“అభయుడిమీదా, జీవకుడిమీదా చూపించే అభిమానం నీ తండ్రి ఎప్పుడైనా నీ మీద చూపించాడా? ఇప్పుడు నువ్వు రాజువి కాకపోతే, అభయుడికి బింబిసారుడు రాజ్యం ఇస్తాడనేది తధ్యం. ఆ తర్వాత నీ జీవితం ఏమౌతుంది? నీ ఇష్టం, మరోసారి ఆలోచించుకో,” దేవదత్తుడు లేచి వెళ్తూ చెప్పాడు.
శీర్షికలు కథలు
ఈ శాఖకు ఇరవై ఐదేళ్ళు సేవ చేసినందుకు ఒక చిన్న రాయితీ తీసుకున్నట్టు అనుకోవచ్చు. ఎంతమంది దోచుకోవట్లేదు; ఒక్కొక్కళ్ళయితే వెయ్యి కోట్లు, రెండు వేల కోట్లు మింగేశారంటున్నారు. స్టాక్ మార్కెట్ కుంభకోణాన్ని, బ్యాంకుల్లో పై స్థాయి ఆఫీసర్లను చూళ్ళేదూ?! వాటితో పోలిస్తే ఇదేం పెద్ద తప్పని?
ఆ సినిమాలో ప్రారంభంనుండి చివరిదాకా వీస్తున్న పొగమంచులోంచి కొట్టుకు వస్తున్న ఎండుటాకుల్లాగా, ఆ రాత్రంతా మల్లికార్జున్ మనసులో కూడా ఎడతెగని వాన కురుస్తూనే ఉంది.
గుండెలు అవిసిపోయే దుఃఖంతో క్రిసెస్ మార్గం తోచక తన ఇష్టదైవం అయిన అపోలోకి ప్రార్థన రూపంలో విన్నపం సమర్పించుకున్నాడు. తన ఆప్తుడికి ఎదురయిన కష్టాన్ని చూడగానే అపోలోకి కోపం వచ్చి అగమేమ్నాన్ సేనల మీద ప్లేగు మహమ్మారి పడాలని శపించేడు.
“మీరు ఏమీ అనుకోనంటే, ఒక మాట… మీరు నాతో డేట్‌కి వస్తారా?” అని ధైర్యం కూడగట్టుకుని అడిగేశాడు.
వేయబోయిన అడుగు ఆగింది కానీ, ఆమె అతని వైపు తిరగలేదు.
ఓ బోర్డు మీద తప్పు రాస్తే చెరిపేసుకోవచ్చు, ఓ కాగితం మీదైతే చింపేసుకోవచ్చు. కానీ ఓ మనసు మీద తప్పు రాసుకుంటే?
భారత యుద్ధం గురించి చదువుతున్నప్పుడు వచ్చే రకం సందేహాలే ట్రోయ్ యుద్ధం గురించి కూడా వస్తాయి. ఈ కథ పురాణమా? ఇతిహాసమా? ఈ యుద్ధం నిజంగా జరిగిందా? జరిగితే ఎప్పుడు జరిగింది?
రోడ్ల మీద ఇంకా సన్నటి చీకటి పొంచి ఉంది. కాలికి ఒక రాయి తగిలినట్లు కాలు విదిలించుకుంటూ గట్టిగా భూమ్మీదకు తన్ని అడుగేశాడు. అప్పుడు అతని కుడి కాలు నేలను తాకిన చోటునుండి ఒక నీటి ఊట పైకి చిమ్మడం మొదలైంది. అతను నమ్మలేకపోయాడు. ఆ ఊట ఆరడుగుల ఎత్తుకు పైకి చిమ్ముతోంది.
రాత్రి నగరాన్ని కప్పదు. వివస్త్రను చేస్తుంది. పగలు ధరించిన అబద్ధాల్ని ఒక్కొక్కటిగా విప్పి, అసలు ముఖాన్ని బయటపెడుతుంది… రాత్రి పదకొండు దాటిన తర్వాత నగరం పాత్రలు మార్చుకుంటుంది. పగలు అధికారంతో మాట్లాడిన మనుషులు, రాత్రి ఒంటరిగా నడుస్తారు. పగలు నవ్విన ముఖాలు, రాత్రి ఆలోచనలతో నిండిపోతాయి.
నేను దేవుణ్ణి కాదు, టెలెమాకస్! నువ్వు ఎవరి కోసం రాత్రి, పగలు కలవరిస్తున్నావో, ఎవరి రాకకోసం ఇరవై ఏళ్ళబట్టి ఎదురు చూస్తున్నావో ఆ వ్యక్తిని నేనే. నేను నీ తండ్రిని!
పయనీర్ లాడ్జ్ కాలంతోపాటు ముందుకు వెనక్కు మెల్లగా సాగుతూనే ఉంది. నిజానికి అది ఒక జ్ఞాపకాల దొంతరలా మారింది. కొందరు ఇప్పటికీ దాని ముందు నిలబడి గతంలో ఆ గదుల్లో తాము స్త్రీలతో గడిపిన ఉల్లాస వేడుకల గురించి తలపోసుకుంటూ ఉంటారు.
