తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు కె. మమత ఎంపికైంది. ఎగసి పడే భావాలను, నిజాయితీగా – సున్నితమైన పదచిత్రాల్లో పట్టుకురావడంలో గల నేర్పు, కవిత్వానికి కట్టుబడి ఉండటం నేటికాలపు కవులనుండి ఈమెను ఎడంగా నిలబెడతాయి.
ఈమాట జనవరి 2015 సంచికకు స్వాగతం!
!!!ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!
ఆలన్ ట్యూరింగ్(23 జూన్ 1912 – 7 జూన్ 1954): కంప్యూటర్లు మన జీవితాలని ఊహించని విధంగా మార్చేశాయి. మన ఆలోచనలని, అనుభవాలని, మన విద్యవైద్యావైజ్ఞానిక విధానాలకు, పరిశోధనలకు మునుపెన్నడూ లేనంత ఊతం ఇచ్చాయి, మన ప్రస్తుత కాలాన్ని సాంకేతిక యుగం అని పిలుచుకునేంతగా కంప్యూటర్లు మానవాళిని ప్రభావితం చేశాయి. ఐతే, వీటి ఆవిర్భావానికి ట్యూరింగ్ మెషీన్ అని పిలవబడే ఒక ఆలోచన, ఒక యంత్రం కాని యంత్రం ఆధారం అని, అది ఎంత తేలికైన, అద్భుతమైన ఆలోచనో తెలుసుకున్నవారు విస్మయానికి గురి కాకతప్పదు. అందుకు ఆద్యుడైన ఆలన్ ట్యూరింగ్ గురించి కంప్యూటర్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు అనే శీర్షిక క్రింద కొడవళ్ళ హనుమంతరావు కొంత విరామం తరువాత రాసిన వైజ్ఞానిక వ్యాసం; వాణి నా రాణి అని ఠీవిగా చాటుకున్న పిల్లలమర్రి పినవీరభద్రుడు జైమినీ భారతాన్ని రాసిన ఉదంతాన్ని చక్కటి కథగా మలచిన తిరుమల కృష్ణదేశికాచార్యుని పద్యనాటిక, ఈ సంచికలో.
ఇంకా: మానస, స్వాతికుమారి, నారాయణ, ఇంద్రాణిల కవితలు; శ్యామలాదేవి, సుబ్రహ్మణ్యం, ఆర్ శర్మ, సాయి బ్రహ్మానందం కథలు; మోహన రావు, కామేశ్వరరావు, మానసల వ్యాసం, శీర్షిక, సమీక్షలు; శ్రీనివాస్ సమర్పిస్తున్న రేడియో నాటకం, లలిత గీతాలు…
అబ్బాయిని కోడలు వినకుండా మందలించింది పార్వతమ్మ. ఓ వెఱ్ఱినవ్వు నవ్వి ఊరుకున్నాడు అమ్మూ. కోడలికి చెప్పాలంటే సంకోచపడింది ఆవిడ. గౌరీశంకరం గారు కూడా నోరు మెదపలేదు. అమ్మాయికి చెప్పే స్వతంత్రత లేదని అన్నారు. అమ్మాయి తల్లి తండ్రులు చెపితే బాగుంటుందేమో ప్రస్థుత పరిస్థితులలోయని పార్వతి దగ్గర అభిప్రాయపడ్డారు.
ఈ వూరికి ఆ వూరు ఎంత దూరమో ఆ వూరికి ఈ వూరూ అంతే దూరం అన్నట్టు… మన తెలుగు దేశం నడిబొడ్డులో పుట్టి పెరిగిన ఈ అమ్మాయిలు ఇంత వెస్ట్రనైజ్‌డ్‌గా వున్నారేమిటీ అని నేను ఆశ్చర్య పోయానా, మరీ వాళ్ళేమో నా గద్వాల్ చీర, నా జుట్టుముడి చూసి ఈ దేశంలో నలబై ఏళ్ళుగా వుంటున్నానని, నేను డాక్టర్ నని విని నోళ్ళు తెరిచారు!
ముని గుడిసె లోంచి బయటకొచ్చి మిఖాయిల్‌ని తీసుకెళ్ళి ఓ చెట్టును పడగొట్టించేక దాన్ని మూడు ముక్కలుగా కాల్పించేడు నిప్పుల మీద. అవి బొగ్గుముక్కల్లాగా అయ్యేక చెప్పేడు ముని, “ఇవి సగం లోతుగా ఇక్కడ పాతిపెట్టు. రోజూ నోటితో వీటిని తడుపుతూ ఉండు. నీకిదే పని. ఎప్పుడైతే ఈ మూడూ పూర్తిగా ఆకులు వేసి మళ్ళీ మొలవడం మొదలు పెడతాయో అప్పుడు నీకు పాప ప్రక్షాళన అయినట్టు.”
