఊహాగానమే. ఇది మొట్ట మొదటి కావ్యము.
సంస్కృతములో శ్లోక ఛందస్సు మూలము, కాలక్రమేణ జరిగిన మార్పులు, అందులోని విభిన్న రీతులు మున్నగువానిని సోదాహరణముగా వివరించినాను. శ్లోకపు నడకతో క్రొత్త విధములైన అర్ధసమ వృత్తముల సృజననుగుఱించి కూడ తెలియబఱచినాను. అంతే కాక 16 అక్షరముల అష్టి ఛందములోని ప్రతి పాదములో రెండు శ్లోక పాదములను ఏ విధముగా ఉంచి వ్రాయవచ్చునో అనే సంగతిని కూడ మీముందు పెట్టినాను.
ఈ శ్యామలా దండకమును మహాకవి కవికులతిలకుడు కాలిదాసు వ్రాసినాడని ప్రతీతి. ఈ చాటుకథ జగద్విదితమే. మూర్ఖుడైన కాలిదాసు సౌందర్యవతి, విద్యావతియైన రాజుగారి కుమార్తెను వివాహమాడి ఆమెచే కనుగొనబడి కాళికాదేవివద్ద పంపబడి ఆ దేవిని ధ్యానించి ఆ దేవిచే నాలుకపైన బీజాక్షరములను వ్రాయించుకొని ఆ దేవిని ఈ దండకము ద్వారా స్తుతించినట్లు కథ. ఇక్కడ రెండు సందేహాలు ఉదయిస్తాయి.
నాకు నచ్చిన వృత్తములలో మందాక్రాంతము ఒకటి. అందులో ఒక గాంభీర్యము, ఒక విభిన్నమైన గతి దాగి ఉన్నాయి. కాలిదాసకవి వ్రాసిన మేఘదూతము ద్వారా ఈ వృత్తము మిక్కిలి ప్రసిద్ధి కెక్కినది. ఈ వృత్తపు పుట్టుక, ఇందులో వ్రాయబడిన సందేశ కావ్యములనుగుఱించి ఇంతకు ముందే నేను ఆషాఢస్య ప్రథమ దివసే అనే వ్యాసములో చర్చించి యున్నాను.
సమాజములో స్త్రీ స్థానాన్ని గురించి ఇప్పుడు కూడ వాదాలు, వివాదాలు తగ్గకుండా ఉన్నాయి. కాని నియంతలైన రాజులు, సుల్తానులు పరిపాలించే కాలములో రాణీవాసాన్ని ఒక్క చిరునవ్వుతో తిరస్కరించి తన ఇష్టాయిష్టాలకు మాత్రమే విలువ నిచ్చిన యువతి ఒకామె జీవించి ఉన్నదనడము నిజముగా గర్వ కారణమే.
సంస్కృతములో విసమ లేక విషమ వృత్తములలో మూడు పాదములు ఒక విధముగా, ఒక పాదము వేఱొక విధముగా లేకపోతే అన్ని పాదములు వేఱువేఱు విధములుగా ఉంటాయి. ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము విషమ వృత్తమైన ఉద్గతా(త) వృత్తమును వివరించి అందులో దాగియున్న తాళవృత్తముల మూసలను కూలంకషముగా చర్చించుటయే.
రేచన వ్రాసిన కవిజనాశ్రయము మొదటి తెలుగు గ్రంథము కాదని శాసనముల, తదితర ఆధారముల ద్వారా నిరూపించబడినది. కొన్ని శతాబ్దములకు ముందు ఛందోనియమముల కొఱకు వాడబడిన హలంతములైన పదములను అజంతములుగా ఉచ్చరించేవారని శాసనముల ద్వారా నిరూపించడమైనది.
తెలుగు, కన్నడము, హిందీ, మరాఠీ మున్నగు భాషలలో గణములను జ్ఞాపకములో ఉంచుకొనడానికి య-మా-తా-రా-జ-భా-న-స-ల-గం అనే ఒక సులభసూత్రము వ్యాప్తిలో నున్నది. ఛందస్సు నేర్చుకొనే విద్యార్థికి ఇది తెలిసిన విషయమే. గణము యొక్క పేరు ముందే ఉండడము వలన అందులోని గురు లఘువులను తెలిసికొనుట సులభము అవుతుంది.
