గాథాసప్తశతి శతకం



తస్స కహా-కంటఇఏ సద్దా అణ్ణణసమోసరిఅ-కోవే
సుముహాలోఅణ-కంపిరి ఉవఊఢా కిం పవజ్జిహిసి

తస్య కథా-కంటకితే శబ్దాకర్ణనసమపసృతకోపే
సమ్ముఖాలోకన-కంపనశీలే ఉపగూఢా కిం ప్రపత్స్యసే


వాని గుఱించిన మాటల
మేను చలించెను, కినుక శమించె బలికినన్,
వాని గనగ గంపింతువు
తా నాలింగించ నేమి తరుణీ యగునే
… 7-59

If we just mention his name
you get goose-bumps
and if he speaks with you
your anger melts away
and if he stands before you in person
you’re shaken and confused
what is going to happen if he hugs you …
Girl, tell us!



అత్థక్క-రూసణం ఖణ-పసింజణం అలిఅ-వఅణ-ణిబ్బంధో
ఉమ్మచ్ఛర-సంతావో పుత్తఅం పఅవీ సిణేహస్స

ఆకస్మిక-రోషకరణం క్షణ-ప్రసాదనమలీక-వచన-నిర్బంధః
ఉన్మత్సర-సంతాపః పుత్రక పదవీ స్నేహస్య


ఒకతరి కోపముతో, మఱి
యొకతరి చిఱునగవుతోడ నుండినచో, వే-
ఱొకతరి వంకలతో, నిం-
కొకతరి ద్వేషించ నామె కోరును నిన్నే
… 7-75

Young man, don’t fret
if she is
angry one moment
happily smiling the next moment
giving lame excuses yet another moment
hating you the very next moment
she is only loving you …
very dearly!



పుసఉ మహం తా పుత్తి అ వాహోఅరణం విసేస-రమణిజ్జం
మా ఏఅం చిఅ ముహ-మండణం త్తి సో కాహిఇ పుణో వి

ప్రోచ్ఛస్వ ముఖం తత్పుత్రి చ బాష్పోపకరణం విశేష-రమణీయం
మా ఇదమేవ ముఖ-మండనమితి కరిష్యసి పునరపి


కన్నుల నీవిట నీరిడు
చున్నావుగదవె కుమారి చూచిన ప్రియుడున్
కన్నీ ళ్ళొక చెలువమ్మను
కొన్నాడో, నిన్ను బాధ గొనునే తెలుసా
… 7-81

For some reason you’re crying
and your face is besmirched with tears
But
your husband may think that this is
one more way of making yourself pretty
If he entertains such thoughts
you’re in trouble
as he’ll start pestering you for love!



సచ్చం సాహసు దేఅర తహ తహ చడుఆరఏణ సుణఏణ
ణివ్వత్తిఅ-కజ్జ-పరమ్ముహత్తణం సిక్ఖిఅం కత్తో

సత్యం కథయ దేవర తథా తథా చాటుకారకేణ శునకేన
నిర్వర్తితకార్యపరాఙ్ముఖత్వం శిక్షితం కస్మాత్


కుక్కయు కామక్రీడను
మక్కువతో జేసి పిదప మలయుచు దానున్
ప్రక్కకు మొగమును త్రిప్పే
నెక్కడ నేర్చినదొ నెఱుగ నిది నే మఱదీ
… 7-88

The dog made love
and turned its head away
It must have learned it somewhere
Do you know
from whom and from where
my dear husband’s brother!
(Is it from you?)