గాథాసప్తశతి శతకం

[పరిచయ వ్యాసం]


పసు-వఇణో రోసారుణ-పడిమా-సంకంత-గోరి-ముహ-అందం
గహిఅగ్ఘ- పంకఅం విఅ సంఝా-సలిలంజలిం ణమహ

పశుపతే రోషారుణ-ప్రతిమా-సంక్రాంత-గౌరీ-ముఖ-చంద్రం
గృహీతార్ఘ-పంకజమివ సంధ్యా-సలిలాంజలిం నమత


సందెజపమ్మును జేయగ
కెందామర దోసిలి గల ఘృణిదర్పణమం
దందపు టెఱ్ఱని శశిముఖి
గందోయిని గను పశుపతి కంజలు లిత్తున్
… 1-01

The water in His lotus hands
for the evening prayers
reflects the moonlike face of His consort …
red with anger in the dusky glow …
My obeisance to Lord Siva



అమిఅం పాఉఅ-కవ్వం పఢిఉం సోఉం అ జే ణ ఆణంతి
కామస్స తత్త-తంతిం కుణంతి తే కహఁ ణ లజ్జంతి

అమృతం ప్రాకృత-కావ్యం పఠితుం శ్రోతుం చ యేన జానంతి
కామస్య తత్త్వ-చింతాం కుర్వంతి తే కథం న లజ్జంతే


అమృతము వంటిది ప్రాకృత
మమితముగా వ్రాసి చదివి యలరక నున్నన్
గమి కామమునే దలచన్
దమరికి నవదేమొ సిగ్గు ధరపై యెపుడున్
… 1-02

The Prakrit language is
sweet nectar
Some,
instead of reading and
writing in that language
immerse themselves
in erotic thoughts!
Aren’t they ashamed?



ఉఅ ణిచ్చల-ణిప్పందా భిసణీ-పత్తమ్మి రేహయి బలాఆ
ణిమ్మల-మరగఅ-భాఅణ-పరిట్ఠిఆ సంఖ-సుత్తి వ్వ

పశ్య నిశ్చల-నిఃస్పందా బిసనీ-పత్రే రాజతే బలాకా
నిర్మల-మరకత-భాజన-పరిస్థితా శంఖ-శుక్తిరివ


పచ్చని తట్ట పయిన్ గడు
ముచ్చటగా నుండు తెల్ల ముత్తెమువోలెన్
పచ్చని తామరపాకున
నిచ్చలముగ నుండె పక్షి నిశ్శబ్దముగా
… 1-04

Like a white pearl
on a spotless emerald dish
sits the white heron –
unmoving and silent
(Go then to the lake
the lily white damsel
clad in green
waits for you
silently
and patiently)



దుగ్గ అ-కుటుంబ-అట్ఠీ కహం ణు మఏఁ ధోఇఏణ సోఢవ్వా
దసి-ఓసరంత-సలిలేణ ఉఅహ రుణ్ణం వ పడఏణ

దుర్గత-కుటుంబాకృష్టిః కథం ను మయా ధౌతేన సోఢవ్యా
దశాపరత్సలిలేన పశ్యత రుదితమివ పటకేన


ఉదుకగ చీరను ప్రతిదిన
మది గతుకుల నిండిపోయె యౌరా లేమిన్
బ్రదుకున నగచాట్లు పడెడు
ముదుసలి గని చినుగు చీర మోమున జలముల్
… 1-18

Then –
she was young and rich with several suitors
with countless priceless saris to wear
Now –
she is old, worn and torn
and the only sari she has
is old, worn and torn
beaten again and again
even the holes in the sari
shed tears



అలిఅ-పసుత్త విణిమీలి-అచ్ఛ దే సుహఅ మజ్ఝ ఓఆసం
గండ-పరిఉంబణా-పులయి-అంగ ణ పుణో చిరాఇస్సం

అలిక-ప్రసుప్తక-వినిమీలితాక్ష హే సుభగ మమావకాశం
గండ-పరిచుంబనా-పులకితాంగ న పునశ్చరయిష్యామి


బూటకపు నిద్ర చాలిక
నీటుగ పులకింతు వేల నిను చుంబించన్
చోటిమ్ము నీదు ప్రక్కన
మాటిత్తును తడవు జేయ మన కూటమికిన్
… 1-20

I know it is all a fake
you’re not sleeping
See how you got excited
when I brushed a kiss on your cheeks
Move aside
let me also share the bed
I promise, no delay henceforth!



అసమత్త-మండణా విఅ వచ్చ ఘరం సే స-కోఉహల్లస్స
వోలావిఅ-హలహలఅస్స పుత్తి చిత్తే ణ లగ్గిహిసి

అసమాప్త-మండనైవ వ్రజ గృహం తస్య సకౌతూహలస్య
వ్యతిక్రాంతౌత్సుక్యస్య పుత్రి చిత్తే న లగిష్యసి


నీ సింగారము చాలునె
యాసించినవాడు హర్ష మందిన సరిగా
నాసక్తి విడక మునుపే
దాసునిగా జేసికొమ్ము తక్షణ మిపుడే
… 1-21

Young girl
enough of your makeup and toilet
He’s waiting
Go
when he loses interest in you
it will be harder to impress



పిఅ-విరహో అప్పియదంసణం అ గరు ఆఇఁ దో వి దుక్ఖాఇం
జీఏఁ తుమం కారిజ్జసి తీఏఁ ణమో ఆహిజాఈఏ

ప్రియవిరహోऽప్రియదర్శనం చ గురుకే ద్వే అపి దుఃఖే
యయా త్వం కార్యసే తస్యై నమ అభిజాత్యై


నయవంచకులను గనుటయు,
ప్రియతము బాసిన విరహము పెను దుఃఖములే
ప్రియకరమగు నీ నడతల
నియమము పొగడగ దగినవి నిజముగ సుదతీ
… 1-24

When the person in your heart is away
and
you suffer from the pangs of separation
and when bad guys use this pretext
to take advantage of you
the sorrow is indeed unbearable
But you stand steadfast
your spotless conduct stands out
Way to go, girl!



ణవ-లఅ-పహరం అంగే జహిఁ జహిఁ మహఇ దేవరో దాఉం
రోమంచ-దండ-రాఈ తహిం తహిం దీసఇ బహూఏ

నవలతా-ప్రహారమంగే యత్ర యత్రేచ్ఛతి దేవరో దాతుం
రోమాంచ-దండ-రాజిస్తత్ర తత్ర దృశ్యతే వధ్వాః


కరమున లతతో దాకెను
మఱదియు నంగాంగములను మక్కువతో న-
త్తరి ముండ్లవోలె రోమము
లరయన్ లేచెను నవవధు వగు వదినియకున్
… 1-28

Her husband is far away
and she is newly wed
Her husband’s brother
gently with a feather
brushes all over the body
Goose-bumps and goose-bumps …
everywhere!



దిఅరస్స అసుద్ధమణస్స కులబహూ ణిఅఅ-కుడ్డలిహిఆఇం
దిఅహం కహేఇ రామాణులగ్గ-సోమిత్తి-చరిఆయిం

దేవరస్యాశుద్ధమనసః కులవధూర్నిజక-కుడ్య-లిఖితాని
దివసం కథయతి రామానులగ్నసౌమిత్రి-చరితాని


వాడే తమ్ముడు వదినను
చూడడు కన్నెత్తి వాడు చూడుము వారిన్
నాడంత జెప్పె మఱదికి
కోడలు తను పఠము జూపి కుడ్యము మీదన్
… 1-35

Look at this picture on the wall
Lakshmana
in the forest
with brother Rama and his wife
Never looked at her
and you?
you’re infatuated with me
your brother’s wife
Stop it!



ణయి-ఊరసచ్ఛహే జోవ్వణమ్మి అఇ-పవసిఏసు దిఅసేసు
అణిఅత్తాసు అ రాఈసు పుత్తి కిం దడ్ఢమాణేణ

నదీపూరసదృశే యౌవనే అతిప్రోషితేషు దివసేషు
అనివృత్తాసు చ రాత్రిషు పుత్రి కిం దగ్ధమానేన


నిండిన నదివలె యౌవన
ముండునె, యది రాదు మఱల నుసురుసు రనుటల్
దండుగ, దొరలును దినముల్
మెండుగ, రాత్రులరుదెంచు మేల్కొను మిపుడే … 1-45

Youth is a flooded river
and the flood
will not last long
But
don’t fret about it
Days roll by and nights pass
Wake up and enjoy …
No dilly-dallying!



