గాథాసప్తశతి శతకం



గఅ-వహు-వేహవ్వఅరో పుత్తో మే ఏక్క-కండ-విణివాఈ
తహ సోహ్ణాఇ పులఇఓ జహ కండ-కరండఅం వహఇ

గజ-వధూ-వైధవ్యకరః పుత్రో మే ఏక-కాండ-వినిపాతీ
తథా స్నుషయా ప్రలోకితో యథా కాండ-సమూహం వహతి


ఒక బాణముతో గరిణిని
వికలముగా విధవ జేయు పేరిమి పుత్త్రుం
డిక నీ కోడలి సొబగును
బ్రకటితముగ జేసె పులకలందు నిజమ్మై
… 7-30

With one arrow
he can kill an elephant
and make its mate a widow
Alas
such a steady guy, my son,
is having goose-bumps
at the sight of this
beautiful girl, my daughter-in-law



ణ అ దిట్ఠిం ణేఇ ముహం ణ అ ఛివిఉం దేఇ ణాలవఇ కిం పి
తహ వి హు కిం పి రహస్సం ణవ-వహు-సంగో పిఓ హోఇ

న చ దృష్టిం నయతి ముఖం న చ స్ప్రష్టుం దదాతి నాలపతి కిమపి
తథాపి ఖలు కిమపి రహస్యం నవ-వధూ-సంగః ప్రియో భవతి


కనులెత్తి చూడదు, మొగ-
మును దాకగ వద్దను, కడు ముద్దుగ మాటల్
దను బలుకదు, మఱి ప్రియతమ
యనెదరు జను లీయమను రహస్యమ్మేమో?
… 7-45

She does not lift her head
nor does she allow me
to hold her face in my hands
nor does she utter endearing words
Still people praise her so much
what is the secret behind all this –
I know not!



పచ్యూసాగఅ రంజిఅ-దేహ పిఆలోఅ లోఅణానంద
అణ్ణత్త ఖవిఅ-సవ్వరి ణహ-భూసణ దిణవఇ ణమో దే

ప్రత్యూషాగత రక్తదేహ ప్రియాలోక లోచనానంద
అన్యత్ర క్షపితశర్వరీక నభోభూషణ దినపతే నమస్తే


అరుదెంతువు వేకువ నీ
వరుణాంగములన్ గనులకు వరమగు ప్రభలన్
బరదేశములన్ రాత్రుల
నరిగెడు దివమణి దినమణి కంజలు లిత్తున్
… 7-53

Every morning you rise
as a red globe
filled with radiance
a treat to the eyes
Every night you visit distant lands
You’re the light of the sky
You’re the light of the day
I prostrate before you



జం జం ఆలిహఇ మణో ఆసావట్టీహిఁ హిఅఅ-ఫలఅమ్మి
తం తం బాలో వ్వ విహీ ణిహుఅం హసిఊణ పమ్హుసఇ

యద్యాదాలిఖతి మన ఆశావర్తికాభిర్హృదయఫలకే
తత్తద్బాల ఇవ విధిర్నిభృతం హసిత్వా ప్రోచ్ఛతి


హృదయఫలకమున జిత్రము
ముదమున నాశాపిచులము బూని రచించన్
విధి తుడుచు నకస్మాత్తుగ
బెదవులపై నవ్వు జిందు పిన బాలుడనన్
… 7-56

On the easel of the heart
as one paints happily
with the brush of desire,
Fate
like a little boy with an innocent smile
wipes it off …
all of a sudden, cleanly!