మా అమ్మమ్మా వాళ్ళు కార్తిక మాసంలో అరటి దొప్పల్లో దీపాల్ని వెలిగించి, నదిలో వదిలే వారు. ఆకాశంలో మిలమిలా మెరిసే నక్షత్రాల్లాగా, నీళ్ళలో అందరూ వదిలే ఆ దీపాల్ని చూడటానికి అమ్మమ్మ కొంగు పుచ్చుకుని గజగజా వణుకుతూ ఆవిడ వెంట వెళ్ళేవాళ్ళం. ఆ మధ్య వూరువెళ్ళినప్పుడు మా చిన్న మావయ్య కోడలు షాలిని, వుయ్ లీవ్ లైట్స్ ఇన్ ద లేక్. యు వాంట్ టు కమ్ అండ్ సీ? అంది.

మీకు తెలిసే ఉంటుంది. రాజు నిన్న మధ్యాన్నం మద్రాసు హాస్పిటల్లో పోయారట. ఈయన చెప్పారు! పాపం అంత పేరూ, డబ్బూ ఉండి చివర్లో కేన్సరు బారిన పడటం తలుచుకుంటే బాధేస్తుంది. మరీ అరవయ్యో పడిలో పడకుండానే పిట్టలా రాలిపోవడం అన్యాయం. కూతురి పెళ్ళయినా అయ్యింది. కొడుకులిద్దరికీ పెళ్ళీ అవీ ఇంకా కాలేదు. సంబంధాలు కుదిరాయనీ ఈయన చెప్పారు. పాపం!

“మీరు జ్ఞాన సంపన్నులని ఊళ్ళో వాళ్ళు చెప్తూంటే విని నాకున్న మూడు సందేహాలు మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. ఏ పని చేయడానికైనా సరైన సమయం ఏదో తెలుసుకోవడం ఎలా? నాకు కావాల్సిన ముఖ్యమైన మనుషులెవరో గుర్తించడం ఎలా? నాకున్న పనుల్లో అతి ముఖ్యమైన పని ఏది? ఇవే నా ప్రశ్నలు. వీటిని ఎంతమందినో అడిగాను కానీ ఎవరూ సరిగ్గా సమాధానం చెప్పలేకపోయేరు. కొంతమంది చెప్పినా అవి నాకు నచ్చలేదు.”

వ్యవసాయ భూమి రియల్ ఎస్టేట్‌గా మారే ముందు దశను రచయిత మధురాంతకం నరేంద్ర జాగ్రత్తగా పట్టుకొని వస్తారు. భూముల స్థలీకరణకు మానవ ప్రతిఘటన బలహీనమైన ఈ అవస్థలో రోసిరెడ్డి ఒక ప్రశ్న వేస్తాడు. “మడుసులంతా ఈ మాదిరి కొంపలు గట్టుకొనేదానికి కయ్యలు, కాలువలు గావాలంటే కుదిరితిందా? నేలుండేది దున్నిపంట చేసేదానికా? కడగాలేసి గోడల్లేపే దానికా?”

రాజకుమారి యామిని ఉంది చూడు. ఆ అమ్మాయి ఒక కాశ్మీరకవీంద్రుని వద్ద సంస్కృతం నేర్చుకుంటున్నదని నీకింతకు ముందు చెప్పినాను కదా! ఆయనను నేను చూచినాను. ఆయన మహాపండితుడు, గొప్పకవి అంటే విన్నాను. అంతే కాదు. ఆయనంతటి స్ఫురద్రూపిని నేనెన్నడూ చూడలేదు. నీలవర్ణం బదులు బంగారు రంగుతో మెఱిసే శ్రీకృష్ణమూర్తిలాగ ఆయనుంటాడు. అంతేకాక ఆయన యువకుడు గూడ.

చీకటి మరింత చిక్కబడింది. మన్మథుడు వచ్చాడు కాబట్టి వారవనితలూ జారవనితలూ కూడా వచ్చి చేరారు! కవిగారి చమత్కారం చూడండి. ‘వృద్ధ వారవిలాసినీ విసరమునకు అపలితంకరణ ఔషధంబు అనగ’ ఉందట చీకటి. పలితకేశం అంటే నెరిసిన జుట్టు. పలితంకరణం అంటే జుట్టు పండిపోవడం. అపలితంకరణం అంటే కేశాలకు నల్లదనం రావడం. అపలితంకరణ ఔషధం అంటే, అలా నల్లబడేందుకు వాడే మందు, అంటే ఇప్పటి భాషలో hair dye.

ఒకప్పుడైతే విద్యాగోష్ఠులలో –-

కమలాకరకమలాకర
కమలాకర కమల కమల కమలాకరమై
కమలాకర కమలాకర
కమలాకరమైన కొలను గని రా సుదతుల్.

