మేఘసందేశం – ఆడియో రూపకం

[రజనీకాంతరావుగారు వాద్య (కథా) చిత్రాలకు ఒక ఒరవడి, రూపం దిద్దినవారని చెప్తూ ఆదికావ్యావతరణం, మేఘసందేశం, కామదహనం రూపకాలని వాటికి ఉదాహరణలుగా పేర్కొన్నాను. ఇక్కడ మీకు వినిపిస్తున్న ‘మేఘసందేశం’ సంస్కృత సంగీత రూపకం 1978లో బెంగుళూరు రేడియో కేంద్రం ద్వారా ప్రసారితమయ్యింది. అప్పట్లో రజనిగారు బెంగుళూరు స్టేషన్ డైరెక్టరుగా పనిచేసేవారు. దీని సంస్కృత రచన (మూలం మేఘదూత నుండి తీసుకున్న రెండు శ్లోకాలను మినహాయిస్తే), సంగీత నిర్వాహణ చేసినది రజనిగారే. ఆయన గొంతును కూడా వినవచ్చు. యక్షునిగా ప్రధాన గాత్రధారి శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. 1958-59 ప్రాంతంలోనే వీరిద్దరి కలయికలో మేఘసందేశం అన్న తెలుగు సంగీత రూపకం విజయవాడ కేంద్రం ద్వారా ప్రసారితమయ్యింది. కానీ ఆ రికార్డింగు మనకీరోజు అందుబాటులో లేదు.

దీనిని ఈ సంచికలో మోహనరావుగారు మందాక్రాంత వృత్తం పైన రాసిన ఆషాఢస్య ప్రథమ దివసే అన్న వ్యాసానికి అనుబంధంగా అందిస్తున్నాను. మోహనరావుగారే ఈ రూపకానికి మొదటిలో రజనిగారు కన్నడంలో మాట్లాడిన మాటలకు, ఆ పైన సంస్కృత శ్లోకాలకు తెలుగులో క్లుప్తంగా అర్థాన్ని కూడా అందించారు. అంతేకాకుండా తగిన చోట ఎంతో శ్రమతో ఈ రూపకంలో గీతాలకు మూలమైన శ్లోకాల సంఖ్యతో ఈమాట గ్రంధాలయంలోని మేఘదూత ప్రతికి అనుసంధించారు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాగమురళి గారు రూపకపు సంస్కృత పాఠాన్ని అందించడమే కాకుండా మోహనరావు గారి అనువాదానికి తోడ్పడ్డారు. వారికీ నా కృతజ్ఞతలు.]


రూపక పాఠం

శ్రీరస్తు శుభమస్తు విజయోస్తు
చిరవియోగ పీడితదంపత్యోః
శీఘ్రసంయోగసంసిద్ధిరస్తు
స్వాస్థ్యమస్తు సౌఖ్యమస్తు
సదా సుఖీరస్తు శుభ‌మస్తు విజయోస్తు
మహాకవి కాళిదాస గ్రథితస్య
మేఘసందేశ శ్రవ్య కావ్యస్య
శృంగార గేయ సుందర గాథా
రూపకీకృత రజనీకాంతాభిధేయేన‌
బుధజనవిధేయేన‌
సరసహృదయసమ్మతిమ్ ప్రాప్నుయాత్
విశ్వ జనయశస్వితామాప్నుయాత్||

కశ్చిత్కాన్తా విరహగురుణా స్వాధికారాత్ప్రమత్తః
శాపే నాస్తంగమితమహిమా వర్షభోగ్యేణ భర్తుః
యక్ష శ్చక్రే జనకతనయా స్నానపుణ్యోదకేషు
స్నిగ్ధచ్ఛాయాతరుషు వసతిం రామగిర్యాశ్రమేషు||

కశ్చిత్ స్వాధికారాత్ ప్రమత్తో హేమమాలీ నామాంకితః యక్షః కాన్తా విరహ గురుణా వర్ష భోగ్యేణ భర్తుః కుబేరస్య శాపేన అస్తంగమితమహిమా దండకావనే రామగిరి ఆశ్రమేషు జనకతనయా స్నాన పుణ్యోదకేషు స్నిగ్ధచ్చాయా తరుషు వసతిం చక్రే||

గతో ఋతుర్వసంతః గ్రీష్మోప్యాగతః. తస్మిన్ అవసరే దుష్కరస్య గ్రీష్మస్య చ దుస్సహస్య వియోగస్య ఉభయో[స్తావె] దందహ్యమానాయాం అవస్థాయాం నాయకో యక్షః||

కేవలం తే నిరుపకారీ మేऽపి కించిన్న సుఖకారీ
సోగతోऽద్య వసంత సమయః
వై న భవతి వై న భవతి వై న భవతి ప్రియతమే
హృదయభేదీ వియోగశాపః దేహదాహక గ్రీష్మ తాపః
దహ్యమాన జగత్సమంతాత్ ధరతి జ్వాలాతోరణం ఖలు
వై న భవతి వై న భవతి వై న భవతి ప్రియతమే
నిశీథిన్యాం నిదాఘేऽస్మిన్ రుద్యతే తుహినేపిశశినా
వనేऽస్మిన్నపి కుసుమ గన్ధః వమ‌తి దావాగ్నిస్ఫులింగాన్
వై న భవతి వై న భవతి వై న భవతి ప్రియతమే||

నానుభోగ్యో విప్రలంభః [జ్ఞాతుం వరం] కథా ప్రారంభః
యక్ష విభునా కథం ప్రదేయః జాయా వియోగ దుస్సహ శాపః?

యక్ష ప్రియానురక్తిః కిమభూత్? శిక్షాయితాపరాధః కిమ్ తత్?

యత్ర ఉన్మత్తభ్రమరముఖరాశ్చ నిత్యపుష్పాశ్చ పాదపాః హంసశ్రేణీరచితరశనాశ్చ నిత్యపద్మాశ్చ సాకారాః కేకోత్కణ్ఠాః నిత్యభాస్వత్కలాపాశ్చ భవనశిఖినో తత్ర కుబేరస్య రాజధాన్యాం అలకాపుర్యాం ఉపవన్యాం శాపాత్పూర్వం ప్రమోదయన్తీ యక్ష దంపతీ||

సఖి తిష్ఠావ సఖి మే గృహి హేమ‌ తామరసాని
ఇత ఇత ఆగచ్చ ఉపవనమందిరమేతత్

కుల్యాశ్చ నికుంజానిచ మా తీర్యంతాం పరితం
కిమ్ నహి గతమఖిలవనం కిమిదానీం శ్రాంతోऽసి
మానససరోత్ఫుల్లాని మాన్య కనక కమలాని
స్వాంగుళీనాల‍ంక్రియంత సఖి త్వదీయ ధమ్మిల్లే
కయిషే విన్యసితుమ్ ఉత్సుకోసి క్షణమత్ర విరమ
లజ్జా మాం గ్రసతి వనే శుక పికేక్షితౌ నావితి||

తదాతిక్రాన్తస్సమయశ్చన్ద్రశేఖరమర్చితుమ్ ఇదానీమపి నానీతాని స్వర్ణ కమలాని మానసాత్ యక్షేణాద్య స్వామికార్యాత్ ప్రమత్తేన కిమిర్థమితి కృద్ధోభూదలకాధీశో యక్షస్వామీ కుబేరః||

