ఇది చాల బాగుంది
ఎక్కడికక్కడ విరిగిపోవడం
రెండు పెగ్గులు పద్యం తాగి
ఒక బుజమ్మీద ఒరిగిపోవడం
ఈమాట మే 2012 సంచికకు స్వాగతం!
ఆషాఢ మాసం కాకపోయినా, మధ్యాహ్నాలు ఆకాశమంతా నల్లమబ్బులు నిండిపోయి ఉరుములూ, మెరుపుల జడివానలు మనల్ని అప్పుడప్పుడూ పలకరిస్తున్నాయి ఇప్పటికే. వాటిని చూసేనేమో, కృష్ణ మోహన రావు గారు, కాళిదాస విరచిత మేఘదూతంపై వ్రాసిన ఛందోవ్యాసం ఆషాఢస్య ప్రథమ దివసే ఈ సంచికలో ప్రత్యేకం. ఈ వ్యాసానికి యక్షుడి చిత్రాలను అందించినది ఔత్సాహిక చిత్రకారుడు మాగంటి వంశీమోహన్గారు. అంతే కాదు, ఈ వ్యాసానికి తోడుగా పరుచూరి శ్రీనివాస్ సేకరించిన మేఘసందేశం ఆడియో రూపకం కూడా ప్రత్యేకమే. బాలాంత్రపు రజనీకాంత రావు రచన, సంగీత సారథ్యంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రధాన గాయకుడిగా ఆలిండియా రేడియో, బెంగళూరు నుంచి 1978లో ప్రసారమైన ఈ రూపకం అపురూపమైనదని అనడంలో సందేహం ఏమీ లేదు. అలాగే, స్త్రీల రామాయణపు పాటల విశ్లేషణలో భాగంగా వెల్చేరు నారాయణ రావుగారి ఇంకో వ్యాసం లక్ష్మణదేవర నవ్వు ఈ సంచికలో మీకోసం.
సంగీత్ నాటక్ అకాడెమీ టాగోర్ సమ్మాన్ పురస్కారానికి పట్రాయని సంగీత రావుగారినీ, టాగోర్ రత్న పురస్కారానికి బాలాంత్రపు రజనీకాంత రావుగారినీ ఎన్నుకొన్నారు. వారికి మా హార్దిక శుభాకాంక్షలు. ఈమాటలో వీరి గురించిన పరిచయ వ్యాసం 88 యేళ్ళ యువకులు.
ఇంకా: ఇంద్రాణి, తః తః, వైదేహి, ముకుంద రామారావు, హెచ్చార్కెల కవితలు; వేలూరి కథ; గౌరి, పూర్ణిమ, మాధవ్‌ల అనువాదాలు; జయప్రభ పుస్తకం అన్నమయ్య పదపరిచయం పై సాయి బ్రహ్మానందం సమీక్ష; పాత కినిమా సంచికలనుండి రోహిణీప్రసాద్ అందించిన సినిమా సంగతులు; పలుకుబడి, మూడు లాంతర్లు, నాకు నచ్చిన పద్యం, కథ నచ్చిన కారణం ధారావాహిక శీర్షికలు; కనకప్రసాద్ శబ్ద రచన బాల బేలవు ముద్దరాల. …
కారడివిలో రావణాసురుని చేత పట్టుపడిన నిన్ను తొడలమీద పెట్టుకొని ఉన్నాడు రాముడు. ఆయన ఒక క్షణం నీ దగ్గిర లేకపోతే నీకు ప్రాణాలు నిలవవని అన్నావు గుర్తుందా, అప్పుడే నన్ను అనరాని మాటలు అన్నావు కదా, మరి ఇప్పుడు ఆరునెలలు రాముడు లేకుండా ప్రాణాలు నీకు ఎలా నిలిచాయి? ఆడవాళ్ళ మాటలు నమ్మకూడదు.
ఊగుతాడు సూర్యుడు
గుండ్ల కమ్మ మీద
తేలుతాడు చంద్రుడు
కాళ్ళు జాపుకు ఆవులిస్తూ
మెటికలు విరుస్తుంది కాలం.
ఆశ్చర్యార్థకాలను, హర్షాతిరేకాలను, బాధను దుఃఖాన్ని తెలిపేటప్పుడు బంధుత్వ పదాలను వాడడం ద్రావిడ భాషల ప్రత్యేకత. దెబ్బ తాకితే అమ్మో! అంటాము. జాలి చూపడానికి అయ్యయ్యో! అంటాము. అలాగే ఆశ్చర్యానికి అబ్బో! అంటాము. పని పూర్తి కాగానే అమ్మయ్య! అని నిట్టూరుస్తాము.
