గాథాసప్తశతి శతకం



దీససి పిఆణి జంపసి సబ్భావో సుహఅ ఏత్తిఅ వ్వేఅ
ఫాలేఇఊణ హిఅఅం సాహసు కో దావఏ కస్స

దృశ్యసే ప్రియాణి జల్పసి సద్భావః సుభగ ఏతావానేవ
పాటయిత్వా హృదయం కథయ కో దర్శయతి కస్య


నను జూతువు నగవులతో
వినిపింతువు నీ పలుకుల బ్రియకరముగ న-
త్యనునయముగ నుందువె యా
మనసును విప్పగ నొరులకు మఱి యెట్లగునో
… 5-89

You meet me with pleasure
You talk with me sweetly
You move with me like a dear friend
But
who can tell what thoughts reside
in the mind of others?
(Do you love me or not?)



రోవంతి వ్వ అరణ్ణే దూసహ-రఇ-కిరణ-ఫంస-సంతత్తా
అఇ-తార-ఝిల్లి-విరుఏహిఁ పాఅవా గిమ్హ-మజ్ఝహ్ణే

రుదంతీవారణ్యే దుఃసహ-రవి-కిరణ-స్పర్శ-సంతప్తాః
అతి-తార-ఝిల్లీ-విరుతైః పాదపా గ్రీష్మ-మధ్యాహ్నే


ఎండాకాలములో సూ-
ర్యుండు వడను గాయుచుండ నురు వృక్షతతుల్
బెండుగ నడవి నిలువ, నం-
దుండెడు పురుగులు సడులను తుర్రున జేసెన్
… 5-94

The searing summer heat
transformed these big forest trees
into leafless stumps
The insects that swarmed them
are making an incessant noise



ఖేమం కంతో ఖేమం జో సో ఖుజ్జంబఓ ఘరద్దారే
తస్స కిల మత్థఆఓ కో వి అణత్థో సముప్పణ్ణో

క్షేమం కుతః క్షేమం యోऽసౌ కుబ్జామ్రకో గృహద్వారే
తస్య కిల మస్తకాత్కోऽప్యనర్థః సముత్పన్నః


నెమ్మది యెక్కడ బ్రదుకున
నమ్మానిసి యిందు లేడు యతడెట గలడో
నెమ్మది మామిడి చెట్టని
నమ్మగ నది యిప్డు కొనల ననల దొడంగెన్
… 5-99

Where is the peace of mind
when he is in a distant land –
I know not where –
That little mango tree in the courtyard
makes my days passable as I reminisce
But
even that is sprouting some little flowers
Ah – cruel spring!



వాఉద్ధ అ-సిచఅ-విహావిఓరు-దిట్ఠేణ దంత-మగ్గేణ
బహు-మాఆ తోసిజ్జఇ ణిహాణ-కలసస్స వ ముహేణ

వాతోద్ధత-సిచయవిభావితోరు-దృష్టేన దంత-మార్గేణ
వధూ-మాతా తోష్యతే నిధాన-కలశస్యేవ ముఖేన


మొలకల నుంచునపుడు ధర
గలశము గనబడ ముదమ్ము గలుగు విధానన్
గలిగెను కూతురి చీరయు
తొలగగ గాలికి తను గన దొడపై గాటుల్
… 6-07

The breeze blew away the sari
and in a fleeting moment
revealed the thighs of the daughter
and the mother glanced
at the bite wounds on her thighs
(during love play)
She felt so happy
as if a pot of gold was unearthed
during planting