రాజదూతస్య ఆగమనం చ ఉద్ఘోషణం చ నోపలక్షన్తీ యక్ష దంపతీ ఇతోధిక ప్రణయప్రమోదే సన్తీ||

ముకురం దర్శయ మే ముఖే మమ పత్ర భంగ చిత్రణం కరోమి
దర్పణ‌ ఏష ప్రియే ప్రేంఖావత్ డోలాయతే తవ వదన శశినం
సీమన్తే మమ తిలకం క్రియతాం నిష్కంపిత త్వదీయ కరాభ్యామ్
ముక్తాస్తే కిం స్వేదవారిణా ముఖమపావృతం కిమాచమ్యతాం.
ముక్తారోచిత పత్ర లేఖనం స్వేదభ్రమయా మాపమార్జతాం
శోషయితుమార్ద్రపత్ర లేఖనం కపోలయుగ్మే నిశ్వసామి కిమ్
మాతావత్ భో స్రుతిత‌ తుషారం ఆచ్చాదయతి ముకురగత మూర్తిమ్||

హేమమాలిన్ హే యక్ష హేయం భర్తు రవజ్ఞా కథమ్ ఖలు త్వయాద్య విస్మరితా రాజాజ్ఞా

సఖి ప్రదేహి సత్వరం ఇతో దేహి కమలాని
ప్రభవే శివార్చనాయ ప్రదేయాని ఇమాని
అపరాధో[చయం] కృతః తథాపి స్వీకుర్విమాని.
దూతం ద్రుతం తం ప్రేష్య తతః త్వాం గమిష్యామి
హా ధిక్ పూజాసమయః కియచ్చిర‌మతిక్రాన్తః
ఆర్య రాజదూత, అద్య అన్యమనస్కోऽభవమ్
ఇమాని సుమాని ప్రభవే త్వమేవ త్వరితం ప్రదేహి||

అతిక్రాన్తోऽప్యభూత్ ప్రభోః పూజాసమయమిదానీమ్| కథమపి దాస్యామ్యేతాని| కాగతి: స్యాత్ యువయో: ఖలు| శోభిత ప్రణయ ప్రమోదే పునరపి యక్ష దంపతీ||

వదనమధురిమా అపాంగమహిమా కటీకుటిలతా గమనచతురతా
వినా త్వద‌ఖిలం క్వ మే జీవనమ్
సఖి త్వాం వినా క్వ మే జీవనమ్
అరాళాలకా, స్వరోల్లాసికా మృదులాంగులికా, చతురవైణికా||

నాకేన కిమపి నందనేన కిమ్
ఆవయోః ప్రణయ ఏవ శాశ్వతః
కిం నన్వలకాపుర‌పుష్పమధుభిరావయోః
ప్రణయాంబునిధౌ సాకం సఖి ప్లవమానయోః
ఆవయోః ప్రణయ ఏవ శాశ్వతః
కిమ్ ప్రేంఖా[వహ] అనురాగ డోలికాయామ్
సంయాపయితుం ఆనందవారిరాశామ్
ఆవయోః ప్రణయ ఏవ శాశ్వతః
అలమలం తయా య[త్కాపి] కామ్య పదవీ
లోకాతీతావయోరేకైక పదవీ
ఆవయోః ప్రణయ ఏవ శాశ్వతః||

[సత్యధర్మౌ స‌మాశ్రిత్య జనయిత్వమనో వ్రజన్] దివ్యధర్మాదతిక్రాన్తో విస్మృతః ప్రభుశాసనః యయా ప్రమదితవ్యోऽభూత్ దేవస్యాస్య దివాదపి ప్రభ్రష్టో భూయాదేవం శాపో వర్షః అవధిఃఖలు||

దుస్సహో హ శాపోऽయం దుర్భరో హ వియోగః
నిస్సహాయతా హి తేన సంయమీక్ష్యతే కథం
దుష్కరో హ శాపోయం విరహో వత్సరావధిః
నిస్తుల ప్రణయే కథం సోఢుం శక్యతే హ‌
కిమ్ మమ సౌందర్యేన కిమ్ మమ తారుణ్యేన‌
ఏతే శాపహేతవః కిం నను భస్మీభవేయుః
కో వక్షతి మయా సహ చ రప్స్యతి మే గాయనేన‌
క్రీడిష్యతి కేన సహ మమోపవనే మయూరః||

నిస్సీమా ప్రణయలోలతా ప్రభుసేవా విఖ్యాన్త మత్తతా
ప్రభుశాపాయిత పదచ్యుతిః వత్సర ప్రవాసవిధుర స్థితి:
గణయన్తౌ ద‍ంపతీ కతిపయౌ దినరాత్రౌ యాపయితవ్యౌ
వసతి నాయికాలకాపురే చ ప్రవసతి నాయకో దండకే||

అస్మిన్ రూపక ప్రారంభే యద్విప్రలంభావస్థాయామ్ దృష్టః నాయకో యక్షః పునరపి తదవస్థాయామేవ ప్రవిశతి||

కురగం భూధరేషువా ఫుల్లకుసుమ వనేషువా
సంచరతి అయే ప్రియే మే రోమాంచయతి అయే ప్రియే మే

దివ్యావాసా కదాపి త్వయా మోత్తార్యత మోత్తార్యత‌
విలోక తన్వి మే ప్రియగమే అలోక సుందరి ప్రియతమే

పరిరంభన్ మారుతేషు వా ప్రణిధాన ప్రాంతరేషువా
ధ్యాయితాసి అయే ప్రియే మే మాం విస్మారయితాసి అయే మే ప్రియే||

అస్యామేవావస్థాయామ్ త‌స్మిన్ రామగిరౌ ప్రియావిరహ కృశతనుత్వాత్ సః యక్షః కతిచిన్మాసాన్ నీత్వా కనకవలయ భ్రంశరిక్త వంశప్రకోష్ఠోऽభూత్| అపిచ సః ఆషాఢస్య ప్రథమదివసే ఆశ్లిష్టసానుం మేఘం వప్రక్రీడాపరిణతగజమివ ప్రేక్షణీయం దృష్టవాన్||

ఆగతో దర్శనీయః ఆషాఢమేఘః ప్రణత పత్రాంకితేన శేషాహివైభవేన‌
ఆగతో దర్శనీయః ఆషాఢమేఘః
తద్రామగిరేరుపరి తత్తపోవనేషు ప్రియకాన్తయావినా వర్షప్రవాసినా
విశ్రామ క్షణమితి తూర్ణమభ్యర్థితో||

హే జలధర తిష్ఠ సోదర సరిత్ హృదయ సంతాపే విధుర వ్యధా శ్వసనేऽపిచ
[దాహాకాతపేక్రమేప్యుడ్డయన్] గ‌గనం త్వం గచ్చసి
హే జలధర తిష్ఠ సోదర
ప్రణయ భంగే చ స్వప్నేచ వ్యసనే కృశతన‌వః
దందహ్యమాన మానసాః ప్రణయినః
తవ సహజన్మినః ఖలు||

ధూమ జ్యోతి స్సలిల మరుతాం సంఘాతస్య మేఘస్య అచేతనతాం కించిదపి న విచారయన్ యక్షః ప్రాణిభిః ప్రాపణీయం ఆత్మనః సందేశం ప్రియాయాః ప్రాపయితుం మేఘస్య సాహాయ్యం అభ్యర్థయన్ రామగిరేః ప్రభృతి అలకానగరీపర్యన్తం మార్గం వర్ణయితుం ఆరభతే||

ఇదానీం ప్రభృతి శ్రోత్రాణాంచ పఠితౄణాం చ భావనాకాశే అపితు ప్రేక్షకాణాం పురతో రంగస్థలే చ ఏకస్మిన్ కాలే రామగిర్యాశ్రమ స్థితయోః యక్షమేఘయోశ్చ యక్షవర్ణితమార్గే యాతవ్యస్య మేఘస్య చ దండకాలకాపర్యన్తం నదీ కానన గిరి నగర జనపదవాసినాం మర్త్యామర్త్య నరనారీజనానాం చ ఖగమృగాదీనాం చ అలకాపుర్యాం యక్షజాయయా సహ సమాగమిష్యతః పునర్మేఘస్య ప్రవేశ నిష్క్రమణాని ఏతస్మిన్ రూపకనిరూపణవిధౌ సందర్శ్యన్తే||

