భద్రిరాజు కృష్ణమూర్తి గారితో సుమనస్పతి (ఆకాశవాణి) ఇంటర్యూ
Category Archive: భాషాశాస్త్రానికి మరోపేరు భద్రిరాజు
ద్రావిడ భాషాపరిశోధనలో గత శతాబ్దంలో ‘సగంనాది’ అనగల ఏకైక శక్తిమంతుడు ఆయన ఒక్కడే.
మాండలిక వృత్తిపద కోశాల విషయం భద్రిరాజువారి మౌలిక పరిశ్రమ ఫలితం.
ఇంతటి మహత్తర కోశాన్ని సంకలనం చేసిన శ్రీ భద్రిరాజు కృష్ణమూర్తిగారికీ, ఆ పని వారికే అప్ప చెప్పి ఓపికతో చేయించుకొని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారిని మరొకమారు అభినందిస్తున్నాను. మరొకమారు చాలదు. పిదప వేరొక మారు, ఆ తరువాత ఇంకొకమారు అభినందించాలి.
తెలుగులో ఆలోచనా రంగం బలంగా ఏర్పడటానికి కృషి చేసిన వారిలో కృష్ణమూర్తిగారు చాలా పెద్దవారు. ఆయన వేసిన ప్రణాళికలూ, చేసిన ఆలోచనలూ, ప్రతిపాదించిన సిద్ధాంతాలూ తయారు చేసిన శిష్యులూ, తెలుగు భాషని ఒక్కసారిగా కొన్ని శతాబ్దాలు ముందుకు తీసుకొచ్చి ఇరవయ్యో శతాబ్దిలో పెట్టాయి.
సందర్భం వచ్చింది గనుక వారిని కొత్త తరానికి స్థూలంగా పరిచయం చేయడం, అంతర్జాతీయ భాషాశాస్త్ర రంగంలో అగ్రగామి భాషా శాస్త్రవేత్త గా గుర్తింపు రావడానికి కారణమైన వారి కృషిని వివరించడం అవసరం అనుకుంటాను.