థోఅం పి ణ ణీసరఈ మజ్ఝణ్ణే ఉహ సరీర-తల-లుక్కా
ఆఅవ-భఏణ ఛాఈ వి పహిఅ తా కిం ణ వీసమసి

స్తోకమపి న నిఃసరతి మధ్యాహ్నే పశ్య శరీర-తల-లీనా
ఆతప-భయేన చ్ఛాయాపి పథిక తక్త్విం న విశ్రామ్యసి


నడు దినమున నెండకు భయ
పడి దేహపు నీడ కనుల బడకను దాగెన్
బడలికతో నీవిప్పుడు
నడువక విశ్రాంతి గొనుము నా గృహమందున్
… 1-49

My dear traveler
Afraid of the hot sun
even the shadow
is hiding under you
unseen
Why don’t you rest your tired limbs
for a while
in my place?



ఉఅహ పడలంతరోఇణ్ణ-ణిఅఅ-తంతుద్ధ-పాఅ-పడిలగ్గం
దుల్లక్ఖ-సుత్త-గుత్థేక్క-బఉల-కుసుమం వ మక్కడఅం

పశ్యత పటలాంతరావతీర్ణ-నిజక-తంతూర్ధ్వ-పాద-ప్రతిలగ్నం
దుర్లక్ష్య-సూత్ర-గ్రథితైక-బకుల-కుసుమమివ మర్కటకం


వ్రేలాడె పట్టునుండియు
కాలికి దారము గొని తను కడు నైపుణితో
సాలెపురుగొక్క ప్రోగున
లీలగ కుట్టిన పొగడన లెస్సగ దోచెన్
… 1-63

Whilst it was hanging
upside down from the web
holding itself skillfully
with a thin thread to its leg
the spider
looked like a
flower tied to a single thread



జఇ చిక్ఖల్ల-భఉప్పఅ-పఅమిణమలసాఇ తుహ పఎ దిణ్ణం
తా సుహఅ కంఠఇజ్జంతమంగమేహ్ణిం కిణో వహసి

యది కర్దమ-భయోత్ప్లుతపదమిదమలసయా తవ పదే దత్తం
తత్సుభగ కంటకితమంగమిదాని కిమితి వహసి


నడచుచు నుండగ తనపై
బడరా దడుసంచు నీదు యడుగులలో దా
నడచుచు నుండగ చిన్నది
వడిగా పులకాంకురమ్ము వచ్చెనె నీకున్
… 1-67

After the rains
walking on the muddy path
she walks in your footsteps
carefully
and no dirt falls on her
But you,
you’re having goose-bumps all over!



బహు-వల్లహస్స జా హోఇ వల్లహా కహ వి పంచ దిఅహాఇం
సా కిం ఛట్ఠం మగ్గఇ కత్తో మిట్ఠం వ బహుఅం అ

బహువల్లభస్య యా భవతి వల్లభా కథమపి పంచ దివసాని
సా కిం షష్ఠం మృగయతే కుతో మృష్టం చ బహుకం చ


పాయక నుండునె దక్షిణ
నాయకు డాఱవ దినమున నా యింటిని, దా
నాయన జేరును సవతిని,
దీయని భక్ష్యము సతతము తినగా నగునే
… 1-72

One man
many wives!
I am one of his many wives
True he enjoyed these few days my company
Tomorrow
Am I going to keep his company still
Alas
are not sweet delicacies
strictly rationed?



జం జం సో ణిజ్ఝాఅఇ అంగోఆసం మహం అణిమిసచ్ఛో
పచ్ఛాఏమి అ తం తం ఇచ్ఛామి అ తేణ దీసంతం

యద్యత్స నిర్ధ్యాయత్యంగావకాశం మమానిమిషాక్షః
ప్రచ్ఛాదయామి చ తం తం ఇచ్ఛామి చ తేన దృశ్యమానం


ఏ యంగము చూచునొ వా-
డా యంగము కప్పుకొనగ యత్నము జేతున్
నా యంగము లగపడ నే-
నో యాశింతును మనసున నుడువగజాలన్
… 1-73

The edge of the sari is falling
What a shame
to be exposed thus
to his hungry staring looks
Let me cover myself better
Alas
in my utter confusion
am I letting him to see …
more of me?



తడ-సంఠిఅ-ణీడేక్కంత-పీలుఆ-రక్ఖణేక్క-దిణ్ణ-మణా
అగణిఅ-విణివాఅ-భఆ పూరేణ సమం వహఇ కాఈ

తట-సంస్థిత-నీడైకాంత-శావక-రక్షణైక-దత్త-మనాః
అగణిత-వినిపాత-భయా పూరేణ సమం వహతి కాకీ


నదిలో వెల్లువ వచ్చెను
నది యొడ్డున చెట్టు గూడు నదిలో బడగా
నది వేగము కాకి మఱచె
నది నిసుగును మునుగకుండ యత్నము జేసెన్
… 2-02

Roaring floods in the river
A nest from a tree on the bank
falls into the raging waters
Unaware
the mother crow
is trying to save its little one …
The current sweeps
the nest
the crow and its little one
all … in one mad rush
floating on the waters



ణిప్పచ్ఛిమాఇఁ అసఈ దుఃఖాలోఆఇఁ మహుఅ-పుప్ఫాఇం
చీఏ బంధుస్స వ అట్ఠిఆఇఁ రుఅఈ సముచ్చిణఇ

నిష్పశ్చిమాన్యసతీ దుఃఖాలోకాని మధూక-పుష్పాణి
చితాయాం బంధోరివాస్థీని రోదనశీలా సముచ్చినోతి


కాలిన దేహపు యస్తుల
కేలను వెత నేరునట్లు క్రింద పడిన యా
రాలిన కొద్ది సుమమ్ముల
బేలయు నేరెను మనసున బిక్కు కలుంగన్
… 2-04

As one picks up
with a heavy heart
ashes and bones
from the burnt body
she
gathers a few fallen flowers …
(May be no more blossoms to pick
hereafter
and no more trysts
Alas
the season of spring has ended)



కఇఅవ-రహిఅం పేమ్మం ణత్థి వ్విఅ మామి మాణుసే లోఏ
అహ హోఇ కస్మ విరహో విరహే హోత్తమ్మి కో జిఅఇ

కైతవరహితం ప్రేమ నాస్త్యేవ మాతులాని మానుషే లోకే
అథ భవతి కస్య విరహో విరహే భవతి కో జీవతి


కలదే కపట మ్ముండక
నిలపై ప్రేమయు, నటులనె యిది యుండీనచో
కలదే విరహ మ్మిలపై,
గలదే జీవము విరహము గలుగగ నత్తా
.. 2-24

Pure love
and no deceit
do they coexist?
On that day
there are no pangs of separation!
If lovers
cannot see each other
what is life
and how does one live it
tell me
dear aunt!



అచ్ఛేరం వ ణిహిం విఅ సగ్గే రజ్జం వ అమఅ-పాణం వ
ఆసి మ్హ తం ముహుత్తం విణిఅంసణ-దంసణం తీఏ

ఆశ్చ్యర్యమివ నిధిమివ స్వర్గే రాజ్యమివామృతపానమివ
ఆసీదస్మాకం తన్ముహూర్తం వినివసనదర్శనం తస్యాః


కాన వివస్త్రగ నామెను
నేనచ్చెరువందితి, నొక నిధి యనుకొంటిన్
నే నాకమొ లేక నమృత
పానమ్మో యని దలచితి పఱగగ సఖుడా
… 2-25

My dear friend
strange surprise awaited me
when I saw her for the first time
in her naked glory
Did I spy on a buried treasure
or is it an unseen heaven
Did I sip ambrosia
Did I become immortal
or
Did I experience all these –
at once?



సాలోఏ వ్విఅ సూరే ఘరిణీ ఘరసామిఅస్స ఘేత్తూణ
ణేచ్ఛంతస్స వి పాఏ ధుఅఇ హసంతీ హసంతస్స

సాలోక ఏవ సూర్యే గృహిణీ గృహస్వామినో గృహీత్వా
అనిచ్ఛతోऽపి పాదౌ ధావతి హసంతీ హసతః


సందియ కాలే దింకను
తొందరగా కడిగె కాళ్ళ దొంగ నగవులన్
సుందరి కార్యము గని పతి
యుందను నవ్వెను కతమ్ము నూహించె నిదే
… 2-30

The husband returned early
some more time for eventide
Will he leave again
may be not if I wash his feet
With an innocent smile
she was washing his feet
He guessed the reason
why she was doing this chore
He too smiled at her
innocently!



రూఅం అచ్ఛీసు ఠిఅం ఫరిసో అంగేసు జంపిఅం కణ్ణే
హిఅఅం హిఅఏ ణిహిఅం విఓఇఅం కిం త్థ దేవ్వేణ

రూపమక్ష్ణోః స్థితం స్పర్శోంऽగేషు జల్పితం కర్ణే
హృదయం హృదయే నిహితం వియోజితం కిమత్ర దైవేన


నిండగ గన్నుల రూపము
నిండగ స్పర్శల పులకము నెఱగా మెయిపై
నిండగ వీనుల మాటలు
నిండగ హృదిలో హృదయము నిడు విరహమ్మా
… 2-32

Eyes looking at eyes
currents of excitement on touch
ears filled with music
of endearing sweet nothings
one heart resting in another
Then …
this long physical separation
why
O God, why?