— వంటి పద్యాలనిచ్చి అర్థతాత్పర్యాలు చెప్పమనటం పరీక్షకులకూ, పరీక్ష్యులకూ ఒక కేళీవినోదంకరణగా ఉండేదట.

వివిధ దైవ స్తోత్రములలో అక్షరమాలా స్తోత్రము ఒకటి. మృత్యుంజయ స్తోత్రములో ప్రతి పంక్తి అ, ఆ, ఇ, ఈ ఇత్యాదులైన అక్షరములతో ప్రారంభమై క్ష-కారముతో అంతమవుతుంది. అక్షరములతో ప్రారంభించు పంక్తులకు బదులు అకారాది అక్షరములతో ప్రారంభమగు వృత్తములతో పద్యములను వ్రాయవలయుననే ఒక ఆలోచన ఫలితమే ఈ ప్రయత్నము.

తల్లియందంపు టద్దమై దనరు తెలుఁగు
సొబగు దెలియక కష్టమం చోకిలించు
నేటియువతకు గురువులౌ మేటివారి
పాటవంబున పాడయ్యె భాష బ్రదుకు!

ఆరున్నరైపోవొచ్చింది
స్నానాల దగ్గిరా జట్టీలు?
నాన్న విన్నారంటే తంతారు!
కాఫీ టిఫినూ ఏవండీ ఇవుగోటి
ఫేంటూ లాల్చీ మంచమ్మీద పెట్టేను
కేరేజీ చురుకుతుంది జాగర్త!

కొండదారిలో రాలిపడ్డ పూలగుత్తుల్నీ
కుబుసాలు విడుచుకుంటోన్న
జంటసర్పాలనీ
జాగ్రత్తగానే దాటుకు ఇల్లు చేరతాను కానీ,
ఆ గాలిలో నలిగిన పూలపరిమళమేదో
ఊపిరిలో చేరి వెంటాడటమాపదు.

ఈ క్షణంలో మనం ఒకటి కావటంలోనే
పురాతనకాలాల విశ్రాంతి కొలువు తీరింది
ఈ విశ్రాంతిలోనే సమస్తసృష్టీ
నదిలో ప్రతిఫలించే ఆకాశంలా తేలుతూ వుంది

రెండు దక్షిణ భాషల సాహిత్య సంపద ఈ శార్దూలవిక్రీడితములో ఒక కవి చేసిన ఒక చిన్న మార్పుతో ముడివేయబడినది. పడమటి చాళుక్య చక్రవర్తి రెండవ పులకేశి సత్యాశ్రయుని కాలములో రవికీర్తి అనే ఒక కవి ఆ రాజును పొగడుతూ వ్రాసిన పద్యములు ఐహొళె శిలాశాసనములలో ఉన్నాయి. ఇది క్రీస్తుశకము 634 కాలము నాటిది.

దేశానికి ఒక ప్రధాన మంత్రి ఉంటే బాగుంటుంది కాని దేశంలో ఉన్న కులాలు అన్నీ, ‘ఎవరి కులం వారి ప్రధాన మంత్రి వారికే’ అంటూ, కులానికొక ప్రధాన మంత్రి కావాలంటే ఏమి సబబు? అలాగే ఈ భౌతిక ప్రపంచంలో మనకి ద్యోతకమయే దృగ్విషయాలని అన్నిటిని ఒకే ఒక సిద్ధాంతంతో అభివర్ణించగలిగితే బాగుంటుందనేది శాస్త్రవేత్తల చిరకాల వాంఛ.

ప్రఖ్యాత గాయకుడు, రంగస్థల నటుడు శ్రీ మాధవపెద్ది సత్యం సమర్పించిన ప్రత్యేక జనరంజని కార్యక్రమాన్ని, రేడియో కోసం వారు పాడిన ఐదు లలితగీతాలను మీతో పంచుకుంటున్నాను.

ఏ సాంకేతిక సాధనం లేదా యంత్రం, మానవ విచక్షణకు సాటిరావు. ఇవి కొన్ని పరిథులకు లోబడి మనకు సహాయకారిగా ఉంటాయి. పద్య రచననను చేయడానికి భాషపై పట్టు సాధించడంతో పాటుగా, ఛందో నియమాల ధారణ, అధ్యయన, అభ్యాసనాలు కొంతవరకూ చేయవలసిందే. కానీ ఈ ప్రత్యేక సాహిత్య ప్రక్రియను తరువాతి తరానికి అందించడానికి సాంకేతిక సాధనాల అవసరాన్ని గుర్తించాల్సి ఉంది. అటువంటి సాంకేతిక సాధనం ఈ ఛందం©.