అమృతమధుర జీవనధర జలధర అలకానగరీం యాహి
సఖే మే సందేశం మమ సఖ్యై వోఢుం అలకానగరీం యాహి
అలకానగరీం యాహి జలధర అలకానగరీం యాహి
జానామి త్వాం ప్రకృతిపురుషం జాతం వంశే భువనవిదితే
అధిగుణే త్వయి అర్థిత్వం మే అమోఘకామా ప్రియ‌
గన్తవ్యా తే వసతిరలకా హరశిరశ్చన్ద్రికాంచిత హర్మ్యా
సంతప్తానాం త్వమసి శరణం సందేశం మే హర సఖ్యై
అత్ర ద్రక్ష్యతాం దివసగణనాతత్పరాం విప్రలబ్ధకృశాంగీమ్
అవ్యాపన్నాం భ్రాతృజాయాం హర మే సందేశమముష్యై
గన్తవ్యా తే వసతిరలకా సందేశమిదం హర సఖ్యై
ఖిన్నస్య గిరిషు న్యస్త పదస్య క్షీణస్య నదీం లంఘయతః
తే గన్తవ్యా వసతిరలకా మార్గం తావత్ శృణు మేఘ||

మందం ప్రసరతి మారుతః మధురం నదన్తి చాతకాః
నయనసుభగే నభసి భవన్తం సేవిష్యన్తి వలాహకాః
వయం జలధర ప్రియాః చాతకా: వర్షబిన్దు పానే వ్యాసక్తాః
ప్రియజలధరేణ పరిషించితాన్ పిబామోऽమూన్ తుషారకణాన్||

శ్రేణీభూతాసితవర్ణా వయం వలాహకా సుపర్ణాః కురు కురు సకలం సురుచిరం తవ శీకరైస్సుఖకరం
త్వయ్యాసన్నే పరిణత జమ్బూఫలభరితేషూపవనేషు కతిపయదినస్థాయిహంసా నీడానిరతా కాకాశ్చ
[త్వత్తం] జర్జతి కుతో ఆగతః స్వాగతం తే ప్రావృట్ జలధర బిసకిసలయమాసీనో వయం గగనపతితవసహాయాగన్తో
కా కా కా కా కా కా యస్యై త్వం శ్రియ వార్తాం వహసి తే గన్తవ్యా వసతిరలకా మార్గం తావత్ శృణు మేఘ||

పరిష్వజ చిత్రకూటగిరిం రఘురామపదైరంకితం
వనచరవనితా భుక్తేషు విరమవింధ్య కుంజేషుక్షణం
అప్రకంప్యతాం [రజ]ఘనకాయ ఆదాయనర్మదాపేయం
వనగజమదవాసిత తోయం జమ్బూకుంజ నిరుద్ధరయం
త్వయ్యాసారోల్లసితవనైః త్వయ్యాయత్తైః కృషిఫలితైః
ఆనందితజనపదాననాః కరిష్యన్తి స్వాగతం తవ‌||

ఆగతోऽస్తి కిం పునరపి ఆగతోऽస్తి కిం
పశ్యన్ ముదిత‌ మృగశివాం ప్రకృతిగాత్రతులదోऽసౌ
ఆగతోऽస్తి కిం పునరపి ఆగతోऽస్తి కిం
మల్లీలతా కుల్యాతటే ఉల్లోలినీవస్మయతే
[వయంత్యా సువాక్షిప్య హ] సువర్ణ టంకాన్ వికిరతి
గాయకైః వః శ్రుతిభిః [ఉద్గత్తద్ కులాలకాసు]
ఆగతోऽస్తి కిం పునరపి ఆగతోऽస్తి కిం||

వింధ్యపాదే రేవాం ద్రక్ష్యసి వేత్రవతీం చ దశార్ణేషు
నిర్వింధ్యా సిప్రే సేవ్యాతాం తత్రాపితు మాళవేషు చ‌
పశ్యావశ్యం నగరత్రితయం విశాలాంతకోజ్జయినీంచ‌
భవనశిఖరేషు విశాలాయాం మార్గఖేదం నయేథాః
ఉజ్జయిన్యాం మహాకాళస్య మందిరం సేవ్యతాం త్వయా||

అయి సఖి అయి సఖి ఆయాతః
కియత్ శీఘ్రమేవ సుఖకరః
పశ్య పశ్య ఏష జలధరః
మహాకాలదేవకులం ప్రవిశ్య
ధ్వజస్తంభమామూలమావృత్య
[ఆమంగలస్య నాహి]
సంధ్యాతూర్యాయాం దధతి పటహతాం
సాంధ్య తేజే జలదే శంభోర్భుజావిలీనే
నృత్యారంభే భవతి భవానీ భక్త్యా పశ్యతి
హరగజాజినేచ్ఛాం||

కస్మింశ్చిత్పురీ భవనవలభౌ నీత్వా రాత్రిం పునరేహి
గంభీరాయాః పయసి సరితః ఛాయాత్మా తే ప్రవిశేత్
విశాలాయశ్చతుష్పథేషు పురోపకంఠేషుజనపదేషు
ఉదయనగాథా గాన‌తత్పరాః గ్రామవృద్ధ గోష్ఠ్యః శ్రూయన్తామ్||

ప్రద్యోతన[స్తుభతారణవ్యూహే యంత్రగజా]దిఙ్మూఢేऽరణ్యే
మృగయావినోదినం వీణావాదినం కారాగృహేవత్సరాజం న్యరుంఢ‌
వాసవదత్తాయ రాజనందిన్యాః వీణాగురుత్వే ధీయుక్తో[రజనః]
రాగైస్సహానంగరాగం ప్రబుధ్య స్వపురీం యయౌ ప్రియాసహ మంత్రి యుక్త్యా||

తతోపిచ శరవణోద్భవ‌నిలయో దేవగిరిః సంసేవ్యతాం
వీణాపాణిభిః సిద్ధమిథునైః సహ షడాననం వందస్వ||

వందావహే గిరిజాతనుజం గాంగేయ‌శరవణప్రసవం
సురవరగణ సేనాన్యం స్కన్దం పక్షివాహనం భజావహే||

యస్మాద్ భువామవతరతి గంగా యస్సురభిళం మృగమదేన‌
తస్మిన్ హిమాచలే సిత శృంగే త్వం పథి శ్రమమపనయేథాః
స్వనద్భిః మధురవంశీభిః సహకిన్నరజనానాం గానే
పశుపతేస్త్రిపురవిజయకథాయై భూయాత్ మురజో తవ గర్జా||

సర్వంసహాయస్య స్యందనే స్థిత్వా
[వేదగిరా యం సాధు వాజినోయుక్త్వా
సారథిరితిపురో వేద సంహిత్వా]
వామహస్తే మేరు కార్ముకం ధృత్వా
దక్షిణే నాగేంద్ర శింజినీం ద‌త్వా
బాణాయికం భుజగశాయినం ముక్త్వా
దానవపురీత్రయం ఏకత్ర దగ్ధం
విజయీ స భగవాన్ విశ్వనాథో హి||

హిమాచలమతిక్రమ్య గమ్యతాం భార్గవ స్ఫుటిత క్రౌంచబిలం
హీయతాం బిలాదుదీచీ త్వయా తిర్యగాయామశోభినా
శృంగోచ్ఛ్రాయై రాశీభూతః ప్రతిదినమివ శివాట్టహాసః
తతో తితీర్ష్య కైలాసస్య యస్సురవనితా దర్పణః||