సహిఆహిఁ భణ్ణమాణా థణఏ లగ్గం కుసుంభ-పుప్ఫం త్తి
ముద్ధ-బహుఆ హసిజ్జఇ పప్ఫోడంతీ ణహవఆఇం

సఖీభిర్భణ్యమానా స్తనే లగ్నం కుసుంభ-పుష్పమితి
ముగ్ధవధూర్హస్యతే ప్రస్ఫోటయంతీ నఖపదాని


అరుణాశోకసుమమ్ములు
తరుణీ నీకంటె నేమొ స్తనముల గనుమా
తరుణుడు జేసిన గాటుల
తరుణియు తుడువగ జతనము తను గావించెన్
… 2-44

“Is it red juice of Asoka flowers
on your breasts, my dear?”
confronted thus by friends
the innocent girl tried to wipe off
those nail marks of her beloved ….
to no avail!



జీవిఅ-సేసాఇ మఏ గమిహా కహఁకహఁవి పేమ్మ-దుద్దోలీ
ఏహ్ణిం విరమసు రే డడ్ఢ-హిఅఅ మా రజ్జసు కహిం పి

జీవితశేషయా మయా గమితా కథం కథమపి ప్రేమదుర్దోలీ
ఇదానీం విరమ రే దగ్ధహృదయ మా రజ్యస్వ కుత్రాపి


బేల హృదయమా నీకిది
చాలదె మండితివి నిప్పు జ్వాలలలోనన్
చాలును నీకీ భారము
కాలకు మఱి కీలలందు కలవరపడుచున్
… 2-48

You had enough, my heart
You got burnt badly
Isn’t this enough for you
Why do you try to get burnt …
again and again!



విరహ-కరవత్త-దూసహ-ఫాలిజ్జం తమ్మి తీఅ హిఅఅమ్మి
అంసూ కజ్జల-మఇలం పమాణ-సుత్తం వ్వ పడిహాఇ

విరహ-కరపత్ర-దుఃసహ-పాఠ్యమానే తస్యా హృదయే
అశ్రు కజ్జల-మలినం ప్రమాణసూత్రమివ ప్రతిభాతి


విరహపు వెత ఱంపమువలె
కరకర కోసెను హృదయము కాటుక కరుగన్
కరిగీతయు హృదయముపై
కరిగీతయు దుంగపైని కరణిని దోచెన్
… 2-52

Separation cuts the heart
like a saw
She cries
and the black kohl melts
and forms a thin line
on her bosom
like the measuring line
used on logs
while cutting the wood



ఉద్ధచ్ఛో పిఅఇ జలం జహ విరలంగులీ చిరం పహిఓ
పావాలిఆ వి తహ తహ ధారం తణుఇం పి తణుఏఇ

ఊర్ధ్వాక్షః పిబతి జలం యథా యథా విరలాంగులిశ్చిరం పథికః
ప్రపాపాలికాపి తథా తథా ధారాం తనుకామపి తనూకరోతి


జల మడుగగ పాంథుం డా
జలజాక్షియు కరములందు జలమును బోసెన్
జలధారయు తగ్గె గనులు
కలియగ ధర బడెను నీళ్ళు కాలము గడిచెన్
… 2-60

The thirsty traveler
begs for water
She pours water
into the cup of his hands
He drinks
and lifts his eyes
As the eyes met
less water poured
and he lets more water down
and time ticks on!



భిచ్ఛాఅరోఁ పేచ్ఛఇ ణాహి-మండలం సావి తస్స ముహ-అందం
తం చటుఅం అ కరంకం దోహ్ణ వి కాఆ విలుంపంతి

భిక్షాచారః ప్రేక్షతే నాభి-మండలం సాపి తస్య ముఖ-చంద్రం
తచ్చటుకం చ కరంకం ద్వయోరపి కాకా విలుంపంతి


బిచ్చము నడిగిన వాడో
యచ్చెరువున నామె నాభి నవలోకించన్
మెచ్చెను శశిముఖ మామెయు
నచ్చటి కాకులు భుజించె నా భోజనమున్
… 2-61

He came to beg
and began to appreciate
her waist
She came to offer
and began to appreciate
his moonlike face
The nearby crows ate
the food from the bowl and the plate!
(The beggar is the husband in disguise and his wife
promptly identified him as her husband)



వక్కం కో పులఇజ్జఉ కస్స కహిజ్జఉ సుహం వ దుక్ఖం వా
కేణ సమం వ హసిజ్జఉ పామర-పఉరే హఅ-గ్గామే

వక్త్రం కః ప్రలోక్యతాం కస్య కథ్యతాం సుఖ వా దుఃఖం వా
కేన సమం వా హస్యతాం పామరప్రచురే హత-గ్రామే


ఎవ్వరి గ్రీగంట గనుట
యెవ్వరితో బంచుకొనుట నీ వెతసుకముల్
యెవ్వరితో నవ్వను నా
కెవ్వరు హా! బీదవార లీ గ్రామములో
… 2-63

I can’t take sidelong glances at anybody
I can’t share my experiences with anybody
I can’t heartily laugh and flirt with anybody
I can’t …
No civilized person exists
in this poor wretched god-forsaken place!



ఫలహీ-వాహణ-పుణ్ణాహ-మంగలం లంగలే కుణంతీఏ
అసఈఅ మణోరహ-గబ్భిణీఅ హత్థా థరహరంతి

కార్పాసీ-క్షేత్ర-కర్షణ-పుణ్యాహమంగలం లాంగలే కుర్వత్యాః
అసత్యా మనోరథగర్భిణ్యా హస్తౌ థరథరాయేతే


పొలమున జేసెను దా నా-
గలి పూజను రైతు చూలు గనులు చెమర్చన్
మలముగ జేసితి నే నీ
స్థల మిట్టుల యంచు నపుడు తలచుచు స్మృతులన్
… 2-64

On the eve of tilling
and planting cotton seeds
the farmer’s pregnant wife was offering
traditional flowers to the plough
with moist eyes
and thought –
“Am I defiling
the very same field
where I made love
to my secret lover …
once upon a time!”



గహ-వఇణా ముఅ-సేరిహ-డుండుఅ-దామం చిరం వహేఊణ
వగ్గ-సఆఇం ణేఉణ ణవరిఅ అజ్జా-ఘరే బద్ధం

గృహ-పతినా మృత-సైరిభ-బృహద్ఘంటాదామ చిరమూఢ్వా
వర్గ-శతాని నీత్వానంతరమార్యాగృహే బద్ధం


పోయిన మహిషపు (మహిషీ) హారము
వేయగ వేఱు మహిషముల (మహిషులను) వెదుకుచు గనకన్
గోయిలలోగల దేవత
కా యిలుఱేడొసగె తుదకు నతి వేదనతో
… 2.71

Having lost his buffalo (wife)
he removed its (his deceased wife’s)
necklace of beads
and searched in vain
to find another animal (woman)
whose neck could be adorned with it
He gifted it to the village temple … finally




గోలా-విసమోఆరచ్ఛేలణ అప్పా ఉరమ్మి సే ముక్కో
అణుఅంపాణిద్దోసం తేణ వి సా ఆఢమువఊఢా

గోదావరీ-విషమావతారచ్ఛలేనాత్మా ఉరసి తస్య ముక్తః
అనుకంపానిర్దోషం తేనాపి సా గాఢముపగూఢా


గోదావరి పులినముపై
బాధగు పడుకొనుట కాన వక్షఃస్థలిపై
తా దల నుంచగ బ్రియుడున్
మోదముతో గౌగిలించె ముదితను బిగిగా
… 2-92

Rocky and sandy Godavari banks –
not a comfortable bed to lie on
So she put her head
on the chest of her beloved
He too was understanding
and hugged her hard!



ఓహి-దిఅహాగమాసంకిరీహిఁ సహిఆహిఁ కుడ్డ-లిహిఆఓ
దో-తిణ్ణి తహిం విఅ చోరిఆఏఁ రేహా పుసిజ్జంతి

అవధి-దివసాగమాశంకినీభిః సఖీభిః కుడ్య-లిఖితాః
ద్వి-త్రాస్తత్రైవ చోరికయా రేఖాః ప్రోచ్ఛ్యంతే


వ్రాసిన గీతను ప్రతి దిన
మాసగ తుడిపెను సతి పతి యాగమనముకై
చూసిన సకియలు తుడిపిరి
వేసిన గీతలను కొన్ని వెత నిడ సఖికిన్
… 3-06

She already drew lines
counting the days of waiting
for her husband’s return
As each day passed
she wiped out the lines
one by one
Her friends wiped out
a few more
Poor girl …
on the day
when there are no more lines to wipe
where is the husband?