ఈ పాటలను ఎలా పాడాలి, ఎవరైనా పాడియున్నారా అనే విషయము నాకు తెలియదు. కాని ఇట్టి పాటలను అందఱు పాడే విధముగా ఒక స్థాయి కన్న తక్కువగా ఒక half octaveలో ఇమిడేటట్లు పాడుకొంటారు. అందు వలన సంగీతములో తరిఫీదు ఉన్నవారు, మంచి శారీరము ఉన్నవారు మాత్రమే వీటిని పాడుటకు అర్హులు అని భావించరాదు.
శ్రీరామ భూపాలు డా – సీతతో
జేరి చనెఁ గాననములో
వారితోఁ దా వెళ్ళెఁగా – వదలకను
వారిజాక్షుని నీడగా
ఘోర కాంతారములలోఁ – గూర్మితో
దూరముల గడచె నతఁడున్
చారుహాటకరూపుఁ డా – సౌమిత్రి
వీరవిక్రముఁడు గాదా…
పద్యములకు పేరులను లాక్షణికులు ఎలా పెట్టారో? ఒకే పద్యానికి ఎన్నో పేరులు, ఒకే పేరుతో ఎన్నో పద్యాలు! వృత్తపు పేరును బట్టి గణనిర్ణయము సాధ్యమా? క్రొత్త వృత్తములకైనా ఇలా చేయవచ్చు గదా? ఇంతవఱకు నేను సుమారు 150కి పైన ఇట్టి సార్థకనామ గణాక్షర వృత్తములను కల్పించినాను. అందులో అరవై వృత్తములను ఇక్కడ మీకు పరిచయము చేస్తున్నాను.
మార్కస్ బార్ట్‌లీ దక్షిణభారత సినీఛాయాగ్రాహకులలో ఆయన అద్వితీయుడు. పాతాళభైరవి, జగదేకవీరుని కథ, గుణసుందరి కథ, మాయాబజార్ వంటి సినీమాలలో బార్ట్‌లే చూపిన కెమేరా కౌశలం ఇప్పటికీ చలన చిత్రాభిమానులకు ఆశ్చర్యం కలగజేస్తూనే ఉంది.
ఇది యుగాది సమయము. వసంతఋతువుతో ప్రారంభమవుతుంది క్రొత్త సంవత్సరము. ఈ హేవిలంబినామ సంవత్సరమును కొన్ని వసంతతిలకములతో, ఆ లయ ఉండే పద్యములతో శుభాకాంక్షలతో ఆహ్వానిద్దామా?
గడచిన నెల వ్రాసిన వ్యాసములో ఉదాహరణముల ఉత్పత్తిని, వాటి నియమములను, విభక్తులను గుఱించిన విశేషములను, రగడల లక్షణములను చర్చించినాను. ప్రతి విభక్తికి నిదర్శనముగా కొన్ని ప్రసిద్ధమైన ఉదాహరణ కావ్యములనుండి వృత్తములను, కళికోత్కళికలను నిదర్శనములుగా చూపినాను. ఇప్పుడు నేను వ్రాసిన శారదోదాహరణతారావళి అనబడు ఒక ఉదాహరణకావ్యమును మీకు సమర్పిస్తున్నాను.
తెలుగు సాహిత్యములోగల పలు ప్రత్యేకతలలో ఉదాహరణము మిక్కిలి ప్రసిద్ధి యైనది. ఉదాహరణము అనగా ప్రతియొక విభక్తితో మూడు చొప్పున పద్యములు వ్రాసి చివర అన్ని విభక్తులతో ఒక పద్యమును వ్రాయుట. అంకితాంకముతో మొత్తము ఇరువదియాఱు పద్యములతో వ్రాయబడిన ఇట్టిది ఒక లఘుకావ్యము లేక క్షుద్రకావ్యము. ఇది చతుర్విధ కవితలలో మధుర కవిత వర్గమునకు చెందినది.
అంగనా మంగనా మంతరే మాధవః
మాధవం మాధవంఽచాంతరేఽణాంగనా
ఇత్థ మాకల్పితే మండలే మధ్యగః
సంజగౌ వేణునా దేవకీ నందనః
తమిళములో పా అంటే పాట అని చెప్పవచ్చును. ప్రాచీన తమిళ ఛందస్సులో ప్రసిద్ధికెక్కిన ‘పా’ ఛందస్సులు – వెణ్బా, ఆశిరియప్పా, కలిప్పా, వాంజిప్పా, మరుట్పా.ఈ వ్యాసములో వెణ్బాగుఱించి మాత్రమే చర్చిస్తాను. వెణ్ అనగా తెలుపు అని, పా అనగా పాట అని అర్థము, కాబట్టి వెణ్బాను ధవళగీతి అని పిలువవచ్చును.
