అందరూ గోతిలో పడిపోయి గోల పెడుతున్నారనుకుంటే ఆయన లాంటి వాళ్ళకి ఒక తృప్తి. జనాన్ని పిల్చి ‘ఇదిగో చూడండి. పాపం వీడు గోతిలో వున్నాడు. కష్టాల్లో వున్నాడు. అమాయకుడు. ఎలా బ్రతకాలో కూడా వీడికి తెలియదు. నేనే వీడిని కనిపెట్టి చేరదీసి జీవితాన్ని బాగుచేసుకోవడమెలాగో నేర్పిస్తున్నాను,’ అని చెప్పుకోవడం సరదా. ఎందుకంటే బాధల్లో బలహీనతల్లో వున్న వారి గురించి చెప్పుకుంటేనే కదా ఆయనలాంటి వాళ్ళకి పేరూ ప్రఖ్యాతి. ఒకళ్ళని ఉద్దరిస్తున్నామంటేనే కదా వాళ్ళకి ప్రత్యేకత!
జనవరి 2016
!!!ఈమాట రచయితలకూ పాఠకులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!
ఈమాట సజీవంగా సగర్వంగా 17వ ఏడులోకి అడుగు పెట్టింది. మీ సహాయసహకారాలు ఆదరాభిమానాలు లేకుండా ఇది ఎంతమాత్రమూ సాధ్యమయేది కాదు. అందుకు మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతాభివందనాలు అర్పిస్తున్నాం. అయితే ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నడవవలసిన దారి అంతా ముందే ఉన్నది. అందువల్ల, మారుతున్న కాలంతో పాటు మారుతూ కొత్త తరాల రచయితలనూ, పాఠకులనూ ఈమాట సాహితీప్రయాణంలో సహగాములను చేయడానికి, ఈమాట అందరికీ మరింత చేరువ కావడానికీ ప్రయత్నిస్తున్నాం. అదే సమయంలో సాహిత్యాన్ని సాహిత్యంగానే మననీయాలనే మా ఆశయాన్ని, మేము నమ్మిన సాహిత్యపు విలువలను కాపాడుకోవడానికి, సాహిత్యధోరణుల పాతకొత్తల మేలు కలయికగా ఈమాటను నడపడానికీ కృషి చేస్తున్నాం. సాహిత్యస్పందన తక్షణమూ, తాత్కాలికమూ అయి ఆవేశకావేషాలు రగిలించే జాతిమతవాద రాజకీయధోరణుల ప్రాబల్యానికి పనిముట్టు కాదనీ కారాదనీ మా నమ్మకం. ఆహ్లాదాన్నీ ఆలోచననీ కలిగించే సృజనాత్మక సాహిత్యంతో పాటు, విశ్లేషణాత్మక విమర్శావ్యాసాలను ప్రోత్సహించడం ద్వారా సాహిత్య చర్చలకు దోహదం చేయాలనీ, ఈమాట అందుకు ఒక చక్కటి వేదిక కావాలనీ మా కోరిక, మా ప్రయత్నమూ. ఈ దిశగా ఈమాట ప్రయాణం మీ తోడ్పాటు, ప్రోత్సాహం లేకుండా ఇప్పటిదాకా జరగలేదు. ఇకముందూ జరగదు. మీ ఆశీస్సులు, మీ సహకారం ఇకముందూ ఈమాటకు ఉంటాయని ఆశిస్తూ, ఉండాలని ప్రార్థిస్తూ, ఈమాట నిర్వహణలోనూ, ఆశయాలలోనూ ఏమాత్రమూ రాజీ పడమని హామీ ఇస్తూ, మీ అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం.
కేవలం దుఃఖాలకీ ఆనందాలకీ తప్ప అసలైన కళా ప్రదర్శనలకి వేటికీ నిన్ను స్టేజీ ముందర కూర్చోబెట్టలేకపోయానని నాకు విచారంగా వున్నది – ఇప్పుడే కాదు, ఎప్పటినించో! నవ్వకు – నా ఖర్మ కాలి ఇలా మంచానికి బందీ నయి కళ్ళు మూతలు పడినప్పుడే నాకు సంగీతమూ, నృత్యమూ ఏవీ రావు అని గుర్తుకొచ్చి బాగవగానే ఈసారి తప్పకుండా నేర్చుకోవాలని అనిపించేది. తరువాత లేస్తానా, అదేమిటో, వాటి విషయమే పూర్తిగా మర్చిపోతాను. పోనీ, ఫాతిమాకి అవేమైనా వచ్చా?
