అనగనగా ఒక పల్లెటూళ్ళో ఒకే ఒక క్షురకుడు, అనగా బార్బర్ ఉన్నాడు. అతనికి ఒక నియమం ఉంది. ఆ ఊళ్ళో తమకి తాము గడ్డం గీసుకోని వారికే అతను గడ్డం గీస్తాడు. తనకు తాను గడ్డం గీసుకొనే ఏ వ్యక్తికీ అతను గడ్డం గీయడు. చాలా సజావైన నియమం లాగానే ఉంది కదూ! అయితే దీనికి సమాధానం చెప్పు చూద్దాం. ఆ క్షురకుడు తన గడ్డం తాను గీసుకుంటాడా లేదా? ఇందులో మెలిక ఏమిటో జాగ్రత్తగా ఆలోచించు.

అయినా ఒక చిత్రకారుడిగా నా పరిమితి నాకు ఉంది. నిజంగా వసుధేంద్ర కోరుకున్నట్లు నిక్కరు విప్పి పడేసి ఏడుపు మొహంతో, అవమానభారంతో నడుం వంచుకుని ఉన్న కుర్రవాడు, వాడిని కడుగుతూ తల్లి, కుడివైపున పిల్లల్ని వేసుకుని పందులు, ఈ వైపు కుక్క మూతి నాక్కుంటూ చూస్తూ, వెనుక ఎగతాళిగా నవ్వుతున్న స్కూల్ పిల్లలు… ఇదంతా గీస్తే అపుడు బొమ్మ ఏవవుద్దంటే బహిరంగ మల విసర్జన వద్దే వద్దు! మోడీయ స్వచ్ఛ భారతే ముద్దు!

‘నీలితురాయి పూలను చూస్తే ఆకాశంలో నెమలి పింఛం విప్పారినట్లు అనిపిస్తుంది. పూల సోయగాలను చూస్తూ కూర్చోవడమే నాకు ధ్యానం. ఆకులు లేని లోటు తీర్చడానికా అన్నట్టు కొమ్మల మీద లెక్కలేనన్ని చిలుకలు, గోరింకలు, తేనెపిట్టలు!’ అని పరవశించే మంగాదేవి, తమ ప్రాంగణానికి జయతి గత నవంబరులో వచ్చినపుడు, ‘తెల్లవారే లేచి పిల్లల్ని వెంటేసుకొని తోటలో ఏయే పక్షులున్నాయో వాళ్ళకి చూపించాలి,’ అని ప్రేమతో ఆదేశించారట.

ఎలాంటి సంకోచం లేకుండా చెబుతున్నాను, బాల్యంలో నేను ‘చడ్డీ రాస్కెల్’ని. ఉదయం లేచిన వెంటనే అమ్మానాన్నలు ఇద్దరూ ‘పాయిఖానాకు వెళ్ళు’ అని ఎంత చెప్పినా ‘రావటం లేదు’ అని జవాబిచ్చి రెండు రెండు రోజులు వెళ్ళకుండా ఉండిపోయేవాణ్ణి. గబ్బువాసన వచ్చే ‘పాయిఖానా’ ఆ చిన్న వయస్సులో ఎలా ఇష్టమవుతుందో చెప్పండి? దానికి బదులుగా మిఠాయి అంగడికి వెళ్ళమంటే రెండు రెండు సార్లు వెళ్ళటానికి సిద్దంగా ఉండేవాడిని.

అంబాలా ఛావనీలో ఆమె దందా బాగా నడుస్తుండేది. ఛావనీలో తెల్లవాళ్ళు ఆమె దగ్గరకు తాగి వచ్చేవారు. ఒక మూడు నాలుగు గంటల్లో ఆమె షుమారు పదిమందిదాకా తెల్లవాళ్ళను తృప్తి పరచి ఇరవై ముప్ఫై రూపాయలదాకా పుట్టించేది. ఈ తెల్లవాళ్ళు దేశీలకన్నా మంచివాళ్ళు. వాళ్ళేం అంటున్నారో సుల్తానాకు అర్థం అయేది కాదు నిజమే కాని వాళ్ళ భాష అర్థం కాకపోవటం అనేది ఆమెకి బాగా ఉపయోగపడింది.

