అంత హాయిగా, ధారాళంగా, మంచి విషయ పరిజ్ఞానంతో కబుర్లు చెప్పే మనుషుల్ని నేను చాలా తక్కువ మందిని కలిశాను. దేశ స్వాతంత్ర్యోద్యమం గురించి, 1925-1960ల మధ్య కాలం నాటి సాంస్కృతిక జీవనం గురించి కళ్ళకు కట్టినట్లు చెప్పేవారు. ఇంక ఆ కాలం నాటి నాటక, సంగీత ప్రపంచం గురించయితే చెప్పనక్కరలేదు.

సాంఘికంగా మార్పు చెందుతున్న స్త్రీ రూపం మనలో ఒక రకమైన అవ్యవస్థని సృష్టించింది. ఒక సమస్యతో జీవిస్తున్నంత కాలం, రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చెయ్యడం మానవ సహజం. కాని, నిజం చెప్పాలంటే, మనలో ఎవ్వరికీ — భర్తలుగా, భార్యలుగా, ప్రేమికులుగా, చిత్రకారులుగా, విమర్శకులుగా — ఈ విషయాలపై సంపూర్ణ జ్ఞానం లేదు అని ఒప్పుకోవటం కష్టం.

బ్రౌన్ తెలుగు ప్రజలతో కలిసిమెలిసి తిరిగి రాతప్రతులని వాళ్ళు ఇళ్ళల్లో భద్రపరిచే తీరు, చదివే తీరు, అందులో తేడాలు, అన్నీ గ్రహించి వుంటే తెలుగు గ్రంథ ప్రపంచాన్ని గురించి ఆయనకు కొంత అవగాహన వచ్చేది. కానీ ఆ ఆలోచన ఆయనకి రాలేదు. తెలుగు గ్రంథసంస్కృతి యూరోపు దేశాల గ్రంథసంస్కృతికన్నా భిన్నమైనదేమో అన్న సందేహం కించిత్తయినా కలగలేదు కూడా.

వలస పాలన సమయంలొ రచించినప్పటికీ, ఫకీర్ మోహన్ సేనాపతి నవల ఛ మన అఠ గుంట అన్యాపదేశ ప్రస్తావనల ద్వారా, వ్యంగ్యం ద్వారా ఆనాటి భారతీయ సమాజాన్ని, సంస్కృతిని, విశ్లేషణాపూరితంగా వర్ణిస్తుంది. అందువలన, ఫకీర్ మోహన్ సేనాపతి వాస్తవిక ధోరణిలో వ్రాసినప్పటికీ ఆయనను ఒక ఉత్తరాధునిక రచయితగా కూడా చూడవచ్చును.

చుట్టు పక్కలంతా దీపాలు వెలిగినప్పుడు,
కొండెక్కలేని ఒత్తి రెపరెపలు లీలగా…
అతనికి ఉన్నపళాన బెంబేలౌతుంది
‘వెళ్ళొస్తా’ అనడానికి తడారిన నోరు పెగలదు.
వయసు తరుముతున్నవాడిలా
చకచకా, ఒక్క విసురుతో
మెట్లపైకి దూకి పలాయిస్తాడు…

పుప్పొడి అనే కవితలో పంక్తుల సంఖ్య ఆఱు మాత్రమే. కాని అది చదివినప్పుడు కలిగిన అనుభూతి అపారమైనది. 25 సంవత్సరాలకు ముందు కార్ల్ సేగన్ మనమంతా, అంటే ఆ ఆకాశము, అందులోని ఎన్నో పాలవెల్లులు, మన సౌర కుటుంబము, దానిలోని మన భూమి, అందులో అన్ని జీవజాలాలు అంతా ఆ ఖగోళ బీజము నుండి పుట్టిన అణువులు అని చెప్పిన మాట స్మృతిలో నిద్దుర లేచింది.

చుక్కలను తాకకుండ వాటి చుట్టు ముగ్గుపొడితో, తడి పిండితో చిత్రవిచిత్రములైన ఆకారములను సృష్టించుటకు వీలవుతుంది. వీటిని మెలిక ముగ్గులు లేక మువ్వల ముగ్గులు అంటారు. వీటిని జాగ్రత్తగా వేసినప్పుడు ఇందులో ముడులు కనబడుతాయి. ఇవి త్రాటితో లేక త్రాళ్ళతో నేసిన తివాచీలలా కూడ ఉంటాయి. ఇవియే నిజమైన మెలిక ముగ్గులు.