ఆ రోజు రాత్రి తీర్థయ్యకు మళ్ళీ అదే కల వచ్చింది. చౌరంగీ రస్తాకు రెండువైపులా లక్షల సంఖ్యలో జనం నిలబడి ఉన్నట్టూ, వాళ్ళంతా రాతివిగ్రహాలై నిశ్చలంగా నిలబడినట్టూ, దారికి రెండువైపులా పెద్దపెద్ద తెల్లటి నియాన్ దీపాలు వెలుగుతున్నట్టూ! ఆ దారంతా రక్తం! అక్కడ నిలబడి ఒక నడివయస్సు స్త్రీ ఛాతీని రెండు చేతులతో బాదుకుంటూ, ప్రవీర్! ప్రవీర్! అంటూ విలపిస్తోంది. ఆమె విరగబోసుకున్న పొడుగాటి జుట్టు ముఖం మీద పడుతోంది.
నిసి ఒక్కసారిగా లేచి, విక్టర్‌కి ఎదురుగా పరుగెట్టింది. టెరేస్ మీదకు కాలు పెట్టబోతున్న వాడిని ఆ ఆఖరు మెట్టు మీదే నిలబెట్టి, గాఢంగా కౌగిలించుకుంది. వారి ఎత్తులు సమాన మయ్యాయి. ఆమె అతని ముఖం చేతుల్లోకి తీసుకుని, అతని స్ఫుటమైన, ముద్దుల కాహ్వానిస్తున్నట్టుగా ఉండే విలువంపుల పెదవుల మీద తన గులాబీ పెదవుల ముద్దు ఉంచి, అలాగే నిలిపి ఉంచింది. దీర్ఘంగా అతని శరీరపు పరిమళాన్ని ఆఘ్రాణించింది. విక్టర్ అప్రయత్నంగా, ఆమెను చుట్టివేశాడు.
ఈ కవితలో మీరు సుమారు నాలుగు వందల మాటలు వాడారు. కలగా పులగంగా సమాసంలో కలిపేసిన మాటలని ఒక మాట గానే లెక్క పెట్టాము. మేము సాధారణముగా మా పత్రికలో ఇరవై-ఇరవై ఐదు లైనులకు మించిన కవితలని అచ్చు వెయ్యము. మా పత్రికలో మొదటి పేజీలో కవిత అచ్చయితే, ఆ కవితకి, రాసిన కవికీ పద్ధెనిమిది క్యారెట్ల బంగారు పతకాలు ఇచ్చి సన్మానించే సంస్థలు, స్వాములు, పీఠాధిపతులూ, ఉన్నారని మీకు తెలుసు.
అడవిలోనే చెట్టు కింద శిధిలావస్థలో దొరికింది ఓ విగ్రహం తల. వీరభద్రుడట. గోతాంలో ఉన్నాడు. ఆటవికులెవరో పూజలు చేయడం మానేసి వదిలిపెట్టిపోయిన విరిగిపోయిన విగ్రహం తాలూకూ తల అని నిర్ణయించారు వాళ్ళు. చివరికి వాళ్ళింటిలోనే పూజ గదిలో ఉంచాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా నలుగురూ కలిసి మోసుకు వెళ్ళి పూజగది ముందు ఉంచి ఇంక వెళ్ళొస్తామని వెళ్ళిపోయారు.
తిరిగి వచ్చేటప్పటికి మా ఆవిడ టెలిఫోనులో ఎవరితోనో మాట్లాడుతోంది. నేను బట్టలు మార్చుకొని వచ్చేటప్పటికి ప్రభావతి ఫోన్ పెట్టేసింది. ఒక పదిహేను నిముషాలు నిశ్శబ్దంగానే గడిచింది. ఒక్కొక్కప్పుడు నిశ్శబ్దం భరించడం కూడా కష్టమే. తొందర పడ్డానేమోనని అనిపించింది. ఒక లక్ష పెట్టి చేయిస్తే ప్రభావతి కోరిక తీరుతుందేమో ననిపించింది కూడాను. ఈ భావం ఒక నిముషం కన్నా నిలువలేదు. ఉన్న నాలుగూ లాకర్లోనే ఉన్నాయి. రెండు జతల గాజులు కూడా.