ప్రాప్తకైలాసం పయోదం పురస్తాత్
హే అప్సరోంగనాః ఈషధ్వమధునా
ఉద్గర్తయామహై వరయాంచలేనైవం
ఉద్గీర్ణతోయైః క్రీడామ తేన సహ||

బద్ధోపి గర్జితైః భాయయన్ అస్మాన్
[సవ్యాజమర్దయతి ప్రవృద్ధ కిరణే]||

తదనన్తరం యక్షః కైలాసస్యోపరి స్థితాం అలకానగరీం ప్రతి మేఘాయ నివేదయతి||

ఉత్సంగే ప్రణయిన ఇవ కైలాసోపరి అలకాం స్రస్త గాంగ‌దుకూలాం అవేహి కామీనీమివ‌
వ్యావహతి తవ తుషారం ముక్తాయుక్తాలకమివ న త్వం తాం దృష్ట్వా న పునర్వేత్తి పయోద||

కైలాసోపరి అలకాం విద్ధి కామినీమివ|

హస్తే లీలాకమలాని అలకే బాలకుందాని ముఖే లోధ్రరజసా యయా ప్రాపితా సిత శ్రీః
కైష్యాగ్రే కురవకం చ కర్ణే నవ శిరీషం చ సీమన్తే నీపం యయా ధ్రియంతే కామిన్యా||

అలకా తే గన్తవ్యా ద్యౌరితి మన్తవ్యా

ఆనందోత్థం నయనసలిలం యత్ర నాన్యైర్నిమిత్తైః
నాన్యస్తాపః కుసుమశరజాత్ ఇష్టసంయోగ సాధ్యా
అక్షయ్యాన్తర్భవన నిధయః ప్రత్యహం [ర‌క్త]కంఠైః
ఉద్గాయద్భిః ధనపతి యశః కిన్నరైః యత్ర సాధ్యం||

యక్షేశ్వరో రాజరాజః కుబేరోऽస్తి కల్పభూజః
నవనధీనాం సోऽహి రక్షకః కిన్నరాణాం సోऽహి పాలకః
నలకూబరో యస్యపుత్రః శర్వేన సహ యస్య మైత్రిః||

ధనదగృహాదుత్తరేణ లక్ష్యతాం మమాగారం
విదిత ద్వార తోరణేన ఇంద్రధనురివారుణేన‌

తదుపాన్తే కృతక కుటక ప్రియావర్ధితో మమ‌
హస్త ప్రాప్య స్తబకో నమిత బాల మందారః

మరకత మణి సోపాన వికచహైమ కమలాచ‌
ప్రేక్ష తత్ర నీపే కృతహంసీ వసతిం వాపీం||

అనేన ప్రకారేణ యక్షః ఆత్మనః గృహం అభిజ్ఞాతుమ్ సూచనాని వినిర్దిశ్య అపరం జలధరమేవ ఉద్దిశ్య ఆత్మనో జాయాం ప్రతి ప్రకృతావస్థాం వర్ణయతి||

తన్వీ శ్యామా శిఖరి దశనా పక్వ బింబాధరోష్ఠీ
మధ్యే క్షామా చకితహరిణీ ప్రేక్షణా నిమ్ననాభిః
శ్రోణీభారాదలసగమనా స్తోకనమ్రా స్తనాభ్యాం
యా తత్రస్యాద్యువతి విషయే సృష్టిరాద్యేవ ధాతుః||

తాం జానీథాః పరిమిత కథాం జీవితం మే ద్వితీయం
దూరీభూతే మయి సహచరే చక్రవాకీమివైకాం
గాఢోత్కంఠాం గురుషుదివసేషు ఏషు గచ్ఛత్సు బాలాం
జాతామన్యే శిశిరమథితాం పద్మినీవాన్యరూపాం||

గచ్ఛన్విహాయ రామగిరౌ సుదీర్ఘం తు తేన ప్రోక్తం
అలకాయై తావన్మార్గం కర్ణగతాంతర్విశిష్టతాం
తత్ర [యచ్ఛదనిరూపణం తద్ధి యోగినీ ప్రియాపదాం]
శ్రుతవతా జలధరేణ సః సద్యోదత్త్వా సంకల్పా
అలకాపుర్యాం దర్శయామహ ప్రత్యక్షం యక్షభామినీం||

యస్యాం దూరసీమ్నివా యస్యాం విపిన భూమ్నివా
కియచ్చిరం విరహోऽయం కథం సహ్యతే విభునా
ఇహైతావదహమేకా తప్తా కృశా భవామి
పరవాసీ తత్ర ప్రాణపతిః కథం సౌఖ్యమేతి
కిమర్థమద్య విహరతి స్వైరం దక్షిణానిలః
ఇతో మనోరథసుతస్య గరుత్సు శక్తిర్విశతి
శాపస్యావసానస్య సామీపీర్యం కిమిదం
[దశవైత‌హ కిమలమతో] అహర్గణన తత్పరతా||

ఏతస్యాం విరహావస్థాయాం సంతప్తాం యక్షనాయికాం విశాలాక్షీం సమ్మేలయితుం విహంగీబృందం యక్షస్య గృహాంతరే జలధరం ప్రవేశయతి||

ప్రవిశ ప్రవిశ జలధర పశ్య పశ్య పయోధర‌
[ఇటఇకోపి] ధనదగృహాదుత్తరేణ దూరభూః
అయం తు క్రీడాశైలః అత్ర తిష్ఠ క్షణమపి
పశ్య పురస్తాదత్ర యక్షనిలయ తోరణం

పాతయ విద్యుద్దృష్టిం ఏహి కలభతనుతాం
గృహాంతరే శృణోషి కిమ్ యక్షవధూభాషణమ్||

శారికే రసికే స్మరసి పత్యుః కచ్చిదపి
త్వం హి తస్య ప్రియేతి చ తస్య ప్రేమ వచనాని
చిత్రే [మత్కృతేస్త్యప్రత్ భావకం] యత్ దృశా కృతమ్
పశ్యసి కిమ్ సాదృశం పత్యుర్నిజరూపేణ

[వీణా సారణోద్యోక్తయ‌ తమ్ శ్లిష్య] గాయన్త్యా
మూర్ఛనా హి విస్మ్రియతే అశ్రుసిక్త తంత్ర్యా మయా||

విశాలాక్షి యక్షప్రేయసి కియచ్చిరం తథా రోదిషి?
దక్షిణాదిశావాయాతః దక్షిణానిలేన త్వరితః
త్వత్ర్పియస్య వార్తాహరః యక్షరమణి ప్రత్యయం హర‌
అలం విరహగ్లానినాపి చ…

(సశేషమ్)

రూపక పరిచయం

0:00
విశ్వసాహిత్యమునకు, అందులో నాటక సాహిత్యమునకు, కాళిదాసు భారతదేశపు ఒక గొప్ప కానుక. వ్యాసవాల్మీకుల తరువాత కవికులగురువు కాళిదాసు పేరు ప్రసిద్ధమైనది. ఈ కవి, నాటక రచయితను గురించిన వివరాలు మనకు దొరకడము లేదు. విశ్వనాటక సాహిత్యములో కాళిదాసు వ్రాసిన అభిజ్ఞాన శాకుంతలము తనదేయైన ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకొన్నది. అతని నాటకప్రతిభకు శాకుంతలము ఒక నిదర్శనమయితే, అతని కవితాప్రతిభకు మేఘదూతము ఒక గొప్ప ఉదాహరణ అవుతుంది.

