రాబోయే సర్వధారి ఉగాదికి, తెలుగు లలిత కళా సమితి (Telugu Fine Arts Society, NJ, USA ) తెలుగుజ్యోతి పత్రికావర్గం ఒక విశేష సంచికని మీ ముందరికి తీసుకు రాబోతోంది. ఈ విశేష సంచికలో ప్రచురించడానికి దేశవిదేశాల్లో వున్న తెలుగు భావుకులందరికీ ఈ ఆహ్వానం.
ఈమాట జనవరి 2008 సంచిక విడుదల
ఈమాట జనవరి 2008 సంచికలో —
ఉత్తర అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులలో మూడు రకాల తెలుగువారిని వారి మాటల ద్వారా గాక, చేతల ద్వారా ఎలా గుర్తించవచ్చో వివరిస్తూ వేలూరి వేంకటేశ్వరరావు సంపాదకీయం: “నా మాట”
ఇంకా విశేషాలు —
- సితార్ విద్వాంసులలో పండిట్ రవిశంకర్ అర్జునుడైతే, ప్రతిభలో కర్ణుడి వంటి ఉస్తాద్ విలాయత్‌ఖాన్ గురించి కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారి మల్టీమీడియా వ్యాసం: “సర్వోత్తమ సితార్ విద్వాంసుడు ఉస్తాద్ విలాయత్‌ఖాన్“
- దేవతలకూ, రాక్షసులకే గాక, ప్రాణం లేని ఘనస్వరూపాలకు కూడా అనేక ముఖాలుంటాయంటూ జెజ్జాల కృష్ణమోహన రావు గారి సచిత్ర వ్యాసం: “ప్లేటో ఘనస్వరూపాలు“.
ప్రకృతి రంగులన్నిటినీ
దోచేసుకుని రాత్రి
ఎటో పారిపోతోంది
నువ్వు చేయమన్నదల్లా
చేస్తూనే వున్నా
నువ్వు చూపిందల్లా
చూస్తూనే వున్నా
తీర్థం తాగి చెయ్యి నెత్తిమీద ఎందుకు రాసుకుంటారో అర్థం కాదు నారాయణకి. యింకా చాలా విషయాలు అతనికి అంతు పట్టవు. సంస్కృతంలో సుప్రభాతం, ఆనక వేద మంత్రాలూ చదివి, అరవంలో తిరుప్పావయ్యో మరేదో చదువుతారు కదా, మరి తెలుగులో ఏవీ చదవరెందుకు? యింతకీ వెంకటేశ్వర స్వామిది యే భాష?
తన జైత్రయాత్రల సందర్భంగా కృష్ణా తీరంలోని శ్రీకాకుళం అనే వూరిలో ఒక రాత్రి ఉండగా, ఆ వూరి గుడి లోని శ్రీ ఆంధ్రమహావిష్ణువు కలలో కనిపించి ఆముక్తమాల్యద వ్రాయమని ఆదేశించినట్లు ఆయనే ఆ కావ్యంలో చెప్పుకున్నాడు. చెప్పినది తెలుగుదేశం లోని గుళ్ళో దేవుడు. వ్రాసినది కర్నాటక చక్రవర్తి. కథ జరిగినది తమిళ దేశంలో – ఎంత మంచి సన్నివేశమో గమనించండి.
“ఈ తీరని ప్రశ్న గురించి ఎంతమందికి తెలుసు? కంప్యూటర్ సైన్సు లోకెల్లా ఇంతకన్నా తెలుసుకోదగ్గ విషయం మరేముంది? దీని గురించి నలుగురికీ తెలిసే విధంగా ఓ వ్యాసం రాస్తే బాగుంటుంది గదా,” అని అనిపించింది.
ప్రపంచమంతటా సామాన్యంగా సితార్ అనగానే రవిశంకర్ పేరును తలుచుకుంటారు. ఒక భారతీయ శాస్త్రీయసంగీతజ్ఞుడు ఎంతటి ఖ్యాతిని పొందవచ్చునో నిరూపించిన మేధావి రవిశంకర్ అనడంలో సందేహమేమీ లేదు. అయితే ప్రతి అర్జునుడికీ సరితూగే ఒక కర్ణుడు ఉంటాడనుకుంటే అందుకు సరిగ్గా సరిపోయే వ్యక్తి ఉస్తాద్ విలాయత్‌ఖాన్. సితార్ చేత “పాడించి”, సితార్ వాయిద్యపు పరిధిని అపారంగా విస్తరింపజేసి, సితార్ శైలికే కొత్త భాష్యం చెప్పిన విలాయత్‌ఖాన్‌కు మరెవరూ సాటిరారని భావించేవారూ ఉన్నారు.
మా బెడ్ పక్కనే ఏడాది క్రితం వచ్చిన బెస్ట్ కపుల్ అవార్డు ట్రోఫీ ఒక్కటే ప్రపంచానికి కనబడే నిజం!
అతడిని అంతకు ముందు ఎక్కడ చూసానో గుర్తొస్తోంది! సాయంత్రం సన్మాన సభలో నేను చేయ బోయే ప్రసంగానికి పీయ్యే సహాయం అంతగా అవసరం లేదు. పాతికేళ్ళ క్రితం నేను చదువుకునే రోజుల్లో, నా స్కాలర్‌షిప్ పని మీద కలుసుకున్న వీయస్సార్, ఈ వీధుల సుబ్బరామయ్యా ఒక్కరే!
