కామం పాశ్చాత్యులు ‘కనిపెట్టారు’ అన్న భావం మనలో చాలామందికి ప్రబలంగా ఉంది. భారతీయసంస్కృతి అందుకు విరుద్ధమని, పాశ్చాత్య సంస్కృతులతో పోలిస్తే మన సంస్కృతి చాలా స్వచ్ఛము పవిత్రము అన్న భావం కూడా చాలామందిలో ఉంది. ఈ చర్చ కావ్యవిమర్శలో రాకుండా ఉండదు. నిజమే, కాని అది ప్రధానం కాదు.

అక్కడి ఒక కూడలిలో ‘చూడు చూడు అంటూ ఒక శిల్పం చూపించాడు మార్కో. అతను ముందే చెప్పిన, హనుమంతుడి పోలికలు పుష్కలంగా ఉన్న ఆకృతి అది. దానికి మార్కో పెట్టిన పేరు ‘మాయన్ హనుమాన్’. ఆమాట అక్కడికి వచ్చిన ఒక భారతీయ టూరిస్టు మార్కోతో అన్నాడట – దాన్ని మార్కో ఖరారు చేసి వాడేస్తున్నాడు.

వాడు నాకు బావ అవుతాడు కదూ. ఏదో ఒకటి వెక్కిరించకుండా వాడి నోరు ఊరుకోదు. నామీద ఓ అక్క అంటూ ఏడవబట్టి నన్ను పెళ్ళి చేసుకోడు. బతికిపోయా. లేపోతే ఏముందీ మా మేనత్తా మా బామ్మా నన్నే వాడికి కట్టబెట్టేస్తారు. పై సంబంధాలు ఎందుకూ? వాడికెవరికో ఇచ్చి తర్వాత ఏదన్నా అయితే బాధ పడ్డం, అని ఉపన్యాసాలు ఇస్తారు.

డిసిప్లిన్‌కి భంగం రాకుండా, తన పద్ధతిలో తనుండే ఇతన్ని చూస్తే ఆశ్చర్యంగా అనిపించేది. యూనిఫారంలో షూస్ దగ్గర్నించీ కాప్ వరకూ, తన వీలు కోసం చేసుకున్న చిన్నా పెద్దా తేడాలేవీ బయటికి కనిపించకుండా జాగ్రత్త పడేవాడు. బరాక్‌లో అతని బెడ్‌ని అటు చదువుకోవడానికీ ఇటు విశ్రాంతికీ వీలుగా, మెత్తటి దోమతెర, రీడింగ్ లాంప్‌ వంటి ఏర్పాట్లతో సౌకర్యవంతంగా మలచుకున్నాడు. అవసరమైతే తప్ప మాట్లాడడు. డ్రింక్, సిగరెట్లు ముట్టుకోడు.

వీరరాఘవయ్యకి ఇదంతా తెలుసు. ఆవిడ పుట్టింటినుంచి తెచ్చిన నాలుగు రూపాయలతో బొంబాయి జీవితానికి అంకురార్పణ జరిగిందని, ఆ బెట్టు, ఆ ధీమా, ఆ దెప్పు పెళ్ళాం నుంచి జీవితాంతం భరించాలని తెలుసు. నాలుగు రూపాయలు నలభై చేశానుగా, నాప్రమేయమూ కొంత ఉంది అనటానికి లేదు. నా నాలుగే ఈ నలభై అని ఆవిడంటే తార్కికంగా ఆమె తప్పని ఆవిడ భాషలో ఆవిడని ఒప్పించలేడనీ తెలుసు.