మేఘదూతములో కాళిదాసు శైలి కవిత్వంతో నిండుకొని భావవంతముగా నున్నది. ఇందులో కనిపించే యక్షుని విరహవేదన, తహతహ, భావతీవ్రత కాళిదాసునిదే యేమో అనిపిస్తుంది. కొందరు విద్వాంసులు మేఘదూత కావ్యానికి రామాయణము ఆధారమంటారు. అరణ్యవాసములో రావణునిచే అపహరించబడిన సీతకోసం రాముని నిరీక్షణ, సంతాపము విరహి యక్షుని నిరీక్షణలో, సంతాపములో సాక్షాత్కారమైయున్నది. రామాయణములో కనబడే వర్షాకాలపు వర్ణన మేఘదూతమునకు ప్రేరణ నొసగినదనే అభిప్రాయము ఉన్నది.

ప్రణయలోకములో మునిగియున్న యక్షుడు కర్తవ్యపరిపాలనా దోషముచే ఒక సంవత్సరకాలము తన ప్రభువైన కుబేరుని శాపమువలన దేశభ్రష్టుడై యుండవలసి వచ్చినది, ప్రియురాలినుండి దూరము కావలసి వచ్చినది. ఈ కాలమును విరహియైన యక్షుడు మధ్యభారతములోని నాగపురము దగ్గర రామగిరిలో, అంటే నేటి రాంటేక్ ప్రాంతములో గడిపాడు. వానాకాలములోని ఒక సంఘటన – విరహి యక్షుడు దిగ్భ్రాంతితో ఆకాశమువైపు చూస్తున్నాడు. అప్పుడు ఒక మేఘము ఆకాశములో ఉత్తరాభిముఖముగా వెళ్ళుతున్నది. దీనిని గమనించిన యక్షునికి వియోగముతో బాధపడే తన ప్రియురాలికి ప్రేమను తెలిపి ఆమెలో ఆత్మవిశ్వాసము పుట్టించడానికి ఆ మేఘము ద్వారా సందేశము పంపాలనే ఒక ఆలోచన కలిగి అలాగే చేస్తాడు. యక్షుని ప్రేమపూర్ణ సందేశమును మోసికొని మేఘము అలకానగరమునకు వెళ్ళే దారిని కూడ వివరిస్తాడు. విరహముతో బాధపడే ప్రియురాలికి, ప్రేమికుల కలయికలోని ప్రీతి, ప్రేమపై నమ్మకము కలిగించే నవజీవనమును, వెన్నెల రాత్రిలో విహరించే ప్రేమాశ్వాసనను ప్రసాదించమని మేఘాన్ని ప్రార్థిస్తాడు.

కాళిదాసు మేఘదూతము వ్యక్తిగత కావ్యము. కథానాయకుడు మూగదైన మేఘముతో మాట్లాడుతాడు. తానే స్వగతములో మాట్లాడుకొంటాడు. ఇవన్నీ కల్పనయే. వీటిని నాట్యబద్ధము చేయడము కాని, దృశ్య మాధ్యమములోకాని, ఎన్నో పాత్రల మూలముగా శ్రవ్యరూపములో ప్రసారము చేయడము కాని ఒక గొప్ప సవాలు. ప్రస్తుతము శ్రవ్యరూపకముగా నేర్పరచిన దీనిలో భూతభవిష్యద్వర్తమాన కాలములు ఒకే సమయములో పొందు బరచబడియున్నదని శ్రోతలు గమనించగలరు. సంభాషణలు, మాటలు లేకుండా నాటకీయము గావించడము కుదరదని కొందరు ఆధునికుల వాదము. అయితే రసానుభూతితోబాటు నాటకమును, సంగీతమును రెంటిని ఒకే చోట జతపరచిన ప్రయత్నము యిది. భారతీయ సంగీతపు బహుముఖ వైవిధ్యమును శ్రోతలు ఇక్కడ అనుభవించవచ్చును.

సంస్కృత గీతికల వివరణ

[వరుస: రూపకంలో గీతిక వచ్చే సమయం – గీతిక వివరణ. కుండలిలో ఉన్నది గీతికకు మూలమైన మేఘదూత కావ్యంలో పద్యపు సంఖ్య (ఈమాట గ్రంధాలయపు ప్రతిలో).]

4:00
నాందీవాక్యము – శ్రీరస్తు, శుభమస్తు అంటూ ఆరంభమవుతుంది. చిరవియోగ పీడితులైన దంపతులకు శీఘ్రమే సంయోగసిద్ధి కలగాలని కవి ఆశ్వాసిస్తాడు. మహాకవి కాళిదాసు మేఘసందేశ శ్రవ్య కావ్యము రజనీకాంతునిచేత రూపకముగా వ్రాయబడినదై విశ్వవిఖ్యాతి చెందుగాక అంటాడు సూత్రధారుడు.
5:43
మేఘదూతమునందలి ప్రథమ పద్యమైన కశ్చిత్కాంతా విరహగురుణా అనే మందాక్రాంత వృత్తము పాడబడినది. కథా సందర్భమును వివరించాడు సూత్రధారుడు. హేమమాలి అనే యక్షుడు ప్రభువైన కుబేరునిచే శపించబడి దండకావనములో రామగిరిలోని ఒక ఆశ్రమములో తన కాలమును వెళ్ళబుచ్చుతున్నాడు. వసంతగ్రీష్మ ఋతువులంతమైనవి. దుష్కరమైన గ్రీష్మతాపం, దుస్సహమైన వియోగతాపం నాయకుడైన యక్షుడిని దహించివేస్తున్నవి. (1.01)
8:12
యక్షుడు పాడుతున్నాడు. ఓ ప్రియా, మనకు సుఖాన్ని ఇవ్వలేని వసంతకాలము గడచిపోయినది. వియోగశాపము హృదయాన్ని భేదిస్తున్నది. గ్రీష్మాతపము జ్వాలాతోరణమువలె జగాలను దహిస్తున్నది. ప్రియతమా, ఈ వేసవి రాత్రిలో చంద్రుడు కూడా దుఃఖిస్తున్నాడు. కుసుమాలు దావాగ్నిస్ఫులింగాలను వెడలగ్రక్కుతున్నాయి.
10:05
దుస్సహమైన విప్రలంభమునకు కారణము తెలియబరచడానికి భూతకాలములోకి వెళ్ళుతుంది కథ. భార్యావియోగమనే దుస్సహమైన శాపాన్ని యక్షరాజైన కుబేరుడు ఎలా ఇచ్చాడు? యక్షునికి తన ప్రియురాలిపట్ల ఉండిన అనురక్తి ఎటువంటిది? అంత శిక్షింపతగిన నేరమేమి చేశాడు?
11:00
అలకాపురిలో సదా వికసించిన పూలచెట్లుండే ఉపవనములో యక్షదంపతులు క్రీడించుచున్నారు.
11:50
వాళ్ళిద్దరు యుగళగీతాన్ని పాడుకొని ఆనందిస్తుంటారు.
ఓ సఖీ, ఇక్కడ కూర్చుందాము. నేను తెచ్చిన బంగారు కమలాలని స్వీకరించు.
ఇటు, ఇటు ఈ ఉపవనమందిరానికి రా.
ఈ కాలువలు, పొదరిళ్ళ చుట్టూ తిరగవద్దు.
ఈ వనమంతా పూర్తిగా చూడలేదు కదా. అప్పుడే అలసిపోయావా?
మానససరోవరంలో వికసించిన గొప్ప కమలాలను నీ ముంగురులలో నా చేతులతో అలంకరించనీ.
నీ చేతులతోనే అలంకరించాలని ఉత్సుకపడుతున్నావు. ఒక్క క్షణం ఆగు. శుకపికాలు చూస్తున్నాయని నాకు సిగ్గు కలుగుతోంది.

