ఆ గదిలో దీవాన్ వంటి దాని మీద తెల్లని పరుపు, పరుపుపై తెల్ల దిండు. పక్కన ఒక వార్నీష్డ్ చెక్కబల్ల, దానిమీద ఒక ఎర్రని పానాసోనిక్ టేప్ రికార్డర్ కమ్ రేడియో. ఆ ఇంట్లో మనుషులు ఎవరూ కనబడేవారు కాదు. ఆ ఇంటిముందు నిలబడి నేను ఆ టేప్ రికార్డర్ కేసి ఇష్టంగా చూసేవాణ్ణి.

ఇక్కడ ఋతువులు మారుతుంటే, చరాచర జీవరాశి మొత్తం దాంట్లో భాగమవుతుంది. సడన్‌గా చీర మార్చుకునే తెలుగు సినిమా హీరోయిన్‌లా ప్రకృతి రంగులు మార్చుకుంటుంది. పక్షుల కిలకిలారావాలు మారతాయి. సూర్యుడి వేళలు మారతాయి. ఇంతెందుకు సంవత్సరానికి రెండు సార్లు గడియారంలో సమయం కూడా మార్చుకోవాలి. కొత్త బట్టలు రోడ్డెక్కుతాయి. సెలవులకి పిల్లల కేరింతలు మార్మోగుతాయి. ఇండియాలో అయితే ఉష్ణోగ్రత, కరెంట్ బిల్లు మార్పు డామినేట్ చేస్తాయి.

రెండవ సర్గలో తొమ్మిదవ శ్లోకం నుండి పదిహేనవ శ్లోకం వరకూ తెలుగు ప్రతిపదార్థాల దగ్గిర నా చదువు కుంటుపడింది. రెండు క్రౌంచపక్షులు, రతిక్రీడలో పారవశ్యంతో ఆనందిస్తూ వుండగా ఒక బోయవాడు (నిషాదుడు) మొగ క్రౌంచపక్షిని నిర్దాక్షిణ్యంగా చంపుతాడు. అది చూసి వాల్మీకి శోకించి ‘మానిషాద’ అని మొదలు పెట్టి బోయవాడిని శపిస్తాడు. ఈ శ్లోకం సంస్కృతసాహిత్యంలో మొట్టమొదటి శ్లోకంగా పరిగణిస్తారు.

నాకు తెలిసిన పండుగలలోకెల్లా పిల్లల కోసమనుకునే గొప్ప పండగ ఏదో తెలుసా? వినాయక చవితి. వినాయకుడు దేవుడు, కారణ జన్ముడు, ఏకదంతముపాస్మహే, కరిభిద్గిరిభిత్కరికరిభిద్గిరిగిరిభిత్కరి అనే గందరగోళమూ, భయమూ, భక్తి, లెంపలు వేసుకోడఁవూ, గుంజీళ్ళు తీసుకోడఁవూ… వంటివి కాదు.

ఆ అమ్మాయి ద్వారాల పక్కన ఉన్న ఆ డిజైన్లను తన బొమ్మల పుస్తకంలో నకలు దింపుకోవాలని ప్రయత్నిస్తుంది. చూసి వాటిని గీయడం సరిగా కుదరకపోతే రబ్బరు పెట్టి తుడిచి మళ్ళీ పదే పదే గీయ ప్రయత్నించడం, ఇబ్బంది పడ్డం చూస్తున్నాను. పెన్సిల్ ముక్క ఒక కోణం నుండి మరో కోణానికి తిరుగుతూ ఆగుతూ సుతారంగా మెలికలు పోతూ సాగుతుంది గీత.

నాకన్నా అయిదున్నర సంవత్సరాలు పెద్ద అయిన నా పెద్దన్నకు అప్పటికే, అంటే 1962 ప్రాంతాలకు, తెలుగులో పద్యవిద్య పట్టుబడింది. ఆంధ్రదేశంలో నారాయణాచార్యుల వంటి మహాత్ములకు బాగా దగ్గరగా ఉన్నవారిని కాస్త మినహాయిస్తే, ఈమాత్రం ఆమాత్రం తెలుగు పద్యవిద్యలో ప్రవేశం ఉన్నవాళ్ళకి సన్నిధిలోనో, ఏకలవ్యంగానో విశ్వనాథే గురువు. ఇంత అయినా కాలేజీకి రాగానే శ్రీశ్రీ చక్రారాధన అలవడింది.

ఏ కళైతే మనిషిని తేలికపరుస్తుందనుకుంటామో అదే మళ్ళీ నెత్తిన బరువు కూడా మోపుతోంది. ఏ నీటివల్లయితే బురద అవుతున్నదో అదే నీటివల్ల అది శుభ్రమూ అవుతుందన్నాడు వేమన్న. దీనికి విరుద్ధంగా ఏ కళ అయితే శుభ్రం చేస్తుందనుకుంటున్నామో అదే కళ ఆ కళాకారుడిని మురికిలోకి కూడా జారుస్తోంది. మరి దీనికి ఉన్న మార్గం ఏమిటి?

