కండలు తిరిగిన కుర్రాడొకడు
ఎక్కాడు మొరటుగా రెక్కలు నలిగేట్టు
వాడి చేతిలో చిట్లిన గాజు
చనిపోయిన తన ప్రేయసి పెట్టిన
తొలిముద్దు జ్ఞాపకపు ముక్క

ఎవరన్నారు మనిషంటే ఘన పదార్ధమని?
చెట్టిక్కిన వాడూ మనిషే
ఎక్కిన కొమ్మను నరుక్కున్న వాడు మనిషే
కింద పడి విలవిలలాడి మృత్యువును ముద్దాడిన వాడూ మనిషే

పున్నాగములు కొన్ని మూర్ధంబునందు,
కాంచనంబులు కొన్ని కంఠంబునందు,
మల్లెపూవులు కొన్ని యుల్లంబునందు,
హల్లకంబులు కొన్ని హస్తంబులందు,
పంకజంబులు కొన్ని పాదంబులందు,

తడారిన గాలి, వడి వడిగా నడుస్తూ నిప్పులోకి దూకుతోంది.
తన చివరి పరిమళపు జావళిని వినిపిస్తూ ఓ మల్లె
మట్టిలో రాలిన చప్పుడవుతోంది.

కనపడని ఒక విచ్ఛేదం
కడుపులో పొంచి వున్నట్టు
బద్దలవబోయే బాంబు ఒకటి
లోపల బస చేసి టిక్ టిక్ టిక్ అంటున్నట్టు
దేహం లోని అంతరింద్రియంపై
దాడి చేసేందుకు క్రూరమృగమొకటి

శరీరంతో
మీరు లేని ప్రపంచంలో
నేనూ కొంతకాలం నివసిస్తాను త్రిపురా…!
మనిషి ఉన్నప్పటి ప్రపంచాన్ని
లేనప్పటి ప్రపంచంతో పోల్చుకుంటూ –
కొన్ని కాంతి సమయాల్ని తింటూ –
వింత ఆటలో పాల్గొంటూ…

సంధ్యా సముద్రమూ చెరోవైపు నుంచి మీదకొచ్చి పడుతుంటే తిరిగి వెళ్ళే ప్రతి అలతో పాటు ఇసుకలోకి కూరుకుపోయే పాదాల్ని పైకి లాక్కుంటూ ప్రయాసపడే వాడు దీపస్థంభానికి చిక్కుకుని రెపరెపలాడుతున్న గాలిపటంతో గుసగుసగా అన్నాడు నాకు తెలుసు ఓడిపోవడానికే మొదలెట్టాను ఈ ఆటని

ఈ పావురాలు ఎగిరేందుకు పుట్టినవికావు
ఇవి వాలేందుకే ఈ లోకంలోకి వచ్చాయి
కాస్త నీడా కాస్త శాంతీ ఉన్నచోట వాలి
నీడ లాంటి శాంతి లోకి వృత్తంలా మరలి

అతడూ అమ్మాయి విడిపోయేప్పుడు పంచుకోడానికి
విడిపోయే ఆలోచన రావడానికి ముందు కొనుక్కున్న
సింగిల్ ఫ్యామిలీ హౌస్ కిటీకీలో ఏదో కదలిక

లేదు జానకీ, అది నిజం కాదు. నాకు మనుషుల మీద జాలి, కరుణ అంతే. నాకు ఎవరి మీద, దేని మీద ద్వేషం లేదు – మనుషులతోనే కాదు పువ్వులతో, చెట్లతో, పక్షులతో కూడా మాట్లాడతాను. దారిలో చెయ్యి చాచిన ప్రతి చెట్టు కొమ్మని ఆప్యాయంగా అందుకుంటాను. మమ్మీ! డాడీ మాటలలాగే ఉంటాయి. ఆయన మాట్లాడకపోవటమే బెటరు.

బ్రహ్మగారు ఎంత చెప్పినా పశుపతికి భార్యోత్సాహ పద్యం పాడుకోవాలనే ఉబలాటం తగ్గలేదు. కష్టమైనా, నిష్ఠురమైనా సాధించాలని బలంగా కోరుకున్నాడు. లహరి మహా దొడ్డ ఇల్లాలు అని భార్య పేరు పొందాలని, తద్వారా లహరీపశుపతులు ఆదర్శ దంపతులు, ఒకరి కోసమే మరొకరు పుట్టారు అనిపించుకోవాలని తీర్మానించుకున్నాడు. ఘోర ప్రతిజ్ఞ చేసుకున్నాడు.

శివయ్య పార్టీ కొత్తది కాబట్టి అప్పటికే దశాబ్దాల చరిత్ర వున్న రాజకీయ పార్టీలన్నీ కుమ్మక్కై ఆ సవాళ్ళకి జవాబులు చెప్పకూడదని నిర్ణయించుకున్నాయి. వాళ్ళ నిర్ణయాలకి కారణం, అలాంటి సవాళ్ళు విసిరింది తామెంత అవినీతిపరులో నిర్ధారించడానికి శివయ్య వేసిన ఎత్తు కావచ్చనీ, సవాళ్ళని తాము స్వీకరించగానే శివయ్య తన పనయిందని పెద్దగా నవ్వేసి ఈల వేసి గోల చేస్తాడేమోననీను.

