గొప్ప పాట! గొప్ప భావన! సీతమ్మ శోకం లోకానికంతటికీ తెలిసేది, జలధితరంగాల లాగా. రామయ్య బాధ లోకానికి తెలిసేది కాదు. ఆ శోకం ఆయన మదిలో భద్రం. ఇది అర్థానికి ఒక పొర. ఈ తెర తొలగిస్తే మరో గాఢార్థం. కనుకట్టులో కనువిప్పును దాచిన మహాకవి వేటూరి! కనుకట్టు: సీతారాముల వియోగం; కనువిప్పు: సముద్రము తరంగము, రెంటికీ వియోగమా?

తొలి నవల పాఠకుల ఆదరణ దృష్ట్యా విజయవంతమైనా, ఆ తర్వాత విమర్శకులు కత్తిగట్టడంతో 19వ శతాబ్ది రచయిత్రుల జాబితానుంచి పక్కకి తొలగిన రచయిత్రి ఎలిజబెత్ గాస్కెల్. విమర్శకులు కత్తిగట్టడానికి కారణమేమిటి? ‘మగవాడిలా కార్మికులు, పేదల గురించి రాయడానికి ప్రయత్నించడం, పారిశ్రామిక విప్లవం ఫలితాలను చర్చించడం!’

మతాబా గొట్టాలెన్నయ్యాయి? లెక్కపెట్టేరా? అవి చాలవు. ఇంకా అంటించాలి. సన్నపాటి పెన్సిలుతో కొన్ని చెయ్యాలి. పంచడానికి వాటిని ఇద్దాం. చచ్చటి కణికికి, చాకలి నారాయణకి, ముత్తెమ్మ వాళ్ళ గూడెం పిల్లలకీ ఇవ్వాలిగా! ఇంకా నయం, రూళ్ళకర్రకి చుట్టి గొట్టాలు చెయ్యలేదు! ఎంత మతాబు మందూ వీటికే చాలదు. ఇంక చిచ్చుబుడ్లలో ఏం కూరతాం?

“రైల్ టికట్ సర్కార్‌నే ఫ్రీ మే దేదియా, గోవాలో తిరిగేసి టైమ్‌పాస్ చేసేసి పోదాంలే, కోర్స్ అయిపోతుంది కదా అనుకోకండి.” కరుకుగా మోగింది కనకప్పన్ గొంతు. “ఇంకోసారి మీ స్క్వాడ్ గురించి ట్రైనింగ్ జేసీవో నాకు కంప్లైంట్ చేశాడో…” అందర్నీ కలయజూశాడు ఒకసారి. పిడికిట్లో ఏదో నులుముతున్నట్లు సైగ చేస్తూ “నిచోడ్ దూంగా! ఇంకెందుకూ పనికి రాకుండా చేసేస్తాను జాగ్రత్త!” బయటికి నడిచాడు. పీకల్దాకా మండింది అందరికీ – జిబోన్‌గాడి మీద.

ఏదీ ముందుగా వ్రాసి పెట్టుకున్నది కాదు. ఏ నెల కానెల అప్పటికప్పుడు వ్రాస్తూ వచ్చిందే. ఈమాట నవంబర్ 2021 సంచికలో ఈ ధారావాహిక మొదలయ్యింది. నవంబరు 2022కి అంతా అయిపోదా అనే ధీమా ఉండింది. ఇప్పుడు మార్చి 2023. వ్రాస్తూ పోతే ఇంకా 16 నెలలు వచ్చేట్టు ఉంది.

తెలుగు సాహిత్యం చంద్రోదయవర్ణనల ఆటపట్టు కదా. పై రెండు పద్యాలలో మొదటి పద్యంలోని వస్తువదే. రెండవపద్యంలో వెన్నెల వర్ణించబడి ఉంది. ఎక్కువమంది కవులు వర్ణించిన వస్తువుపై మళ్ళీ ఒక కవితనల్లాలంటే ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకురాక తప్పదు. ఉదయాస్తమయ వర్ణనలయితే, ఇక కొత్తగా ఊహించడానికి ఏమీ లేదు అనేంతలా వర్ణనలు ఉన్నాయి. ఎన్ని ఉన్నా, ప్రతి చిన్ని కవినీ తమవైపుకు లాగుకొనే ప్రకృతిసమ్మోహనశక్తులవి.