జీతం అనేది ఒకటి జీవితంలో మొదటిసారి అందుకోవడమూ, అందరమూ ఆ మొదటి తారీఖు రాగానే అకౌంట్స్‌ సెక్షన్‌ ముందు వరుసగా నిలబడటమూ, వాళ్ళు ఒక్కొక్కరినీ రెవెన్యూ స్టాంపులు అంటించిన రిజిస్టర్‌లో సంతకం పెట్టించుకుని, టేబుల్‌ మీద పరిచిన నోట్ల కట్టల్లోంచి మనకో కొన్ని కాగితాలు చిల్లర పైసలతో సహా లెక్కించి చేతికి ఇవ్వడమూ; కొన్నాళ్ళు పోయాక చెల్లింపుల్ని కొంత నాగరికపరిచి, ముందే అందరి డబ్బుల్నీ ఎవరి కవర్లో వాళ్ళకు వేసి పిన్‌ చేసి ఉంచడమూ;

నేను యూట్యూబులో ఒకే ఒక్కసారి మా పెద్దోడు నడవడానికి ముందు కాళ్ళు హుషారుగా టపటపలాడించే వీడియో పోస్టు చేయడానికిగానూ అకౌంట్ ఓపెన్ చేశాను. దానికి పాస్‌వర్డ్ ఏదో ఉంటుంది. నాకే గుర్తులేదిప్పుడు. ట్విట్టర్ కూడా ఓపెన్ చేశాను. కానీ వాడట్లేదు. అయినా దానికి కూడా ఏదో ఉండేవుంటుంది. గూగుల్ ప్లస్ కూడా ఏదో ఉన్నట్టుందిగానీ దానిలో నేను ఉన్నట్టో లేనట్టో నాకే తెలీదు.

పూర్వం, ఎప్పుడో ఒక ఉత్తరం వచ్చేది యోగక్షేమాలను తెలియజేస్తూ. వ్యక్తులు అవసరం మేరకు మాట్లాడేవారు. అంచేత ఏ వ్యక్తి అయినా అవతలివారికి ఎంత మేరకు అవసరమో అంతే తెలిసేవారు. ఇప్పుడు దాదాపుగా ప్రతి వ్యక్తి సోషల్‌ మీడియాలో ‘ఎవైలబుల్’గా అందుబాటులో ఉంటున్నాడు. ప్రతిరోజు అనేక విషయాల మీద తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వాటి మీద చర్చోపచర్చలు చేస్తున్నాడు.

ఒకే పేద్ద కాగితం, అదే పొడవాటి వేళ్ళ చిత్రకళా విన్యాసం. నో దిద్దుబాట్లు, నో అచ్చుతప్పులు, నో కొట్టివేతలు… అలా చూస్తుండగానే నరాల బిగువూ, కరాల సత్తువ, కణకణ మండే, గలగల తొణికే అనేక కన్నులు, లోహ రాక్షసుల పదఘట్టనచే కొనప్రాణంతో కనలేవాళ్ళూ, కష్టం చాలక కడుపుమంటచే తెగించి సమ్మెలు కట్టేవాళ్ళూ, చెరసాలలలో చిక్కేవాళ్ళూ…

నీ దగ్గరకు రహస్యంగా వస్తున్న నాయకుల పేర్లు చెప్పమని హింస పెడుతున్నారు. నేను గదిలోంచి చూస్తూ ఉంటే ఉదయం అతని తల్లి, భార్య, పోలీస్‌స్టేషన్‌ గేటువద్ద నుంచుని ఏడుస్తున్నారు. ఉదయం నాకు వచ్చిన రొట్టెలు కూడా అతనికి పంపాను. నన్ను కోర్టుకు తీసుకొని పోతూవున్నప్పుడు అతనికి రహస్యంగా ధైర్యంగా వుండమని సైగ చేశాను.

ఇందాకా అనుకున్నాం కదా పిన్నీసు అని; చెప్పులు, పిన్నీసు రెండూ జంట కవులు. ఆ రోజుల్లో పిన్నీసుల హారం లేని ఆడ మెడ ఉండేది కాదు. పిన్నీసుకు జాత్యంతరం అంటదు. హిందూ, ముస్లిమ్, కిరస్తానీ అందరి మెడల గొలుసుల్లో పిన్నీసులు తళుకుమనేవి. అంగళ్ళల్లో పిన్నీసులు కొనడం డబ్బు దండగ, రోడ్ల మీద మొలతాడు దారాలు అమ్ముకునేవారి దగ్గర పిన్నీసు ప్యాకెట్లు కాస్త అగ్గువ. చొక్కాకు గుండీలు లేవా పిన్నీసు ఉందిగా!

