ప్రస్తుతం మనం ఘనంగా వీథుల్లో జరుపుకుంటున్న గణేశ చవితి ఉత్సవాలకు మాత్రం మూలం మరాఠ రాజ్యంలోని పీష్వాలు ప్రారంభించిన గణేశ ఉత్సవాలే. నానాసాహెబ్ పీష్వా రాజ్యకాలంలో గాణపత్యవ్రతం ప్రారంభమైనట్టుగా మనకు మరాఠా రాజ్యానికి సంబంధించిన దస్తావేజుల ద్వారా తెలుస్తుంది.
అక్టోబర్ 2018
తెలుగునాట తెలుగు చదవడం రాయడం అటుంచి సరిగ్గా మాట్లాడడం కూడా అరుదైపోతున్న ఈ రోజుల్లో, ఎక్కడో అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో కొందరు పుస్తకాలు చదవడం ఇష్టం ఉన్నవారు కలుసుకోవడం, తాము చదివిన కథలూ నవలలూ కవితల మంచీచెడ్డలు మాట్లాడుకోవడం, ఆపైన ఆ ఆసక్తి, అభిరుచులే డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ పేర ఎదిగి ఒక సంస్థగా మారి అమెరికా తెలుగు ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడమే కాక, ఇరవై యేళ్ళు నిరాఘాటంగా నడవడం అసామాన్య విషయం మాత్రమే కాదు, ఎంతో సంతోషం కలిగించే విషయం కూడా. డీటీఎల్సీ అని అందరూ పిలుచుకొనే ఈ బుక్ క్లబ్ కేవలం పుస్తకాలు చదవడంతోనే ఆగిపోక, నిక్కచ్చిగా విమర్శ చేయడం, ఎంతో శ్రమతో, నిరపేక్షతో, కేవలం తెలుగు సాహిత్యం పట్ల ప్రేమతో మరుగునపడిన పుస్తకాలను ప్రచురించే బాధ్యత కొంత తలకెత్తుకోవడం, తెలుగు భాషాసాహిత్యాల గురించిన సభలు నిర్వహించడం ఎంతో హర్షించదగిన పరిణామం. వీరి స్ఫూర్తితో అమెరికాలోని ఎన్నో నగరాలలో తెలుగు సాహిత్య సంఘాలు వెలిశాయి, తెలుగు కథ కవితల గురించి మాట్లాడుకుంటున్నాయి, ఏం చేస్తే మన తెలుగు భాష కలకాలం బ్రతికి ఉంటుంది, మరింత అభివృద్ధి చెందుతుంది, మనం ఎలా దీన్ని కాపాడుకోవాలి అని ఆలోచిస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు. డీటీఎల్సీ పుట్టి ఇరవై యేళ్ళు అయిన సందర్భంగా సెప్టెంబర్ 29-30 తారీకులలో ఇరవై యేళ్ళ పండగ పేరుతో తెలుగులో ప్రామాణిక భాష అవసరమూ ఆవశ్యకత, తెలుగులో ప్రచురణ వ్యవస్థ, ఇత్యాది అంశాలపై ఒక చక్కటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా, డీటీఎల్సీ వారి కృషికి, తెలుగు పట్ల వారి ప్రేమకు, వారి నిస్వార్థ ప్రయత్నాలకూ ఈమాట తరఫున హార్దికాభినందనలు తెలుపుతున్నాం.
కరణంగారు లేచి “కృష్ణంరాజుగారూ, మీరు మాట్టాడింది భావ్యం కాదు. పెద్దలనిబట్టో మీ కుటుంబం మీద వున్న అభిమానంతోనో జనం మీ పెద్దరికాన్ని గౌరవిస్తున్నారు. ఇప్పుడు మీలో మీరే పోటీ పడతానంటే పడండి. ఎవరి సత్తా ఏంటో ప్రజలే తేలుస్తారు. అంతేకానీ ఇలా పేకాటాడో, కోడి పందేలుకట్టో అధికారం అనుభవిస్తామంటే మొత్తం గ్రామాన్ని అవమానించినట్టే!” స్థిరంగా అన్నారు.
హఠాత్తుగా అడవి అదృశ్యమై సాగర దృశ్యానికి తెరతీసింది. అదో విభిన్న సముద్రం. కంటిచూపుకు ఆనేంత దూరంలో చిన్నాపెద్ద ద్వీపాలు. మ్యాపును సంప్రదించగా అవే లిటిల్ డైమండ్, గ్రేట్ డైమండ్ ద్వీపాలని చెప్పింది. ఏమని వర్ణించనూ ఆ సాగర దృశ్యాన్నీ! మాటలను కోప్పడి మనసే సర్వస్వంగా ఆ సుందర దృశ్య భావనను మనసులో ఆకళించుకోవలసిన క్షణాలివి.
బైట తుఫాను హోరు. ఈదురు గాలులు, వానజల్లులు ఆ బార్న్ చుట్టూ గిరికీలు కొట్టతూనే ఉన్నాయి. సముద్రం పొంగులు తెలుస్తూనే ఉన్నాయి. పెరిగే అలలు విరిగే అలలు. ద స్టార్మ్ రేజ్డ్ ఆల్ ఎరౌండ్ దెమ్. కాని అతని చేతుల మధ్య ఆమె భద్రంగా ఉంది. శరీరంలోని బడబానలం చల్లబడింది. ఆమె పెదవుల మీద నవ్వులు పూచాయి. హి ఈజ్ సో రైట్. హిస్ ఎవిరీ టచ్ వాజ్ కంపాటిబుల్ టు హర్. ఎ గ్రేట్ లవర్. వెరీ టెండర్. అండ్ ఎ జెంటిల్మన్!
ఎర్ర రాతి కొండల వెంబడి దిక్కుతోచక తిరుగుతూ
నా ప్రేమను కనుమలలో పాతిపెట్టేశాను.
ఆ క్షణంలోనేనా విముక్తి కోసం నువ్వు ప్రార్థనలు చేసింది?
ఆకాశంలో నీ రూపురేఖలతో మబ్బులు
నోళ్ళు తెరిచి నా వైపుకి అప్పుడప్పుడు దూసుకు వస్తాయి
Broken hearts tied,
Hands tightly held
Frozen in time
Five stayed still
The wheel turned again
Took another one down
నేను కెనడాకు విహార యాత్రికుడిగా రాలేదు. నా దరఖాస్తుల్లోనూ, విచారణల్లోనూ చెప్పినట్టు మా దేశంలో జరుగుతున్న యుద్ధం నుండి ప్రాణాలు కాపాడుకోడానికి కట్టుకున్న భార్యని, దేవతల్లాంటి నా పిల్లల్నీ వదిలేసి తప్పించుకుని వచ్చినవాణ్ణి. నా కుటుంబాన్ని ఎలాగైనా పోషించుకోవచ్చన్న ఆశతో మూడు నెలలపాటు అష్టకష్టాలు పడుతూ ప్రయాణం చేసి వచ్చాను. ఫ్లయిటెక్కి నేరుగా అలా వచ్చి ఇలా దిగలేదు.
కాశ్మీరు సైనికుడి రక్తమంటిన అరువు రాయి
అటవీ అధికారులపై ఎర్ర చందనం కూలీ రాయి
వాహన చోదకుని రక్తమంటిన నిర్లక్ష్యపు రాయి
స్థలాల దురాక్రమణల్లో కాళ్ళొచ్చిన రాయి
మృత కథలని మోస్తున్న చరిత్ర రాయి
మోసులెత్తిన ఆశలను మోస్తున్న పునాది రాయి
బేతాళా! రోజుకో విభిన్నమయిన కథని చదవాలని, పాఠకరావు తాపత్రయం. అదే అతడు ఒక్కోరోజు ఒక్కోరకంగా ప్రవర్తించటానికి కారణం. అంతే కాదు, కాలక్షేపానికి కథలు చదివేవాళ్ళు అవి విసుగు కలిగిస్తే, వాటిని విసిరేసి ఇంకో కాలక్షేపాన్ని వెతుక్కుంటారు. కాని అదే కథాప్రపంచంలోకి మాటిమాటికీ వెళ్ళరు. అందుకని పాఠకరావు కాలక్షేపానికి మాత్రమే కథలు చదువుతున్నాడన్న అపోహని వెంటనే నీ మనసులోంచి తొలగించు.