నాకు డెబ్బీతో పరిచయం విచిత్రంగా జరిగింది. నేను బారిస్టాగా పనిలో చేరిన కొత్తలో కస్టమర్ల ఆర్డర్లు తీసుకోవడం కాస్త కష్టంగా ఉండేది. అలవాటు లేని పని. పైగా వచ్చే ప్రతీ వాడూ ఒక్కో కాంబినేషన్లో కాఫీ ఆర్డర్ చేస్తాడు. సాధారణంగా కాఫీ గ్లాసు మీద ఆర్డరు రాస్తారు. దాన్ని బట్టే కాఫీ చేస్తారు.
నిజానికి ప్రకృతి వర్ణనలకు సంబంధించి చాలా మంది పాఠకులకు ఉండే ఇబ్బంది కవి దృష్టితో లోకాన్ని చూడలేకపోవడం; కవి వర్ణనలను అతిశయోక్తులని నమ్మడం. ఈ వైయక్తికమైన అనుభవాలని సార్వజనీనం చేసి ఒప్పింప జేసుకోవడానికి కవిలో నిజాయితీతో పాటు, పాఠకులను చనువుగా తన వెంట రమ్మని పిలవగల నేర్పు కూడా ఉండాలి.
మొత్తం సృష్టిలో ఒకానొక జీవిగా మన మానవజాతి ఆయుఃప్రమాణమెంత? దాన్ని మనం ఎంతవరకూ సద్వినియోగం చేసుకుంటున్నాం? బుద్ధిజీవులమైన మనం ఆ బుద్ధిని దేనికోసం ఉపయోగిస్తున్నాం? జారిపోయే కాలం విలువని తెలుసుకోనీయకుండా ఏయే ఉన్మాదాలు మన బుద్ధిని ఆక్రమించేస్తున్నాయి? మతోన్మాదం, మదోన్మాదం, ధనోన్మాదం, అధికారోన్మాదం – ఎన్నెన్నో ఉన్మాదాలు!
క్రిందటి రాత్రి వఱకును గావ్యమునకు పినవీరభద్రుఁడు శ్రీకారము చుట్టలేదని రాజునకును, సభికు లకును దెలియును. ఒకరాత్రిలో నాశువుగ నైనను అంతటి మహాకావ్యమును వ్రాయుట దుర్లభ మని సభికు లభియోగము దెచ్చిరఁట. అప్పుడు పినవీరభద్రకవి ‘వాణి నారాణి’ యనియు, తన కది యసా ధ్యము కాదనియు వారికి బదులు చెప్పెనఁట!
విమానాన్ని చూసిన ప్రతిసారీ
వినమ్రంగా చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుందిఎగిరే రేకుల డబ్బాలా కాక
చేపా హంసలు ఒక్కటై దర్శనమిచ్చే
దేవతా సోయగంలా అనిపిస్తుందిసంజీవ పర్వాతాన్ని అమాంతంగా
మోసుకు పోతున్న హనుమంతుడి
కార్యోన్ముఖుత ని గుర్తుకు తెస్తుంది
పాటకు
పడగ విప్పిన
తాడు చుట్టుకు
సాలె పట్టుల్లా
పైపైకి లేచే
సూటి చూపులు
ఎన్ని వసంతాల వంచనకు వడలి
రేకులుగా రాలిపడుతోందో
లోలోపలెంతగా దహించుకుపోయి
దావాగ్నిలా ఎగసిపడుతోందో
దూరం నుండి చూస్తున్నవాడివి
మళ్ళీ ఏమైంది?
ఎవరో పిలిచారు నేలపైకి.ఒక్క నిముషం,
నిన్నొకసారి సర్దేసి వెళ్ళనీ.
మిగిలిన రెండు జాజిపూలనీ
దిండుమీదే వదిలేసి ఉంచనీ.