అజ్జం గఓత్తి అజ్జం గఓత్తి అజ్జం గోఓత్తి గణరీఏ
పఢమ వ్విఅ దిఅహద్ధే కుడ్డో రేహాహిఁ చిత్తలిఓ

అద్య గత ఇత్యద్య గత ఇత్యద్య గత ఇతి గణనశీలయా
ప్రథమ ఏవ దివసార్ధే కుడ్యం రేఖాభిశ్చిత్రితం


వెళ్ళెను నేడే, నేడే
వెళ్ళెను, నేడే తన పతి వెళ్ళే ననియున్
నల్లని గీతల వ్రాసెను
తెల్లని గోడపయి మొదటి దినమందే తాన్
… 3-08

He left today
Today he left
The husband has just
left today
So saying the wife drew lines
on the wall counting his days of absence
even before the first day ended!



సచ్చం భణామి బాలఅ ణత్థి అసక్కం వసంత-మాసస్స
గంధేణ కురవఆణం మణం పి అసయిత్తణం ణ గఆ

సత్యం భణామి బాలక నాస్త్యశక్యం వసంతమాసస్య
గంధేన కురబకాణాం మనాగప్యసతీత్వం న గతా


ఆమని కసాధ్య మిలపై
నేమియు లేదనుట నాకు నెఱుకయె మూర్ఖా
యామె పతివ్రత కురవక
మామె సుశీలతకు నడ్డె యా గంధమ్ముల్
… 3.19

Agreed
everything is possible
in the season of spring
Yet, foolish one!
She is devoted to her husband
and loves him only
The red flowers of amaranth
and their scent
cannot sway her from
her chosen path …
straight, not crooked!




పిఅ-సంభరణ-పలోట్టంత-వాహ-ధారా-ణివాఅ-భీఆఏ
దిజ్జ ఇ వంకా-గీవాఏఁ దీవఓ పహిఅ-జాఆఏ

ప్రియ-సంస్మరణ-ప్రలుఠద్బాష్ప-ధారా-నిపాత-భీతయా
దీయతే వక్త్ర-గ్రీవయా దీపకః పథిక-జాయయా


వెడలిన ప్రియతము దలువగ
వెడలెను కను కొనల నీరు విరహముతోడన్
పడి యది సంధ్యాదీపపు
కొడి నార్పునొ యంచు నామె కుత్తుక ద్రిప్పెన్
… 3-22

He is somewhere far away
and as she was lighting the evening lamp
her eyes were brimming with tears
“I cry always
my tears must not extinguish
the just lit wick”
so saying she turned her head away



తే వోలిఅ వఅస్సా తాణ కుడంగాణ థాణుఆ సేసా
అహ్మే వి గఅ-వఆఓ మూలుచ్ఛేఅం గఅం పేమ్మం

తే వ్యతిక్రాంతా వయస్యస్తేషాం కుంజానాం స్థాణవః శేషాః
వయమపి గత-వయస్కా మూలోచ్ఛేద్యం గతం ప్రేమ


ఇప్పుడు లేరా ప్రియకరు
లిప్పుడు లేవా వెదురుల యిరవులు, బోదెల్
యిప్పుడవి, వయసు మీఱిన
దిప్పుడు, ప్రేమలత వేరు లేకముగ తెగెన్
… 3-32

Those old friends no longer visit us
They are after younger girls
Those secret trysts
in bamboo groves too are gone
and only their stumps remain
Years are upon us
alas, the roots of desire
are totally cut off …



వికిణ్ణఇ మాహ-మాసమ్మి పామరో పాఇడిం వఇల్లేణ
ణిద్ధూమ-ముమ్ముర వ్విఅ సామలీఁఅ థణో పడిచ్ఛంతో

విక్రీణితే మాఘమాసే పామరః ప్రావరణం బలీవర్దేన
నిర్ధూమముర్మురనిభౌ శ్యామల్యాః స్తనౌ పశ్యన్


రవికను విప్పెను సతి వే-
సవి యుక్కను నోర్వలేక స్తనములొ పొగ లే-
క వెలుంగు నిప్పు, శైత్యము
నివంగ నమ్మెను పశువుల నెంతయొ ప్రేమన్
… 3.38

Summer’s heat
verily a cauldron
the poor farmer’s wife was blouseless
and
her breasts were
mounds of smokeless fire
The husband sold his bullocks,
his only wealth,
to buy materials to make her
cool and comfortable



సచ్చం భణామి మరణే ట్ఠిఅహ్మి పుణ్ణే తడమ్మి తావీఏ
అజ్జ వి తత్థ కుడంగే ణివడఇ దిట్ఠీ తహచ్చేఅ

సత్యం భణామి మరణే స్థితాస్మి పుణ్యే తటే తాప్యాః
అద్యాపి తత్ర నికుంజే నిపతతి దృష్టిస్త థైవ


ఇవి నా కడసరి రోజులు
చవి యనుభవముల దలచితి సకియా నిజమై
కవగా రేవాతటిలో
బవిత్ర వంశీవనమ్ము వచ్చెను స్మృతికిన్
… 3-39

Those sweet bygone days with him
in the bamboo groves
on the banks of Narmada
are flooding my memory …
as my last days are drawing near



వేవిర-సిణ్ణ-కరంగులి-పరిగ్గహ-క్ఖసిఅ-లేహణీ-మగ్గే
సోత్థి వ్విఅ ణ సమప్పఇ పిఅసహి లేహమ్మి కిం లిహోమి

వేపనశీల-స్విన్న-కరాంగులి-పరిగ్రహ-స్ఖలిత-లేఖనీ-మార్గే
స్వస్తేవ న సమాప్యతే ప్రియసఖి లేఖే కిం లిఖామః


తడిసెను చెమటల జేతులు
గడగడ వడకేను వ్రేళ్ళు కలమది జారెన్
నుడువగ లే “శ్రీ” యంచును
నిడుదగ నేమని రచింతు నెచ్చెలి చెపుమా
… 3-44

My hands are
moist with sweat
my fingers are trembling
the stylus has fallen from my hand
Even the first word is incomplete
Tell me how to pour myself
into this letter to him …
far away, and eagerly in anticipation?



సో అత్థో జో హత్థే తం మిత్తం జం ణిరంతరం వసణే
తం రూఅం జత్థ గుణా తం విణ్ణాణం జహిం ధమ్మో

సోऽర్థో యో హస్తే తన్మిత్రం యన్నిరంతరం వ్యసనే
తద్రూపం యత్ర గుణాస్తద్విజ్ఞానం యత్ర ధర్మః


కరముల నున్నది ధనమగు,
చిర బాధలలో దరి గల సిరి నెయ్యమె, యా
స్థిరమగు ధర్మమె జ్ఞానము,
వర సద్గుణములె చెలువము వసుధన్ గనగా
… 3-51

Money is what one has in hands
Friendship is the nearest one
giving solace in hardships
Good conduct is beauty
and
righteousness is the greatest wealth



గఅ-కలహ-కుంభ-సంణిహ-ఘణాపీణ-ణిరంతరేహిఁ తుంగేహిం
ఉస్ససిఉం పి ణ తీరహ కిం ఉణా గంతుం హఅ-థణేహిం

గజ-కలభ-కుంభ-సన్నిభ-ఘన-పీననిరంతరాభ్యాం తుంగాభ్యాం
ఉచ్ఛ్వసితుమపి న తీరయతి కిం పునర్గంతుం హతస్తనాభ్యాం


అరుల మనస్సుల క్షోభము
కరిగండస్థలము బోలు కవ చన్నులు యా
పురుషుల నుసిగొల్పు సొబగు
సిరి కలశమ్ములను వృథగ జేయుట సరియే
… 3-58

They make the rival girls nervous
Thet provoke the hearts of young men
those cups of beauty
that resemble the mounds of the elephant
Those twin breasts
Girl, why don’t you make use of them …
and love some one?



