తిలక్ అమృతం కురిసిన రాత్రి కవితాసంకలనం పై రా.రా. సమీక్ష (సంవేదన, జనవరి 1969) సారస్వత వివేచన – రా.రా. వ్యాస సంకలనం నుండి పునర్ముద్రణ.
ఈమాట సెప్టెంబర్ 2010 సంచికకు స్వాగతం!
నువ్వు లేవు నీ పాట వుంది, ఇంటి ముందు జూకా మల్లెల్లో చుట్టుకుని, లాంతరు సన్నని వెలుతురులో కమ్ముకుని.. అంటూ అద్భుతమైన వచన కవిత్వాన్ని మనకందించి అకాలంగా కాలం చేసినా మన మనసుల్లో చిరంజీవిగా నిలిచిపోయిన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్. ఆయన ఇలా గుర్తు రావడానికి ఏ సందర్భమూ లేదు, అక్కర్లేదు. ఆ కవితా సతి నొసటి రసగంగాధర తిలకపు చుక్కలు కొన్ని ప్రత్యేకంగా, శబ్దతరంగాలు, కథలు, కవితలు, వ్యాసాలతో కలిసి ఈ సంచికలో ఈమాట పాఠకుల కోసం.
రా.రా. ‘తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు’ శీర్షికతో దేవరకొండ బాలగంగాధర తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ మీద వ్రాసిన సమీక్ష వారి స్థాయికి, వారి రీతికి తగినట్లుగా లేకపోవటం ఆశ్చర్యం వేస్తుంది.
కవి తిలక్‌పై ఆలిండియా రేడియో సమర్పించిన ఈ సంగీత, సాహిత్య చర్చా రూపకం తిలక్ గురించి లోతైన పరిచయం చేస్తుంది. ఈ రూపకం ఈమాట పాఠకుల కోసం ప్రత్యేకం.
అసలు ప్రహేలిక అంటే అర్థమేమిటి? అని అడిగాము వాళ్ళమ్మను. ప్రహేలిక అంటే సంస్కృతంలో నటన లేక నాటకానికి సంబంధించిన అర్థమట. ఏమో కానీ, నాకు పాత తెలుగు పత్రికల్లో ఎక్కడో, గళ్ళనుడికట్టుకు పదబంధప్రహేలిక అని పేరు చదివినట్లు గుర్తు.
లోతుతెలీని లోయలాంటి
ఒంటరితనంలో,
రాలిపడుతున్న
ఉసిరిచెట్టు ఆకుల మధ్య-
“అమ్మా నీకు ఇంకా యాభై ఏళ్ళు రాలేదు. నాన్న పోయినప్పటినుంచీ నువ్వు ఒక్కత్తివే ఉంటున్నావు కదా? నా పెళ్ళి అయితే నువ్వొక్కత్తివీ ఎలా? నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకోకూడదూ? ఏమిటి నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకుంటే తప్పు?
భయదమతంగజంబులటు వార్షుకమేఘము లంబరంబునం
బయికొనియుండఁ, దారలు క్షపాకరుడుం గనరాకయుండఁగా
మొల్ల అంటే మల్లెపూవు. కవయిత్రి మొల్ల రామాయణాన్ని తలచుకోగానే మనసుకు ఒక కమ్మని పూతావి సోకినట్లుంటుంది. ఆమె తన భక్తినీ, కవితాశక్తినీ కలబోసి క్లుప్తంగా ఓ మనోహరమైన రాయాయణాన్ని తెలుగు భాషకు దయచేసింది.
నిన్ను నువ్వు నిరంతరం
తడుపుకుని
కప్పుకుని ముద్దై
అంతలోనే విప్పారి
మేను విరిచి
నువ్వేస్తున్న బొమ్మల్లో
రూపాంతరం చెంది
ఆనవాలు పట్టలేని అదృశ్య చిత్రాన్ని
తిలక్ రాసిన ‘గోరువంకలు’ ఛందోబధ్ధ కవిత్వ సంకలనం నుండి కొన్ని పద్యాలు ఈమాట పాఠకులకోసం…
లలిత వాసు ఎదురుగా నిలబడి అతని ఎడమ చేతిని తన కుడి చేతిలోకి తీసుకుంది. తన ఎడమ చేతిని అతని నడుము చుట్టూ వేసి నెమ్మదిగా స్టెప్పులు వేయిస్తూ అతనికి డాన్స్ నేర్పించింది.
