గిడుగు రామమూర్తి పంతులు మనం వాడవలసిన భాషకి వ్యావహారిక భాష అని పేరు పెట్టారు. కానీ ఎవరు వ్యవహరించే భాష వ్యావహారిక భాష అని అడిగితే స్పష్టంగా చెప్పలేక శిష్ట వ్యావహారిక భాష అనే మాట అన్నారు. శిష్టులంటే గోదావరి జిల్లాల్లో చదువుకున్న బ్రాహ్మణులు. వాళ్ళు కూడా ఉచ్ఛరించే పద్ధతిలోనే తెలుగు రాయరు. అందుచేత శిష్ట వ్యావహారికం అనే మాటకి స్పష్టమైన నియమాలు చెప్పటం కష్టమైంది.

ఒక్కసారి గుండె మీద వేయి శతఘ్నుల పోటు. ఊపిరి అందడం లేదు ఇవాన్‌కి. పెద్ద గోతిలో పడిపోతూండగా చివర్లో కనిపించిన ఓ వెలుగు. ఓ పక్కకి వేగంగా వెళ్తూంటే నిజంగా అటుగాక మరో వ్యతిరేక దిశలో వెళ్తూన్న భావన. ‘హమ్మయ్య, ఇదేదీ నిజం కాదన్నమాట. సరే మరేది నిజం?’ ఇవాన్ మనసులో కొత్త ఆలోచన రూపు దిద్దుకోవడం తెలుస్తోంది, అన్నింటినీ ముంచేసిన కొత్త నిశ్శబ్దం లోంచి.

తర్కం,హేతువు కూడా మానవ బుద్ధినుంచి పుట్టేవేననీ, మానవ బుద్ధి పరిమితమైనదనీ భావించడం వల్ల కాబోలు, తర్కాన్నీ హేతువునూ అధిగమించిన పరమ సత్యం కోసం భారతీయ తత్త్వవేత్తలు తమ అన్వేషణ సాగించారు. అంత మాత్రాన భారతీయులు తర్కానికి తక్కువ స్థానం యిచ్చారని అనుకోవడం పెద్ద తప్పే అవుతుంది. తత్త్వసిద్ధాంతాల ప్రతిపాదనలో తర్కానికి తిరుగులేని ప్రాధాన్యం ఉంది.

మనుషులు మనుషులని చంపారు. ఆడవాళ్ళని చెరిచారు. భవనాల్లోని ఎండిన కట్టెలు, నోరులేని ఇటుకలను కూడా అదే చేశారు. ఆ తుఫానులో ఆడవాళ్ళని నగ్నంగా నిలబెట్టారని, వారి రొమ్ములను కోశారని విన్నాడు. అతడు చుట్టుపక్కల చూస్తున్నవన్నీ నగ్నంగా, ప్రాణం లేకుండా తెగి పడున్నాయి.

ఒక్క టూ మినిట్స్ టైమ్ ఇవ్వండి సార్. టోటల్ ప్రోజక్ట్ డిటైల్స్ చెప్పేస్తాను. ఎకరాకి ఎనభై మొక్కలు వేస్తాం. ఫస్ట్ క్రాప్ పదకొండు నెలకొస్తుంది. కానీ… అది వేసే పిలకలు పెరిగి పెద్దయి గెలలేస్తే, ప్రతి మూడు నెలలకీ ఓ క్రాప్‌లా అనిపిస్తుంది. యావరేజిన ఏడాదికి ఫోర్ కటింగ్స్. ఎలా లేదన్నా గెలకి వంద పీసులుంటాయి. ప్రభుత్వం ‘లెవీ’కి యాభై పళ్ళు తీసేసినా, జస్ట్ టూ లాక్స్ మీవి కాదనుకుంటే… మీ టూ హండ్రెడ్స్ ఫ్రూట్స్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈజీక్వెల్టూ… లెక్కేసుకోండి!

“ఏంటో ఇక్కడంతా చీకటి చిక్కగా భయంగా ఉంది.” అందామె.

ఆచితూచి అడుగులేస్తూ తలుపు దగ్గరకి చేరుకుంది.

“అబ్బా, ఈ తలుపెంత బరువుగా ఉందో!”

అంటుండగానే భళ్ళున లోపలి వైపుకి తెరుచుకుంది బరువైన ఆ తలుపు.

మనకి రైళ్ళంటే రైలు బండి. రైల్స్ మీద నడిచే బండి. మనకి రైళ్ళంటే రైల్స్ కావు. ఆ రైళ్ళలో స్లీపర్ లుంటాయి. ఈ రైల్సు కిందా స్లీపర్ లుంటాయి. దీనర్ధం catwalk అంటే తెలియని వాళ్ళకి అర్ధం కాదు. Catwalk అంటే పిల్లినడకలని, haven అంటే స్వర్గధామం అని అనువాదం చేసే మన జర్నలిస్ట్‌లకి, చానలిస్ట్‌లకీ ఎప్పటికీ అర్ధం కాదు.

ఆఫీసరు అనగానే తెలియని భయం ఎందుకు కలుగుతుంది? పెళ్ళి ఫొటోలో ఆయన మామూలుగానే ఉన్నాడు. కానీ పాత ఫొటోల్లోని మనుషులకూ, కొత్త ఫొటోల్లోని మనుషులకూ కొట్టొచ్చినట్టు తేడా ఎందుకు కనబడుతుంది? తాను వెయిట్‌ చేస్తున్నట్టుగా చెప్పివుంటుందా? ఇందాకటి స్త్రీ కూరగిన్నెతో బయటికి వెళ్ళబోతూ, టీపాయ్‌ మీది గ్లాసు తీసుకెళ్ళి, మళ్ళీ తిరిగివస్తూ, అతడికో జవాబు బాకీ ఉన్నట్టుగా, ‘వస్తున్నా’రన్నట్టుగా వెనక్కి చేయి చూపించి బయటికి వెళ్ళిపోయింది.