కీరంతీ వ్విఅ ణాసఇ ఉఅఏ రేహ వ్వ ఖల-అణే మేత్తీ
సా ఉణ సుఅణమ్మి కఆ అణహా పాహాణ-రేహ వ్వ

క్రియమాణైవ నశ్యత్యుదకే రేఖేవ ఖలజనే మైత్రీ
సా పునః సుజనే కృతా అనఘా పాషాణరేఖేవ


నీటను గీచిన గీతయె
కూటమి జేయుట మహిపయి కుజనులతోడన్
కూటమి సత్పురుషులతో
పాటవమగు ఱాతిగీత, పాడవకుండున్
… 3-70

Lines drawn on water
vanish as soon as they are drawn
and so does the friendship with the evil
Friendship with the good is
like a line drawn on rock, never erased




సేఅ-చ్ఛలేణ పేచ్ఛహ తణుఏ అంగమ్మి సే అమాఅంతం
లావణ్ణం ఓసరఇ వ్వ తివలి-సోవాణ-వత్తీఏ

స్వేదచ్ఛలేన పశ్యత తనుకేంऽగే తస్యా అమాత్
లావణ్యమపసరతీవ త్రివలీ-సోపాన-పంక్తిక్తభిః


సన్నగ నయ్యెను పాపము
చిన్నది లావణ్య నదియు స్వేదముగానై
తిన్నగ ముడుతల మెట్టుల
చెన్నుగ దిగజారి కారె సెలవలె గనగా
… 3-76

She is emaciated
and all her beauty is flowing
slowly down the folds of her stomach
in the form of sweat



ఫల-సంపత్తీఅ సమోణఆఇఁ తుంగాఇఁ ఫల-విపత్తీఏ
హిఅఆఇ సుపురిసాణం మహా-తరూణం వ సిహరాఇం

ఫలసంపత్యా సమవనతాని తుంగాని ఫలవిపత్యా
హృదయాని సుపురుషాణాం మహాతరూణామివ శిఖరాణి


తరువులు ఫలముల నిండగ
బరువున దలవంచు, లేచు ఫలరహితమ్మై
ధరలో నతులు సిరిన్ స-
త్పురుషులు, యున్నతులు లేమి పొందిన వేళన్
… 3-80

Those tall trees
laden with fruits bend down
and stand erect when bare
Likewise
the wise are humble when laden with riches
and stand tall when struck with penury



ధావఇ విఅలిఅ-ధమ్మిల్ల-సిచఅ-సంజమణ-వావడ-కరగ్గా
చందిల-భఅ-వివలాఅంత-డింభ-పరిమగ్గిణీ ఘరిణీ

ధావతి విగలిత-ధమ్మిల్ల-సిచయ-సంయమన-వ్యాపృత-కరాగ్రా
చందిల-భయ-విపలాయమాన-డింభ-పరిమార్గిణీ గృహిణీ


క్షురికను జూడగ మంగలి
కరమున బాలుడు పరుగిడె గ్రక్కున దానున్
కరముల జడ వేయుచునే
పరిగెత్తెను మాత వాని బట్టగ వేగన్
… 3-89

One look at the knife
in the hands of the barber …
promptly
the boy took to his feet
and the mother too followed
to catch her son
still braiding her hair
with her fingers



మాస-పసూఅం ఛమ్మాస-గబ్భిణిం ఏక్కదిఅహ-జరిఅం చ
రంగత్తిణ్ణం చ పిఅం పుత్తఅ కామంతఓ హోహి

మాసప్రసూతాం షణ్మాస-గర్భిణీమేక-దివస-జ్వరితాం చ
రంగోత్తీర్ణా చ ప్రియాం పుత్రక కామాయమానే భవ


నెల దిరిగిన శిశుమాత, నా-
ఱ్నెల దిరిగిన గర్భవతిని, నృత్యము ముగియన్
వెలివచ్చిన నర్తకి, దిన
మలసిన రుజవతిని నీవు మరులన్ గొనరా
… 3-99

May you satisfy the desires of
a new mother having a one month old child
a pregnant woman of six months
a dancer who has just performed on the stage
and a woman who is feverish for a day!



అహ అమ్హ ఆఅదో అజ్జ కులహరాఓ త్తి ఛేంఛఈ జారం
సహసాగఅస్స తురిఅం పఇణో కంఠం మిలావేఇ

అసావస్మాకమాగతోऽద్య కులగృహాదిత్యసతీ జారం
సహసాగతస్య త్వరితం పత్యుః కంఠే లగయతి


మా యమ్మ బంప వచ్చే
నీయన మన యింటి కిప్పు డీతని గనుమం
చాయమ జారుని వచ్చిన
నాయకునికి జాణతనమునన్ జెప్పెనుగా
… 4-01

He is related to my parents
and has come to visit us
So did she introduce her lover
to her husband who was just returning home



ఏద్ద హ-మేత్తమ్మి జఏ సుందర-మహిలా-సహస్స-భరిఏ వి
అణుహరఇ ణవర తిస్సా వామద్ధం దాహిణద్ధస్స

ఏతావన్మాత్రే జగతి సుందర-మహిలా-సహస్ర-భూతేऽపి
అనుహరతి కేవలం తస్యా వామార్ధ దక్షిణార్ధస్య


సుందరు లెందఱొ జగమున
నందఱివలె కాదు యీమె యా యొడలం దీ
సుందరి ఎడమకు సాటిగ
సుందరి కుడియే సరియగు సుందర యెపుడున్
… 4-03

So many beautiful women are there in this world
She is unlike them
To equal the beauty on her left side
there is only her right side
and nothing else and nobody else



కీర-ముహ-సచ్ఛహేహిం రేహఇ వసురా పలాస-కుసుమేహిం
బుద్ధస్స చలణ-వందణ-పడిఏహిఁ వ భిక్ఖు-సంఘేహిం

కీరముఖసదృక్షై రాజతే వసుధా పలాశకుసుమైః
బుద్ధస్య చరణవందనపతితైరివ భిక్షుసంఘైః


మోదుగు పూవులు బుద్ధుని
పాదములను దాకు బిక్షు పరివార మనన్
పాదపములనుండి బడే
నా ధరణికి చిలుక ముక్కు లనగా సొబగై
… 4-08

During the spring
the red palaasha flowers
resembling the parrot beaks
fell to the ground
looking like the followers of the Buddha
dressed in saffron
prostrating before him
(and don’t forget my dear girl
that is the place of your tryst with him)



కలహంతరే వి అవిణిగ్గఆఇఁ హిఅఅమ్మి జరమువగఆఇం
సుఅణ-కఆఇఁ రహస్సాఇఁ డహఇ ఆఉక్ఖఏ అగ్గీ

కలహాంతరేऽప్యవినిర్గతాని హృదయే జరాముపగతాని
సుజన-శ్రుతాని రహస్యాని దహత్యాయుఃక్షయేऽగ్నిః


కలహ మ్మాగగ, మదిలో-
పల దప్పక నుంచుకొనుచు పరమ రహస్య-
మ్ముల నుందు రుత్తమ పురుషు
లిలపై బూడి దగుదనుక నిహ దేహమ్ముల్
… 4-21

Even after the conflict ends
the wise will never reveal their secrets
they will keep them confidentially
until their bodies are consigned to flames



చిక్ఖిల్ల-ఖుత్త-హలముహ-కఢ్ఢణ-సిఠిలే పఇమ్మి పాసుత్తే
అప్పత్త-మోహణ-సుహా ఘణసమఅం పామరీ సవఇ

కర్దమమగ్ర-హలముఖ-కర్షణ-శిథిలే పత్యౌ ప్రసుప్తే
అప్రాప్త-మోహన-సుఖా ఘనసమయం పామరీ శపతి


అడుసున చిక్కిన నాగలి
గడు యత్నమ్మున వెలుపలి కత డెత్తెను దాన్
బడలికతో రైతప్పుడు
పడుకొనగా పడుచు భార్య వానను దిట్టెన్
… 4-24

The plough was stuck in the mud
Huffing and puffing
The farmer got it out
and his tired body
needed rest and relaxation
His young wife began
to curse the cause of all this … the rains!
(Ah, impotence for unfulfilled desires!)



కుసుమ-మఆ వి అఇ-ఖరా అనద్ధ-ఫంసా వి దూసహ-పఆవా
భిందంతా వి రఇఅరా కామస్స సరా బహు-విఅప్పా

కుసుమమయా అప్యతిఖరా అలబ్ధస్పర్శా అపి దుఃసహప్రతాపాః
భిందంతోऽపి రతికరాః కామస్య శరా బహువికల్పాః


వాడియె సుమమయమైనను
వేడిమి నిడి తాకకుండ వెచ్చగనుండున్
జూడగ నెదలో గ్రుచ్చిన
గూడ సుఖమ్ముల నొసగెడు కోలలె యవియున్
… 4-26

Made of flowers
they are soft, yet sharp
even without actually touching
they generate heat
even when they pierce the heart
they offer comfort
No wonder
they are Cupid’s arrows



ఓసహిఅ-ణో పఇణ సలాహమాణేణ అఇచిరం హసిఓ
చందోత్తి తుజ్ఝ వఅణో విఇణ్ణ-సుమంజలి-విలక్ఖో

ఆవాసథికజనః పత్యా శ్లాఘమానేనాతిచిరం హసితః
చంద్ర ఇతి తవ వదనే వితీర్ణకుసుమాంజలివిలక్షః


ఆ జాబిల్లియె వదనము
పూజార్హ మనెను ద్విజుండు బూవులతోడన్
బూజారియు సిగ్గిలగా
నా జామాతయు నది గని యాగక నవ్వెన్
… 4-46

Your moonlike face
is fit for worship
So saying the young priest
touched her when offering flowers
O how bashful was he –
even in disguise –
The husband by her side
began to laugh – nonstop!



