తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనే ఆమె జిజ్ఞాసకు అక్కడి పరిచయాలు ఎంతో తోడ్పడ్డాయి. చదివిన పుస్తకాల వల్ల ప్రపంచాన్ని మార్చటం సాధ్యమే అనే అభిప్రాయం ఏర్పడింది. వామపక్ష రాజకీయాలు అర్థవంతమైనవి అనిపించింది. ప్రపంచమంతా విప్లవాలు జరుగుతున్న సమయమది. ఆ ప్రభావం క్యాంపస్‌లో చాలా ఉంది.
Category Archive: సమీక్షలు
‘వందేళ్ల కథకు వందనాలు’ అర్పిస్తూ సమర్పించిన 118 కథనాల్లో కేవలం 12 మంది రచయిత్రులు మాత్రమే దర్శనమిచ్చారు. రచయిత్రి శీలా సుభద్రాదేవిగారిని ఆ విషయం బాధించింది. వ్యక్తిగత ఆసక్తితో కథాసాహిత్య నిర్మాణంలో రచయిత్రుల భాగస్వామ్యం గురించి ఆమె ఆరా తీస్తూ పోతే, ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూశాయి.
శ్రీదేవి కథలలోని పాత్రలన్నీ సజీవ చైతన్యంతో ఉంటాయి. దృఢమైన వ్యక్తిత్వం కలిగివుండి, జీవితంపైన స్పష్టమైన అవగాహన కలిగివుంటాయి. వేసే ప్రతీ అడుగూ తడబడకుండా ఆచితూచి వేస్తాయి. పొరపాటున అడుగు పక్కకు తప్పినా దానికి మరొకరిపై నింద వేయవు. తమ తప్పిదాన్ని తామే తెలుసుకుని మేలుకుంటాయి.
ఈ కథకు ఇంత గుర్తింపు ఎలా వచ్చింది అన్న ప్రశ్న కలగవచ్చు. ఒకసారి చదవంగానే పూర్తిగా అర్థమయ్యే కథ కాదు. చదివిన ప్రతిసారి కొత్త కోణాలను, లోతులనూ చూపించే కథ. పాత్రల అంతరంగాలు, మనస్తత్వాలు అర్థం చేసుకోవడంలో మెదడుకు పని కల్పించే కథ. అందుకే గొల్లపూడి మారుతీరావు ఈ కథను నిగూఢత, మార్మికత ఉన్న మిస్టిక్ స్టోరీ అన్నారు. కుముదం మృత్యువుతో ముగిసిన ఈ కథ మనస్సులో నిశబ్దతను, విషాదాన్ని నింపుతుంది.
‘ఉపజ్ఞ’ ఈ పుస్తకానికే తలమానికమైన వ్యాసం. అందులో పదాల విన్యాసం, పన్ ప్రయోగాలు, శ్యామ్ ట్రేడ్‌మార్క్ హిందీ వరుసలు రచయిత మనోభావాలకు అద్దం పట్టి, ఆసక్తికరంగా చదివిస్తుంది. భరాగో తినిపించే సాహిత్య చిప్సూ గాసిప్సూ, కొకు జ్ఞాపకాలు…
‘మీకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి?’ అని మిత్రులు, పాఠకులు అడిగితే నవ్వి ఉరుకోవటం, లేదా ఒక మొహమాటపు నవ్వు నవ్వి ‘అందుకే నేను కార్టూనిస్ట్’నని అని తప్పించుకోవటం పరిపాటే. నిజానికి ఇలాంటి ప్రశ్నలకి జవాబులు ఇవ్వటం కష్టమే. ఐడియాలు ఎప్పుడు, ఎలా బుర్రకి తడతాయో చెప్పటం నాకు కష్టమే.
అనుపమకు స్కూల్ ఫైనల్ చదువుతుండగా కళ్ళు మండుతుంటే వేడి చేసిందేమో అనుకుంటే ఒకకన్ను పోయి, మరో కన్ను కూడా మసకేసి క్రమంగా పోయే పరిస్థితి వస్తుంది అని తెలుస్తుంది. అన్నీ సక్రమంగా అమరివున్న వాళ్ళకే పెళ్ళిళ్ళు జరగటం కష్టమైన రోజుల్లో ఒకలోపం ఉన్నప్పుడు పెళ్ళికావటం కష్టం అనే పరిస్థితులు ఆనాడు. సహజంగానే అనుపమని చూసుకునేందుకు పెళ్ళిచూపులకు వచ్చిన పెళ్ళికొడుకులు ఆమె చెల్లిని చేసుకుంటాననే రోజులు కూడా ఆనాడు.