అన్నమయ్య శృంగార పదాలని కేవలం శృంగారంగా చూడకుండా కవితాత్మకంగా పరిశీలించి అందులో ఉండే పద మాధుర్యాన్నీ, భావ సౌందర్యాన్నీ వివరిస్తూ ఒక పుస్తకరూపంలో “వలపారగించవమ్మ వనిత నీ – యలుక చిత్తమున కాకలి వేసినది” పేరున అన్నమయ్య పదపరిచయం చేసింది కవయిత్రి జయప్రభ.
బ్రహ్మ వేసిన లెక్కల ప్రకారం దక్షిణభారతదేశాగ్రంలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంగా రావాలి. అదెలాగంటే, శంబళ అనే కుగ్రామంలో విష్ణుయశుడనే వాడికీ, వాడిభార్య సుమతికీ శిశువుగా ఆయన జన్మమెత్తాలి. ఆయనకి కవి, ప్రాజ్ఞుడు, సుమంతుడు అనే ముగ్గురన్నలుండాలి. అతగాడు, పరశురాముని దగ్గిర విద్యాభ్యాసం చెయ్యాలి. ఇది కర్మానుగుణ్యంగా జరగవలసిన వరస.
హటాత్తుగా అతను నన్నే చూస్తున్నాడని నాకనిపించింది. మామూలుగా చూడటం కాదు. అతని చూపులు సూటిగా, అటూ ఇటూ తొణక్కుండా నన్ను ఆపాదమస్తకం శ్రద్ధగా చదువుతున్నట్టుగా, అక్కడితో ఆగకుండా లోపల్లోపలికి చొచ్చుకొనిపోయి నా వీపుని కూడా ఒదిలిపెట్టకుండా, నా శరీరాన్ని బైటా లోపలా కూడా శల్యపరీక్ష చేస్తున్నాట్టుగా, అబ్బ! చటుక్కున చూపు తిప్పుకున్నాను.
మత రాజకీయాలని, విద్వేషాలనీ అవతలకి నెట్టి ఈ కథ చదవవలసిన అవసరం ఉన్నది. ఈ కథని చదవవలసిన నేపథ్యం కూడా వేరే! మహాత్మా గాంధీ అంటే సాధారణ భారతీయులకి ఎంత ఆదర్శమూర్తో, మహమ్మదాలీ జిన్నా పాకిస్థానీయులకి అంత ఆత్మీయుడు. నెహ్రూని పక్కకి తప్పించి జిన్నాని మొదటి ప్రధానిగా చెయ్యటానికి కూడా గాంధీ సిద్ధపడ్డాడు. అయితే, జిన్నా గురించి హిందువులకి ఉన్న అభిప్రాయాలు వేరు.
కవి చేమకూర వెంకటరాజు లోకంలో వెంకటకవిగా సుప్రసిద్ధుడు. ఆయన కావ్యం విజయవిలాసంలో ప్రతి పద్యం లోనూ చమత్కారం చూపిస్తానని శపధం చేశాడట ఈయన. అలాగే ప్రతి పద్యమూ ఆలోచనామృతం చేశాడని చెప్పవచ్చు. పైకి చూస్తే ఒక భావంతో కనిపించే పద్యంలో తవ్వుకుంటూ పోతే ఎన్నో విశేషార్థాలు ద్యోతకమౌతాయి. ఒక రకమైన రసానందం కలిగించే కావ్యమే ఇది.
సావిత్రి గురించి కుటుంబరావుగారు ఊహించిన ‘మంచి భవితవ్యం’ మాట నిజమయింది కాని హిందీ సినిమాల్లో ప్రవేశం మటుకు లభించలేదు. విజయావారు రషెస్ అందరికీ చూపడం వంటి అపురూపమైన విషయాలు మనం ఈ వ్యాసంనుంచి తెలుసుకోవచ్చు. అలాగే సావిత్రి తొలిదశ విశేషాలు ఇంత వివరంగా మరెక్కడా దొరకవేమో.