అంతో-హుత్తం డజ్జఇ జాఆ-సుణ్ణే ధరే హలిఅ-ఉత్తో
ఉక్ఖాఅ-ణిహాణాఇఁ వ రమిఅ-ట్ఠాణాఇఁ పేచ్ఛంతో

అంతరభిముఖం దహ్యతే జాయాశూన్యే గృహే హాలికపుత్రః
ఉత్ఖానిధానానీవ రమితస్థానాని పశ్యన్


గోతు లసహ్యము చూడగ
పాతరకై భూమి ద్రవ్వ, పలు చోటులలో
ప్రాత దినాలన్ సలిపిన
చేతోభవకేళి దల్చి చింతిలె వాడున్
… 4-73

Digging for buried treasure leaves
an eyesore of pits and mounds
Is it not true for reminiscences too
Ah, those trysts
and
amorous encounters with her!
Where is she now in this empty nest?



జం జం కరోసి జం జం జప్పసి జహ తుమ ణిఅచ్ఛేసి
తం తమణుసిక్ఖిరీఏ దీహో దీఅహో ణ సంపడఇ

యద్యత్కరోషి యద్యజ్జల్పసి యథా త్వం నిరీక్షసే
తత్తదనుశిక్షణశీలాయా దీర్ఘో దివసో న సంపద్యతే


నీవాడిన యాటలు బలు
నీవాడిన మాటలు బలు నివ్వెఱ నిచ్చున్
నీవు గనిన దృశ్యము లవి
యీ వనితకు నొక దినమున నెఱుగగ వశమా
… 4-78

What you did
what you said
what you saw
are matchless and endless
How can I pour over these all
that too
in a day’s span?



భండంతీఅ తణాయిం సోత్తుం దిణ్ణాఇఁ జాఇఁ పహిఅస్సా
తాఇం చ్చేఅ పహాఏ అజ్జా ఆఅట్టఇ రుఅంతీ

భర్త్సయంత్యా తృణాని స్వప్తుం దత్తాని యాని పథికస్య
తాన్యేవ ప్రభాతే ఆర్యా ఆకర్షతి రుదతి


ప్రాతఃకాలము పథికుని
జూతము గోశాల ననుచు సుందరి వెళ్ళెన్
యాతడు లేడట, కయ్యము
జేతునె యని గడ్డి గొనుచు జింతిలి యేడ్చెన్
… 4.79

In the morning
she visited the cowshed
to enquire of the traveler
there is no trace of him
Only the bed of straw remained
and
she gathered the straw with both her hands
and began to wail –
“Why did I quarrel with him?”
(Alas,
I knew he was my lover in disguise
and I still quarreled!)



అజ్జ సహికేణ గోసే కం పి మణే వల్లహం భరంతేణ
అమ్హం మఅణ-సరాహఅ-హిఅఅ-వ్వణ-ఫోడనం గీఅం

అద్య సఖి కేన ప్రాతః కామాపి మన్యే వల్లభాం స్మరతా
అస్మాకం మదన-శరాహత-హృదయ-వ్రణ-స్ఫోటనం గీతం


ఉదయమె విరహపు గీతిక
మదిలో దన చెలి దలంచి మ్రగ్గుచు నెవరో
వ్యధతో పాడగ కలగెను
మదనశరాఘాతమైన మానస మిపుడున్
… 4.81

Struck with the blow of separation
from the beloved
someone is singing sadly
this early in the morning
Already
struck with the blow of separation
from my beloved
makes the misery
all the more unbearable



పసిఅ పియే కా కువిఆ సుఅణు తుమం పరఅణమ్మి కో కోవే
కో హు పరో నాహ తుమం కీస అపుణ్ణాణ మే సత్తీ

ప్రసీద ప్రియే కా కుపితా సుతను త్వం పరజనైః కః కోపః
కః ఖలు పరో నాథ త్వం కిమిత్యపుణ్యానాం మే శక్తిః


కోపము చాలును, ఎవరికి
కోపమొ, నీవే కుపితవు, కోప మొరులపై?
నే పరుడనె? యౌ, నెటులో?
పాపులపై కినుక బూన బలమా నాకున్?
… 4-84


(అతడు: కోపము చాలును, ఆమె: ఎవరికి కోపమొ, అతడు: నీవే కుపితవు, ఆమె: కోప మొరులపై? అతడు: నే పరుడనె? ఆమె: ఔను, అతడు: ఎటులో? ఆమె: పాపులపై కినుక బూన బలమా నాకున్?)

Don’t be angry!
Who is angry?
You are!
One never gets angry with strangers!
Am I a stranger?
Yes!
How?
I don’t feel like becoming angry with
those who offend me!
(Yes, you did offend me!)




ఏహిసి తుమం త్తి ణిమిసం వ జగ్గిఅం జామిణీఅ పఢమద్ధం
సేసం సంతావ-పరవ్వసాఇ వరిసం వ వోలిణం

ఏష్యసి త్వమితి నిమిషమివ జాగరితం యామిన్యాః ప్రథమార్ధం
శేషం సంతాప-పరవశాయా వర్షమివ వ్యతిక్రాంతం


క్షణమున గడపితి రేతిరి
మును భాగము నీవు వచ్చి మును నిల్తువనిన్
వెనుకటి భాగము రావని
యనుకొని వరుసమువలె నయె వ్యధతో నాకున్
… 4.85

With the expectancy of your arrival
the first half of the night passed off
in a jiffy!
Realizing that after all you won’t meet me
the latter half was like a long year …
never ending!



సిక్కిరిఅ-మణిఅ-ముహ-వేవిఆఇఁ ధుఅ-హత్థ-సింజిఅవ్వాఇం
సిక్ఖంతు వోడహీఓ కుసుంభ తుమ్హ ప్పసాఏణ

సీత్కృతమణితముఖవేపితాని ధుతహస్తశింజితవ్యాని
శిక్షతు కుమార్యః కుసుంభ యుష్మత్ప్రసాదేన


పాయక తరుణు లెఱుగుదురు
జేయుట మణితమ్ముల బలు చీత్కారములన్
జేయుట కరతాళమ్ముల
నా యాననముల నిటునటు నాడ్చుట మదనా
… 4.92

Thanks to you
O God of Love
the young women learn quickly
to utter sounds of joy
to utter orgasmic shrieks
to clap their hands
and to nod their heads from side to side



మజ్ఝాహ్ణ-పత్థిఅస్స వి గిమ్హే పహిఅస్స హరఇ సంతావం
హిఅఅ-ట్ఠిఅ-జాఆ-ముహ-మఅంక-జోహ్ణా-జల-ప్పవహో

మధ్యాహ్న-ప్రస్థితస్యాపి గ్రీష్మే పథికస్య హరతి సంతాపం
హృదయ-స్థిత-జాయా-ముఖ-మృగాంక-జ్యోత్స్నా-జల-ప్రవాహః


వేసవి నడు దినమందు ప్ర-
యాసల వచ్చిన యతనికి నగపడి యెదురై
యాసల మదిలో నింపెడు
యా సతి శశిముఖి బలుకగ నలసట గలదే
… 4-99

Emaciated by the intensity of the mid-day sun
the husband returns home
The cool moon-like face of the wife welcomes him
Where did the wretched tiredness go
Did it melt away
in the coolness of her affection



డజ్ఝసి ఇజ్ఝసు కట్టసి కట్టసు అహ ఫుడసి హిఅఅ తా ఫుడసు
తహ వి పరిసేసిఓ చ్చిఅ సోహు మఏ గలిఆ-సబ్భావో

దహ్యసే దహ్యస్వ క్వథ్యసే క్వథయస్వ అథ స్ఫుటసి హృదయ తస్ఫుట
తథాపి పరిశేషిత ఏవ స ఖలు మయా గలితసద్భావః


కాలవలెనన్న గాలుము
మాడుచు మరుగవలెనన్న మరుగుము మనసా
చీలవలెనన్న జీలు
మ్మేలు నతడె నను సుభావహీనుండైనన్
… 5-01

If you feel like burning, burn
if you feel like boiling, boil
if you feel like breaking, break
O heart
even if he is indeed bad
Yes, I am blind, I love him!




ఏఏణ చ్చిఅ కంకేల్లితుజ్ఝ తం ణత్థి జం ణ పజ్జత్తం
ఉవమిజ్జఇ జం తుహ పల్లవేణ వరకామిణీ హత్థో

ఏతేనైవ కంకేల్లే తవ తన్నాస్తి యత్ర పర్యాప్తం
ఉపమీయతే యత్తవ పల్లవేన వరకామినీహస్తః


సుందరమగు నీ పత్రపు
టందము యామె కరము లని యందురు తెలుసా
సుందరి యందము నీవలె
సుందరమే వంజుళతరుసుందర నిజమై
… 5-04

Her tender reddish hands
are like your leaves
If you are a personification of beauty
indeed, she too is
O Ashoka tree!