అధ్యయన శీలత లేక తమను మెచ్చుకునే వారిని చేరదీసి తాము రాసే అస్తవ్యస్త కవిత్వానికి హారతులు పట్టించుకునే వారికి ఈ పుస్తకం మింగుడు పడకపోవచ్చు. అక్కడక్కడ రఘుగారి శేషేంద్రపై మొగ్గు, కొన్ని దురుసు వాక్యాలు, కించిత్ ధిషణాధృతి చివుకు కలిగించవచ్చు.
బతుకు గతుకుల్లో గట్టి దెబ్బ తగిలినప్పుడు అవి కరిగి బయటకు తేలతాయి. నమ్మిన వాళ్లకు దేవుడు ఒక ఆసరా. నాకు నేనే ఆసరా, మనసును స్వాధీన పరచుకోగలిగితే, కార్యకారణ సంబంధాలను హేతుబద్ధతతో వివేచించగలిగితే దారి స్పష్టమవుతుంది.
ఈ కథలో ఇద్దరు మగవాళ్ళూ హెమింగ్వే రెండు రూపాలు. ఏ మాత్రం అడవి జంతువుకు బెదరని, స్త్రీ ని నిక్కచ్చిగా అంచనా వేయగల విల్సన్లో ఒక హెమింగ్వే ఉంటాడు. మృత్యుభయం వదలనివాడు, క్షణక్షణం తన స్త్రీ ముఖకవళికలను గమనిస్తుండే బలహీనుడు, భార్య ఎంత ప్రమాదకరురాలో తెలిసీ ఆమె లేనిది తనకు జీవితం లేదని అనుకునే నిస్సహాయుడు ఫ్రాన్సిస్ లోనూ రచయిత పూర్వానుభవాల ఛాయలు లేకపోలేదు.
మనం సాధారణంగా ఇగ్నోర్ చేసే వ్యక్తులు, పరిసరాలు అంటే ఒక చిన్న ఆడపిల్ల, ఒక చిన్న ఊరిలో ప్రాథమిక పాఠశాల, రిటైర్డ్ సేల్స్మన్ – ఇలాంటి వారి జీవితాలని జాగ్రత్తగా చూసి, ఆమె వారి గురించి వ్రాసింది. ఆమె వాళ్ళ జీవితాలను సీరియస్గా తీసుకుంది. అందువల్ల, ఒక్కొక్కసారి వారి పాత్రలు వారి కంటే పెద్దవిగా, ఘనంగా కనిపిస్తాయి. అది, కాల్పనిక సాహిత్యంలో మన్రో చేసిన గొప్ప పని. నిజం చెప్పాలంటే, ఆవిడ రాసిన ప్రతి ఒక్క కథా ఒక నవలగా మలచవచ్చు.
మెహక్ ఈ సంపుటి ముందుమాటలో చెప్పినట్టు రెండు ముఖ్య విషయాలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఒకటి – ఇతివృత్తాలు, సంవిధానం, ముగింపు భిన్నంగానే కనిపిస్తాయి. రెండు – ఇరు మతాల మధ్య సయోధ్య పెంపొందించి, వైరుధ్యాలను వెదికి వేరుచేసి, చెరిపేసే కృషి వున్న సృజనశీలత. ఈ రెండు విశేషాలు స్పష్టంగా వ్యక్తమవుతాయి ఈ కథల్లో.
తెలుగుదారి పుస్తకం వీటన్నిటికంటే భిన్నమైన పరిస్థితుల్లో వచ్చింది. పరిమిత ప్రయోజనం కోసం ఉద్దేశించిన ఈ వ్యాకరణాన్ని సమగ్రమైన తెలుగు వ్యాకరణం అనడానికి వీల్లేదు. వ్యాకరణ పరిభాష అంతా ఇంగ్లీషులో ఉన్నందువల్ల తెలుగు అధ్యాపకులకు కాని, విద్యార్థులకు కాని ఇది అంతగా ఉపయోగపడదు.