సంస్కృత, కన్నడ-తెలుగు, తమిళ, మాత్రా ఛందస్సు, నేను కొత్తగా ప్రతిపాదించిన ఛందస్సులో గణముల సంఖ్య ఒక గుణశ్రేఢి. సామాన్య నిష్పత్తి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. అందులో కొన్నిటికి Pascal triangleతో కూడ సంబంధము ఉన్నది.
తెలుగు భాషలో ఒక నూతన కవితాశైలికి నాందీవాక్యమును పలికిన మహాప్రస్థానంలో ఎన్నో రకములైన మాత్రాఛందస్సులను శ్రీశ్రీ వాడినాడు. ఛందస్సు సర్పపరిష్వంగము నుండి విముక్తుడనయ్యానని చెప్పుకొన్న శ్రీశ్రీ గేయములలో రసానుభూతి కోసం ఎన్నో ఛందస్సులను పాటించాడు.
చతుర్మాత్రలతో పాటలు అన్ని భాషలలో నున్నవి. చతుర్మాత్రలతో అష్టమాత్రలను చేర్చి వ్రాసినప్పుడు వాటికి ఒక ప్రత్యేకమైన అందము కలుగుతుంది, నడకలో వైవిధ్యము పుట్టుతంది. ఇట్టి అమరికలు ఈ వ్యాసములో వివరించినట్లు ఛందశ్శాస్త్రములో గలవు. కాని వాటిని వెలికి ఇంతవఱకు ఎవ్వరు తీసికొని రాలేదు. ఈ నా ప్రయత్నము గానయోగ్యమైన ఛందస్సులను కల్పించుటకు సహాయకారిగా నుంటుందని భావిస్తాను.
పదములు
పాడెదన్,
పిలిచి వలపుల
పీటను వేతు,
పుల్కలన్ బెదరుచు
పూతు గంధమును,
పృథుకము
పెట్టెద నావుపాలితో ముదమున,
పేద
పైదలియు
పొగడ సరాలను
పోహణింతు, నీ సుదినము
పౌర్ణమిన్ బ్రదుకు శుభమవ,
పండ త–
పః ఫలమ్ము రా!
గీతులు అనగా గానయోగ్యములైన ఛందస్సులు. అన్ని భారతీయ భాషలలో పాటలకు అనువైన ఛందస్సులను లాక్షణికులు కల్పించినారు. సంస్కృతములోని ఆర్య తొమ్మిది విధములు, అందులో ప్రత్యేకముగా నాలుగింటిని గీతులు అని పేర్కొన్నారు. అందులో ఆర్యాగీతి కన్నడ తెలుగు భాషలలోని కంద పద్యమే. అంతే కాక వైతాళీయములు తాళయుక్తముగా పాడుకొనదగినవే. ప్రాకృతములో కూడ గేయములకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చారు. అనాదినుండి కన్నడ తెలుగు భాషలలో కూడ ఇట్టి గానయోగ్య ఛందస్సులు గలవు. కన్నడములో త్రిపద, అక్కరలు, రగడలు, తెలుగులో ద్విపద, తరువోజ, సీసము, ఆటవెలది, తేటగీతి, అక్కరలు, రగడలు ఇట్టి ఛందస్సులే.
వివిధ దైవ స్తోత్రములలో అక్షరమాలా స్తోత్రము ఒకటి. మృత్యుంజయ స్తోత్రములో ప్రతి పంక్తి అ, ఆ, ఇ, ఈ ఇత్యాదులైన అక్షరములతో ప్రారంభమై క్ష-కారముతో అంతమవుతుంది. అక్షరములతో ప్రారంభించు పంక్తులకు బదులు అకారాది అక్షరములతో ప్రారంభమగు వృత్తములతో పద్యములను వ్రాయవలయుననే ఒక ఆలోచన ఫలితమే ఈ ప్రయత్నము.