రసిఅ విఅట్ఠ విలాసిఅ సమఅణ్ణఅ సచ్చఅం అసోఓ సి
వర-జుఅఇ-చలణ-కమలాహఓ వి జం విఅససి సఏహ్ణం

రసిక విదగ్ధ విలాసిన్సమయజ్ఞ సత్యమశోకోऽసి
వర-యువతి-చరణ-కమలాహతోऽపి యద్వికససి సతృష్ణం


ఇల రసికుడవు, చతురుడవు,
విలాసుడవు నీవశోక వృక్షమ, నీకున్
గల దా సమయజ్ఞత నిను
చెలువపు స్త్రీ తాక వేగ జిగురింతువుగా
… 5-05

You have good taste
You are artful
You are playful
You think fast
And when a beautiful damsel’s feet
touch you, you come to life …
instantaneously!



ఏత్తాఇచ్చిఅ మోహం జణేఇ బాలత్తణే వి వట్టంతీ
గామాణి-ధూఆ విస-కందలివ్వ వడ్ఢీఆఁ కాహిఇ అణత్థం

ఏతావత్యేవ మోహం జనయతి బాలత్వేऽపి వర్తమానా
గ్రామణీదుహితా విషకందలీవ వర్ధితా కరిష్యత్యనర్థం


చిన్నదిగానున్నను దన
కన్నులతో రైతుబిడ్డ కదిలించునుగా
చిన్నది పెరిగిన విషతరు
వన్నది నిజమై యనర్థ మందించు గదా
… 5-10

This farmer’s daughter is so young
yet she attracts attention
with a roll of her eyes
She is sure to grow into
a poisonous tree
with calamitous consequences!



ఖణ-భంగురేణ పేమ్మేణ మాఉఆ దుమ్మిఅహ్మా ఏత్తాహే
సివిణఅ-ణిహి-లంభేణ వ దిట్ఠ-పణట్ఠేణ లోఅమ్మి

క్షణ-భంగురేణ ప్రేమ్ణా మాతృష్వసః దూనాః స్మ ఇదానీం
స్వప్న-నిధి-లంభేనేవ దృష్టప్రనష్టేన లోకే


క్షణమం దగపడి వేఱొక
క్షణమున మరుగగు నిధి యది కలలోన గదా
క్షణమున కరిగెను పిన్నీ
ఘనమగు నా ప్రేమ యదియు కడు బాధ లిడన్
… 5-23

Like a treasure
that appears a moment
and disappears the next moment
in a dream
my love too has dissolved
just like that
drowning me in great grief, my dear aunt!



అణ్ణో కో వి సుహావో మమ్మహ-సిహిణో హలా హఆసస్స
విజ్ఞాఇ ణీరసాణాం హిఅఏ సరసాణఁ ఝత్తి పజ్జలఇ

అన్యః కోऽపి స్వభావో మన్మథ-శిఖినో హలా హతాశస్య
నిర్వతి నీరసానాం హృదయే సరసానాం ఝటితి ప్రజ్వలతి


అసలీ నిప్పది యేమో
రసమయ హృదయముల నెంతొ రాజిలి వెల్గున్
రసరహితమ్మగు హృదులన్
మిసి లేకనె యారు ప్రకృతి మేరల మీఱున్
… 5-30

What a strange sort of fire
this love is
It transcends natural laws
and makes its own
It does not glow in dry hearts
but
lights up brilliantly in juicy hearts



పాఅ-పడిఓ ణ గణిఓ పిఅం భణంతో వి అప్పిఅం భణిఓ
వచ్చంతో వి ణ రుద్ధో భణ కస్స కఏ కఓ మాణో

పాదపతితో న గణితః ప్రియం భణన్నప్యప్రియం భణితః
వ్రజన్నపి న రుద్ధో భణ కస్య కృతే కృతో మానః


పదముల బడ గమనించవు
ముదముగ మాటాడ కసిరి పొమ్మన్నావే
వదలగ వెను బిల్వవు నీ
మదిలో నా గర్వ మేల మదవతి యెఱుగన్
… 5-32

When he fell at your feet
you ignored
When he spoke to you tenderly
you snapped back
When he was taking leave
you didn’t call him back
Girl
I just don’t know what you think of yourself …
really!



అవిరల-పడంత-ణవ-జల-ధారా-రజ్జు-ఘడిఅం పఅత్తేణ
అపహుత్తో ఉక్ఖేత్తుం రసఇ వ మేహో మహిం ఉఅహ

అవిరలపతన్నవజలధారారజ్జుఘటితాం ప్రయత్నేన
అప్రభవన్నుత్క్షేప్తుం రసతీవ మేఘో మహీం పశ్యత


ఎడతెగకుండగ వర్షము
పడుచుండగ నీటిధార పగ్గముతోడన్
గడవను లాగక లేకను
సడి సేయుచునుండె నింగి చంచలకరయై
… 5-36

The rains were nonstop and continuous
The thick stream of water looked like a rope
with which the sky was trying
to draw the water pot of earth
and unable to do so
it was shrieking loudly
with thunder and lightning!



ఓ హిఅఅ ఓహి-దిఅహం తఇఆ పడివిజ్జఊణ దఇఅస్స
అత్థేక్కాఉల వీసంభ-ఘాఇ కిం తఇ సమారద్ధం

హే హృదయ అవధిదివసం తదా ప్రతిపద్య దయితస్య
అకస్మాదాకుల విస్తంభఘతిన్ కిం త్వయా సమారబ్ధం


మనసా తల నూపితివే
చనుచున్నప్పుడు ప్రియుండు జ్ఞప్తిని గలదా
విను నీవిప్పుడు వానిని
నిను వీడిన నిర్ఘృణుడని నిందించెదవే
… 5.37

When he was taking leave of you
before his sojourn
you nodded your head dumbly
and today
you’re calling him pitiless and selfish!




రఇ-కేలి-హిఅ-ణిఅంసణ-కర-కిసలఅ-రుద్ధ-ణఅణ-జుఅలస్స
రుద్దస తఇఅ-ణఅణం పవ్వఇ-పరిఉంబిఅం జఅఇ

రతి-కేలి-హృత-నివసన-కర-కిసలయ-రుద్ధ-నయన-యుగలస్య
రుద్రస్య తృతీయ-నయనం పార్వతీ-పరిచుంబితం జయతి


రతికేళివేళ బట్టల
పతి విప్పగ లజ్జితయయి పార్వతి మూసెన్
బతి కందోయిని, ముద్దిడె
నతిగా నపు డగ్గి కంటి, నది జయ మవుతన్!
… 5-55

As Siva disrobed her to make love
the bashful Parvati
closed His two eyes
and then kissed His third eye –
the eye of fire!
May Siva’s third eye be victorious
and bring prosperity!



ఆవణ్ణఇఁ కులాఇం దో వ్విఅ జాణంతి ఉణ్ణఇం ణేఉం
గోరిఅ హిఅఅ-దఇఓ అహివా సాలాహణ-ణరిందో

ఆపన్నాని కులాని ద్వావేవ జానీత ఉన్నతిం నేతుం
గౌర్యా హృదయ-దయితోऽథవా శాలివాహన-నరేంద్రః


పలు కష్టమ్ములతో బ్రదుకున
నిలుచుచు పోరాడుచుండు నిర్భాగ్యులకున్
దొలగించు గష్టము శివుడు, కు-
వలయాధీశుండు శాతవాహనుడు సదా
… 5-67

For those who have fallen behind
and are down with their luck
only two offer succour …
Lord Shiva and King Satavahana!



ఆఅంబ-లోఅణాణం ఓల్లంసుఅ-పాఅ-డోరు-జహణాణం
అవరహ్ణ-మజ్జిరీణం కఏ ణ కామో వహఇ చావం

ఆతామ్ర-లోచనానామాద్రాంశుక-ప్రకటోరు-జఘనానాం
అపరాహ్ణ-మజ్జనశీలానాం కృతే న కామో వహతి చాపం


అరుణమ్మగు కన్నులతో
తరుణులు తమ మొలల దొడల తడిబట్టలతో
చెరువున జూపుచు నాడగ
విరియమ్ముల మదను డెక్కు పెట్టక విడునా
… 5-75

With reddening eyes
the young women are bathing at noon time
and the clinging wet clothes
reveal their thighs and hips
How can the love god keep quiet
and not act
without aiming his arrows –
the arrows of flowers?



అణ్ణా వరాహ-కువిఓ జహతహ కాలేణ గమ్మఇ పసాఅం
వేసత్తణావరాహే కువిఅం కహఁ తం పసాఇస్సం

అన్యాయాపరాధకుపితో యథాతథా కాలేన గచ్ఛతి ప్రసాదం
ద్వేష్యత్వపరాధే కుపితం కథం తం ప్రసాదయిష్యామి


అపరాధములన్ జేయగ
కుపితుని కృప జూప జేయు గుట్టు నెఱుగుదున్
విపరీత ద్వేష మ్మది
కుపితుని జేయంగ నెట్లు కోపము కరగున్
… 5-88

When he becomes cross with me
I know the tricks to pacify him
But
he is jealous and suspicious
and is consumed by anger
How to cool him now?