ఈమధ్య వచ్చే కథల్లో లోతు మరీ ఎక్కువగా ఉంటోంది నాయుడి కవిత్వంలో లాగ. అర్థం చేసుకోడానికి శ్రమ పడాలి అని గుర్తొచ్చింది. చదువుతూ ఉన్న పుస్తకంలో కథ అసంపూర్ణంగా ఉంది. ఇప్పటి బతుకులో లోతు లేదా? అర్థం చేసుకోలేక పోతున్నానా? కథకురాలు కొత్తగా చెప్పే ప్రయత్నంలో చాలా విషయాలు స్పృశించిందా? ఫేస్‌బుక్‌లో అందరూ పుస్తకాన్ని మెచ్చుకున్న వాళ్ళే. బహుశా వేరే రకంగా చెప్పడానికి సంకోచమేమో!?

మధ్యలో ఎందుకో ఆ కనురెప్పలు తెరచి
ఎరుపు మొగ్గల్లోంచి
నిను చూస్తో, చిన్నగా నవ్వినప్పుడు

నీ చేతిని తమ చేతిలోకి తీసుకుని, తిరిగి
కళ్ళు మూసుకుని
ఆ భద్రతలో ఎటో తేలిపోయినప్పుడు!

భావపూరితమైన ప్రకృతివర్ణనతో మొదలై, ఒక కవిమృతిజనితదుఃఖం నింపుకొని, ఆ కవిని స్మరిస్తూ, వియోగాన్ని వర్ణించి, కవి వ్రాసిన కావ్యం కవిస్మృతి కన్నా బలీయంగా యెదను పట్టి లాగుతూంటే దాన్ని తల్చుకొని, ఆ స్థితి నుంచి కావ్యనాయికతో సల్లాపమాడి, తిరిగి తేరుకొని మళ్ళీ సత్కవిని స్మరించి ముగిసిన ఈ కవిత వంటి ఎలిజీని నేను మరొకదాన్ని చూడలేదు. చరిత్రకారులు గుర్తింపని ఆధునికాంధ్రయుగంలోని మొట్టమొదటి మాలికాస్మృతిగీతమిది.

ఇక్కడికి ఇలా రావడానికి ఏదైనా కారణం ఉందా? లోపలెక్కడో తెలీని ఆలోచనల నుంచి ఇక్కడికి రావాలని, ఇలా ఈ క్షణాన్ని గడపాలని, ఈ పరిసరాలను చూడాలని, ఇలా ఒక మనిషిని కలవాలని అనిపించి ఉంటుందా? లోలోపలే ఏదైనా జరిగి ఉంటుందా? ఇదేదీ కాకపోవచ్చు! మనుషుల జీవితాలు చాలా చిన్నవి. దేనికీ ఎవరికీ అక్కర ఉండదు. బతికుండే క్షణాలను కల్పించుకోడం కోసం మనస్సు పడే వెంపర్లాటేమో ఇదంతా!

వేసవికాలపు సాయంత్రం
విరగకాసిన మావిడి తోటలో
వేలకొద్దీ కాయల్ని చూస్తూ
విరాగివై కూర్చుంటే

‘సహస్ర శీర్షాపురుషః’ అర్ధం కోసం
వేరెక్కడో వెతకక్కరలేదు నువ్వు!

నేడు తెలుగులో వందకుపైన గౙల్ రచయితలు ఉన్నారని అంచనా. కాని ఆ గౙలులలో గౙల్ ఛందస్సు మాత్రము మృగతృష్ణగా మిగిలినది. ఈ పరిస్థితి ఎందుకు తెలుగు గౙలులకు అనే ప్రశ్నకు గౙల్ ఛందస్సు విదేశీయము, మన తెలుగు భాషకు సరిపోదు అన్నది ఒక ముఖ్య వాదము. ఇందులో ఇసుమంత కూడ సత్యము లేదు. అసలు ఈవాదమును లేవనెత్తినవారు గౙల్ ఛందములను చదివినారా అనే సందేహము కలుగుతుంది.

ఒక్కోసారి ఎవరూ దొరకనప్పుడు
పెరుగన్నం దక్కని గండుపిల్లిలా
జాలి మరకతో తిరిగినట్టుండే
వాడి కంతిరి ముఖం మీద పోలికలు
గంపలు గంపలుగా పోగుపడతాయ్.

