గురుదేవునికి అంజలి

ముందుమాట

సాహిత్య క్షేత్రములో నోబెలు బహుమతిని అందుకొన్న ఒకే ఒక భారతీయుడు రవీంద్రనాథ టాగూరు. సాహిత్యములో, సంగీతములో ఈ మహాకవి చేసిన ప్రయోగాలు కోకొల్లలు. రవీంద్రుడు 1861 సంవత్సరములో మే, 7వ తారీకున జన్మించాడు. అంటే ఈ నెల అతని 150వ జన్మదిన వార్షికోత్సవము. రవీంద్రుని కథలు, నవలలు, నాటికలు ఎన్నో తెలుగులో అనువదించబడ్డాయి. కాని గీతాంజలి కాక ఇతర కవితలు, పాటలు మనకు ఆంగ్లానువాదాల ద్వారా మాత్రమే పరిచితము. రవీంద్రుని ఈ విశేష జన్మదిన సందర్భముగా, ఇతని కొన్ని పాటలకు నా అనువాదాలను, మూల బెంగాలీ మాతృకలతో సహా మీకు అందజేస్తున్నాను. అనువాదాలు కూడా వీలైనంతవరకూ పాడుకోటానికి అనువుగా ఉండేట్టు ప్రయత్నించాను. కాని పాడేటప్పుడు కొన్ని హ్రస్వాలను దీర్ఘముగా, కొన్ని దీర్ఘాలను హ్రస్వముగా పలకాలి. ఉదాహరణకు ఈ పాటలలో దీర్ఘాక్షరాలు ఎక్కువ. ఒక గురువు ఉండవలసిన చోటులో రెండు లఘువులను ఉంచాను. హలంతములుగా ఉండే పదాల చివర అచ్చును జతపరచాను. పాత India Digestలో డాక్టర్ ఇంద్రాణి నంది అనువాదాలు, మోహిత్ చక్రబర్తి వ్రాసిన A Hundred Devotional songs of Tagore (publ: Motilal Banarsidass, Delhi, 1999) లోని అనువాదాలు, నా సహోద్యోగి డాక్టర్ ప్రసేన్‌జిత్ భౌమిక్ వివరణలు నా అనువాదానికి ఆధారాలు. నా ఈ అనువాదాలు మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను.

1. ఆలో ఆమార్ ఆలో ఓగో

ఆలో ఆమార్ ఆలో ఓగో, ఆలో భూబన్ భరా
ఆలో నయన్ ధో్ఓయా ఆమార్ ఆలో హృదయ్ హరా

నాచే ఆలో నాచే ఓ భాఇ, ఆమార్ ప్రాణేర్ కాఛే
బాజే ఆలో బాజే ఓ భాఇ, హృదయబీణార్ మాఝే
జాగే ఆకాశ్, ఛోటే బాతాస్, హాసే సకల్ ధరా

ఆలోర్ స్రోతే పాల్ తులేఛే హాజార్ ప్రజాపతి
ఆలోర్ ఢేఉయే ఉఠ్ల మేతే మల్లికా మాలతీ
మేఘే మేఘే సోనా, ఓ భాఇ యాయనా మానిక గోనా

పాతాయ్ పాతా హాసి ఓ భాఇ, పులక్ రాశి రాశి
సురనదీర్ కూల డుబేఛే సుధా-నిఝర-ఝరా

ఆలో ఆమార్ ఆలో ఓగో

వెలుగో వెలుగు నా యీ వెలుగు జగమే నింపెను గదా
వెలు గీ కనుల కడిగేను గాదా నింపెను హృదిని సదా

నాట్యమ్మాడె వెలుగో ప్రియతమ జీవన కేంద్ర మ్మాయె
మ్రోగించేను వెలుగో ప్రియతమ ఎడదవీణియ పలికె
లేచే నా నింగి, వీచే నా గాలి, నవ్వెను నేల కులికి

వెలుగను నదిలో తేలె చలించె వేలాది భ్రమరములు
వెలుగుల తరగల నూగె తూగె మల్లియలు జాజులు
మేఘా లన్నియు బంగరు ప్రియతమ సురుచిర మణులై వెలిగె

ఆకులు నవ్వె చూడో ప్రియతమ పులకరింపుల ప్రోవై
సురతరంగిణికి తెగెనో కట్టలు సుధలు వరదలయ్యె

2. ఆమి చిని గో చిని

ఆమి చిని గో చిని తోమారే ఓగో బిదేశినీ
తుమి థాక సింధుపారే ఓగో బిదేశినీ

తోమాయ్ దేఖేఛి శారదప్రాతే
తోమాయ్ దేఖేఛి మాధబీ రాతే
తోమాయ దేఖేఛి హృది-మాఝారే
ఓగో బిదేశినీ