రెండు దక్షిణ భాషల సాహిత్య సంపద ఈ శార్దూలవిక్రీడితములో ఒక కవి చేసిన ఒక చిన్న మార్పుతో ముడివేయబడినది. పడమటి చాళుక్య చక్రవర్తి రెండవ పులకేశి సత్యాశ్రయుని కాలములో రవికీర్తి అనే ఒక కవి ఆ రాజును పొగడుతూ వ్రాసిన పద్యములు ఐహొళె శిలాశాసనములలో ఉన్నాయి. ఇది క్రీస్తుశకము 634 కాలము నాటిది.
తెలుగు సాహిత్యపు ఛందోగగనములో మిక్కిలి ప్రకాశవంతముగా మెరిసే మినుగుతార కందపద్యము. ఒక చిన్న పద్యములో అనేకానేక భావములను సంతరించుకొనే శక్తి సామర్థ్యములు గలిగిన పద్యము కందపద్యము. ఇట్టి కంద పద్యపు పుట్టు పూర్వోత్తరాలను, అందచందాలను, భూతభవిష్యత్తులను నా శక్తి మేరకు ఈ రెండు వ్యాసములలో తెలిపినాను.
సుమారు రెండు వేల సంవత్సరాలకు ముందే సంస్కృతప్రాకృతములలో, సుమారు 1300 సంవత్సరాలకు ముందు కన్నడములో, సుమారు 1100 సంవత్సరాలకు ముందు తెలుగులో కంద పద్యములు ఉండినవి, ఆంధ్ర మహాభారతములో మూడింట ఒక పద్యము కంద పద్యమే. అందుకే కంద పద్యమును అందముగా వ్రాయని, వ్రాయరాని, వ్రాయలేని వాడు కవి కానేరడు అంటారు.
డా. ఏల్చూరి మురళీధరరావు నవంబరు 2013 ఈమాటలో వ్రాసిన ‘కుమారసంభవంలో … ‘ అన్న వ్యాసానికి ప్రతిగా నా ఈ వ్యాసంలో నన్నెచోడుడు ప్రబంధయుగము తఱువాతవాడు కాదని, కవిజనాశ్రయ ఛందోగ్రంథమునకు ముందే కుమారసంభవమును వ్రాసినాడని వివరిస్తున్నాను.
ఇంపగు కెంపుల జొంపలొ
సొంపగు బంగారు రేకు – సొగసుల సిరులో
వంపుల మరకతవల్లులొ
నింపెను కంబళమువోలె – నేలను నాకుల్
ఈ రచన ముఖ్యోద్దేశము శ్రీవిష్ణుమూర్తి యెత్తిన దశావతారములను సార్థకనామవృత్తములలో వర్ణన చేయడము. శ్రీజయదేవకవిలా మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, బుద్ధ, కల్కి అవతారములను దశావతారములుగా ఎన్నుకొన్నాను.
త్రిపదల వెనుక ఇంత గొప్ప చరిత్ర దాగి ఉన్నదన్న సంగతి చాల మందికి తెలియక పోయినను, అందఱికి హైకూలను గుఱించి తెలిసి ఉంటుంది. హైకూ ఒక త్రిపద – మొదటి మూడవ పంక్తులలో ఐదు అక్షరములు, రెండవ పంక్తిలో ఏడు అక్షరాలు ఉంటాయి యిందులో. పదములకన్న ఆ పదములు సృష్టించిన చిత్రములు హైకూ ప్రత్యేకాకర్షణ.
పరిచయము కవితలను వచనరూపముగా, పాటలుగా, పద్యములుగా వ్రాయవీలగును. ఇందులో వచన కవితా రచనలో తగినంత స్వేచ్ఛ ఉంటుంది. పద్యములు గణబద్ధమైనవి. అనగా, పద్యాల లోని […]
ప్రతివాది భయంకర శ్రీనివాస్ గొప్ప గాయకులు మాత్రమే కాదు, గొప్ప కవి కూడ. వారు 26 అక్షరములకన్న ఎక్కువ అక్షరములు గల వృత్తములను, సార్థక నామ వృత్తములను సృష్టించియున్నారు. వారి స్మృతి చిహ్నముగా వారి పేరుతో పాదమునకు 34 అక్షరములు గల సి-రి-ని-వా-స వృత్తమును కల్పించి వారిపై ఒక పద్యమును వ్రాసినాను.
