దాశరథి రాసిన నిండుపున్నమి పండువెన్నెల అనే పాట ఏడక్షరాల లయమీద కష్టపడి అమర్చడం జరిగిందనీ బాలసరస్వతి చెప్పింది.
ఈమాట సెప్టెంబర్ 2011 సంచికకు స్వాగతం!
వేగుంట మోహన ప్రసాద్ (05జనవరి 1942 – 03ఆగస్ట్ 2011): మో’ గా సుప్రసిద్ధుడైన అపరిచితుడు కవి వేగుంట మోహనప్రసాద్. ఆంగ్ల సాహిత్యంలో ఎం. ఏ. విజయవాడ సిద్ధార్ధ కళాశాలలో ఆంగ్లోపన్యాసకులుగా పని చేశారు. మొట్టమొదట ప్రచురించబడ్డ కవిత హిమానీహృది, 1960 మే నెల భారతిలో. మహారాష్ట్రలో పనిచేస్తున్నప్పుడు తన ఊరి తన వారి జ్ఞాపకానుభవాల కాక్టెయిల్ ‘చితి-చింత’ (1969) మో’కి తెలుగు కవుల్లో ప్రత్యేకమైన ఉనికిని తెచ్చింది. ‘రహస్తంత్రి’, ‘సాంధ్యభాష’, ‘పునరపి’, ‘నిషాదం’, ఇలా ఎన్నో ‘నీడలూ జాడ’ల్లో ఆయన ‘బతికిన క్షణా’ల్లో ఆయన ‘కరచాలనాల’ నుంచి వెలువడినై. తెలుగు కవిత్వపు కాన్వాసు మీద అరాచకంగా ఒలికి అద్భుతమైన ప్రశ్నగా పరిణమించిన రంగు పదం మో’.
ఈ సంచికలో – కొత్త రచయిత బులుసు సుబ్రహ్మణ్యం, లైలా యెర్నేని, సాయి బ్రహ్మానందం గొర్తి, శర్మ దంతుర్తి, కె.వి. గిరిధరరావుల కథలు; గౌరి కృపానందన్ అనువాద కథ; కృష్ణదేశికాచార్యులు, పాలపర్తి ఇంద్రాణిల కవితలు; భీమ్‌సేన్‌జోషీ రావు బాలసరస్వతీదేవి గురించి కొడవటిగంటి రోహిణీప్రసాద్ సంగీత వ్యాసాలు; జెజ్జాల కృష్ణ మోహనరావు, కనకప్రసాద్, వేలూరి వేంకటేశ్వరరావు, భద్రిరాజు కృష్ణమూర్తుల వ్యాసాలు; ఒక మో కవిత; తానా 2011 సమావేశపు సాహిత్య ప్రసంగాల చిత్రతరంగాలు, ఇంకా…
నేను ముందు గది అంటే మా ఆవిడ నా కేసి చురచురా చూస్తుంది. దాన్ని డ్రాయింగ్ రూము అని పిలవాలిట. ఒక టీవీ, నాలుగు కుర్చీలు, నా లాప్టాపూ తప్ప మరేమీ లేని ఆ రూముని అలా పిలవాలంటే నాకు మనస్కరించదు.
సమాజపు రీతి రివాజులు చెయ్యకూడని పనులని చేయిస్తాయి. కానీ మానవత్వంతో నడుచుకోవడానికి, సాటి మనిషి పట్ల దయతో వ్యవహరించడానికి స్పందించే మనసు ఉంటే చాలు. మనకి ఉన్న పరిధిలో సమాజ సేవ చేయడానికి ఎటువంటి ఆటంకమూ ఉండదు.
ఆమె ఒక గులాబీ రంగు జరీ పని చేసిన చీర కట్టి, అదే రంగు జాకెట్టు వేసుకుంది. చేతికి ముత్యాలు, రవ్వల గాజులు. ఒక చేతికి వరుస వరసల ముత్యాల బ్రేస్ లెట్. ఆమె ముఖం కోలగా, ఎంతో ముద్దుగా ఉంది. ఇంత వంక పెట్టలేని కనుముక్కు తీరు.
విశ్వనాధం పెద్ద కూతురు సీతాలు. పదోతరగతి ఆడ గజనీ మహమ్మదులా దండెత్తింది. చదువెలాగూ అబ్బలేదని సంగీతం నేర్పిస్తున్నారు. ఆ సంగీతం నేర్పే సుబ్బారావు నాకు స్నేహితుడు. సుబ్బారావు మా అమలాపురంలో పేరున్న సంగీతం మాష్టారు.
‘రావణాసురుడి పది తలలకూ, ఒకే రకం మొహం వుంటుందా? లేక ఒక్కో తలకూ ఒక్కో రకం మొహం వుంటుందా?’ ఎప్పటినుంచో నన్ను వేధిస్తున్న ప్రశ్న! ఆరో తరగతిలో వున్నప్పుడు టీచర్‌ని అడిగాను. ఇదే ప్రశ్న ఇంట్లో అన్నయ్య నడిగితే అసలు రావణుడే లేడు పొమ్మన్నాడు. నాన్న నడగాలంటే భయం.
అటునొక చూపూ ఇటునొక చూపూ
అడఁగారదు ఈ తగులాట
అదియొక తీరూ ఇదియొక తీరూ
ముదిగారము నీ తలపోత
నాన్న చెప్పడం ప్రకారం తను పుట్టింది ఇండియాలో చిన్న పల్లెటూర్లో. దాదాపు ఇరవై ఏళ్ళు అదే ఊర్లో ఉన్నాడు, తెలుగు మాత్రం మాట్లాడుతూ. ఇంగ్లీషొచ్చినా మాట్లాడే అవసరం రాలేదుట ఎప్పుడూ. చాలా బీద కుటుంబం. ఏమీ ఉండేది కాదు.