మళ్ళీ తెలవారంగానే
తెలిసిందే అయినా సరే
ఏదో ఒక దారి ఎంచుకుంటూ
సమాధానపడుతూ
ఖాళీలను పూరించాలనుకుంటూ
ఒక ఘడియ నుంచి ఇంకో ఘడియలోకి

కొద్ది వారాల తర్వాత ఫ్రాన్సిస్ ఆంటీ మళ్ళీ ఫోన్ చేసింది. ఇంకో ఉత్తరం రాయాలట నేను. ఆ ఉత్తరం ఫ్రాన్సిస్ అత్తయ్యకు పంపాను. కొద్ది రోజుల తర్వాత ఆమె నుంచి ఫోన్ వచ్చింది. హెరాల్డ్ ఫోన్ తీసి, మౌత్‍పీస్‍కు చెయ్యి అడ్డం పెట్టి “ఫ్రాన్సిస్ ఆంటీ, నీ ఉత్తరం గురించి లేటెస్ట్ రివ్యూ కాబోలు” అన్నాడు. ఫోన్ తీసుకున్నాను. “జోనథన్? నీ దగ్గర చాలా టాలెంట్ ఉందిరా. ఎంత బాగా రాశావో ఉత్తరం. చదువుతుంటే నాన్నమ్మ మొహం వెలిగిపోయిందనుకో. “

ఇన్నేళ్ళుగా దాచిన సమావేశాల రహస్యం గురించి నాకెలా తెలిసింది? దానికి సమాధానం- యుద్ధం. ఈ యుద్ధం, యుద్ధానికి కారణమైన రహస్యాన్ని తప్ప తక్కిన రహస్యాలన్నిటికీ తెర దించింది. ఆత్మవిమర్శలో నిమగ్నమైన ఈ ప్రపంచం, ఆ ఒక్క రహస్యాన్నీ పక్కన పెట్టేసింది. ఎక్స్-క్లబ్ సభ్యులు పదిహేనుమందిలో తొమ్మండుగురు యుద్ధరంగంలోని ఆసుపత్రులలో పర్యవేక్షకులుగా నియమితులయ్యారు. తక్కిన వారికి ఉన్నచోటే పని మరింత పెరిగింది.

ఆయన ఒక పెద్ద తాడు చివర్న కొక్కెం కట్టి చందమామ మీదకి విసురుతున్నాడు. తెల్లనిగోళం తన చేతుల్లోకి వచ్చి పడేవరకూ ప్రయత్నించాడు. చాలా అలసిపోయాడు. అంత పెద్ద గోళం అమాంతం వచ్చి పడేసరికి బరువు మోయలేక నానా యాతన పడ్డాడు. అక్కడికి దగ్గరలోని భవనాల నీడలో నక్కినక్కి చూస్తున్న వ్యక్తిని పిలిచాను, ఆ పెద్దాయనకి సాయం చేయమని. అప్పటికే చందమామ నుంచి జారిన నీటి చుక్కలు అతని పాదాలమీద పడ్డాయి.

ముసలివాడికి సమయం ముగిసింది. లాంతరు వెలుగు పూర్తిగా పెంచి పెద్దగా పొలికేక పెడుతూ గదిలోకి దూకాను. ముసలివాడు అరిచాడు – ఒకే ఒకసారి. క్షణం ఆలస్యం కాకుండా ముసలివాడిని మంచం మీద నుండి కిందకు తోసి బరువైన పరుపు వాడి మీదకు లాగాను. కొట్టుకుంటున్న వాడి గుండె చప్పుడు ఇంకా వినిపిస్తూనే ఉంది. అయితే అది ఇప్పుడు గోడ దాటి వినిపించదుగా. చివరకి గుండె కొట్టుకోవడం నిలిచిపోయింది. ముసలివాడు చచ్చిపోయాడు.

శూన్యం చిటికెనవేలు పట్టుకొని
ధీమాగా నడిచానని
మరొకరి ముందు మోకరిల్లిన నీడను
తనదిగా పొరబడ్డానని
మనసును మళ్ళీ మళ్ళీ
ముక్కలుగా చేసుకున్నదేమో!

కర్ణాటక సంగీతానికి ప్రాచుర్యం తీసుకువచ్చిన దేవదాసీల గురించి పరిశోధనలు జరిగాయి. జీవిత చరిత్రలూ వచ్చాయి. కానీ అవి ఒకరిద్దరిని తప్ప ప్రతిభావంతులైన ఎంతో మందిని పట్టించుకోలేదు. వీళ్ళంతా తుదీ మొదలూ లేని అయోమయంలోకి జారిపోయారు. నవలారూపంలో అయినా వారికి మాట్లాడే కనీసపు హక్కుని ఇవ్వడానికి నేను ప్రయత్నించాను.

అరబ్బీ, పారసీక కవిత్వములో ముఖ్యమైన ప్రక్రియలు నాలుగు: అవి గజల్, ఖసీదా, మస్నవీ, రుబాయి. చాలమందికి గజల్, రుబాయీలు పరిచయమే. వీటిలో ఒక పాదమును మిస్రా అంటారు; రెండు పాదములను శేర్ అంటారు. రెండు శేర్‌లు ఒక రుబాయీ. అనగా రుబాయీ ఒక చతుష్పది. అరబ్ భాషలో అర్బా అంటే నాలుగు అని అర్థము.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ: