ఎంతో అనుభవజ్ఞులైన తెలుగు సాహితీ వేత్తలు, విశ్వవిద్యాలయాధికారులు కూడా ఈ రకమైన సిద్ధాంతాలకు వత్తాసు పలకడంతో ఈ వాదాల అశాస్త్రీయతను ఎత్తిచూపిస్తూ మరోసారి రాయడంలో తప్పులేదనిపించింది.

ఇవి రాయటానికి రెండు కారణాలున్నాయి. మొదటిది, ఈమాట వంటి అంతర్జాతీయ వెబ్ పత్రిక నడపటంలో ఒక ముఖ్య ఉద్దేశ్యం – ప్రవాసాంధ్రుల అనుభవాలు అందరితోటీ పంచుకోటం కాబట్టి, ఈమాటను ఒక వేదికగా తీసుకొని మా అనుభవాలు పంచుకోవాలని. రెండవది, మేము ఫ్రాన్స్ నుంచి అమెరికా తిరిగి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది. మా జ్ఞాపకాలు, అనుభవాలు మరిచి పోకముందే వాటిని రాతపూర్వకంగా పొందుపరచాలని!

నారాయణరావు గారి అనువాదం కన్యాశుల్కం నాటకాన్ని మళ్ళీ చదివించింది. అనువాదమే కాదు; ఆయన రాసిన వెనుక మాట (The Play in Context) నూతన ప్రేరణనిచ్చి, తిరిగి ఆలోచించవలసిన అవసరం కల్పించింది. వెనుక మాటలో నారాయణరావుగారు ఒక సరికొత్త ప్రతిపాదన చేసారు. ఒక రకంగా ఇది విప్లవాత్మకమైన ప్రతిపాదన. తన ప్రతిపాదనని సోపపత్తికంగా సమర్థించారు.

శా. శ్రేణుల్ గట్టి నభోంతరాళమునఁ బాఱెన్ బక్షు; లుష్ణాంశుపా     షాణ వ్రాతము కోష్ణమయ్యె; మృగతృష్ణావార్ధు లింకెన్; జపా     శోణం బయ్యెఁ బతంగ […]

వానా కాలమే కాదు, వాన పడిన సమయం కూడా కవులకు ముఖ్యమౌతుంది. చంద్ర కవితలను విడివిడిగా అనేక సంవత్సరాలుగా చూస్తూనేఉన్నా, అన్నిటినీ కలిపి ఒకచోట చదవటం మంచి అనుభవం.

ఆ పెళ్ళి విందు రాజారావుకొక కొత్త అనుభవం! ఎవరో ఓ మహాకవి అన్నట్లు అనుభవాల పేజీలే కదా జీవితమంటే! తన పిల్లల ప్రవర్తనల మార్పు అనే అనుభవం అతనికి మెల్ల మెల్లగా తెలుస్తోంది. ఏ అనుభవాల అంచున ఎప్పుడు జారి పడతామో ఎవ్వరికీ తెలియదు.

“అమెరికన్లకి మనలాంటి విదేశీయుల్ని చూసి వీడు మనవాడు అని ఎప్పటికీ అనిపించదనుకుంటా. ఉద్యోగ ధర్మంగా ఏదో స్నేహంగానే ఉంటారు గానీ ..”

అమ్మాయిలకు ఉన్నతవిద్య అవసరమా! ఏ వయసులో పెళ్ళిజరిగితే బాగుంటుంది? ఆర్థిక స్వాతంత్ర్యం స్త్రీలకెంత వరకూ ప్రయోజనకరం? ఆశయాలకూ, ఆచరణకూ పొంతన కనిపిస్తుందా? జీవితంలో సర్దుబాటు తప్పదా? అయితే, అది ఎలాంటి సర్దుబాటైతే బాగుంటుంది? సర్దుబాటు స్త్రీ, పురుషుల్లో ఇద్దరికీ ఉండాలా? లేక ఒక్కరికే ఉండాలా? మొదలైన ప్రశ్నలు – వాటికి సమాధానాలు డి. కామేశ్వరి గారు రాసిన ‘ మనసున మనసై ‘ నవలలో చాలా వరకు కనిపిస్తాయి. ఆ సమస్యలను నవల లోతుగా చర్చిస్తుంది.

అతన్ని చూస్తే నిసి గుండె లయ తప్పింది. అతను అతి సుందరుడు. పసుపు రంగా అంటే కాదు. తెలుపా అంటే అది కాదు. గులాబీ వర్ణమా మరి. అతి నాజూకుగా సున్నితంగా ఉన్న ముఖ రేఖలు. కొద్దిగా పొడవాటి మెత్తని జుట్టు. గంభీరమైన సోగ కన్నులు.ఓ! మై గాడ్! హాడ్జ్కిన్స్ ఉన్న ఇతనికేమో కాని నాకు చెమటలు పడుతున్నాయ్. ఎంత మన్మధుడు! మన్మథుడికి జబ్బులు రావచ్చునా దేవా! అనుకుంది నిసి.

తెలుగులోగాని, కన్నడములోగాని చంపకోత్పలమాలలలో వ్రాయబడిన పద్యాలు తెలియని విద్యార్థులు అరుదు అనుటలో అతిశయోక్తి ఏమాత్రము లేదు. ఈ వృత్తాలు ఈ రెండు భాషలలో ఖ్యాత వృత్తాలు. ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము ఈ వృత్తాల ఉత్పత్తిని, వికాసమును గురించి చర్చించుటయే. నా ఆశయము ఈ విషయాలను అందరికీ తెలియజేయుటయే.

కంప్యూటర్ కీబోర్డు మీద వావీవరస లేకుండా టైప్ చేసినట్టయితే మహాకావ్యం తయారవుతుందా? అవదని ఖచ్చితంగా చెప్పవచ్చు. అదే సంగీతం కీబోర్డు మీద అయితే ఏదైనా రాగం పలుకుతుందా? చాలామంది నమ్మకపోవచ్చుగాని పలుకుతుంది. నిజానికి అన్నీ తెల్లనివో, నల్లనివో వాయిస్తే రాగం పలకకపోవడమే అరుదు. అతి ప్రాథమిక స్థాయిలో సంగీతం వాయించదలుచుకున్నవాళ్ళ కోసమే ఈ వ్యాసం.