గొప్పులు తవ్వడానికి,
కలుపు తియ్యడానికి
కాల్వలు కట్టడానికి
పంటకొయ్యడానికి
ప్రయాసపడుతుంటాడు ఒక్కడే, ఒంటరిగా
వాడంటే మాత్రం ఎవరికీ పడదు
ఎవరికీ అర్థంకాని నల్లటి విషాదం వాడిది
పగవారి కుట్రో
బంధువుల గూడుపుఠాణో
రాజ్యభారం కోల్పోయి
బికారిలా తిరగసాగాడు రాజు
రాజభోగాలు పోయాయని చింతలేదు
ప్రతి అక్షరాన్ని సార్థకంగా ఉపయోగించి విశ్వనాథ రచించిన ఆ నవలలో, నాయికకు ఆ పేరునే ఎందుకు ఎంచుకున్నారు? దేవీనామమే కావాలంటే, అవి అనంతంగా ఉండగా ఏకవీర అనే పేరునే ఎంచుకోవటానికి కారణం ఏమిటి? ఏదో సార్థకమైన ఉద్దేశం ఉండే ఉండాలి. ఆ కోణంలో పరిశోధన ప్రారంభించేసరికి నిజంగానే గొప్ప అవగాహన, సాంకేతికతలను రంగరించి రచయిత ఆ పేరును ఉపయోగించారని స్పష్టమైంది.
భారత యుద్ధానంతరం ఒకరోజు అర్జునుడు ద్వారకకు వస్తాడు, కృష్ణుణ్ణి చూడడానికి. ఆ రోజు కృష్ణుడు ఏదో దీక్షలో ఉన్నాడు. అలాంటి సమయంలో ఒక బ్రాహ్మడు ఏడ్చుకుంటూ కృష్ణార్జునుల దగ్గరికి వస్తాడు దీనంగా. ఆయన శోకాన్ని చూసి కృష్ణుడు కన్నీరు పెట్టుకుంటాడు. కృష్ణుడి బాధను చూసి అర్జునుడూ కళ్ళనీళ్ళపర్యంతమవుతాడు. సంగతేమిటంటే ఆ విప్రుని భార్య గర్భవతిగా వుండి, శిశువును ప్రసవించగానే ఆ శిశువు చనిపోతాడు.
సంస్కృతములో శ్లోక ఛందస్సు మూలము, కాలక్రమేణ జరిగిన మార్పులు, అందులోని విభిన్న రీతులు మున్నగువానిని సోదాహరణముగా వివరించినాను. శ్లోకపు నడకతో క్రొత్త విధములైన అర్ధసమ వృత్తముల సృజననుగుఱించి కూడ తెలియబఱచినాను. అంతే కాక 16 అక్షరముల అష్టి ఛందములోని ప్రతి పాదములో రెండు శ్లోక పాదములను ఏ విధముగా ఉంచి వ్రాయవచ్చునో అనే సంగతిని కూడ మీముందు పెట్టినాను.
క్రితం సంచికలోని గడినుడి 23కి మొదటి ఇరవై రోజుల్లోనే అయిదుగురినుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపిన అయిదుగురు: 1. రవిచంద్ర ఇనగంటి, 2. భమిడిపాటి సూర్యలక్ష్మి 3. శైలజ 4. సుభద్ర వేదుల 5. శ్రీనివాసులు రెడ్డి. విజేతలకు మా అభినందనలు.
గాయకుడిగా ఆయన ప్రతిభకు స్పష్టంగా అద్దం పట్టే పాటలివి. మొదటి రెండు 1948లో మహాత్మా గాంధి మరణానంతరం రాసి, హెచ్.ఎం.వి. వారికి రికార్డుగా ఇచ్చినవి. అదే సమయంలో గాంధీకి నివాళులర్పిస్తూ చాలా భారతీయ భాషలలో బాగా పేరు పొందిన గాయనీగాయకులు రికార్డులిచ్చారు.
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.