13:45
యక్షస్వామి కుబేరునికి చంద్రశేఖరుని అర్చించే సమయము సమీపించింది. ఆ పూజకు కావలసిన స్వర్ణకమలాలను వేళకు కోసి తెచ్చి ఇవ్వడము యక్షుని పని. ఈ రోజు ఆ పనిలో అతడు ప్రమత్తుడైనాడేమని కుబేరుడు క్రుద్ధుడైనాడు.
14:23
రాజదూత ఆగమనాన్ని సూత్రధారుడు సూచిస్తున్నాడు. కాని యక్ష దంపతులు ఇంకా తమ ప్రణయక్రీడలో సర్వము మరచి పాట పాడుకొంటున్నారు.
ఓ ప్రియా అద్దాన్ని చూపించు, నా ముఖంపైన మకరికా పత్రాలు రచించుకుంటాను.
ఇదిగో అద్దము. నీ ముఖమనే చందమామ ఈ అద్దంలో నాట్యం చేస్తోంది చూడు.
కదలని నీ చేతులతో నాకు తిలకాన్ని దిద్దు.
నీ ముఖంపైన ముత్యాల్లాగా స్వేదబిందువులున్నాయి.
మకరికాపత్ర రచనలోని ముత్యాలని స్వేదబిందువులనుకొని తుడిచివేయవద్దు.
ఆ పత్రరచన తడి ఆరడానికి నీ బుగ్గలపైన నిశ్వసించనా?
వద్దు, వద్దు, అద్దం పైన మంచుకమ్మి నా ముఖం కనిపించడం లేదు.
16:40
దూత – ఓ హేమమాలీ, రాజాజ్ఞను విస్మరించితివేల?
యక్షుడు – ఓ ప్రియా, ఆ బంగారు కమలాలను ఇలా ఇవ్వు. శివపూజకై ప్రభువుకి పంపించాలి.
భార్య – అయ్యో, అపచారం జరిగింది. అయినప్పటికీ ఇవిగో పూలు.
యక్షుడు – దూతను పంపివేసి మరల నీవద్దకే వస్తాను
భార్య – అయ్యో పూజాసమయం మించిపోయినదే.
యక్షుడు – ఓ రాజదూతా, ఈ రోజు నేను అన్యమనస్కుడనై ఉన్నాను. ఈ పూలను నీవే ప్రభువుకి అందివ్వు.
దూత – పూజాసమయం గడిచిపోయింది. ఇంక ఇప్పుడు ఇవి ప్రభువుకి ఎలా ఇవ్వను? మీ ఇద్దరి గతి ఏమవుతుందో!
యక్షదంపతులు మరలా ప్రణయకేళిలో మునిగిపోతారు.
18:15
అరాళాలకా, స్వరోల్లాసికా, మృదులాంగుళికా, చతుర వైణికా, సఖీ, నీవు లేక ఎలా జీవించను అని యక్షుడు పాడుతాడు.
19:24
స్వర్గంతోగాని, నందనవనంతోగాని మనకి పని ఏమి? మన ఇద్దరి ప్రణయమే శాశ్వతమైనది.
ప్రణయ సముద్రంలో తేలియాడే మాకు ఈ అలకానగరపు పువ్వులతేనెతో పని ఏమి?
ఆనందడోలికలలో తేలియాడుతూ కాలాన్ని గడుపుతాము.
కోరినదే అయినప్పటీకీ ఆ పదవితో నాకిక సరి, మా ఇద్దరి కలయికయే లోకాతీతమైన పదవి అని యక్షుడు పాటలో అంటాడు.
20:48
కుబేరుని గొంతు వినిపిస్తుంది. దేవకార్యనిర్వహణలో జాగరూకత చూపకపోయిన కారణాన ఒక యేడు భూలోకములో వనవాసము చేయాలి అని కుబేరుడు ఆంక్ష విధించాడు.
21:24
యక్షపత్ని దుఃఖము, నిస్సహాయతతో నీవులేని నా యీ యౌవనము, సౌందర్యము ఎందుకు అని వాపోతుంది.
22:40
ప్రభువు శాపముతో నాయిక అలకాపురిలో, నాయకుడు దండకారణ్యములో ఒక సంవత్సరము ప్రవాసము. దివారాత్రములు లెక్కపెట్టుకుంటూ యక్షదంపతులు కాలం గడుపుతున్నారు.
23:25
సూత్రధారుడు కథను ప్రస్తుతానికి తీసికొనివస్తాడు. గాలిని కౌగిలించుకొంటూ అతిలోకసుందరియైన ప్రియతమను అయే ప్రియే అని తలచుకొంటాడు యక్షుడు.
25:20
సూత్రధారుడు యక్షుడు ఎలా ఆషాఢమాసములో మొదటిరోజు మేఘాన్ని చూసినాడో అనే విషయాన్నిగురించి చెప్పుతాడు. ఈ పద్యము ఆషాఢస్య ప్రథమ దివసే వ్యాసములో చర్చించబడినది. (1.02)
26:06
దర్శనీయమైన ఆషాఢమేఘం వచ్చింది, అది ఆదిశేషునివలె ఉన్నది.ప్రియావిరహంతో బాధపడుతున్న యక్షుడు ఒక్కక్షణం ఇక్కడ విశ్రమించు అని మేఘాన్ని ప్రార్థించాడు.
27:05
యక్షుడు మేఘాన్ని “జలధర తిష్ఠ సోదర” అని స్వాగతిస్తాడు. ఓ జలధరా, ప్రియసోదరా, ఆగు. నదులకు హృదయబాధను, విరహాన్ని కలిగిస్తూ నీవు వేసవిలో నింగికెగురుతావు. ప్రియులకు దూరమై విరహబాధతో కృశించే జీవులకు నీవు సోదరుడివే అవుతావు.
28:07
సామాన్య మానవుడయితే ఒక సజీవ ప్రాణి ద్వారా సందేశమును పంపిస్తాడు. పొగతో, వెలుగుతో, గాలితో, నీటితో (ధూమజ్యోతిస్సలిలమరుతాం) నిర్మింపబడిన ఒక మేఘము సబబైన వార్తాహరుడు కాదు, కాని యక్షుడు తానుండే స్థితిలో ఆ సంగతి మరచాడు, ఆ మొయిలురాజు సహాయంకోసం ప్రాధేయపడి, రామగిరినుండి అలకానగరానికి మార్గము కూడ తెలుపుతున్నాడని సూత్రధారుడు చెబుతాడు. ఈ ధూమజ్యోతి పద్యము కాళిదాసు భావచిత్రణకు, కల్పనావైచిత్రికి ఒక గొప్ప ఉదాహరణ. (1.05)
29:01
రామగిరినుండి అలకాపురికి వెళ్ళే దారిలో కనబడే నదీనదాలు, నగరాలు, గ్రామాలు, ఖగ మృగాలు, చెట్లు చేమలు, నరనారుల భావస్వభావములను కూడ మేఘునికి యక్షుడు చిత్రీకరిస్తాడన్నాడు సూత్రధారుడు.
30:20
’అమృతమధుర జీవనధర జలధర అలకానగరీం యాహి’ అని మేఘుని అభ్యర్థిస్తాడు యక్షుడు.
ఇక్కడ నుంచి యక్షుడు పాడుతూ దారిలోని ఒక్కొక్క దృశ్యాన్నీ వర్ణిస్తూ ఉంటాడు. అప్పుడూ ఆయా దృశ్యాలలోని వ్యక్తులు ఆయా విశేషాలని పాటలరూపంలో మన కళ్ళకి కట్టిస్తూ ఉంటారు.
యక్షుడు అంటాడు. నీవు గొప్ప వంశములో పుట్టావు, ఇంద్రుని కొలువులో ఉన్నావు, ఇష్టము వచ్చినట్లు రూపాన్ని మార్చుకోగలవు. దహించబడేవారిని నీవు చల్లబరచుతావు. వెన్నెలలో తడిసిన భవనాలతో నిండిన యక్షుల నగరమైన అలకాపురికి వెళ్ళు. జాతం వంశే (1.06), సంతాప్తానాం(1.07) మున్నగు వృత్తాలనుండి వాక్యాలు ఈ పాటలో ఉపయోగించబడ్డాయి.
32:50
నీవు వెళ్ళే మార్గములో గాలి నీకు అనుకూలముగా ఉంటుంది. చాతక పక్షుల ధ్వని వింటావు నీవు. ఆకాశములో బారులుగా వెళ్ళే బలాకపక్షులను కన్నుల పండువుగా చూస్తావు. మందం మందం నుదతి పవనః అనే పద్యముపైన ఆధారపడినది యిది. ఈ పద్యాల ప్రోత్సాహమువల్లనేమో, మహాకవి టాగూరు బలాక పద్యాలు అని ఒక ఖండ కావ్యాన్ని వ్రాసినాడు.(1.09)
33:10
చాతకపక్షులూ, కొంగలూ ఆనందంతో పాడుతూ మేఘానికి ప్రియవాక్యాలు పలుకుతాయి.
యక్షుడు పాడతాడు. మేఘమా నీ ఆగమనంతో నేరేడుపళ్ళ తోటలలో హంసలూ, కాకులూ విడిది చేస్తాయి.
హంసలు మేఘానికి స్వాగతం పలుకుతూ పాడతాయి.
కాకులు కూడా పాడుతూ అలకానగరమార్గాన్ని మేఘానికి తెలియజేస్తాయి.