“ఏరా నీ తెలుగు ఇలా ఉండేమిటీ?” అని అడిగితే, “నీకు తెలియదా బాబాయ్? నేను తెలుగు చదవటం మానేసి చాలా రోజులైంది! అందులో మనది హైదరాబాద్ తెలుగు!” అని నవ్వుతూ సమాధానం చెప్పాడు.
ఈ నేపథ్యంలో కొల్లూరి సోమశంకర్ వంటి సమర్ధుడైన యువరచయిత ఇతర భాషల కథల్ని తెలుగులోకి తర్జుమా చెయ్యటం మీద తన దృష్టి కేంద్రీకరించడం అభినందించాల్సినదే. ఐతే ఉత్తినే దృష్టి కేంద్రీకరిస్తే ఏమైంది? ఇప్పటివరకూ 40కి పైన కథల్ని చక్కటి తెలుగులోకి అనువదించి వివిధ పత్రికల్లో ప్రకటించటమూ, వాటిల్లోంచి 19 కథల్ని ఏరి “మనీప్లాంట్” అని చిన్న సంపుటం వెలువరించటం – అదీ నిజంగా అభినందించాల్సిన విషయం.
ఔరంగజేబు తనగురువుకి రాసిన ఉత్తరం కొమర్రాజు వేంకటలక్ష్మణరావు గారు 1910 లో పారశీకంనుంచి తెనిగించారు. ఆ అనువాదం దిగువన తెలుగులోవిద్యాబోధనపై ఆకాలంలో ఆయన అభిప్రాయాలు చదవచ్చు. 1910 తరువాత తెలుగు మాధ్యమంగా విద్యాబోధనలో వచ్చిన మార్పులు ఈమాట పాఠకులు గుర్తించగలరు.
ఇట్టి ఘనస్వరూపాలలో మిక్కిలి ప్రసిద్ధి కెక్కినవి ప్లేటో ఘనస్వరూపాలు (Platonic solids). ఇవి ఐదు – చతుర్ముఖి (tetrahedron), ఘన చతురస్రము (cube), అష్టముఖి (octahedron), ద్వాదశముఖి (dodecahedron), వింశతిముఖి (icosahedron).
ప్రస్తుతం తెలుగు నాటకం పరిషత్తులకే పరిమిత మయిపోయింది. సృజనాత్మకత కరువయ్యింది. నాటక ప్రదర్శనకి పట్టు మని పదిమంది కూడా రారు. ఏం చూస్తాం, ఇంట్లో టీవీ ఉంది, సినిమాలున్నాయి, మాకింకేం సృజనా అవసరంలేదనే స్థాయిలో నాటకం ప్రేక్షకులకోసం వెంపర్లాడుతోంది.
ఎవరైనా కొత్తవాళ్ళు ఒక్కసారి తూర్పునుంచి పడమరదాకా, ఉత్తరం నుంచి దక్షిణందాకా ఈ దేశంలో చూస్తే ఒక్క సంగతి స్పష్టంగా బోధపడుతుంది. ఇక్కడి తెలుగు సంస్థల్లో మూడు రకాల తెలుగు వాళ్ళు ఉన్నారు.
మనసొక్కక్షణం
మాష్టారు ప్రవేశించిన
తరగతి గది
ఈ ఏడాది నుండి అనువాదం, పరిశోధనా, నిఘంటు నిర్మాణాల్లో కృషి చేసిన పండితులకు ఉడతాభక్తిగా ఒక పురస్కారం ప్రకటించాలన్న సంకల్పం. ఇందులో భాగంగా, కేశవరావు గారి అనువాద గ్రంథం Tree,My Guru కు CP బ్రౌన్ పండిత పురస్కారం.
రెల్లు గడ్డి కింది తాబేటి భాష
తనకు తెలుసునని డబాయిస్తాడు
కుక్కతోకతో గోదారి ఈదాలని
నడుము లోతుకు వెళ్ళి, కోరలు చూసాక తెలిసింది
అది గుంటనక్కకు గురువని.
ఏవీ ఆరుబైట మంచు బొమ్మలు?
ఏవీ ఆ చిత్రవిచిత్ర ఆకుల ఇంద్రధనస్సులు?
ఏవీ ఆ రెడ్‌కార్డినల్స్ స్వరఝరులు?
ఏవీ ఆ పడిలేచే అల్లరి తరంగాలు?
ఏవీ ఆ లేక్‌మెండోటా గుసగుసలు?
మరోసారి కొరికేలోపే
జారిపోయిన బందరు మిఠాయిని.
మెరుపుల ఓణీతో, ఉరుముల గజ్జెలతో తాండవం చేస్తుంది వాన
ఆకాశానికి భూమికి మధ్య పేనిన తాడుల వాన
ఎప్పటిలాగే తెల్ల మంచు చీరని కట్టుకొని
ఈ నగరం క్రొత్త సంవత్సరం కోసం ముస్తాబవుతుంది
తే.గీ. పాత కొత్తల కలిపెడి సేతు వవగ
పిన్నపెద్దతరములకభిన్నమవగ
రెండుభాషలనందునుద్దండులవగ
నడిమి వయసు కత్తిపయిన నడక! నరుడ!