ఆమి ఆకాశే పాతియా కాన్
శునేఛి శునేఛి తోమారి గాన్,
ఆమి తోమారే సఁపేఛి ప్రాణ్
ఓగో బిదేశినీ

భుబన భ్రమియా శేషే
ఆమి ఏసేఛి నూతన దేశే
ఆమి అతిథి తోమారి ద్బారే
ఓగో బిదేశినీ

ఆమి చిని గో చిని తోమారే ఓగో

నిను తెలుసు తెలుసు నాకు ఒహో విదేశినీ
ఆ సంద్ర మావలున్న నిన్నో విదేశినీ

నిను జూచేను శారద వేళ
నిను జూచేను ఆమని రేయి
నిను జూచేను
హృది లోలోన, ఒహో విదేశినీ

నే నాకాశ మంత చెవులై
విన్నాను విన్నాను ఆ నీదు గీతి
నే నిచ్చేను ప్రాణమ్ము నీకు, ఒహో విదేశినీ

భువన మెల్ల వెదకి
నిను గంటి క్రొత్త చోట
నే నతిథి నీ గృహాన, ఒహో విదేశినీ

3. చిత్త పిపాసిత రే

చిత్త పిపాసిత రే
గీతసుధార తరే

తాపిత శుష్కలతా బర్షణ యాచే యథా
కాతర అంతర మోర్ లుంఠిత ధూలి ’పరే
గీతసుధార తరే

ఆజి బసంతనిశా, ఆజి అనంత తృషా,
ఆజి ఏ జాగ్రత ప్రాణ్ తృషిత చకోర-సమాన్
గీతసుధార తరే

చంద్ర అతంద్ర నభే జాగిఛే సుప్త భబే
అంతర బాహిర ఆజి కాఁదే ఉదాస స్బరే
గీతసుధార తరే

చిత్త పిపాసిత రే

మనసు దహించెనుగా
గీతిక ధారలకై

వాడిన తీగ సదా
వానను కోరుగదా
వాడిన నా మది నేడు
పొరలెను మట్టిపయి – గీతిక ధారలకై

నేడు వసంత నిసి
నేడు పిపాసిని నే
వేచె నీ ప్రాణము ఆ
తృషిత చకోరములా – గీతిక ధారలకై

నింగి వెలింగె శశి
నిద్దుర రాదు సుమా
లోపల వెలుపల నేడు
బాధామయమ్ము స్వరం – గీతిక ధారలకై

4. ప్రభు ఆమార్ ప్రియ

ప్రభు ఆమార్ ప్రియ ఆమార్ పరం ధన హే
చిరపథేర్ సంగీ ఆమార్ చిరజీబన హే

తృప్తి ఆమార్, అతృప్తి మోర్, ముక్తి ఆమార్, బంధనడోర్
దుఃఖసుఖేర్ చరం ఆమార్ జీబన మరణ హే

ఆమార్ సకల గతిర్ మాఝే పరమ గతి హే
నిత్య ప్రేమేర్ ధామే ఆమార్ పరమ గతి హే

ఓగో సబార్ ఓగో ఆమార్ బిశ్వ హతే చిత్తే బిహార
అంతబిహీన్ లీలా తోమార్ నూతన నూతన హే

ప్రభు ఆమార్ ప్రియ ఆమార్

ప్రభువు నాకు ప్రియుడు నాకు నిధియు నీవెగా
భవపథాన సఖుడు నీవె జీవితమ్ములో

తృప్తి నాకు, అతృప్తి నాకు, ముక్తి భవపు పాశము నీవే
ముదము వెతల అవధి నీవె చావు బ్రదుకు నీవె

త్రోవ లన్ని యెపుడు నీవే గమ్య మీవెగా
నిండు ప్రేమాలయమునందు ప్రేమ నీవెగా

అందరి వాడా ఓ నా ప్రభూ డెందములో నుందువు సదా
అంతులేని లీల నీది క్రొత్త క్రొత్తగా

5. తుమి నబ నబ రూపే ఏసో ప్రాణే

తుమి నబ నబ రూపే ఏసో ప్రాణే
ఏసో గంధే బరణే ఏసో గానే

ఏసో అంగే పులకమయ పరశే
ఏసో చిత్తే సుధామయ హరషే
ఏసో ముగ్ధ ముదిత దునయానే

ఏసో నిర్మల ఉజ్జ్వల కాంత
ఏసో సుందర స్నిగ్ధ ప్రశాంత
ఏసో ఏసో హే బిచిత్ర బిధానే
ఏసో దుఃఖే సుఖే ఏసో మర్మే
ఏసో నిత్య నిత్య సబ్ కర్మే
ఏసో సకల కర్మ అబసానే