ఒక్కసారి హేజ్‌వుడ్ నవ్వడం మొదలెట్టాడు. మొదట్లో చిన్నగా మొదలైన నవ్వు తెరలు తెరలుగా పెద్దదై పక్కనున్న డేవిడ్, లిండాలు చూసినా సరే నవ్వుతూనే ఉన్నాడు. కాసేపటికి వచ్చే నవ్వు ఆపుకోలేక గదిలో ఉన్న కిటికీ దగ్గిరకెళ్ళి బయటకి చూస్తూ అదే పనిగా నవ్వు. ఇదంతా అర్ధం కాని డేవిడ్, “స్టాన్, ఆర్ యూ ఓకే?” అన్నాడు. లిండా కూడా కాస్త విస్తుపోయినట్టు చూసేసరికి తేరుకుని సుధీర్‌తో అదే నవ్వు మొహంతో అన్నాడు హేజ్‌వుడ్, “మీ నాన్నగారు మీ కూడా వచ్చారా?”
“సుందరం మా బంధువుల కుర్రాడే. తెల్లగా, సన్నగా ఉండేవాడు. నువ్వూ చూశావు. ఓసారి అతనికి పెద్ద యాక్సిడెంట్ అయి ట్రీట్‌మెంట్‌కి బాగా డబ్బు ఖర్చయింది. మా మావగారు అత్తగారివి నావి నగలు, మా ఇల్లు తనఖా పెట్టి ఆ కుర్రాడికి చికిత్స చేయించారు. దేవుడి దయ. ఆ అబ్బాయి కోలుకున్నాడు. తర్వాత బార్క్‌లో సైంటిస్ట్ అయ్యాడు. మేమంటే ఆ కుర్రాడికి బాగా అభిమానం.” అని చెప్పి, “మూర్తి వాళ్ళు మన కాంపౌండ్‌లోనే ఉండేవాళ్ళు గుర్తులేదా?” అని అడిగింది పరిమళ.
కంసుడు పంపిన రాక్షసులలో రెండవవాడైన శకటాసురుని కృష్ణుడు సంహరించే సన్నివేశంలో వచ్చే పద్యమిది. యశోద స్నానానికని గోపసతులతో నదీతీరానికి వస్తుంది. తాము వచ్చిన బండి క్రింద పక్కవేసి కృష్ణయ్యను పడుకోబెట్టి, నది దగ్గరకి వెళుతుంది. ఆ బండిని శకటాసురుడు ఆవహిస్తాడు. ఇంతలో కృష్ణుడు మేలుకొంటాడు. తల్లి దగ్గర లేకపోయేసరికి ఏడుపు లంకించుకొంటాడు. అప్పుడా బాలకృష్ణుని ముగ్ధస్వరూపాన్ని వర్ణించే పద్యం ఇది.
ఆంధ్రకవి అన్నది రాయల దృష్టిలో ఒక అపురూపమైన గౌరవం. పుట్టినప్పటి నుంచి నేర్చుకొన్న అమరభాషను, తరతరాలుగా ఇంటిలో వెలిసిన తుళు వాక్తతిని, కమనీయమైన కన్నడ కస్తూరిని, విష్ణుచిత్తీయ తమిళాన్ని కాదని, తనకెంతో ఆభిమానికమైన ఆంధ్రభాషకు పట్టాభిషేకం చేసి, ఆ భాషలో ఆముక్తమాల్యద విరచించిన రాయల నోట వెలువడిన అనర్ఘమైన గౌరవవాచకం అది.