ప్రతి అడుగుకీ చెయ్యవలసిన పని కేవలం ఓ గుర్తుని చదవడం, అవసరమైతే దాని స్థానంలో వేరే గుర్తుని రాసి, స్థితి మారి అటో ఇటో కదలడం. అంతే. ఈ మాత్రం చెయ్యడానికి మనిషి ఎందుకు, ఓ యంత్రాన్ని పెడితే సరిపోతుంది గదా. అదీ ట్యూరింగ్ ఆలోచన. మనిషి మనఃస్థితులని ఈ యంత్రం యాంత్రికస్థితులుగా అనుసరించాలి. ఇది కారు లాంటి యంత్రమా? గేర్లు ఉంటాయా? కరెంటు మీద నడుస్తుందా? ఇవేవీ ముఖ్యం కాదు. ఇది కేవలం గణిత భావానికి ఆకారం ఇవ్వడం. పోయి నిర్మించాలని లేదు. కాని ముఖ్యంగా గ్రహించాల్సింది – ఎలాంటి ఆల్గరిదమ్ అయినా సరే ఇలాంటి యంత్రంతో చేసెయ్యవచ్చు. మీకది నమశక్యం కాదంటే నేనర్థం చేసుకోగలను. మీకు నమ్మకం కలగాలంటే యంత్రాలతో కొన్ని లెక్కలు చేయించాలి.
గీతులు అనగా గానయోగ్యములైన ఛందస్సులు. అన్ని భారతీయ భాషలలో పాటలకు అనువైన ఛందస్సులను లాక్షణికులు కల్పించినారు. సంస్కృతములోని ఆర్య తొమ్మిది విధములు, అందులో ప్రత్యేకముగా నాలుగింటిని గీతులు అని పేర్కొన్నారు. అందులో ఆర్యాగీతి కన్నడ తెలుగు భాషలలోని కంద పద్యమే. అంతే కాక వైతాళీయములు తాళయుక్తముగా పాడుకొనదగినవే. ప్రాకృతములో కూడ గేయములకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చారు. అనాదినుండి కన్నడ తెలుగు భాషలలో కూడ ఇట్టి గానయోగ్య ఛందస్సులు గలవు. కన్నడములో త్రిపద, అక్కరలు, రగడలు, తెలుగులో ద్విపద, తరువోజ, సీసము, ఆటవెలది, తేటగీతి, అక్కరలు, రగడలు ఇట్టి ఛందస్సులే.
రచయిత బుచ్చిబాబు ప్రసిద్ధ నవల చివరకు మిగిలేది గురించి ఈమాట పాఠకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నవలను రేడియో కోసం పాలగుమ్మి పద్మరాజు 1960లలో నాటికగా మలిచారు. ఆ నాటికను మీకోసం ఈ సంచికలో పరుచూరి శ్రీనివాస్ సమర్పిస్తున్నారు.
నాలుగేళ్ళ క్రితం ఆంధ్రభారతి శాయిగారితో కలిసి తెలుగు నిఘంటువులు, పదకోశాలు పోగు చేసే కార్యక్రమంలో ఒకరోజు డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో ‘విద్యార్థి కల్పవల్లి’ కోసం వెతుకుతుంటే ఊహించని విధంగా వింజమూరి శివరామారావుగారి గేయసంకలనం కల్పవల్లి-గీతికాలతాంతాలు (1958) అన్న పుస్తకం కనబడింది. చిన్నప్పుడు విజయవాడ రేడియో కేంద్రం నుండి విన్న ఎన్నో లలితగేయాల పూర్తి పాఠాలు ఒక్కసారి కళ్ళముందుంటే కలిగిన సంతోషం మాటల్లో చెప్పలేనిది.
కౌముది వెబ్ మాసపత్రిక మరియు రచన మాసపత్రిక సంయుక్త నిర్వహణలో జరుగుతున్న కథల పోటీ, 2015కు మీ రచనలని ఆహ్వానిస్తున్నాము. పోటీ కథలు మాకు అందవలసిన చివరి తేదీ: ఫిబ్రవరి 5, 2015.
రాబోయే 20 వ తానా సమావేశాలలో (జులై 2-4, 2015) తెలుగు సాహిత్య కార్యక్రమాల నిర్వాహక వర్గం ‘తెలుగు సాహిత్యంలో స్త్రీల పాత్రల స్వభావ పరిణామం’ అనే అంశం పై చర్చావేదిక నిర్వహించనుంది. స్త్రీ పాత్రల స్వభావాలలో వచ్చిన మార్పులు వివిధ తెలుగు సాహితీ ప్రక్రియలలోను, దృశ్య మాధ్యమాలలోను ఎలా ప్రకటితమయ్యాయి? ఈ మార్పులు సమకాలీన సమాజంలో స్త్రీల జీవితాల్ని ఏ విధంగా ప్రభావితం చేశాయి? అనే విషయాలను చర్చకు తీసుకురావడం, ఈవేదిక నిర్వహణ ప్రధానోద్దేశం.