పదాలకుండే సౌందర్యాన్ని ఎరిగి, వాటిని ఉచిత స్థానంలో పొదిగి, ఆ సౌందర్యాన్ని దిగంత ప్రదర్శనం చేసే కళను స్వాధీనం చేసుకున్న కవి వ్రాసింది ఈ పద్యం. శబ్దాలొలికించే సంగీత మాధుర్యాన్ని ఆకళింపు చేసుకుని, వాటి ప్రవాహపు ఒరవడిని ఒక క్రమవిభక్తమూ, సమవిభక్తమూ చేసి, పద్యగతిని హయగతిలోనూ, గజగతిలోనూ నిబంధించగలిగిన కవి వ్రాసిందీ పద్యం. కవి ఏమి చెపుతున్నాడు అనేది తరవాతి సంగతి. పద్యం చదువుతుండగానే శభాష్ అనిపించే పద్యం ఇది.

“రాజా! నన్ను కారు తోలమని కాదు కదా నీ ఉద్దేశం?” అని అడిగాడు. విక్రమార్కుడు సమాధానం ఇవ్వకముందే, “నేను కారు తోలితే నా తోబుట్టువులకు ఆశ్రయమీయటానికి మరికొన్ని శవాలు తయారవుతాయి. అప్పుడు నీకు మోయటానికి కావలసినన్ని…” అని ఉన్న పళంగా మూడు చుక్కలు అడ్డం రావటంతో ఆగిపోయాడు. తెలుగు కథల్లో ఎక్కడ పడితే అక్కడ, అర్థంపర్థం లేకుండా కనపడటం వాటికి అలవాటే.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

వనమయూరములాటి వృత్తములు తమిళములోని తేవారములో గలవు. తెలుగులో పంచమాత్రల ద్విపదలయ కూడ ఇట్టిదే. కన్నడములో కర్ణాట చతుష్పది అమరిక కూడ ఇట్టిదే. వీటిలో మూడు పంచమాత్రలు, ఒక త్రిమాత్ర ఉంటాయి. పాదాంత యతివలన, త్రిమాత్రను కొనసాగించి వనమయూరపు లయను సృష్టించ వీలగును. నాగవర్మ, జయకీర్తులకు తెలుగు ద్విపద పరిచితమై ఉండుటకు అవకాశము ఉన్నది.

ఇప్పుడు స్వభాషాభిమానము అను పేరుతో పర భాషా తిరస్కారము చీడ పురుగువలె అన్ని దేశములందును వ్యాపించుచు భారతీయ విజ్ఞానమును తునకలు తునకలుగా చేయుచున్నది. కాఁబట్టి ఇదివఱకును తమిళులు చేసిన ఉపకారమునకు వారికి కృతజ్ఞులై, ఇప్పటికైన తెలుఁగువారు తెలుఁగు దృష్టితో త్యాగయ్య సాహిత్యమును సమకూర్చి శోధించి పెట్టుకొని దేశములో వ్యాప్తికి తేవలసి యున్నారు.

సామినేని ముద్దునరసింహం నాయుడు 1855లో రాసి, 1862లో అచ్చయిన పుస్తకం హిత సూచని. ఈ అరుదైన, అద్భుతమైన పుస్తకాన్ని ఈమాట గ్రంథాలయంలో ఉంచుతున్న సందర్భంలో ముద్దునరసింహం మనుమడైన ముద్దుకృష్ణ ఆ పుస్తకాన్ని పునఃప్రచురించినప్పుడు ఆరుద్ర రాసిన ముందుమాట సంక్షిప్తంగా ఇక్కడ ప్రచురిస్తున్నాం.

గ్రాంథిక వ్యావహారిక భాషావివాదం బలంగా నడుస్తున్న రోజులలో కూడా, దృష్టి అంతా పదాలు వాటి వర్ణక్రమాల మీదే ఉండింది. ఆ సమయంలో టేకుమళ్ళ కామేశ్వరరావు అనే యువకుడు వ్యావహారభాషకు నియమాలు ఏర్పరుచుకోవాలా వద్దా అనే అంశాన్ని చర్చకు తీసుకొని వచ్చారు. వీరి పుస్తకం ఈ సంచికలో ప్రచురిస్తున్న సందర్భంలో, ఆ పుస్తకపు ముందుమాట, ఇక్కడ ప్రచురిస్తున్నాం – సం.

క్రితం సంచికలోని గడినుడి-26కి గడువుతేదీలోగా (పంపే బొత్తామును అచేతనం చేసేలోగా) ఎనిమిదిమంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపిన ఎనమండుగురు: 1. రవిచంద్ర ఇనగంటి 2. ఆళ్ళ రామారావు 3. శైలజ/ఆగడి ప్రతిభ 4. భమిడిపాటి సూర్యలక్ష్మి 5. బండారు పద్మ 6. కోమలి గోటేటి 7. అనూరాధా శాయి జొన్నలగడ్డ 8. వైదేహి అక్కపెద్ది. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి – 26 సమాధానాలు, వివరణ.