అమితాశ్చర్యం కొలిపే విషయం పిఠాపురం రాజావారు వారి పరివారంతో కాలిఫోర్నియాలో దిగ్గానే ఒక స్వామీజీ, వారి భక్తులు వీరికి స్వాగతం పల్కడం! ప్యాలస్ లని తలదన్నే ఒక ఇంట్లో (బెవర్లీ హిల్స్ లోని ఒక భక్తురాలి ఇల్లట) ఊదువత్తుల మధ్యలో సిల్కు దిండుల మీద ఆశీనులై ఉన్న ఈ స్వాముల వారిని అక్కడి వాళ్ళంతా ఒక దేవుడిని చూసినట్లు చూడటం!
ముని చీకటి
కాటుక అలదిన
అంచుల వెనక
మాటలు దాచిన
సరసులని
అక్టోబర్ లో అడుగు పెట్టేసరికి
చుట్టూ వున్న చెట్లన్నీ
ముదురు రంగు కాషాయాల్ని ధరించటం మొదలెడతాయి
జలచాపము వీడిపోయి
గురిమరచిన బాణంలా
తిరుగాడును పిండి.పెనం గుట్టు తెరవబోయి
బిరడాలో ఇస్క్రూలా
ఇరుక్కున్న అట్టు.
వేశ్యావృత్తిలో ఉన్న వారి పట్ల సానుభూతినీ, గౌరవాన్నీ ప్రకటించిన రచయితలు ప్రజా బాహుళ్యపు విశ్వాసాలకు భిన్నమైన దృక్పథాలతో రచనలు సాగించారు. వీరందరూ సృష్టించిన వేశ్యల పాత్రల ద్వారా తెలిసేది ఏమిటంటే అసహజమైన వృత్తిని సమాజం వారిపై రుద్దింది కానీ సహజసిద్ధమైన వారి విలక్షణతలను రూపు మాపలేకపోయింది అని.
ఈ శ్లోకములో చెప్పిన కవిత్త్వపు భావము వెనుక చెప్పని భావసంపద ఎంతో ఉంది. ఇదంతా పాఠకుడు తనకు తాను ఊహించుకోవాలి. ఇక్కడ పాఠకుడూ ఒక కవి! సంక్లిష్టమైన భావం కదూ. ఈ సంక్లిష్టత పద్యంలో లేదు. మనలో ఉంది. ఆధునిక యంత్రయుగంలో ఉన్నాం కాబట్టి ఈ సంక్లిష్టత. మేఘాలు, నక్షత్రాలు, తారకలు, చంద్రుడు – ఆధునిక యుగంలో ఇవన్నీ భోగాలు మనకు!
ఇది నేను కొన్ని నెలలక్రింద ఈమాటలో ప్రచురించిన ‘వాణి నారాణి’ అను నాటికలో సందర్భానుసారముగా ఐదుపాటలను వివిధరాగములలో వ్రాసితిని. శ్రీమతి చర్ల రత్నశాస్త్రిగారు ఆ ఐదుపాటలను పాడిరి. ఆపాటలతో గూడిన పినవీరనవృత్తాంతము నిక్కడ ప్రదర్శించుచున్నాను.
అజంతా (పెనుమర్తి విశ్వనాథశాస్త్రి) తన కవిత్వాన్ని ప్రచురించడానికి అంతగా ఇష్టపడేవారు కాదని అంటారు. అలాగే ఆయన పెద్దగా ఇంటర్వ్యూలు ఇచ్చినట్లు, ప్రసంగాలు చేసినట్లు కనపడటంలేదు. ఆయన కవితలని రెండింటిని ఆయన గొంతులోనే వినిపిస్తాను.
వెంపరాల సూర్యనారాయణశాస్త్రిగారు గొప్ప పండితుడు. ఆయన రచనలలో, ప్రభావతీ ప్రద్యుమ్నము (1962), మనుచరిత్ర (1968) కావ్యాలకు రాసిన మంచి వ్యాఖ్యలు చాలామందికి తెలిసి ఉంటాయి. ఆయన తన సాహితీ యాత్ర పై చేసిన ప్రసంగం ఈ సంచికలో విందాం.
అనువాదంలో అవిరళ కృషికి గుర్తింపుగా మన్మధ నామ సంవత్సరానికి గాను బ్రౌన్ పండిత పురస్కారాన్ని వై. ముకుంద రామారావు గారికి ప్రకటిస్తున్నాము.