కాళికాంబ ఎక్కడికి వెళ్ళినా పోలీసులు వెంటాడుతుండేవారు. ఇల్లు సోదా చేసేవారు. ఇంట్లో సామాన్లు, వండిన వంటలు, ఊరగాయలు అన్ని పాడుచేసి, చేతికి వచ్చినవి పట్టుకుపోతూ ఉండేవారు. నోటికి వచ్చినట్లు ఛండాలపు మాటలనేవారు. ఆడవాళ్ళని నానా భీభత్సంగా భయపెట్టడం, మానభంగాలు చేయడం, కొట్టడం చేసేవారని ఆమె పేర్కొన్నారు.
వారి జీవితం నల్లేరు మీద నడక ఎందుకు కాలేదు? అనుకుంటాం. పులుముకున్న చీకటి వేదనని తామే అనుభవించి మనకు చల్లని చందమామలైన వాళ్ళు కొందరు. ఈ పదిహేనుమందిలో అత్యాశతో అహంకారంతో అపకీర్తి మూటకట్టుకుపోయిన పాబ్లో ఎస్కోబార్ తప్ప తక్కినవారంతా కళాకారులే, తమ రంగాల్లో నిష్ణాతులే.
అందుకే, ఇతనికి ఇష్టమైన ఆట ప్రతీదీ ప్రశ్నించడం, చిన్నపిల్లల లాగా. ప్రతీదీ ఒక అద్భుతంలాగా, ప్రతీదాని వెనుకా ఏదో ముర్మముంది, అదేమిటో తెలుసుకోవాలనే ఉత్సుకత. ఎందుకు, ఎందుకు, ఎందుకు అని పిల్లలందరూ ఎడతెరపి లేకుండా అడిగే ప్రశ్నలు. తెలియనిదంతా తెలుసుకోవాలనే తపన.
నవల నిండా ఉపాఖ్యానాల ఉద్బోధ కానవస్తుంది. బావరి కథ కాని, నౌకానిర్మాణ శాస్త్రవేత్త జాలరి ఓడేసు కథ కాని, కోస్తామాండలికంలో ఒక చేపకు కారువాకి నామకరణం చేసి నిర్ధారించిన కథ కాని, నిగ్రోధుడి ఆగమనం అతడి బోధ కానీ రచయిత యొక్క విషయ సంగ్రహ ఘోరపరిశ్రమను మనకు ఎరుక పరుస్తాయి.
తెలుగుభాష క్రియాత్మకం అన్న విషయాన్ని గమనించకపోవటం దురదృష్టకర పరిణామాలకు దారి తీసింది. ఒక ప్రబల ఉదాహరణ వార్తాపత్రికలు: వీరు ఆంగ్లభాషాపత్రికల్ని అనుసరిస్తూ కృత్రిమమైన తెలుగుని తయారుచేసి భాషకు విపరీతమైన అపకారం చేశారు.
కొందరు ఎప్పటికోగాని కొత్త సంపుటి తీసుకురారు. అది కూడా రాసినవారు చిన్నప్పటి స్నేహితులైతే, కాలం పరుసవేది హస్తస్పర్శతో బంగారంగా మారిన గతదినాలు గుర్తుకు వచ్చి, జ్ఞాపకాల పరిమళం చటుక్కున గుబాళిస్తుంది. ఇటువంటి అనుభవమే రెండు కవితా సంపుటాల విషయంలో ఈమధ్య నాకు కలిగింది.
ఈ కవిత చివరిలో బాలుడికి ఉండే జిజ్ఞాస, చైతన్యం మనిషిలో నిరంతరం లేకపోతే ఈ ఆటని ఆడలేడని ఒకే ఒక పార్శ్వాన్ని మనకి తెలియజేసినట్లు మనకి అనిపిస్తుంది. కాని, తరచి చూస్తే, కవిత ప్రారంభంలో చెప్పిన ‘చదివి పారేసిన పుస్తకం’ అయిన ఆకాశం ఆ జిజ్ఞాస ఉన్నవాడికే తన పుస్తక రహస్యాల్ని విప్పుతుందన్నది సంజ్ఞ.