చేపపిల్లని
గబుక్కున కరుచుకోవటానికి
ముక్కుని చాచి నుంచున్న కొంగల్లా మైకులు
ఎత్తైన గోడల గది నిండా
రకరకాల విదేశీ పెర్ఫ్యూముల రేగు పొదలు
ఎక్కడ కూచుంటావ్

అదబే-లతీఫ్‌ మాస పత్రికలో, నా కథ ఒకటి కాలీ సల్వార్ పేరిట 1942లో అచ్చయ్యింది. దీనిని అందరూ అశ్లీలమని అన్నారు. ఇది పచ్చి అబద్ధం. కథలు రాయడం నా వృత్తి. నాకు సాహిత్యపు అన్ని లక్షణాలతోనూ పరిచయముంది. నేను ఇంతకు మునుపు ఇలాంటి అంశాల మీదే అనేక కథలు రాసున్నాను. వీటిలో ఏ కథ కూడా అశ్లీలం కాదు. నేను ఇకపై కూడా ఇలాంటి అంశాల గురించి రాస్తాను. అవేవీ కూడా అశ్లీలమవ్వవు.

చిన్నప్పుడు మా ఇంటెదురుగా ఉండిన అబ్బులు గాడి గానుగను లాగిన ఎద్దు నాకు జీవితంలో ఎదురుపడిన మొదటి గానుగెద్దు. బక్కగా, పొట్టిగా, చెమట, నూనె కలగలిసి జిడ్డు కారుతున్న శరీరంతో గట్టిగా గాలి వీస్తే ఎగిరిపోయేటట్లుండే వాడు అబ్బులు. గానుగ మధ్యలో ఛర్నాకోలుతోనో లేక ముల్లుగర్రతో కూర్చున్న అబ్బులు, ఆ గానుగను విరామంలేకుండా లాగే ఎద్దు, మధ్యలో వాడి అరుపులు… నాకు మొదట్నుంచీ అబ్బులంటే కోపం.

నువ్వేం వినలేదులే
నేనేదీ గుర్తుంచుకోనులే
కలబోసుకున్న కథలిక్కడే వదిలి
గొంతులో చిక్కుబడ్డ
దిగుళ్ళన్నింటినీ గుటక వేసి
నడుద్దాం కాసేపు, లే!

క్షమించండి. ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది. ఇదీ ఈ తలుపు కథ. దొడ్డమ్మకి వాళ్ళు వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ బాగా గుర్తు. రోజా చెప్తూనే ఉంటుంది. పెదనాన్న పంచె, తలపాగా కట్టుకున్నారు. చిన్న నాగలి భుజాన వేసుకుని వెళ్ళారు. నాన్నా, అన్నయ్యా పాంటూ చొక్కా వేసుకున్నారు. గమ్మత్తు ఏమిటంటే, ఇలాటి చల్లటి శీతాకాలం సాయంత్రాలల్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకనో తెలీదు కానీ వాళ్ళొస్తారని నాక్కూడా అనిపిస్తుంది.

రాజప్ప నాగరాజు ఆల్బమ్‌ను చూపించమని అడగలేదు. అయితే వేరేవాళ్ళు చూసేప్పుడు ఆ పక్కకే తిరగనట్టు ముఖం పెట్టుకుని ఓరకంట చూశాడు. నిజంగానే నాగరాజు ఆల్బమ్‌ చాలా అందంగా ఉందని తెలిసింది. రాజప్ప ఆల్బమ్‌లో ఉన్న స్టాంపులు నాగరాజు ఆల్బమ్‌లో లేవు. సంఖ్య కూడా తక్కువే. అయినప్పటికీ ఆల్బమ్‌ చూడటానికి నాణ్యంగా, చాలా అందంగా ఉంది. దాన్ని చేతిలో పెట్టుకుని ఉండటమే గొప్పగా అనిపిస్తుంది. అలాంటి ఆల్బమ్‌ ఈ ఊరి అంగళ్ళలో దొరకదు.

