మనమున్న జీవితానికి, మనం గీసుకున్న పరిధి దాటి రావడమంటే యుద్ధంతో సమానమైపోయింది. గీతకి అవతలివైపు నుండి చేయి కనపడ్డప్పుడు, అది యుద్ధం నుండి బయటపడేసే సాయమేనేమో అనుకునే మనస్తత్వం దాదాపుగా మాయమై, అది సాయం కోసం చాచిన చేయేనని తీర్మానించుకుని, చూసీచూడనట్టు వెనుతిరగడం పరిపాటైపోయింది.

“వాడు ఆ కమల యే గదిలో వుంటే ఆ గదిలో దూరుతున్నాడు. వాడ్ని లోకువ కట్టి వాళ్ళు మనుగుడుపుల్లోనే ఆ అవపోసన కాస్తా అయిపోయిందనిపిచ్చేట్లున్నారు. నేనెంత నెత్తీ నోరూ బాదుకుంటే ఏం లాభం? మీరు బెల్లం కొట్టిన రాయి. ఇహ యీ తగూలన్నీ నా నెత్తి మీదకు నెట్టేస్తున్నారు. మీరూ మీరూ బాగుండాల. మధ్యన వియ్యపురాలి పీనుగ గయ్యాళిది అనిపించుకోవాలి నేను.”

వంటిల్లంతా పెద్ద చెత్త కుండీలా తయారయింది. నేల మీద రొట్టె ముక్కలు, ఉత్తరాలు, ఖాళీ పేకెట్లు, సిగరెట్టు పీకలు, చెప్పనలవి కాకుండా వుంది. అయినా ఎప్పుడూ ఆవిడ విసుక్కోలేదు. పైగా ఒంటరివాడని, అతన్ని అంటిపెట్టుకుని వుండేవారెవరూ లేరనీ సానుభూతి కూడా. కిటికీ తలుపు తెరిచి ఆకాశం వంక చూసింది. అక్కణ్ణించి ఆకాశం ఎందుకో ఎప్పుడూ దిగులుగా అనిపిస్తుంది.

అది జరిగిన తర్వాత, చాలా నెలల పాటు, ఆ సన్నివేశం నాకు మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చేది. నేనా పెద్దాయనను చిన్నబుచ్చి వుంటానా? పక్కవాడు పాదాభివందనం చేసినప్పుడు, నా నుంచి కూడా ఆయన అదే ఆశించి వుంటాడా? అసలు ఆయన పట్టించుకున్నాడా? కానీ ఇద్దరి మర్యాదలోనూ స్పష్టమైన తేడా కనబడినప్పుడు, లిప్తమాత్రంగానైనా గమనించకుండా ఉంటాడా?

వచ్చే అతిథులు అసమాన ధీరులైన కురువీరులు. అంతే కాదు, వారికంటూ ప్రత్యేకమైన రుచులు కూడా ఉన్నాయి. అందువల్ల పాకశాసనుడు పాకశాలాధిపతిని పిలిపించి పాండవకౌరవాదులలో ఎవరెవరికి ఏయే వంటకాలు వడ్డించాలో ఎవరికేది వడ్డించకూడదో చాలా వివరంగా చెప్పాడు. ఏమైనా తేడాలు వస్తే నరకానికి పంపేస్తానని హెచ్చరించాడు కూడా. అన్నీ జాగ్రత్తగా విన్న వంటపెద్దకి బెంగ పట్టుకుంది. ఇంద్రుడు చెప్పిన వివరాలన్నీ గుర్తుపెట్టుకొనడం ఎలా?