రాజప్ప ఇంట్లోకి వచ్చాడు. హాల్లో అతని తమ్ముడు బెంచి మీద కూర్చుని ఉన్నాడు. చేతిలో పేపర్. పక్కనే పొగలు చిమ్మే కాఫీ. పేపరు మీద ఉన్న చూపును తిప్పి ఒక్క నిమిషం అన్నని పరిశీలనగా చూశాడు. పొద్దున్న లేవగానే కాఫీ తాగక పోతే అన్నయ్యకి ఎంత కష్టంగా ఉంటుందో అతనికి తెలియని విషయం కాదు.
హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసి, అక్షకుమారాది దైత్యులను చంపి, ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి ఐచ్ఛికంగా లొంగిపోయి, రావణుని సభలోనికి తీసుకురాబడి – అక్కడ అవకాశం దొరికే సరికి రావణునికి హితబోధ చేసే సందర్భం లోనిది ఈ పద్యం.
తానా 18వ ద్వైవార్షికోత్సవ సమావేశాలలో శ్రీయుతులు గొల్లపూడి మారుతీరావు, విన్నకోట రవిశంకర్ల ప్రసంగాల వీడియోలు.
తానా 18వ ద్వైవార్షికోత్సవ సమావేశాలలో శ్రీయుతులు కాత్యాయనీ విద్మహే, మృణాళిని, హర్షితా కామత్ల ప్రసంగాల వీడియోలు.
తానా 18వ ద్వైవార్షికోత్సవ సమావేశాలలో శ్రీయుతులు వాసిరెడ్డి నవీన్, జంపాల చౌదరి, చంద్ర కన్నెగంటి, శ్రీపతి, గౌరి కృపానందన్‌ల ప్రసంగాల వీడియోలు.
తానా 18వ ద్వైవార్షికోత్సవ సమావేశాలలో శ్రీయుతులు గొల్లపూడి మారుతీరావు, ఆకెళ్ళ సూర్యనారాయణ, శేఖర్ కమ్ములల ప్రసంగాల వీడియోలు.
నిజం చెప్పాలంటే మన రాజకీయ నాయకులకి మన సంస్కృతి , మన భాష – ఈ రెండూ అవసరం లేదు. చప్పట్ల కోసం చెప్పటం తప్ప, ఈ రెండింటి పైనా ఏ విధమైన గౌరవమూ లేదు. వాళ్ళ లాగానే మన సంస్థలు కూడా ఈ పడికట్టు మాటలు వల్లెవేయడం నేర్చుకున్నాయి. అంతే!
“ఒక్కా ఓ చెలియా, రెండూ రోకళ్ళు, మూడు ముచ్చిలక” అంటూ మనలో కొంతమంది అంకెలు గుర్తు పెట్టుకోవడానికి చిన్నప్పుడు నేర్చుకొన్న పాట! ఇంతకీ మూడుకు ముచ్చిలకకు ఉన్న సంబంధం ఏమిటి?
ఈ మధ్యకాలంలో ఆ ధైర్యం కొంత కుంటుపడింది.
ఆకుపచ్చగా ఉండాల్సిన ఆకులు ఎర్ర పడటం మొదలయ్యింది.
చెట్టు వంగి వంగి కుంగుతున్నది.
భానుమతి నిశ్చయం వాస్తవరూపం దాల్చే దారి ఏదీలేదు. తాను పెళ్ళాడ గోరుతున్నట్టు భానుమతి రామకృష్ణకు ఎట్లా చెబుతుంది? “నాకు నిన్ను చేసుకోవాలని లేదు” అని అతడంటే?…
సృజన అనుభవంలో, అభిరుచిలో కేవలం ఇతరుల మెప్పు మీదే ఆధారపడని ఏ తోవ తమదో స్థిరంగా అనుభవం లోకి రాక, కవిలోనూ పాఠకునిలోనూ కూడా అపరిపక్వమైన అభిరుచే మంకుతనం, మేకపోతు గాంభీర్యంగా, లేదంటే పరస్పరం పెట్టుడు సామరస్యం, సుహృద్భావంగా వ్యక్తమౌతాయి.
తరవాతి కాలంలో భీమ్‌సేన్‌జోషీ పాటకచేరీ చేసే పద్ధతి చాలా బావుండేది. ఏనాడైనా ఆయనకు అభిమానుల్లో అన్ని వయసులవాళ్ళూ కనబడేవారు.
అక్షరాద్యవస్థ / ఉంగా ఉంగా / వధ్యస్థలం / ఈలోగా / ఏలాగానో / వీడ్ని పట్టుకో / బడా చోర్ / పటుకో పటుకో / బాల నేరస్తుడు / వీడ్ని ముట్టుకో / దొంగ ఆంగ్ల పద బంధాల్ని…
కవి, రచయిత త్రిపుర పుట్టిన రోజు సెప్టెంబర్ రెండుట. మన కనకప్రసాదు మిన్నకుంటాడేటి! ఒక కవితా రాసీడు, ఒక చిన్న స్కెచ్చీ గీసీడు, త్రిపుర పుట్టిన్రోజు శుభాకాంక్షలు చెప్పడానికి…
కిటికీ భుజం మీదకు
కొమ్మ సాచి
స్నేహంగా ఊగుతోంది
దానిమ్మ.
కావ్యనాటకసంగీతకళలయందు
పండితుండైన కాకతిప్రభున కామె
కావ్యనాటకసంగీతకళలయందుఁ
దనరు పాండితిచేత మోదంబు గూర్చు.