పుప్పొడి అనే కవితలో పంక్తుల సంఖ్య ఆఱు మాత్రమే. కాని అది చదివినప్పుడు కలిగిన అనుభూతి అపారమైనది. 25 సంవత్సరాలకు ముందు కార్ల్ సేగన్ మనమంతా, అంటే ఆ ఆకాశము, అందులోని ఎన్నో పాలవెల్లులు, మన సౌర కుటుంబము, దానిలోని మన భూమి, అందులో అన్ని జీవజాలాలు అంతా ఆ ఖగోళ బీజము నుండి పుట్టిన అణువులు అని చెప్పిన మాట స్మృతిలో నిద్దుర లేచింది.
చుక్కలను తాకకుండ వాటి చుట్టు ముగ్గుపొడితో, తడి పిండితో చిత్రవిచిత్రములైన ఆకారములను సృష్టించుటకు వీలవుతుంది. వీటిని మెలిక ముగ్గులు లేక మువ్వల ముగ్గులు అంటారు. వీటిని జాగ్రత్తగా వేసినప్పుడు ఇందులో ముడులు కనబడుతాయి. ఇవి త్రాటితో లేక త్రాళ్ళతో నేసిన తివాచీలలా కూడ ఉంటాయి. ఇవియే నిజమైన మెలిక ముగ్గులు.
[పరిచయ వ్యాసం] పసు-వఇణో రోసారుణ-పడిమా-సంకంత-గోరి-ముహ-అందం గహిఅగ్ఘ- పంకఅం విఅ సంఝా-సలిలంజలిం ణమహ పశుపతే రోషారుణ-ప్రతిమా-సంక్రాంత-గౌరీ-ముఖ-చంద్రం గృహీతార్ఘ-పంకజమివ సంధ్యా-సలిలాంజలిం నమత సందెజపమ్మును జేయగ కెందామర దోసిలి […]
ఈ పద్యాలలో విష్ణువుపైన పద్యాలు ఉన్నాయి, శివుడిపైన ఉన్నాయి, బుద్ధుడిపైన ఉన్నాయి. శాతవాహన సామ్రాజ్యములోని మత సామరస్యమును ఇవి తెలుపుతుంది. ఇందులో సుభాషితములు ఉన్నాయి. సంభోగ శృంగారము, విప్రలంభ శృంగారము రెండు ఉన్నాయి.
పారసీక ఉర్దూ భాషలలో మత్తకోకిల లయను బహర్ రమల్ ముసమ్మన్ మహజూఫ్ అంటారు (బహర్ అంటే పద్యము లేక వృత్తము). దీని సూత్రము ఫాయలాతున ఫాయలాతున ఫాయలాతున ఫాయలున్. దీనిని మన గురులఘువులవలెనే వివరిస్తారు. గాలిబ్ వ్రాసిన సబ్ కహాఁ కుఛ్ లాలహ్ ఓ గుల్ మేఁ నుమాయా హో గయీ అనే గజల్ ఈ లయలోనిదే.
కుబేరుని కొలువులో ఉండే యక్షుడు శాపగ్రస్తుడై ఒక యేడు తన భార్యకు దూరముగా విరహవేదనతో తపిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఆ సమయములో వర్షాకాలము ఆసన్నమవుతుంది. ఆకాశములోన మేఘాన్ని చూచి నీవు నా దూతగా వెళ్ళి అలకానగరములో ఉండే నా భార్యను కలిసి నా ప్రేమ సందేశాన్ని అందించమని ప్రాధేయపడుతాడు.
ఇక్కడ మీకు వినిపిస్తున్న ‘మేఘసందేశం’ సంస్కృత సంగీత రూపకం 1978లో బెంగుళూరు రేడియో కేంద్రం ద్వారా ప్రసారితమయ్యింది. అప్పట్లో రజనిగారు బెంగుళూరు స్టేషన్ డైరెక్టరుగా పనిచేసేవారు. దీని సంస్కృత రచన, సంగీత నిర్వాహణ చేసినది రజనిగారే. ఆయన గొంతును కూడా వినవచ్చు. యక్షునిగా ప్రధాన గాత్రధారి శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ.
జేబున్నీసా ఔరంగజేబుకు ప్రియమైన కూతురు. రాజకీయ విషయాలలో ఆమెను సంప్రదించేవాడు. ఆమె తన పెద తండ్రి దారా షికోయొక్క ప్రభావము, ప్రోత్సాహము వలన కవిత్వము వ్రాయడానికి ఆరంభించినది. ఆమెకు అరబీ, పారసీక భాషలలో ప్రావీణ్యత ఎక్కువ. తన తండ్రి ఔరంగజేబ్‌వలె ఆమె భావాలు సంకుచితము కావు.
