అమూర్తత సినారె కవిత్వంలో ప్రధాన లక్షణం. నిర్దిష్ట సంఘటనలకి, ఉద్యమాలకి ఉవ్వెత్తున ఎగసిపడిన సందర్భాలు అరుదు. నిర్దిష్టతను గుర్తించి స్పందించాల్సిన సందర్భాల్లోనూ ఆయన అమూర్త వ్యక్తీకరణనే ఆశ్రయించాడు. భావ సంయమనం పాటించాడు. ఆయనది పెద్దమనిషి తరహా కవిత్వం. ఆయన కవుల్లో లౌక్యుడు. లౌక్యుల్లో కవి.

ముద్దుముద్దుగా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. పూలు చూపించీ, వాటిమీద వాలే సీతాకోకచిలుకలు చూపించీ. మబ్బులు చూపించీ, తొంగి చూసే చంద్రుణ్ని చూపించీ. ఉలిక్కిపడేలా చన్నీళ్ళు చల్లీ, ఉత్తినే భయపెట్టీ. ఒడిలో కూచోబెట్టుకునీ పడుకోబెట్టుకునీ గోరుముద్దలు తినిపించీ. చక్కిలిగింతలు పెట్టి నవ్విస్తూ.

“యాత్రలకు ధనమూ సమయమూ అవరోధాలు కావు. భాష, భద్రత, రక్షణ అధిగమించలేని సమస్యలు కానే కావు.” నిస్సందేహంగా!! పాతికేళ్ళ క్రితం ఓ ఢిల్లీ పెద్దాయన వందేవంద రూపాయల్లో తాను హిమాలయాల్లో రెండురోజులపాటు చేసిన ముప్పై కిలోమీటర్ల ట్రెక్ గురించి రాశాడు. అది మనసులో నిలిచిపోయింది. ‘నేనూ అలా చెయ్యాలి!’ అన్న ఆకాంక్షగా పరిణమించింది.

పట్టుకోవాలని తపించి తపించి
ఘడియలుగా దహించుకుపోయిన
రాత్రిని లాలించి తప్పించి
సూరీడు నేలను ముద్దాడకుండా ఆపాలని
పైన్ చెట్ల నీడలు వెర్రెత్తినట్టు ఊగే
తోటల్లో చేరి, చీకట్లో, రెండు దీపాల్తో…

హాస్యం అశ్లీలం, సంసార పక్షం అని ఉండదు, పండితే పొట్ట చెక్కలు చేస్తుంది, చెడితే, అసందర్భంగా, అసంబద్ధంగానే ఉంటుంది. సభ్య సమాజం బాహాటంగా చర్చించుకునే విషయాలు కాని వాటికి కూడా తగిన సందర్భం సృష్టించి వాటి నుండి నవ్వులను వెలికి తీయగలిగితే, హాస్యానికి అశ్లీల దోషం ఎంత మాత్రమూ అంటదు.

అతడిని భార్య అడిగింది:
“మీరు ఇంతకు ముందు చిన్న విషయానికి కూడా నాతో కొలుచుకునేవారు.
ఇప్పుడు మౌనంగా అన్నీ స్వీకరిస్తున్నారు.
మీరు మంచివాళ్ళయ్యారా?”

మరి మన మహనీయ చిత్ర శిల్ప కళాఖండాలు రెండవ ఎక్కం అప్పగించినంత సులువుగా ప్రజల కళ్ళకి కట్టడం అసాధ్యమా? కానేకాదు. సాంస్కృతిక, కళా రంగాల విశేషాలూ జనం కళ్ళలో, నోళ్ళలో నిత్యం ఉండాలంటే శ్రోతలు, పాఠకులు, సందర్శకులు, ప్రేక్షకులు, భక్తులూ అనే మనం కొంత దురభిమానం, చౌకబారు ఆనందం అనే ‘ఎంటర్‌టైన్‌మెంట్’ను కొంచం త్యాగం చేసే ప్రయత్నం చేసుకోవాల్సిందే.

‘అవును. నేను మాట్లాడి తీరాలిప్పుడు!’ అంటూ రంగప్ప చప్పట్లు కొట్టాడు. ‘అందరూ వినండి. నేను పందెపు రొక్కాన్ని నమశ్శివాయంకు ఇవ్వడానికి వచ్చాను!’ నాకు ఆ మాటలు అర్థం కాలేదు. విన్నవాళ్ళు కూడా నిశ్శబ్దంగా ఉన్నారు. ‘నేను ఓడిపోయాను. కాబట్టి ఇదిగో, ఐదు లక్షలకుగాను చెక్కును నమశ్శివాయంకు ఇస్తున్నాను.’ తన జేబులోనుండి ఒక బ్రౌన్ కవర్ తీసి టేబిల్ మీద పెట్టాడు.