అహల్య శాపగాథను తనదైన శైలిలో ఒక రమ్యనాటికగా ఆవిష్కరించిన తిలక్ రచన సుప్తశిల నాటకం ఆడియో.
చలచ్చంచల వాంఛా పరికలిత డోలా ప్రహేల
ఆశా విశల మోహా విరళ దాహాతివేల
పరితాప శీల దీప ఖేల
నిజమే మరి. ఇవాళ తిలక్ లేడు. తిలక్ పాట వుంది. నిజంగా వుంది. జాలిగా హాయిగా వినపడుతూ వుంది. ఇంకా ఇంకా అలా వినబడుతూనే వుంటుంది.
సాంప్రదాయకవులనీ, భావకవులనీ, అభ్యుదయకవులనీ, విప్లవకవులనీ చేసే విభజన కృత్రిమమైనది. అసలు కవితాతత్వాన్ని పక్కదారి పట్టించేది. కదిలించే కవిత్వాన్ని రాయలేనివాళ్ళకు కవులుగా ఏదోవిధంగా అస్తిత్వాన్ని కలిగించటానికి చేసే వ్యర్ధప్రయత్నం.
తిలక్ తన కవిత వెన్నెలను తన గొంతులోనే వినిపించిన ఈ అపురూపమైన ఆడియో 1965లో ఆలిండియా రేడియో వారిచే రికార్డు చేయబడింది.
ఒక గొప్ప కవిగారి పేరు, మీపేరూ అనుకోకండా ఒకటే అయితే ప్రమాదమే! శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రపంచప్రసిద్ధి పొందితే, శ్రీభాష్యం శ్రీనివాసులు, ఏదైనా అడపా తడపా రాసి ఏ పత్రికకన్నా శ్రీశ్రీ అన్న పేరుతో పంపిస్తే, మందలించని సంపాదకుడు ఉండడనుకుంటాను.
శతక వాఙ్మయానికి పెట్టింది పేరు తెలుగు భాష. సుమారు రెండవ శతాబ్దము నుండి నేటివరకు కవులు శతకాలను వ్రాస్తూనే ఉన్నారు. ఈ రచనలో కొందరి దృష్టి ఇహపరసాధన మయితే, మరి కొందరిది నీతిప్రబోధం. ఇంకా కొందరిది శృంగారం.
కురులని గాలికి వదిలేసి గంతులేసుకుంటూ పూలని, మొక్కలని ముచ్చటగా తాకుతూ పరిగెడుతున్నాను. తలెత్తేసరికి రివ్వున గాలి నా ముఖాన్ని కురులతో కప్పేసింది. చేత్తో నా కురులను స్లో మోషన్లో తొలగించుకుంటూ చూస్తే, గుర్రం మీద కౌబాయ్ టోపీ పెట్టుకొని ఎవరో హీరోలా వున్నాడు.
ఇది జాలి పద్యమా, లేదా నాకీ పద్యంలో ఉండడం ఇష్టంలేక ఇది నాకు ఇచ్చే ధైర్యాన్నీ, కసినీ, కోపాన్నీ భరించే శక్తిలేక నన్ను నేను తప్పించుకోడానికి నేను వేసుకున్న వ్యూహం మాత్రమేనా? ఈ పద్యం చదవడం కష్టం, చదివాక మరిచిపోవడం కష్టం.
సాహిత్యమండలి సంక్రాంతి సంబరాలలోకవి సమ్మేళనం ఆనవాయితీ. మొదటిరోజున, మల్లెపువ్వులాంటి తెల్లటి గ్లాస్గో ధోవతి, అంతకన్న తెల్లటి లాల్చీ వేసుకొని సభవెనకాల నిలబడ్డ స్ఫురద్రూపిని నేను మొదటిసారిగా చూసాను. ఇటువంటి సభల్లో వెనకాల చేరి అల్లరి చేసే వయస్సు నాది.