రెడ్డీ అల్లుడూ అరగంటలో కారు దిగేసరికి గుడి చుట్టూ జనం పోగై ఉన్నారు వింత చూస్తూ. డబ్బులు ముట్టుకోవడానికి ఎవరికీ ధైర్యం లేదు. వినాయకుడి డబ్బా, మజాకా? సాక్షుల్లేకుండా ముట్టుకుంటే జైలూ, దేవుడి డబ్బులు ముట్టుకుంటే నరకమూను. అదీకాక ఈ హుండీ తెరవాలంటే బేంకు వారు రావాలి; దేవుడిది ధర్మఖాతా కదా? కానీ బేంకు వారు గంట పది దాటకుండా, ఆఫీసులు తీయకుండా అలా వచ్చేస్తారా? కొన్నిసార్లు వచ్చేస్తారు మరి.

వంటింటి నుంచే జీవితం ప్రారంభమైనప్పుడు
వంటింటినెలా వదిలేస్తాం
మనోద్వారాలను గెలిచే మార్గాలు
అక్కడినించే ఉన్నాయన్న
పెద్దలమాట ఉండనే ఉంది కదా
అదీ స్త్రీత్వపు మాయతెరగా కనిపించినా
అదే వాస్తవం

ఇవాళ నువ్వేది మాట్లాడినా వింటాను
సిగ్గును రెండు ముక్కలు చేసి
మనసును రెండు చెక్కలుగా కోసి
ఎందుకంటావా?
అవ్యక్తాల్నిలా ప్రేమించినందుకే
అందుకే వింటాను చెప్పు

ప్రస్తుత సంకలనం ఇక్కడ నివాసిగా స్థిరపడ్డాక రూపొందినది. ఇందులో స్నేహరాహిత్యం పట్ల కొంత దిగులు ఉన్నా ఇక్కడ, ఇండియాలోనూ జరిగిన సమకాలీన సంఘటనలకి రాజకీయమైన స్పందన ఎక్కువ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా, ఇండియాలో తన ప్రాసంగికతను నిరూపించుకోవాలనే తాపత్రయం కవిలో ఉన్నట్టు నాకనిపించింది.

ప్రద్యుమ్నుడికి వంటచేయడం హాబీ కాదు. తినడమే కానీ వంట చేయడం రాదని సగర్వంగానే చెప్పుకుంటాడు. భార్య ఎప్పుడైనా, చాలా అరుదుగానైనా పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో వంట చేసుకునే వాడు కాదు. ఆ పది పదిహేను రోజులు బ్రహ్మచారుల మెస్సులోనే నేపాలీ వంట తినేసేవాడు. జోర్హాట్‌లో ఆ కాలంలో వంటమనిషి దొరికేవాడు కాదు. అందుకని ఇన్‌స్టిట్యూట్ కేంటీనులో ఒక నేపాలీ వాడిని కుదుర్చుకున్నారు.

ఇక్కడ నేను శూన్యాన్ని మోస్తున్నాను
నా ఒక్కరి ఖాళీనే మోస్తున్నానా ఏమిటి
ఎందరెందరిదో
ఇక్కడ నేను శవాన్ని మోస్తున్నాను
నా ఒక్క శవాన్నే మోస్తున్నానా ఏమిటి
ఎందరెందరివో

ఊరి చివర వాడలో
ఒంటరిగా ఉంటాడు
డప్పు మోగమంటేనే
ఊరు లోకి వస్తాడు.
ఆదివారం దండోరా!
పాములోయ్ పహారా!

పద్యానికి ఆధునికస్వరాన్ని యివ్వడంతో పాటుగా, పాటని కావ్యంగా మలిచిన చాలా కొద్దిమంది కవులలో విద్వాన్ విశ్వం ఒకరు. పాటనీ పద్యాన్నీ జమిలిగా నేత నేసి, అటు పల్లెపాట లోని అమాయకత్వమూ యిటు మార్గకవిత్వం లోని ప్రౌఢత్వమూ సరిపాళ్ళలో జత చేసి, ఒక సరికొత్త పాటను వినిపించిన కవి. రాయలసీమ కన్నీటిపాటను పెన్నేటిపాటగా ఆయన మలిచిన తీరు అపూర్వం.

