గాథాసప్తశతి శతకం



జం జం కరోసి జం జం జప్పసి జహ తుమ ణిఅచ్ఛేసి
తం తమణుసిక్ఖిరీఏ దీహో దీఅహో ణ సంపడఇ

యద్యత్కరోషి యద్యజ్జల్పసి యథా త్వం నిరీక్షసే
తత్తదనుశిక్షణశీలాయా దీర్ఘో దివసో న సంపద్యతే


నీవాడిన యాటలు బలు
నీవాడిన మాటలు బలు నివ్వెఱ నిచ్చున్
నీవు గనిన దృశ్యము లవి
యీ వనితకు నొక దినమున నెఱుగగ వశమా
… 4-78

What you did
what you said
what you saw
are matchless and endless
How can I pour over these all
that too
in a day’s span?



భండంతీఅ తణాయిం సోత్తుం దిణ్ణాఇఁ జాఇఁ పహిఅస్సా
తాఇం చ్చేఅ పహాఏ అజ్జా ఆఅట్టఇ రుఅంతీ

భర్త్సయంత్యా తృణాని స్వప్తుం దత్తాని యాని పథికస్య
తాన్యేవ ప్రభాతే ఆర్యా ఆకర్షతి రుదతి


ప్రాతఃకాలము పథికుని
జూతము గోశాల ననుచు సుందరి వెళ్ళెన్
యాతడు లేడట, కయ్యము
జేతునె యని గడ్డి గొనుచు జింతిలి యేడ్చెన్
… 4.79

In the morning
she visited the cowshed
to enquire of the traveler
there is no trace of him
Only the bed of straw remained
and
she gathered the straw with both her hands
and began to wail –
“Why did I quarrel with him?”
(Alas,
I knew he was my lover in disguise
and I still quarreled!)



అజ్జ సహికేణ గోసే కం పి మణే వల్లహం భరంతేణ
అమ్హం మఅణ-సరాహఅ-హిఅఅ-వ్వణ-ఫోడనం గీఅం

అద్య సఖి కేన ప్రాతః కామాపి మన్యే వల్లభాం స్మరతా
అస్మాకం మదన-శరాహత-హృదయ-వ్రణ-స్ఫోటనం గీతం


ఉదయమె విరహపు గీతిక
మదిలో దన చెలి దలంచి మ్రగ్గుచు నెవరో
వ్యధతో పాడగ కలగెను
మదనశరాఘాతమైన మానస మిపుడున్
… 4.81

Struck with the blow of separation
from the beloved
someone is singing sadly
this early in the morning
Already
struck with the blow of separation
from my beloved
makes the misery
all the more unbearable



పసిఅ పియే కా కువిఆ సుఅణు తుమం పరఅణమ్మి కో కోవే
కో హు పరో నాహ తుమం కీస అపుణ్ణాణ మే సత్తీ

ప్రసీద ప్రియే కా కుపితా సుతను త్వం పరజనైః కః కోపః
కః ఖలు పరో నాథ త్వం కిమిత్యపుణ్యానాం మే శక్తిః


కోపము చాలును, ఎవరికి
కోపమొ, నీవే కుపితవు, కోప మొరులపై?
నే పరుడనె? యౌ, నెటులో?
పాపులపై కినుక బూన బలమా నాకున్?
… 4-84


(అతడు: కోపము చాలును, ఆమె: ఎవరికి కోపమొ, అతడు: నీవే కుపితవు, ఆమె: కోప మొరులపై? అతడు: నే పరుడనె? ఆమె: ఔను, అతడు: ఎటులో? ఆమె: పాపులపై కినుక బూన బలమా నాకున్?)

Don’t be angry!
Who is angry?
You are!
One never gets angry with strangers!
Am I a stranger?
Yes!
How?
I don’t feel like becoming angry with
those who offend me!
(Yes, you did offend me!)