తుమి నబ నబ రూపే ఏసో ప్రాణే

నీవు క్రొత్తగు రూపుల రమ్ము హృదిలో
రమ్ము తావుల రంగుల రమ్ము గీతుల

రమ్ము అంగము పులకించ తాకుచు
రమ్ము చిత్తము హరుసించ నవ్వుచు
రమ్ము ముగ్ధ ముదిత నయనాల

రమ్ము అమలిన శోభిత కాంతుల
రమ్ము నున్నని చెలువపు శాంతుల
రమ్ము రమ్మిట విచిత్ర విధముల

రమ్ము వెతలో సుఖమున రమ్ము బ్రదుకున
రమ్ము నేను జేయు ప్రతి పనిలో
రమ్ము అన్ని కార్యముల తుదిలో

6. తుమి సంధ్యార మేఘమాలా

తుమి సంధ్యార మేఘమాలా,
తుమి ఆమార సాధేర సాధనా,
మమ శూన్యగగనబిహారీ
ఆమి ఆపన మనేర మాధురీ మిశాయే తోమారే కరేఛి రచనా
తుమి ఆమారి, తుమి ఆమారి,
మమ అసీమగగనబిహారీ

మమ హృదయరక్తరాగే తబ చరణ దియేఛి రామియా,
అయి సంధ్యాస్వప్నబిహారీ
తబ అధర ఏఁకేఛి సుధాబిషే మిశే మమ సుఖదుఃఖ భామియా—
తుమి ఆమారి, తుమి ఆమారి,
మమ బిజనజీబనబిహారీ

మమ మోహేర స్వపన-అంజన
తబ నయనే దియేఛి పరాయే,
అయి ముగ్ధనయనబిహారీ
మమ సంగీత తబ అంగే అంగే దియేఛి జడాయే జడాయే–
తుమి ఆమారి, తుమి ఆమారి,
మమ జీబనమరణబిహారీ

తుమి సంధ్యార మేఘమాలా

నీవు సంజెల మేఘమాల
నీ వమూల్య సుందర సాధన
నా శూన్య గగన విహారీ
నా మనసున సురమ్య భావనల కలుపుచు వ్రాసే నీ కవితను నీకై
నా దానవు నా దానవు
నా విశాల గగన విహారీ

నా హృదయ రక్త రాగము
నీ చరణముల పారాణి
నా కలలలోని రాణీ
నా మదిని యమృతము విషము కలుపుచు నీ పెదవులకు నిత్తు
నా దానవు నా దానవు
ఏకాంత జీవన విహారీ

నా మనసునందు గలుగు తలపు
నీ కనులు జూచు కలగా
ఓ ముగ్ధ నయన విహారీ
నా సంగీతమున చిందు నెందు త్వదీయ శుభాంగ కళాత్మ
నా దానవు నా దానవు
నా జీవన మరణ విహారీ

7. తోమాయ్ ఆమాయ్ మిలన్

తోమాయ్ ఆమాయ్ మిలన్ హాబే బోలే
ఆలోయ్ అకాశ్ భరా
తోమాయ్ ఆమాయ్ మిలన్ హాబే బోలే
ఫూల్ల శ్యామల్ భరా

తోమాయ్ ఆమాయ్ మిలన్ హాబే బోలే
రాత్రి జాగే జగత్ లయే కోలే
ఊషా ఏసే పూర్బ-దూయార్ ఖోలే
కలకంఠస్వరా

ఛల్చే భేసే మిలన్ ఆశా తోరీ
అనాది స్రోత్ బేయే
కత కాలేర్ కూసూం ఊఠే భరీ
బరణ్ డాలీ ఛేయే

తోమాయ్ ఆమాయ్ మిలన్ హాబే బోలే
జుగే జుగే బిశ్వ భూబన్ తలే
పరాన్ ఆమార్ బధూర్ బేషే చలే
చిర-స్వయంబరా

తోమాయ్ ఆమాయ్ మిలన్

నాకు నీకీ మిలన ఘడియలోన
వెలిగే నాకాశ మెల్ల
నీకు నాకీ మిలన ఘడియలోన
పూచె పచ్చని నేల

నాకు నీకీ మిలన ఘడియలోన
రాత్రి మేల్కొని మనకు జోల పాడె
వేకువ తోచె తూర్పు దిక్కునందు
కలనాదములతో

తేలె మన యీ పొందు కోర్కె నావ
అనాది నదము పైన
చిరపరిమళ కుసుమ మాలలతో
పిలుతుమా యీ వేళ

నాకు నీకీ మిలన ఘడియలోన
యుగాలుగాను భూమీతలముపైన
నిలిచియుంటి పెండ్లి చీరను గట్టి
స్వయంవరానికై


జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...