వసంతము చైతన్యాన్ని చూపిస్తే, వర్షాకాలము జీవితములో ఉచ్ఛదశను చూపిస్తుంది. ఆకురాలు కాలము సంపూర్ణత్వాన్ని, తృప్తిని చూపిస్తే, శీతాకాలము తహతహను, నిరీక్షణను సూచిస్తుంది. ఈ ఋతువులకు అనుగుణముగా వసంతతిలకము, వనమయూరము, కనకప్రభ, వియోగిని వృత్తాలను యెన్నుకొన్నాను.
ముగ్గులను రెండు రకాలుగా వేయవచ్చును – ఒకటి చుక్కలు పెట్టి ముగ్గులు వేయడము, మరొకటి చుక్కలు లేకుండా రంగులు నింపి వర్ణచిత్రాలుగా వేయడము.
ఒక మందు వ్యాపార యోగ్యం కావడానికి కనీసం పది నుండి పదిహేను ఏళ్ళు పడుతుంది. ఒక్క వ్యాధికి వేల వేల రసాయన మిశ్రణాలను పరీక్షిస్తే ఒక్కటి చివరకు ప్రభుత్వ ఆమోదాన్ని పొందవచ్చు. ఈ వ్యవహారానికంతటికీ కొన్ని కోట్ల డాలర్లు ఖర్చవుతుందని ఔషధ పరిశ్రమ అంచనా.
ఏసో అంగే పులకమయ పరశే
ఏసో చిత్తే సుధామయ హరషే
రమ్ము అంగము పులకించ తాకుచు
రమ్ము చిత్తము హరుసించ నవ్వుచు
రాధికాసాంత్వనము ప్రచురితమైన సంవత్సర కాలం తరువాత, 1911లో, ‘శశిలేఖ’ అన్న పత్రికా సంపాదకులు ఇది అశ్లీల కావ్యమని అభ్యంతరం లేవనెత్తటముతో, ఈ పుస్తకం నిషేధింపబడి తెలుగు సాహిత్య, ప్రచురణా రంగములలో పెద్ద కార్చిచ్చు రేగిల్లినది.
పువ్వులో, యవి పుష్యరాగపు
రవ్వలో, యవి రజత వృక్షపు
రివ్వలో, యవి ఋతుకుమారికి
నవ్వులో, దువ్వల్
సూచన తమిళ లిపిని తెలుగులో వ్రాయడములో పాటించిన కొన్ని నియమాలను మీకు తెలుపుతున్నాను. తమిళములో వర్గాక్షరములు తక్కువ. క, ఖ, గ, ఘ అక్షరాలను […]
తిరుక్కుఱళ్‌లో నేడు 1330 పద్యాలు దొరుకుతాయి. వీటిని మూడు వర్గాలుగా విభజిస్తారు, అవి – అఱత్తుప్పాల్ (ధర్మ వేదము), పొరుట్పాల్ (అర్థ వేదము), కామత్తుప్పాల్ (కామవేదము). కామత్తుపాల్ అనబడే కామవేదములో 250 పద్యాలు ఉన్నాయి.
శతక వాఙ్మయానికి పెట్టింది పేరు తెలుగు భాష. సుమారు రెండవ శతాబ్దము నుండి నేటివరకు కవులు శతకాలను వ్రాస్తూనే ఉన్నారు. ఈ రచనలో కొందరి దృష్టి ఇహపరసాధన మయితే, మరి కొందరిది నీతిప్రబోధం. ఇంకా కొందరిది శృంగారం.
శ్రీశ్రీ చతుర్మాత్రలలో జ-గణాన్ని ఉపయోగించడం మాత్రమే కాక వాటిని మొదట కూడా పెట్టాడు. ఇది శ్రీశ్రీ ఒక ప్రత్యేకమైన సాధన. అన్ని పాదాలు ఎదురు నడకతో ప్రారంభమయితే ఒక గమనము, ఉరుకు వస్తుంది.
రెండు రోజుల సమావేశాలు సాహిత్యపరంగా చాలా ఆసక్తికరంగా జరిగాయి. దీనికి డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్బు ఎంతో కష్టపడి విజయవంతం చేశారు. పాత మిత్రులను కలవడానికి, కొత్తవారితో పరిచయం చేసికొనడానికి అవకాశం దొరికింది.