కథలో, అడపా తడపా కుముదం, నేను పాత్ర, సుమారు ఇరవైఏళ్ళలో ఒక మూడు నాలుగు సార్లు కలుస్తారు. మాట్లాడుకుంటారు. కలిసిన ప్రతిసారీ, కుముదం జీవితంలో మనిషిగా ఎంత ఎత్తు ఎదిగిందో, ‘నేను’ ఎంత కిందకి దిగజారిందో అంచెలు అంచెలుగా కనపడుతుంది.

కవి ఒక మనోజ్ఞ కావ్యాన్ని రచిస్తున్నాడు. ఎక్కడ? దొంతరలైన మబ్బులకు త్రోవలు చూపే కాగడా చెంత కూర్చుని కావ్యాన్ని రచిస్తున్నాడు కవి. అప్పుడతని దగ్గరకు నాగుపాముల్లాంటి భావాలు వచ్చి చేరాయి. అలా ఆ భావనాభుజంగాలు తనను చేరేసరికి కవిలో ఆవేశం పెల్లుబికింది. రుద్రవీణ వాయిస్తూ పడమటి దిక్కు చివళ్ళ నాట్యం చేస్తానంటున్నాడు.

ఇంతకీ జరిగిందేమిటంటే; అంబుధరం వేనలికి సాటి రాలేక ఇరువ్రయ్యలైనపుడు ఆ దేవతలూ, ఆ విద్వాంసులూ, తదంశముల్ పూని అంటే, ఆ పదాల అర్థాంతరాలను గ్రహించి, సమతఁ బోల్చిరి తత్సతి దృక్కుచంబులన్. వాటిని ఆమె చూపులతోనూ, ఆమె వక్షోజములతోనూ సాటి చేసి, ఎంతో కొంత ఊరటను కల్పించారు.

త్రిపుర ఏనాడూ పట్టుదలగా ఏదైనా ఒక విషయాన్ని గురించి ఇలాక్కాదు అలాగ! ఆని నొక్కి చెప్పడం చూళ్ళేదు నేను. అవేళ మాత్రం మాకిద్దరికీ ఒక టకాఫోర్ వచ్చింది. మాటల్లోన బాలగోపాల్ గారి ప్రసక్తి వచ్చింది. నేను ఆయన “సాహిత్యం జీవితంలో ఖాళీల్ని పూరించాలి” అని అన్నారని అభ్యంతరం చెపుతున్నాను.

ఇంటర్నెట్ ద్వారా రాత, రాతతో ముడిపడ్డ సమాచార వ్యవస్థ ఎంతగా మార్పు చెందాయో, ఆ మార్పులు మన సమాజంలో ఎలాంటి ప్రభావం కలిగిస్తున్నాయో ఇప్పుడు అందరికీ అనుభవంలోకి వస్తున్నది. ఇది కనీవినీ ఎరుగని ఒక పెనుమార్పుగా మనం అనుకుంటున్నాం. అయితే, అంతకంటే మౌలికమైన మార్పు రాత వల్ల మానవ సమాజాల్లో వచ్చింది.

అందుచేత ఆధునిక కవి, లౌకిక వ్యక్తిలో ఒక పొర. ఒక అంతరార్థ భాగం. ఒక్కొక్కప్పుడు, స్ప్లిట్ పర్సనాలిటీ అని మానసిక శాస్త్రజ్ఞులు చెప్పేటట్టు చూస్తే లౌకిక వ్యక్తిలో ఒక ఖండం, ఒక ముక్క. ఇంతకీ కవి అంటే ఎవరూ మనకు కవిత్వం ద్వారా తెలిసే కథ మాత్రమే. అందుచేత కవులందరూ కథలే.

త్రిపదల వెనుక ఇంత గొప్ప చరిత్ర దాగి ఉన్నదన్న సంగతి చాల మందికి తెలియక పోయినను, అందఱికి హైకూలను గుఱించి తెలిసి ఉంటుంది. హైకూ ఒక త్రిపద – మొదటి మూడవ పంక్తులలో ఐదు అక్షరములు, రెండవ పంక్తిలో ఏడు అక్షరాలు ఉంటాయి యిందులో. పదములకన్న ఆ పదములు సృష్టించిన చిత్రములు హైకూ ప్రత్యేకాకర్షణ.

ది త్రిపుర 1999 ప్రారంభంలో విజయవాడలో తమ బంధువులింటికి వచ్చినప్పుడు పన్నాల సుబ్రహ్మణ్యభట్టు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి ఆహ్వానించి చేసిన ఇంటర్వ్యూ. మో (వేగుంట మోహనప్రసాద్), వి. చంద్రశేఖరరావు కూడా త్రిపురగారిని ‘కదిలించారని’ జ్ఞాపకం.

సుమారు 1972-73 ప్రాంతంలో, ఈ నాటకాన్ని సత్యం రాశారు. రేడియోలో బాగా ప్రాచుర్యం పొందిన తరువాత స్టేజి నాటకంగా కూడా మలచబడి చాలా పర్యాయాలు ప్రదర్శింపబడింది. ఆయనకి బాగా పరిచయస్తులైనవారు చెప్పేదేమంటే ఆయన అమరావతి కథల కంటే ఈ నాటకాన్నే తన ముఖ్య రచనగా ఇష్టపడేవారని.