సహజీవన మంటే
అడుగునున్నవా
ళ్ళరుపులు లేకుండా
అడుక్కుంటూ
అడుక్కు, అడుక్కు
మరీ మరీ అడుక్కు
-మరీ మరీ అడక్కు-
ఉండిపోవటం

మూలభారత కథలో దుష్యంతుడు కొద్ది గడియల సేపు మాత్రమే కణ్వాశ్రమంలో ఉండి శకుంతలను లోబరుచుకొని – కణ్వ మహర్షి వచ్చేలోగా వెళ్ళిపోతాడు. కాళిదాసు నాటకంలో దుష్యంతుడు మున్యాశ్రమంలో కొన్ని రోజులుండి, మునులకు రాక్షస బాధ లేకుండా చేసి, శకుంతలతో ప్రణయ కథ నడిపి వెళ్ళిపోతాడు. పిన వీరన దుష్యంతుణ్ణి చాలా రోజులు అక్కడ వుంచి – ప్రణయానికీ విరహానికీ, చంద్రోదయ వర్ణనకూ, యుద్ధ వర్ణనకూ – అన్నిటికీ అవకాశం ఆ సమయంలో కల్పించుకున్నాడు.

కథ అని అనిపించుకోటానికి ఒక రచనకి ఉండవలసిన సహజమైన లక్షణాలు మనకి, పాశ్చాత్యులకీ ఒకటే! ఆ మాట కొస్తే, కథకి ఉండే లక్షణాలు, పాశ్చాత్యుల దగ్గిరనుంచే మనం నేర్చుకున్నాం. కాని, ఆ లక్షణాలని ఒక బిగువైన చట్రంలో బంధించి కథని చూడటం, విమర్శించడం మనం ఇంకా మానేయలేదు. అంతే కాకుండా, కథ లక్షణాలుగా మనం భావిస్తూ, ప్రచారం చేస్తున్నవి బాగా పాతపడిన పద్ధతులని మనం తెలుసుకోవడం అవసరం.

ఏయే దారులంట మళ్ళాలో తెలియని ఎన్నో జీవులు గతి తప్పడం నన్ను అయోమయపరిచేది. గతి ఏమిటని నేను నదిని అడిగాను. ప్రవహించడం మాత్రమే నాకు తెలిసిన విషయం అంది సౌపర్ణిక. గతి ఎవరని మేము శూన్యాన్ని అడిగాము. చుక్కల్ని అడిగాము. సూర్యచంద్రుల్ని అడిగాము. జననమేమిటీ? మరణమేమిటీ? జీవనమేమిటీ? అని మేము చరాచరాల్నీ అడిగాము.

ఏదో పెద్ద ఆఫీసర్ లాగ స్కూలుకు తనకి ఇష్టం ఉంటే వస్తుంది. అలా వచ్చినప్పుడైనా స్టూడెంట్ లాగా వస్తోందా? ఛ!ఛ! నా నోటితో ఎలా చెప్పను? సైకిల్ మీద మగరాయడిలా ధీమాగా పేంట్ వేసుకొని వస్తుంది. బిగుతుగా, ఉన్నదున్నట్లు అందరికీ తెలిసేలా, ఎప్పుడు కుట్లు ఊడి పోతాయేమోనని మనకి భయం కలిగించేటట్లుగా. షర్ట్ వేసుకొని వస్తుంది కదా? పై రెండు బటన్లు పెట్టుకోకుండా అలాగే వదిలేయడం ఎందుకట?

ఆలిండియా రేడియో 1965లో ప్రసారం చేసిన భాస మహాకవి ప్రతిమా నాటకం నుంచి ఒక సన్నివేశం ఆడియో, సంస్కృత, తెలుగు పాఠ సహితంగా ఈమాట పాఠకుల కోసం పరుచూరి శ్రీనివాస్ అందిస్తున్నారు.