ఈ రోజు నేను కూడా ఒక తండ్రిని, నా పిల్లలు విదేశీవాతావరణంలో పెరిగిన వాళ్ళు. ఫాదర్స్ డే రోజు బహుమతులను లేక విందు భోజనాలను లేక ఫోన్‌లో హర్షాభినందనలను ఇస్తారు.
మన శరీరంలోని కుడి ఎడమ భాగాలు సరాసరి బింబప్రతిబింబాలే. ముఖ్యంగా మన చేతులు ఈ దర్పణ సౌష్ఠవానికి ఒక గొప్ప ఉదాహరణ. కుడి ఎడమయితే వచ్చే పొరపాటు ఇంతింత కాదు!
సుమారుగా 1940 నుండి 1960ల పూర్వార్ధపు మధ్యకాలం చిత్రసంగీతానికి స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఆ కాలంలో అన్ని భాషలలోనూ ఎన్నో మధురమైన పాటలు వచ్చాయి. […]
అనంతకవితాకాంచి ఒక పట్టీపైన రాయబడినది. కాంచి అంటే ఒడ్డాణము. అనంత అంటే అంతులేనిది. అంటే ఇది ఒక అంతులేని కవితా వృత్తము వంటిది.
ఈ సమావేశంలో కవులు, కథా, నవలా రచయితలు, విమర్శకులే కాక సాహిత్యాభిమానులు ఎందరో పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ-మెయిలు ద్వారా, రచ్చబండ ద్వారా పరిచితులైన ఎందరో మిత్రులను కలుసుకొని మాట్లాడే భాగ్యం కలిగింది.
బాలిక యువతిగా మారే విధంగా రాత్రిళ్ళు పొడుగవుతున్నాయి. యువతివలెనే రాత్రి కూడా తళుక్కుమనే తారాగణాలనే నగలను ధరించింది.
ఇట్టి ఘనస్వరూపాలలో మిక్కిలి ప్రసిద్ధి కెక్కినవి ప్లేటో ఘనస్వరూపాలు (Platonic solids). ఇవి ఐదు – చతుర్ముఖి (tetrahedron), ఘన చతురస్రము (cube), అష్టముఖి (octahedron), ద్వాదశముఖి (dodecahedron), వింశతిముఖి (icosahedron).
విద్యాసుందరి నాగరత్నమ్మ శారదాస్వరూపిణి, లలిత కళలకు కాణాచి. భరతనాట్యము, శాస్త్రీయ కర్ణాటక సంగీతము, కవిత్వము ఆమెకు కరతలామలకము. భోగినిగా ఆమె జీవితము ఆరంభమై, తరువాత రాగిణిగా మారి, పిదప విరాగిణియై, చివరకు యోగినిగా ముగిసింది. రక్తితో నిండిన ఆమె మనస్సు విరక్తితో నిండి భక్తి మార్గములో ప్రయాణము చేసి విముక్తి పొందింది.
తెలుగులోగాని, కన్నడములోగాని చంపకోత్పలమాలలలో వ్రాయబడిన పద్యాలు తెలియని విద్యార్థులు అరుదు అనుటలో అతిశయోక్తి ఏమాత్రము లేదు. ఈ వృత్తాలు ఈ రెండు భాషలలో ఖ్యాత వృత్తాలు. ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము ఈ వృత్తాల ఉత్పత్తిని, వికాసమును గురించి చర్చించుటయే. నా ఆశయము ఈ విషయాలను అందరికీ తెలియజేయుటయే.
యల్లా నీవే జననియు, నాప్తుడు నీవే,
యల్లా నీవే బంధువు,
యల్లా విత్తములు, విద్య లంతయు నీవే
శంకరుడు లఘు స్తోత్రములనుండి బృహద్గ్రంథముల వరకు సుమారు నాలుగు వందల రచనలను సృష్టించెను. నేను అందులోని కొన్ని ప్రార్థనా స్తోత్రములను ఆధారము చేసికొని ఈ వ్యాసమును వ్రాయుచున్నాను.
విక్రీడితము అంటే ఆట. శార్దూలవిక్రీడితము పులుల ఆట అయితే మత్తేభవిక్రీడితము మదించిన ఏనుగుల ఆట.