రాజు-మహిషిలోని లంబాచోడా ప్రసాద్ తండ్రి ఆత్మహత్య చేసుకోవడానికి చెరువుకు పరిగెత్తిన రాత్రి కురిసిన గాలీ వర్షాన్ని నేను ఎన్నడూ మరచిపోలేను. ఎక్కడో లాటిన్ అమెరికాలో ఎడతెరిపి లేకుండా కొన్ని వందల రోజులు కురిసిన వర్షాన్ని నేను చూడలేదుగానీ దానిని గార్షియా గాబ్రియెల్ మార్క్వెజ్ వర్ణించాడు. అందులో నేను దర్శించిన, చూచిన, తడిచి ముద్దయిన ఆ నా చూడని వర్షాన్ని కూడా నేను మరువలేను.

సాధారణంగా పొద్దున పొద్దున్నే టీవీ పెట్టను. కానీ ఒక్కోసారి పిల్లలు స్కూలుకు వెళ్ళిపోయాక ఏర్పడే నిశ్శబ్దాన్ని శబ్దంతో భర్తీ చేయాలనిపిస్తుంది. సినిమా, ట్రావెల్, ఫుడ్ ఇవి నా ప్రయారిటీలు. శబ్దం మరీ ఎక్కువైందన్నట్టుగా పెట్టగానే ఏదో ఫైట్ వస్తోంది. మహేశ్‌బాబు సినిమా. తలల మీద ఇటుకలు పగులుతున్నాయి. గోడలకు వెళ్ళి గుద్దుకుంటున్నారు.

అంత ఎత్తైన జలపాతం ఒక్క ఉదుటున మనని కొండకొమ్ముకు లాక్కెళ్ళి పోతుంటే, చెవుల్లో జలపాత శబ్దం మనని తనతో ప్రవహింపచేస్తూ. ఆ సీతాకోక చిలుకలు చూడు! ఆ కొండకొమ్ములో తాను జారిపడితే మన గుండె ఆగి కొట్టుకుంటూ ఉంది. అదిగో, ఒక్క నవ్వు పిలిస్తే ఎలా దూకేస్తున్నాడు! ఆ చిరుచీకటిలోనే ఇటు చూసి నవ్వుతాం. నువ్వలా చేయగలవా అనే సవాలు ఇటు నుండి అటు కళ్ళతోనే.

ఒకసారి మదరాసులో బాపుగారి ఇంట్లో ఆయన కలిసీ కలవగానే కొత్త బొమ్మలు ఏఁవేశారు? ఏవి చూపించండి? అని అడిగారు. అవి చూసి మురిసి ‘ఓయ్ వెంకట్రావ్ ఇలా రావయ్యా అన్వర్ బొమ్మలు చూడు ఎంత బావున్నాయో!’ అని ఆయనకు చూపించి ఆపై ‘ఏవండి, ఈ దగ్గరే మా గురువుగారు గోపులుగారి ఇల్లు. ఆయన్ని వెళ్ళి కలవండి ఈ బొమ్మలు చూపించండి చాలా సంతోషపడతా’రని అన్నారు.

వాతావరణం ఒక్కసారి స్తంభించిపోయింది. బీడీల చేతులు ఆగిపోయినై. టీవీ నడుస్తుందన్నట్టేగానీ తెలియని నిశ్శబ్దం ప్రవేశించింది. నేను జయక్కతో కళ్ళు కలపకుండా, అసలు ప్రత్యేకంగా ఎవరి మీదా చూపు నిలపకుండా అలాగే కూర్చున్నాను. ఎన్ని సెకన్లు దొర్లిపోయినై? అంతమందిలో ఎవరో కిసుక్కుమన్నారు. ఇక, నవ్వడమా మానడమా అన్నట్టుగా ఆగి నవ్వి ఆగి నవ్వి ఒక్కసారిగా అందరూ బద్దలైపోయారు.

చిన్నోడికి రోజూ ఓ కథ కావాలి. పెద్దోడికీ ఆసక్తేగానీ అడుగుతాడు, వదిలేస్తాడు; వీడంత మంకుపట్టు పట్టడు. తెనాలి రామకృష్ణ కథలు, ఈసప్‌ కథలు, అక్బర్‌ బీర్బల్‌ కథలు, మర్యాద రామన్న కథలు, ఇట్లాంటివేవో నాకు గుర్తొచ్చినవి చెప్తుంటాను. ఒకరోజు, ఎంత గింజుకున్నా ఏ కథా గుర్తు రాక, ఏదో మేనేజ్‌ చేయొచ్చని డోరియన్‌ గ్రే మొదలుపెట్టాను.

ఈలోగా ఇంకో నంబర్ నుంచి కాల్ రావడం మొదలైంది, “…ఎక్కడ పడిపోయారండీ?” అంటూ. మామయ్య అందా, నాన్న అందా? పిల్లర్ నంబర్ థర్టీన్ అని చెప్పాను. రోడ్డుకు అటువైపా? ఇటువైపా? రైతుబజార్‌కు ఎంతదూరం? కుడిపక్కా, ఎడమపక్కా అంటూ వచ్చిన ప్రశ్నలకు జవాబు చెబుతూనే ఇంకో షాపులోకి వెళ్ళాను. నేను అడిగింది కాక ఇంకేదో పేరు చెప్పి, అది ఉందన్నాడు.