మారిపోతున్న సాహిత్య సామాజిక పరిస్థితులు, సాంకేతిక అవసరాల వల్ల, ఈమాటలో కూడా కొన్ని మార్పులు తప్పనిసరి అవుతున్నాయి. ఈమాట రచయితలకు, పాఠకులకు వీలైనంత వరకూ ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఈ మార్పులని ప్రవేశపెట్టటానికి ప్రయత్నిస్తున్నాం. ఈమాట నిర్వహణలో మేము తరచూ తీసుకొనే నిర్ణయాలు కూడా ఇందులో భాగమే. ఇకనుంచీ ఈమాట పద్ధతులు, నియమాలలో కొన్ని మార్పులను మీ దృష్టికి తెస్తున్నాం.

అతను టార్చి వేశాడు. ఆ సన్నని కాంతిపుంజం ఆ దట్టమైన చీకట్లో ఒక వెలుగు సొరంగం తవ్వుతున్నట్టుగా వ్యాపించింది. గడ్డి మధ్యలో చిన్న కాలిబాట. చుట్టూ కీచురాళ్ళ అరుపులు వినిపిస్తున్నాయి. చీకటి, నిశ్శబ్దం ఇంత దట్టంగా కూడా ఉంటాయని తెలుస్తోంది. ఆ చీకట్లో ఒక మనిషి దీపం పట్టుకుని ముందు నడుస్తుంటే అతణ్ణి అనుసరించడం కొత్తగా ఉంది. మరో ప్రపంచంలోకి వెళ్తున్నట్టుగా అనిపించింది.

క్లిక్ మని శబ్దంతో డిస్కనెక్ట్ చేసిన టోన్ వచ్చింది. గౌతమ్‌కి పిచ్చి పట్టినట్టుగా అయింది. ఒక్కసారి గడియారాలన్నీ కదలటం మొదలెట్టాయి. కేవలం శబ్దమే. సమయం కదలటం లేదు. వెన్నులో చలి పుట్టటం అంటే ఏమిటో మొదటి సారి అనుభవం లోకి వచ్చింది. అన్ని గడియారాల కదలిక గుండెల్లో దడ పుట్టించేదిగా అనిపించింది.

ఇద్దరమూ కలిసి ఈ బంధాన్ని ‘మన అంతరంగాల సాక్షిగా అంగీకరించుకుని’ వున్నామేమో? అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు నువ్వు, ఇంకో అప్పుడు నేను, సర్దుకున్నాం. పెళ్ళైన కొత్తల్లో నువ్వెంత అంటే నువ్వెంత వరకూ వెళ్ళినా, ఏదో జంకు, ఇంకొంచెం బెరకు, మనల్ని ఈ గీటు దాటనీకుండా ఆపింది. అరి కట్టింది.

నేను విత్తనాలు నాటి ఇప్పటికి పదేళ్ళయింది. ఉదయం తొమ్మిది గంటలకి నేను, తెల్ల పొడుగు చేతుల చొక్కా వేసుకొని, చొక్కా మీద తెల్ల గ్లాస్కో పంచె ధరించి, నల్ల బెల్టుతో పంచె బిగించి, వంకాయ రంగు కోటు ధరించి, తెల్ల తలపాగా కట్టుకొని, నా ఆఫీసులో అడుగు పెట్టాను. నాకు భారతీయ సంస్కృతి అన్ననూ అందులో తెలుగు సంస్కృతి యన్ననూ మిక్కిలి మక్కువ.

పని ఉన్నప్పుడు ఎక్కడా ఆపకుండా పనిచేయడం, పనిలేనప్పుడు మౌనంగా ఆకాశం కేసి చూడడం, ఇవే మైకేల్ నిత్య కృత్యాలు. మొదటిసారి ఇంటికి తీసుకొచ్చినప్పుడు, మాట్రియోనా సైమన్‌తో అసహ్యంగా దెబ్బలాడి, తర్వాత మనసు మార్చుకుని మైకేల్ కి భోజనం పెట్టినప్పుడు మైకేల్ చిన్నగా నవ్వడం తప్ప, ఆ తర్వాతెప్పుడూ మైకేల్‌ని నవ్వు మొహంతో చూసినట్టూ సైమన్‌కి గుర్తు లేదు.

ఆమె ముఖపద్మం వాడిపోయింది. తెల్లని నిడుదైన కన్నులు చిన్నబోయి ఉన్నాయి. చెలులతో చేరి ఆమె సరసులోకి దిగి ఆడటం లేదు. ఒక చేయి నుదుటన పెట్టుకుని అలా ఒడ్డునే కూర్చొని ఉంది. నెచ్చెలులు తనని ఆడడానికి రమ్మని పిలుస్తున్నారు. వాళ్ళకి రెండో చేత్తో, ఒంటి చేత్తోనే, నమస్కారం పెట్టి, దయచేసి మీ దోవన మీరు ఆడుకోండని చెపుతోంది. నలుదిక్కులా పరికిస్తోంది. ఏమిటి చూస్తోంది? ఏమీ లేదు! అది ‘చూడక చూచు చూడ్కి.’ వట్టి చూపులన్న మాట.