రాముడు పరిపూర్ణ మానవుడనో, అవతార పురుషుడనో భావించేవారికి శూర్పణఖ వృత్తాంతం వంటి సమాధానపడవలసిన అంశాలతో సమస్యలెదురౌతున్నాయి; అటు సంప్రదాయ వ్యాఖ్యాతలకూ ఇటు భారతీయ విధ్యార్థులకూ కూడా. ఇటువంటి వృత్తాంతాలు కావ్యం యొక్క చారిత్రక ప్రామాణికతను రుజువు చేస్తాయని కొందరు వాదిస్తారు. ఇవి నిజం కాకపొతే వాల్మీకి ఎందుకు నాయకుడికి అపకీర్తి తెచ్చిపెట్టే ఇటువంటి సన్నివేశాలను సృష్టిస్తాడు?

రాజా! నీ మొహంలో ఇంతకు ముందెప్పుడూ కనపడని విసుగు, అలసట ఈసారి నా దృష్టికి స్పష్టంగా కనపడుతున్నాయి. వాటిని చూస్తుంటే, మన పాఠకరావు ఒక కథల సంపుటిని చదువుతున్నపుడు వ్యక్తపరచే హావభావాలు కళ్ళకు కట్టినట్లు నాకు మళ్ళీమళ్ళీ కనపడుతున్నాయి. నాకున్న అభినివేశమంతా వినియోగించి ఆ సన్నివేశాన్ని నీకు వివరిస్తాను. చోదకచర్య పైనే నీ దృష్టి కేంద్రీకరించి నేను చెప్పేది మాత్రం విరామసంగీతంలా విను.

ఏ పాండిత్యం లేకుండా కావ్యాలు రాయటం స్త్రీలకు మాత్రం సాధ్యమా అంటే కాదు అనే సమాధానం. వేళ్ళ మీద లెక్కించదగిన సంఖ్యలో మాత్రమే ఉన్న మహిళా కవులు అల్పసంఖ్యాక వర్గంగా పురుషులదైన కావ్య ప్రపంచంలోకి బెదురుబెదురుగా ప్రవేశిస్తున్నారనటానికి, వాళ్ళను ప్రసన్నం చేసుకొనటానికి వాళ్ళకంటే తామెందులోనూ అధికులం కామని నమ్మబలికి వారి దయను పొందటానికి తాపత్రయ పడుతున్నారనటానికి నిదర్శనం.

ఎఱ్ఱాప్రగడ రామాయణం కూడా రచించాడనీ, అది లభ్యం కావడంలేదనీ అంటారు. ఎఱ్ఱాప్రగడ రామాయణంలోవని ఒకట్రెండు పద్యాలు కొందరు లక్షణ కర్తలుదాహరించడమే ఈ అపోహకు ఆధారం. ఆ ఊహ నిజమై, ఇరవైయవ శతాబ్దపు తొలి సంవత్సరాల్లో హఠాత్తుగా నన్నెచోడుని కుమారసంభవం ప్రత్యక్షమైనట్లు ఎఱ్ఱన రామాయణం కూడా మున్ముందెపుడైనా ప్రత్యక్షమైతే తెలుగు భాషా, తెలుగు జాతీ చేసుకున్న అదృష్టం పండినట్లే.

సీసము అనే పదము శీర్షకమునుండి జనించినది. శీర్షకమును శీర్షము అని కూడ అంటారు. ఈ శీర్షక, శీర్ష పదములు సీసకము, సీసములుగా మారినవి తెలుగులో. సీసపద్యమునందలి సీసమునకు లోహవిశేషమైన సీసమునకు ఏ సంబంధము లేదు. శీర్షకము అనే ఛందస్సును మనము నాట్యశాస్త్రములో చదువవచ్చును. దీని ప్రకారము ఎనిమిది వృత్తములలో ఏదైన ఒకదానిని, లేక ఒకటికంటే ఎక్కువ వృత్తములను వ్రాసి చివర ఒక గీతిని రచించినప్పుడు అది శీర్షకము అనబడును.

క్రితం సంచికలోని ఈమాట 20వ వార్షికోత్సవ ప్రత్యేక గడినుడి -25కి గడువుతేదీ లోగా ఆరుగురినుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపిన ఆరుగురు: 1. భమిడిపాటి సూర్యలక్ష్మి, 2. గిరిజ వారణాసి, 3. రాజేశ్వరి రావులపర్తి, 4. ఆళ్ళ రామారావు, 5. సుభద్ర వేదుల, 6. రవిచంద్ర ఇనగంటి*. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి – 25 సమాధానాలు, వివరణ.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.