ఆకాశం బద్దలైంది. చెవులు పగిలిపోయే పేలుడు శబ్దం రాలేదు ముందు. కేవలం తెల్లటి వెలుగు. వేలాది సూర్యులు ఒక్కసారిగా ఇంట్లోకి దిగివచ్చినట్లు… ఆ వెలుగు తీవ్రతకు తన చేతిలోని గ్లాసు, అందులోని నీరు, చుట్టూ ప్రపంచం క్షణంలో ఆవిరైపోయినట్లు అనిపించింది అమీర్‌కు.
ఆయన తన ఇథకా ద్వీపాన్ని కానీ, తన భార్య పెనలొపీని కానీ, తన కొడుకు టెలెమాకస్‌ని కానీ చూసి ఇరవై ఏళ్ళు కావస్తోంది. కలిప్సో ఎంతగా ప్రేమాభిమానాలు చూపెట్టినా ఒడిస్సియస్ ఇథకాను మరచి, పెనలొపీని విడచి ఉండలేకపోయేడు. తనకు భార్య ఉండడమే కాకుండా ఒక కొడుకు కూడా ఉన్నాడనిన్నీ, వారిని ఇప్పుడు విడిచి వేరొకరిని వివాహమాడడం ధర్మసమ్మతంగా ఉండదనిన్నీ ప్రాధేయపడ్డాడు.
ఆ రైల్వే స్టేషన్ ఒక ప్రసిద్ధ ఆలయానికి సమీపంలో ఉంది. అందువల్ల మంగళ, శుక్రవారాల్లో స్టేషన్‌లో దిగే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇరవై ఏళ్ళ క్రితం ఆ గుడికి ఇంత ప్రాచుర్యమూ, మహత్యమూ ఉండేది కాదు. కానీ ఉన్నట్టుండి దశ తిరిగి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొంది ఉత్తరాది రాష్ట్రాలనుండి కూడా భక్తులు రావడం మొదలుపెట్టారు.
“మరణించినవారి లోకం కంటే బ్రతికున్నవారి లోకం ఎంత అందంగా ఉందో…” అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. ఉదయభానుడి కిరణాల వెచ్చటి స్పర్శకు ఒడిస్సియస్ కళ్ళు తెరిచాడు. ఎదురుగా సర్సీ కనిపించింది. ఇంద్రధనుస్సులోని సప్తవర్ణాలతో మెరుస్తూన్న ఆమె దుస్తులు ఆమె సహజ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తున్నాయి.
అయ్యన్నీ వొగ్గేసుకుని ఆడనుండి ఈ బెంగలూరు వట్టుకొచ్చాడయ్య! మా మునసబు గోరి సిన్నోడు లేరయ్య. ఆరు దేవుడండయ్య! నేనే ఆరెంట బడ్డానండి! ఆయన గోరికి సెక్కూరిటీ ఏపారమంటండి. ‘కాపలాలు కాయాలిరా సత్తీ కాస్తావా’ అన్నారండి.
నేను కుక్కను కాలేనా ఏంటి? నేనవుతా. కచ్చితంగా అవ్వగలను. ఇలాంటి చావుతో నా ఉనికి మాసిపోనివ్వను. తరాలకు తరాలు ఉనికి నిలుపుకోవాలనుకుంటున్నాను. నన్నెవరూ ఆపలేరు. మళ్ళీ మొఱిగాడు. ‘భౌ భౌ భౌ…’
ఎన్ని ఇక్కట్లు ఎదురైనా అతని దృష్టి ఎటూ చెదరకుండా గమ్యం మీదనే ఉంది. ఆ గమ్యం ఇథకా పట్టణం. ఆ పట్టణంలో ఉన్న తన భార్య పెనలొపీ, కొడుకు టెలెమాకస్. ఈపాటికి పిల్లడికి పన్నెండేళ్ళు వచ్చి ఉంటాయి. తన తల్లిదండ్రులు? వారింకా బ్రతికే ఉన్నారా?
ముష్టెత్తడానికి ఆమెకు ప్రత్యేకమైన ఏర్పాట్లేం ఉండవు. ఖాళీ చెయ్యి సాచి యాచిస్తుంది. వచ్చిన నోట్లని ఎడమ చేతిలో బిగియపట్టుకుంటుంది. సిగ్నల్ పడి వాహనాలు వెళుతుండగా పేవ్‌మెంట్ మీదికి చేరి, బొడ్డున దోపుకున్న ఒక తిత్తిలోకి ఆ మొత్తం చేరుస్తుంది.
అంతు దొరక్క గిలగిలా కొట్టుకోవడం అన్నది మానవ మాత్రులుగా మన ఆఖరి ప్రతిస్పందన. అప్పుడు దేవుడు మందహాసం చేస్తాడు. ఒక చిన్న క్లూ విసిరి చూస్తాడు. వీడు దీన్ని పట్టుకోగలుగుతాడా అని సరదాగా పైనుండి వేడుక చూస్తాడు.