మంకెన పువ్వులు విచ్చే కాలం
పచ్చని ఆకులు మెరిసే కాలం
వెన్నెల పువ్వులు తురిమే కాలం
చంద్రుని చల్లని ముద్దుల కాలం
సూర్యుని వెచ్చని కౌగిలి కాలం

దగ్గరై నిలచి
సంభ్రమమో, సందిగ్ధమో అయేకన్న
ఆవిరి రూపమై
మరలే యింద్ర ధనువవడమే
అందమేమో!

నడి రేయి దొంగ! దొంగ! పట్టుకో! పట్టుకో​మ్మని ​ రామయ్య కేకలు బెట్టె. ‘దొంగోడు సంచీ​ బట్టుకోని లగెత్తాడు​ గురవయ్యా!’ అంటానే ఆడి ఎంటబడ్డాడు రామయ్య. ఎనకమాల్నే మేవూ పరుగునొస్తన్నాం. ఆడ్ని ఎట్నో అందుకోని చేతిలో ఉన్న కర్రతో కాలిమీద ఒక్క దెబ్బేసినాడు. ఆడు ​సచ్చాన్రా నాయనో అనరిచినాడు​. ​అదే ఊపులో ఇంక రెండు దెబ్బలు బడినా​యోడికి​. ​ఆ దెబ్బకి ​ఆడి చేతిసంచీ జారి కింద​బడ్డాది.

చిత్రకవిత్వము యొక్కయు, ఆశుకవిత్వము యొక్కయు ప్రధానాశయము వినోదమే. చిత్రకవిత్వమును కవి ముఖ్యముగా తన పాండిత్యప్రకర్షను ప్రదర్శించుకొనుట కనేక నిర్బంధములకు లోనయి వ్రాయుట జరుగుచున్నది. ఇట్టి నిర్బంధములకు లోనయినను, చక్కని పద్యము నల్లిన కవి యొక్క మేధాశక్తి విస్మయావహముగా నుండుటయు, అట్టి మేధాశక్తికి పాఠకుడు అబ్బురమును, ఆనందమును పొందుటయు ఇట్టి కవిత్వము యొక్క ప్రధాన ప్రయోజనము.

రచయిత, హిందూ క్రిప్టిక్ క్రాస్వర్డ్ లోకంలో ప్రసిద్ధులు అయిన కోల్లూరి కోటేశ్వర రావుగారు ఈమాటకు కూర్చబోతున్న గడులలో ఇది మొదటిది ఈమాట పాఠకుల కోసం. గడి మాకు పంపాల్సిన ఆఖరు తేదీ 25 జనవరి.

ACP శాస్త్రి గారిగా చిరపరిచితులైన అందుకూరి చిన్నపొన్నయ్య శాస్త్రిగారు​ రేడియో నాటక రచయిత. వసుచరిత్ర లోని సంగీతశాస్త్రీయత గురించి న వారి రేడియో ప్రసంగమును ఈమాట పాఠకులకై వారి అనుమతితో బుసిరాజు లక్ష్మీదేవి దేశాయ్ సమర్పిస్తున్నారు

గాయని జిక్కి గురించి ఎటువంటి పరిచయం అవసరం లేదు. ఈ సంచికలో జిక్కి పాడిన, అంత తేలికగా దొరకని, మూడు పాటలు: మువ్వలు పలికెనురా, మబ్బుల్లో జాబిల్లి, కుందరదనా వినవే రామకథ – విందాం.

కౌముది వెబ్ మాసపత్రిక మరియు రచన మాసపత్రిక సంయుక్త నిర్వహణలో జరుగుతున్న కథల పోటీ, 2017కు మీ రచనలని ఆహ్వానిస్తున్నాము. పోటీకి వచ్చిన కథలలో ఉత్తమమైన కథలకు ఒక్కొక్కదానికీ రూ. 1500, అత్యుత్తమ కథ (ఒక కథకి) రూ.5000 బహుమానంగా ఇవ్వబడతాయి. చివరి తేదీ: ఫిబ్రవరి 5, 2017.