మెట్ల మీద లయగా నా మెట్టెల ధ్వని
పాదరక్షలు లేని కాళ్ళకి చీరకుచ్చిళ్ళే గొడుగు
కంటి చూపుకి లంకె వేసే ఇరు వైపుల పచ్చదనం
నడక ఆగి సేద తీరి – అచ్చంగా నాదనిపించే సమయం.

నన్ను నేను బయటేసుకోవాలనే వుంటది.
నన్ను మోసిన తల్లికి నా నిస్సహాయతను,
నా బిడ్డల్ని మోస్తున్న తల్లికి నా నిర్లక్ష్యాన్ని తప్ప
ఏమీ ఇవ్వలేని అసమర్థుడిలా మిగిలిపోతుంటాను.
ఇద్దరు తల్లుల దీవెనార్తులే ఊపిరిగా శ్వాసిస్తుంటాను.

వేళ్ళ సందుల్లో
పట్టి ఉంచే బిగువు వదిలేసి
అనుకరిస్తున్నట్టు
లేచిన కాలితో పాటు లేచి
కిందికి దిగే సమయాన్ని
చిన్న చప్పుడుగా మారుస్తుంది.

అంతఃపురస్త్రీల అపహరణము అనునది యోహాన్ గాట్లియబ్ స్టెఫనీ డి యోంగర్ అను నాటకకర్తచే రచింపఁబడి, వుల్ఫ్‌గాంగ్ అమెడెయుస్ మొజార్టు అను సుప్రసిద్ధుడైన ఆస్ట్ర్రియను సంగీతకారునిచే సంగీతబద్ధము చేయఁబడిన గేయవచన సంభాషాత్మకమైన రూపకము. అట్టివాటిలో నన్నింటికంటె ప్రసిద్ధమైనది ఈ మోజార్టు ఓపెరా.

సామాజిక చరిత్ర నిర్మాణానికి కేవలం సాహిత్యం పైనే ఆధారపడవలసిన అవసరం ఉండకూడదు. కానీ సాహితీగ్రంథాలను ఆలంబన చేసుకున్నప్పుడే ఆ సమాజం గురించి సరైన అవగాహన సాధించగలుగుతున్న ఈ నేపథ్యంలో రాజగోపాల్, ఆత్మకథలను ఆధారం చేసుకుని వలసవాద సమాజాన్ని విశ్లేషించాలనుకోవడం మెచ్చుకోవాల్సిన విషయం.

భక్తి ఉద్యమం రోజుల్లో ప్రజలకి దేవుని ఉనికి మీద అచంచలమైన విశ్వాసం ఉంది. అప్పటికి శాస్త్రవిజ్ఞానం ఇంకా బాల్యావస్థలోనే ఉంది. ప్రజానీకంలో అత్యధిక భాగానికి దేవుని చూడాలని, స్మరించాలని, అందుకోవాలనీ తపన ఉంది. తమ నిస్సహాయ స్థితినుండి బయటపడటానికి సంసిద్ధత ఉంది. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు జీవిక ముఖ్య సమస్య.

క్రితం సంచికలోని గడినుడి-81కి మొదటి ఇరవై రోజుల్లో సరిచూపు సచేతనం చేసిన తరువాత ఇరవైయొక్కరి నుండి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి-81 సమాధానాలు.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:

మీ కథలలో ప్రస్ఫుటమయ్యే సృజన, కథనాశైలిలో నూతనత్వం, ఎంచుకునే అంశాలలో వస్తువైవిధ్యం, రచనావిధానంలో నేర్పు సాహిత్యాభిమానులని అలరిస్తాయని మా నమ్మకం. ఈ సంకలనానికై మీరు రాసే కథ మేము అందించాలనుకున్న ప్రమాణాలకి న్యాయం చేస్తుందనే నమ్మకంతో మీకు ఈ ప్రత్యేక ఆహ్వానం.