చనుబాల కోసం ఏడుస్తున్న పిల్లాడికి ఒక పిండిముద్ద ఇచ్చి మాయ చేసే తల్లిలా నన్ను మాయ చేసి పోదామని అనుకుంటున్నావా. నీకు మూడు కళ్ళు ఉన్నా లేకున్నా, నువ్వు హర రూపంలో వచ్చినా నర రూపంలో వచ్చినా నాకు ఒకటే. అంచేత నీ చమత్కారాలు చాలించి నే పెట్టిన భోజనాన్ని బుద్ధిగా ఆరగించి వెళ్ళు – అని శివుడినే గదమాయిస్తుంది ఆ మహా భక్తురాలు!

నా
పాత పద్యాలు-
వాటి మొహాల మీద ఉన్న
ముడతలు తెలుస్తూనే ఉన్నాయి
అవి ఎంత పెద్దవవుతున్నా
అప్పుడప్పుడొచ్చి నన్ను
పలకరిస్తూనే ఉన్నాయి.
ఈ కొత్త పద్యం తోనే-

బాణావరంలో వున్న ఏకైక అయ్యరు హోటల్లో వరుసగా వారం రోజులపాటు భోజనం చేసినవాడు, అన్నంకన్నా ఆకులలములు మేయడమే సుఖమన్న నిర్ణయానికి రాగలడు. ప్రొద్దుపోయి గాలి కాస్తా చల్లబడితే చుట్టుపక్కల మెట్టపొలాల్లో ఉన్న పాములన్నీ పచారు సల్పడానికి వూళ్ళోకి వచ్చేస్తాయి. ఎండాకాలాల్లో త్రాగడానికి నీళ్ళు దొరికితే బ్రహ్మాండం. చలికాలాల్లో విషజ్వరాలకిది ఇష్టారాజ్యం. వెరసి అన్ని ఋతువులలోనూ పరిత్యజనీయం బాణావరం!

పద్యములకు పేరులను లాక్షణికులు ఎలా పెట్టారో? ఒకే పద్యానికి ఎన్నో పేరులు, ఒకే పేరుతో ఎన్నో పద్యాలు! వృత్తపు పేరును బట్టి గణనిర్ణయము సాధ్యమా? క్రొత్త వృత్తములకైనా ఇలా చేయవచ్చు గదా? ఇంతవఱకు నేను సుమారు 150కి పైన ఇట్టి సార్థకనామ గణాక్షర వృత్తములను కల్పించినాను. అందులో అరవై వృత్తములను ఇక్కడ మీకు పరిచయము చేస్తున్నాను.

యెప్పుడో మరి చాన్నాళ్ళకు
యెక్కడెక్కడో తిరిగి తిరిగి వచ్చి
అరుగు మీద గూట్లో యేదో మెరిసినట్లై
యేంటా అని వెళ్ళి చూస్తావు
యేదో యెప్పుడో పగిలిన సీసా పెంకు
లేదా చిరిగిన తగరం ముక్క

ఈ పుస్తకం రాయటానికి రచయిత్రి పల్లవి ఏడు సంవత్సరాల కాలం వెచ్చించారట. కేవలం సమాచార సేకరణకు ఇంతకాలం పట్టలేదు. సుబ్బులక్ష్మి జీవిత విశేషాలన్నీ ఆకళించుకుని, ఆమెతో మానసికంగా చెలిమి చేసి… ఆపైన మాత్రమే రాయటం మొదలుపెట్టానంటారు రచయిత్రి. సజీవంగా లేని వ్యక్తి జీవిత గాథను పునర్నిర్మించటం అంత సులువైన పని కాదు.

గడి నుడి-8కి ఎవరూ పూర్తిగా సరయిన సమాధానాలు పంపలేదు. ఒక్కటి, రెండు తప్పులతో పంపినవారూ లేరు. క్రిప్టిక్ క్లూలకు పాఠకులు అలవాటు పడుతున్నారేమోనని గడి కొంచెం కష్టంగా ఇచ్చినమాట నిజమే కాని ఇంత కష్టం అవుతుందనుకోలేదు.

గడి నుడి – 8 సమాధానాలు, వివరణ.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.