35:03
ఓ మేఘుడా, రఘురాముని పాదముద్రలు కలిగిన చిత్రకూట పర్వతాన్ని కౌగలించుకో. ఆటవిక స్త్రీలు విహరించే పొదలలో ఒక క్షణం విశ్రమించు. అడవి ఏనుగుల మదస్రావంతో గుబాళిస్తున్న నర్మదాజలాన్ని సేవించు. జానపదులు తమ వ్యవసాయానికి ఫలితాన్ని తీసుకునివచ్చావని సంతోషంతో నీకు స్వాగతం పలుకుతారు.
35:53
మళ్ళీ నిన్ను చూచి స్వాగతమిస్తారు ఉల్లాసముగా పల్లీయులు.
36:46
అక్కడినుండి వేత్రావతీతటములో ఉండే విదిశానగరాన్ని దర్శించు. దశార్ణ దేశంలో నిర్వింధ్యానదినీ, సిప్రానదినీ సేవించు. తరువాత మాళవరాజ్యపు రాజధాని ఉజ్జయినిని చేరుకొంటావు. విశాలమైన మార్గాలతో, అందమైన భవనాలతో ఉజ్జయినీనగరము శోభిల్లుతుంది. అక్కడ మహాకాలుని ఆలయమును చూడడము మరవకు. కాళిదాసు స్వంత ఊరు ఉజ్జయిని, అతడు మహాకాలుని భక్తుడు, అందుకే అతని పేరు కాలిదాసు, కాళికి దాసుడయితే అతని పేరు కాళీదాసు అవుతుంది. చారిత్రకముగా ఉజ్జయిని ప్రసిద్ధమైనది. కాళిదాసు సమకాలికుడయిన ఖగోళ శాస్త్రజ్ఞుడు వరాహమిహిరుడు ఉజ్జయినిని నేటి లండన్ గ్రీనిచ్ వలె (సున్న డిగ్రీల రేఖాంశముగా) భావించాడు.
37:38
ఉజ్జయినీ ప్రజలు భవానీశివులకు నాట్య ప్రదర్శనాలు చేస్తుంటారు. దేవుని అతిసంబరముతో ఆరాధిస్తారు.
మహాదేవుని ఆరాధనలో తన గర్జనలతో మేఘము ఢంకారావము చేస్తున్నదని, మేఘాన్ని చూసి మహాదేవుడు తన గజచర్మంపైన మోహాన్ని విడిచిపెడతాడనీ, అది చూసి భవానీదేవి సంతోషిస్తుందనీ పాడతారు.
38:50
నదులను, గ్రామాలను దాటుతూ దారిలో గంభీరానదితో రమించు. పిదప విశాలనగరాన్ని చేరుతావు. ఒకప్పుడు వత్సదేశపు రాజైన ఉదయనుని ఖ్యాతి అవంతిలో ఆబాలగోపాలానికి తెలిసిన విషయమే. అతని గాథలను గ్రామాలలో వృద్ధులు గానం చేస్తూ ఉంటారు, విను.
ఇక్కడ వత్సరాజు చరిత్రను జానపదులు గానం చేస్తారు. వత్సరాజు మృగయావినోది, వీణావాది, వాసవదత్త ప్రియుడు. ప్రద్యోతస్య ప్రియదుహితరం అనే పద్యపు సారాంశము నిక్కడ గమనించవచ్చును. (1.34)
40:20
దేవగిరికి వెళ్ళు. అది గిరిజాతనయుడు, సురసేనాధిపతి, పక్షివాహనుడైన స్కందుని వాసస్థానము. అక్కడ సిద్ధదంపతులు వీణలతో పాడుతూ ఆయనని ఆరాధిస్తుంటారు. వారితో కలిసి ఆ కుమారునికి నమస్కరించు.
ఇక్కడ సిద్ధదంపతుల పాట వినిపిస్తుంది. కుమారసంభవ కర్తయైన కాళిదాసు సుబ్రహ్మణ్యస్వామిని చూడమని మేఘునితో చెప్పడము సహజమే కదా! ఇక్కడ ఒక విషయము చెప్పాలి. కుమారసంభవములోని కుమారస్వామి బ్రహ్మచారి. దేవకార్యము ముగిసిన పిదప ఒక్కడే తపస్సు చేసికొంటు ఉంటాడు. కాని దక్షిణాదిలో ఉండే కుమారస్వామికి (మురుగన్) యిద్దరు భార్యలు