వారమంతా వారాంతం కోసం వోపిగ్గా ఎదురు చూశాక
ఎప్పటిలానే ఏలకుల సుగంధాన్ని మోసుకుని
శనివారపు ఉదయం మెత్తగా నిద్ర లేపుతుంది
సురవర వారు తెలుగు కీబోర్డ్ తయారుచేసి అమ్ముతున్నారు. ఈ కీబోర్డ్‌పై అక్షరాలు తెలుగులో ఉంటాయి. ఈ కీబోర్డ్ వాడి ఇంగ్లిష్, తెలుగు రెండు భాషల్లోనూ టైప్ చేయవచ్చును. వేరే ఏ సాఫ్ట్‌వేర్ అక్కరలేకుండానే మీరు ఇప్పుడు వాడుతున్న కీబోర్డ్ స్థానే సురవర కీబోర్డ్‌ని చక్కగా వాడుకోవచ్చును.
కుబేరుని కొలువులో ఉండే యక్షుడు శాపగ్రస్తుడై ఒక యేడు తన భార్యకు దూరముగా విరహవేదనతో తపిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఆ సమయములో వర్షాకాలము ఆసన్నమవుతుంది. ఆకాశములోన మేఘాన్ని చూచి నీవు నా దూతగా వెళ్ళి అలకానగరములో ఉండే నా భార్యను కలిసి నా ప్రేమ సందేశాన్ని అందించమని ప్రాధేయపడుతాడు.
మాటైన మాటాడు
పలుకైన పలుకవే
చిలుక ముద్దుల కొలికిరో చెల్లెలా
కవితలో, మొదట ఔద్వేగిక ప్రధానంగా, దాదాపు అప్రయత్నంగా వెలువడిన సృజనకు మెరుగులు చెక్కే పని చాల శ్రద్ధతో, సృజనలోని దృశ్య, పద చిత్రాలు, మాటల ఎంపిక, వాటి కూర్పు, స్థానాల్ని గురించీ వివేకంతో వందలాదిగా నిర్ణయాలను తీసుకొని చేసేది. అందుకే ‘కవి పగలల్లా కూర్చుని ఒక కామా ఎక్కడ ఉంచాలో స్థిరంగా ఒక నిశ్చయానికొచ్చేడు,’ లాంటి పరాచికాలున్నాయి.
ఇక్కడ మీకు వినిపిస్తున్న ‘మేఘసందేశం’ సంస్కృత సంగీత రూపకం 1978లో బెంగుళూరు రేడియో కేంద్రం ద్వారా ప్రసారితమయ్యింది. అప్పట్లో రజనిగారు బెంగుళూరు స్టేషన్ డైరెక్టరుగా పనిచేసేవారు. దీని సంస్కృత రచన, సంగీత నిర్వాహణ చేసినది రజనిగారే. ఆయన గొంతును కూడా వినవచ్చు. యక్షునిగా ప్రధాన గాత్రధారి శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ.
ఆ రాత్రి చెవులు బద్దలైపోయేంత గట్టిగా మెరుపు మెరిసింది. తర్వాత అడవినిండా ఆ వెలుగు పడింది. కొంతదూరంలో ఒక ఎండిపోయిన చెట్టు మీద ఒక వింత జంతువు కూర్చుని, ఆ చెట్టుని తినేస్తూ ఉంది. ఆ జంతువు శరీరం నుండి సూర్యుడి నుంచి వచ్చేలాంటి వెలుగు వస్తూ ఉంది. ఇలాంటి జంతువుని ఇంతకు ముందు ఎవ్వరూ, బాఖా ముందు తరాల వాళ్ళు కూడా చూడలేదు.
నిద్రపోని
గాలి పక్షి
ఆడుతూ పాడుతూ
భూభాగమంతా
ఎగురుతుంది
పాత కాలువలో దిగి మెయిన్ రోడ్డుకి ఎక్కి చెరుకు దుకాణం, బాల పాండియన్ మిఠాయి దుకాణం, వేల్ విలాస్ స్వీట్స్ అండ్ హాట్స్ అన్నీ దాటి తెప్పోత్సవం జరిగే చోటుకి వెళ్ళి చేరేసరికి ఇసుక వేస్తే రాలనంతగా జనం ఉన్నారు. ఎక్కడ చూసినా ఇనుప తొప్పిలు ధరించిన రిజర్వ్ పోలీసులు చేతిలో లాటీకర్రలతో. చూస్తేనే భయంగా అనిపించింది.
మహర్వాటీ మహాద్వార తోరణంలో
పక్క పక్క ఆకులమై పలకరించుకొనే వరకూ
నింగీ నీరధీ కలుసుకుంటున్న
క్షితిజ నిశాంత నీలిమల మీద చెలీ!