ప్రకృతి యనియెడు చిన్నారిపడుచు కూర్మి
నాడుకొనఁ గట్టుకొన్నట్టి వీడువోలె
నెగురుచోఁ గననయ్యెను దిగువభూమి
రమ్యతరముగఁ దత్కీరరాజమునకు.

ఏ సుదతి చిరునవ్వువే వెన్నెలా!
ఏ మగువ సిగపువ్వువే
తెల్లని నీ వెలుగు వెల్లువల పరుపుపై
పవళించె నరమోడ్పు ముదిత బృందావని!

తనతో బాటే పెరిగి పెద్దవైన అనుభవం, నైపుణ్యం
వదల్లేక అగరొత్తి పొగల్లో సుళ్ళు తిరుగుతుంటే
పెంచి పోషించిన ఆస్తులు మాత్రం
వారసుల ఇరుకు మదుల్లో వాటాలై విడిపోతుంటాయ్

హిమనగాలు కరుగుతాయి, రగుల్తాయి, ఆవిరులై
మరుగుతాయి అతడి కోర్కెల వైను
గ్లాసుల్లో మంచు మైదానాలశాంత
జలధరాలు, పయనమెచటికని మాత్రం అడగకు

ఉక్కా గొల్లూ చీకటమ్మా వేసాకాలం ఎండ
బిడ్డల్నాటి అడ్డాలు కాదు ఎవడి దేనిమీదనా మరిలేదు
ఎవడూకానివాడి దీవి దానిమీదేనే ఏమీకాన్దాని దీని మీద
దూరానున్నారు చుక్కలమ్మా పిల్లలంటే ఆకాశ పంట

సూర్యకాంతిలో గాని, ఇంద్రధనస్సులో గాని ఆధునిక విజ్ఞాన శాస్త్రం కనిపెట్టిన ఏడు రంగుల గురించి ఈ శ్లోకం వివరిస్తుందంటే నమ్మశక్యం కాదు. నిజానికి, ఋగ్వేద కాలం నాటికే ఇంద్రధనస్సులోని ఏడు రంగులకు ఏడు వేర్వేరు పేర్లుండేవని చెప్పగలిగే శ్లోకం ఏదీ మనకు ఋగ్వేదంలో కనిపించదు.

ఏల్చూరి మురళీధరరావుగారు నవంబర్ 2013 ఈమాటలో ప్రచురించిన ‘కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన అన్న వ్యాసం ద్వారా కుమారసంభవం కావ్యం రాసిన కవి నిజంగా ఎవరు? అతని కాలం ఏది? అనే వాదనను మళ్ళీ తెరపైకి తెచ్చారు. ఇలాంటి కాల, కర్తృనిర్ణయాలపైన నా ఆక్షేపణలను ఈ వ్యాసంలో వివరిస్తాను.

డా. ఏల్చూరి మురళీధరరావు నవంబరు 2013 ఈమాటలో వ్రాసిన ‘కుమారసంభవంలో … ‘ అన్న వ్యాసానికి ప్రతిగా నా ఈ వ్యాసంలో నన్నెచోడుడు ప్రబంధయుగము తఱువాతవాడు కాదని, కవిజనాశ్రయ ఛందోగ్రంథమునకు ముందే కుమారసంభవమును వ్రాసినాడని వివరిస్తున్నాను.

ఆభారతకుమారులు రాజ్యములను స్థాపించుటయే కాక హిందూ విజ్ఞానమును, మతమును ప్రజలలో ప్రతిష్ఠించి, మహానిర్మాణములను భారతీయశైలిని నిర్మించి, తమ మాతృభూమియొక్క ఖ్యాతిని వ్యాపింపజేసి, నిజమగు భారతపుత్రులుగ నుండిరి.

కర్ణాటక సంగీతజ్ఞులకి వెస్ట్రన్ మ్యూజిక్ పరిచయం 1800 కాలంలోనే ప్రారంభమయ్యింది. ఇంగ్లీషు బ్యాండు చాలామంది సంగీత కారులకి పరిచయం ఉంది. ప్రముఖ వాగ్గేయకారులు త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్ ఇంగ్లీషు బ్యాండ్ ప్రభావంతో కొన్ని పాటలు కట్టారు.

ఆలిండియా రేడియో హైదరాబాద్ కేంద్రం వివిధభారతి కార్యక్రమం ద్వారా సంగీత దర్శకుడు శ్రీ సాలూరి రాజేశ్వరరావు సమర్పించిన ప్రత్యేక జనరంజని కార్యక్రమం ఈమాట పాఠకులకోసం అందిస్తున్నాను.