41:27
ఇక్కడ గంగావతరణమును గురించిన కథను యక్షుడు వివరిస్తాడు. రంతిదేవుని స్మరించమని బోధిస్తాడు. ఆరాధ్యైనం శరవణభవం అనే పద్యములో ఈ సంఘటన ఉన్నది. నీ మేఘగర్జనతో త్రిపురవిజయుని సేవించు.(1.49)
ఓ మేఘుడా, మనోహరమైన వేణునాదంతో కిన్నరగాయకులు శివుని త్రిపురవిజయ గాథను పాడుతుంటారు. నీ గర్జనలతో వారికి మృదంగ సహకారాన్ని అందించు.
42:11
విశ్వనాథుడైన శివుని నుతించే పాట యిది.
43:17
కైలాస శిఖరాన్ని గురించిన వర్ణన యిది. అది సురవనితాదర్పణమట. హంసలుండే క్రౌంచపదము, ఆ శృంగచ్ఛాయలను గురించిన వివరాలు యిక్కడ వినవచ్చును. ప్రాలేయాద్రేరుపతటమతిక్రమ్య (1.61), గత్వాచోర్ధ్వంద‌శముఖభుజో(1.62) పద్యాలలోని విశేషాలు యిందులో ఉన్నాయి.
43:53
ఇక్కడ అప్సరాంగనలు మేఘంతో ఆటలాడుతూ పాడుతారు.అతణ్ణి తమ చేలాంచలాలతో కట్టివేసి నీళ్ళు పిండుతుంటారు. అతడు గర్జనలు చేసి వాళ్ళని భయపెట్టి ముందుకు సాగుతాడని పాటలో తెలుస్తుంది.
45:28
తతదనంతరము కైలాసగిరికి ఉపరిభాగమున ఉన్నఅలకానగరిని గురించి యక్షుడు మేఘమునకు చెబుతాడని సూత్రధారు డంటాడు.
45:51
ప్రియుని ఒడిలో కూర్చున్న ప్రియురాలివలె కైలాసోపరిభాగములో అలకానగరము ఉన్నది. గంగ అనే వస్త్రం జారుతుండగా ఆ నగరం కామినివలె కనిపిస్తుంది. అక్కడి స్త్రీల చేతులలో విలాసవంతముగా తామరపూలు ఉంటాయి. కురువక, నీపా పుష్పాలను వెండ్రుకలలో ధరిస్తారు. ఇవన్నీ హస్తే లీలాకమల మలకే అనే పద్యములోనివి. (2.02)
అలకానగర స్త్రీలు తమ అలంకారాలను వర్ణిస్తూ పాడతారు.
47:48
అక్కడి బాష్పాలు ఆనందబాష్పాలు మాత్రమే. బాధంతా కుసుమబాణాలవల్ల కలిగినది మాత్రమే. ప్రణయకలహాలు వియోగాలవల్ల మాత్రమే. అందరికీ ఒకే వయస్సు, అది యౌవనము. ఆనందోత్థం నయనసలిలం అనే పద్యముపైన ఆధారపడిన గీతమిది. (2.04)
48:34
కిన్నరులు యక్షరాజైన కుబేరుని యశస్సుని కీర్తిస్తూ పాడతారు. యక్షేశ్వరుడు, రాజరాజైన కుబేరుడు కల్పవృక్షసమానము, నవనిధులను కాపాడేవాడు అంటూ కుబేరుని గురించిన పాట యిది.
49:28
తన యింటిని గురించి మేఘునితో యక్షుడు చెబుతాడు. ఈ పాటకు తత్రాగారం ధనపతిగృహాన్ (2.14), వాపీచాస్మిన్ మరకతశిలా (2.15) అనే పద్యములు మాతృక. నా యిల్లు కుబేరుని అంతఃపురానికి ఉత్తరదిశలో ఉన్నది. దాని ద్వారపు వంపు ఇంద్రధనుస్సులా ఉంటుంది. చేతితో కూడ తాకడానికి వీలయ్యేటట్లు ఉండే పూలతో నిండిన పొట్టి మందారపు చెట్టులు ఉన్నాయి అక్కడ. అక్కడి నడబావి మెట్టులు పచ్చలతో నిర్మించబడినవి. అందులో హాయిగా హంసలు ఈదుతుంటాయి.
51:05
ఇలా యక్షుడు తన యింటిని వర్ణించి తన భార్యనుగురించిన వివరాలను మేఘునికి చెప్పబోవుచున్నాడని సూత్రధారుడు వివరిస్తాడు.
51:39
తన్వీ శ్యామా శిఖరిదశనా పక్వబింబాధరోష్ఠీ
మధ్యే క్షామా చకితహరిణీప్రేక్షణా నిమ్ననాభిః
శ్రోణీభారాదలసగమనా స్తోకనమ్రా స్తనాభ్యాం
యా తత్రస్యా ద్యువతివిషయే సృష్టిరాద్యేవ ధాతుః||
సంస్కృతసాహిత్యములో అతి సుందరమయిన పద్యాలలో నిది యొకటి (2.21). బ్రహ్మ స్త్రీసృష్టికి ఇది పరాకాష్ఠ అంటాడు కాళిదాసు. తన్వీ అంటేసన్ననిది, శ్యామా అంటే యౌవనపు మధ్య దశలో నున్నది, శిఖరిదశనా అంటే వంకరలు లేని పళ్ళు గలది. పక్వబింబాధరోష్ఠీ అంటే మంచి దొండపండులాటి పెదవులు ఆమెకు ఉన్నాయి. మధ్యే క్షామా అంటే సన్నని నడుము గలది. చకిత హరిణీప్రేక్షణా అనగా భయపడిన లేడి కన్నులవలె ఉన్నాయి ఆమె కన్నులు అంటాడు కవి. నిమ్న నాభి అంటే లోతైన బొడ్డుగలది అని అర్థము, ఇది సౌందర్యసూచకము. శ్రోణీభారాత్ అలసగమన అంటే నితంబవతి కావున మెల్లగా నడుస్తుంది అని అర్థము. స్తోకనమ్రా అంటే వక్షోజద్వయభారముచే కొద్దిగ వంగినది అని అర్థము. బ్రహ్మదేవుని మొదటి శిల్పములా ఆమె ఉన్నది. (కవి పద్మినీజాతి స్త్రీ లక్షణాలను చిత్రీకరించాడు). తరువాతి పద్య మైన తాం జానీథాః (2.22) కూడ ఈ పాటలో నున్నది. నన్ను వదలి ఉండే ఆమె ఒంటరి చక్రవాకపు పక్షిలా కనబడుతుంది నీకు. శిశిరఋతువులో మంచులో వాడిన పద్మములా ఉంటుంది నా భార్య.
53:42
యక్షుడు అలకపురికి వెళ్ళే దారి, అక్కడ తానుండే యిల్లు, తన భార్య రూపము, ఇత్యాదులను గురించిన వివరాలు ఆ నీలజీమూతానికి తెలుపుతాడు, మేఘుడు ఆ గుర్తులతో అలకాపురిని చేరుకొంటాడు అని నటి చెబుతుంది.
54:30
ఇక్కడ అలకానగరంలో యక్షుని భార్య దుఃఖంతో పాడుతూ ఉంటుంది. దూరభూమిలో వనసీమలలో అక్కడ ఉంటున్నాడు భర్త, నేనో యిక్కడ ఒంటరిగా ఉన్నాను, ఒక జడ పదార్థములా కృశించి యున్నాను, అతని సుఖసౌఖ్యాలు ఏమియు తెలియలేదు. అరె, హటాత్తుగా దక్షిణపు గాలి అనుకూలంగా వీస్తున్నదే. నా మనోరథానికి శక్తి కల్పిస్తున్నదే. నా కోరిక త్వరలో ఈడేరుతుందా? శాపావసానకాలము సమీపిస్తున్నదా అని పాడుతుంది యక్షపత్ని.
56:22
ఇలా యక్షపత్ని వ్యధచెందుతుండగా , మేఘాన్ని పక్షి బృందము ఆహ్వానించి, యక్షుని ఇంటికి దారిచూపి, ప్రవేశింపచేస్తున్నదని సూత్రధారుడు చెబుతాడు.
56:58
పక్షులు పాడతాయి: ఓ జలధరా రా, ప్రవేశించు. కుబేరుని రాజభవనమున కుత్తరముగా ఉండే యక్షుని ఇల్లు ఇదే. ఇదిగో క్రీడాశైలం. తోరణమిదిగో. నీ విద్యుత్ దృష్టిని పరిహరించు. శరీరాన్ని గున్నఏనుగు ప్రమాణంలో తగ్గించుకో. ఇంటిలోపల ఆ యక్షిణి వాక్కులను వింటున్నావా?
57:58
యక్షపత్ని పాడుతుంటుంది: ఓ చిలుకా, రసికా, నా ప్రియుణ్ణి ఎప్పుడైనా గుర్తు చేసుకుంటున్నావా? నువ్వంటే ఆయనకి ఎంతో ఇష్టం కదా. ఇదిగో ఆయన బొమ్మ గీశాను. అందులో పోలికలు కనిపిస్తున్నాయా? వీణని వాయిద్దామనుకుంటే, నా కన్నీళ్ళు తంత్రులపైన పడి మూర్చనలు పలకడం లేదు.
59:14
పక్షులు మళ్ళీ పాడతాయి: ఓ విశాలాక్షీ, యక్షప్రేయసీ, ఎందుకమ్మా ఇంతగా దుఃఖిస్తున్నావు? దక్షిణపుగాలులు త్వరపెట్టగా, దక్షిణదిశ నుంచి వచ్చాడులే. ఇక నీ విరహబాధ చాలును.

(సశేషం)

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...