దీససి పిఆణి జంపసి సబ్భావో సుహఅ ఏత్తిఅ వ్వేఅ
ఫాలేఇఊణ హిఅఅం సాహసు కో దావఏ కస్స

దృశ్యసే ప్రియాణి జల్పసి సద్భావః సుభగ ఏతావానేవ
పాటయిత్వా హృదయం కథయ కో దర్శయతి కస్య


నను జూతువు నగవులతో
వినిపింతువు నీ పలుకుల బ్రియకరముగ న-
త్యనునయముగ నుందువె యా
మనసును విప్పగ నొరులకు మఱి యెట్లగునో
… 5-89

You meet me with pleasure
You talk with me sweetly
You move with me like a dear friend
But
who can tell what thoughts reside
in the mind of others?
(Do you love me or not?)



రోవంతి వ్వ అరణ్ణే దూసహ-రఇ-కిరణ-ఫంస-సంతత్తా
అఇ-తార-ఝిల్లి-విరుఏహిఁ పాఅవా గిమ్హ-మజ్ఝహ్ణే

రుదంతీవారణ్యే దుఃసహ-రవి-కిరణ-స్పర్శ-సంతప్తాః
అతి-తార-ఝిల్లీ-విరుతైః పాదపా గ్రీష్మ-మధ్యాహ్నే


ఎండాకాలములో సూ-
ర్యుండు వడను గాయుచుండ నురు వృక్షతతుల్
బెండుగ నడవి నిలువ, నం-
దుండెడు పురుగులు సడులను తుర్రున జేసెన్
… 5-94

The searing summer heat
transformed these big forest trees
into leafless stumps
The insects that swarmed them
are making an incessant noise



ఖేమం కంతో ఖేమం జో సో ఖుజ్జంబఓ ఘరద్దారే
తస్స కిల మత్థఆఓ కో వి అణత్థో సముప్పణ్ణో

క్షేమం కుతః క్షేమం యోऽసౌ కుబ్జామ్రకో గృహద్వారే
తస్య కిల మస్తకాత్కోऽప్యనర్థః సముత్పన్నః


నెమ్మది యెక్కడ బ్రదుకున
నమ్మానిసి యిందు లేడు యతడెట గలడో
నెమ్మది మామిడి చెట్టని
నమ్మగ నది యిప్డు కొనల ననల దొడంగెన్
… 5-99

Where is the peace of mind
when he is in a distant land –
I know not where –
That little mango tree in the courtyard
makes my days passable as I reminisce
But
even that is sprouting some little flowers
Ah – cruel spring!



వాఉద్ధ అ-సిచఅ-విహావిఓరు-దిట్ఠేణ దంత-మగ్గేణ
బహు-మాఆ తోసిజ్జఇ ణిహాణ-కలసస్స వ ముహేణ

వాతోద్ధత-సిచయవిభావితోరు-దృష్టేన దంత-మార్గేణ
వధూ-మాతా తోష్యతే నిధాన-కలశస్యేవ ముఖేన


మొలకల నుంచునపుడు ధర
గలశము గనబడ ముదమ్ము గలుగు విధానన్
గలిగెను కూతురి చీరయు
తొలగగ గాలికి తను గన దొడపై గాటుల్
… 6-07

The breeze blew away the sari
and in a fleeting moment
revealed the thighs of the daughter
and the mother glanced
at the bite wounds on her thighs
(during love play)
She felt so happy
as if a pot of gold was unearthed
during planting



వేసోసి జీఅ పంసుల అహిఅఅరం సాహు వల్లభా తుజ్ఝ
ఇఅ జాణిఊణ వి మఏ ణ ఈసిఅం దడ్ఢ-పేమ్మస్స

ద్వేష్యోऽసి యస్యాః పాఙ్సూల అధికతరం సా ఖలు వల్లభా తవ
ఇతి జ్ఞాత్వపి మయా న ఈర్ష్యితం దగ్ధప్రేమ్ణః


నిను నే బ్రేమించితి నను
గనులెత్తి గనవు దలంచి కామిని యొకతెన్
నిను ద్వేషించే నామెయు
నిను బ్రేమించుట తగ దిక నిర్లజ్జుండా
… 6-10

I loved you with all my heart
you looked the other way
as if I didn’t exist
Now you’re loving another
she looks the other way
as if you don’t exist
Why should I love you still
O shameless one!



కిం రువసి కిం అ సోఅసి కిం కుప్పసి సుఅణు ఏక్కమేక్కస్స
పేమ్మం విసం వ విసమం సాహసు కో రుంధిఉం తరఇ

కిం రోదషి చ రోచసి కిం కుప్యసి సుతను ఏకైకస్మై
ప్రేమ విషమివ విషమం కథయ కో రోద్ధుం శక్నోతి


ఎందుకె యేడ్పులు, శోక
మ్మెందుకె, పరులపయి కోప మెందుకె నీకున్
సుందరి ప్రేమయు విషము, వ-
సుంధర నాపుట వలపును జోద్యమ్మె గదా
… 6-16

Why these tears
why this sadness
and why this unnecessary anger on others?
Love is like a poison
Who can find antidote to its effects?



హసిఅం అదిట్ఠ-దంతం భమిఅమణిక్కంత-దేహలీ-దేసం
దిట్ఠ మణుక్ఖిత్త-ముహం ఏసో మగ్గో కుల-వహూణం

హసితమదృష్టదంతం భ్రమితమనిష్క్రాంతదేహలీదేశం
దృష్టమనుక్షిప్తముఖమేష మార్గః కులవధూనాం


పలు జూపక పెదవులతో
నలతి నగవు, మొగము దించి యక్షుల గాంచన్
లలితము, నడువవలెన్ వా-
కిలి దాటక, కులవధువుల కిది బాగు ధరన్
… 6-25

Smiling with lips without showing teeth
Looking at others with the head bowed
Walking within the confines of the home
These are great traits of a chaste women



జం జం పులఏమి దిసం పురఓ లిహిఅ వ్వ దీససే తత్తో
తుహ పడిమాపడి-వాడిం వహఇ వ్వ సఅలం దిసా-అక్కం

యాం యాం ప్రలోకయామి దిశం పురతో లిఖిత ఏవ దృశ్యసే తత్ర
తవ ప్రతిమాపరిపాటీం వహతీవ సకలం దిశా-చక్రం


ఏ దెస జూచిన నేత్రము
లా దెస నీ చిత్తరువులె యతి సుందరమై
యీ దిక్చక్రము నెల్లెడ
నీదు శిలా ప్రతిమల బలు నే గనుచుందున్
… 6-29

Wherever my eyes wander
I see only your handsome picture
It looks as if the circular firmament
is filled only with your images!



దట్ఠూణ తరుణ-సురఅం వివిహ-విలాసేహిఁ కరణ-సోహిల్లం
దీఓ వి తగ్గఅ మణో గఅం పి తేల్లం ణ లక్ఖేఇ

దృష్టా తరుణసురతం వివిధవిలాసైః కరణశోభితం
దీపోऽపి తద్గతమనా గతమపి తైలం న లక్ష్యతి


కామకళానైపుణి నా
భామాయువకులు విలాసవంతులు జూపం
గా మండుచున్న దీపము
తా మఱచెన్ దన్ను తీరె తైల మ్మందున్
… 6-47

During the love play
the young couple were
exhibiting various erotic poses
The lamp in the room too
watched this display
with keen concentration
Alas! even without its knowledge
the oil in the lamp was exhausted
(and they reached their orgasmic climax)



జంతిఅ గులం విమగ్గసి ణ అ మే ఇచ్ఛాఇ వాహసే జంతం
అణ-రసిఅ కిం ణ ఆణసి ణ రసేణ విణా గులో హోఇ

యాంత్రిక గుడం విమార్గయసే న చ మమేచ్ఛయా వహయసి యంత్రం
అరసిక కిం న జానాసి న రసేన వినా గుడో భవతి


గానుగ తోచినటుల నీ
యానకు నడపగ దొఱకునె యా బెల్లము య-
జ్ఞానీ యిక్షురసమ్ముల
సోనలు కావలె గుడమ్ము సొంపుగ దినగన్
… 6-54

Run the machine as you like
and still expect it to manufacture sugar
O senseless idiot,
to enjoy the sweetness
you need the sweet juices first!



గంధం అగ్ఘా-అంతఅ పక్క-కలంబాణఁ వాహ-భరిఅచ్ఛ
ఆససు పహిఅ-జుఆణాఅ ఘరిణి-ముహం మా ణ పేచ్ఛిహిసి

గంధమాజిఘ్రన్పక్వకదంబానాం బాష్పభృతాక్ష
ఆశ్వాసిహి పథికయువన్ గృహిణీముఖం మా న ప్రేక్షిష్యసే


గంధమయమగు కదంబ సు-
గంధరజమ్ములను బీల్చ కనులు చెమర్చెన్
సుందరి కనరాదు సరిగ
ముందిట నూఱడిలుము చెలి మోము గనబడున్
… 6-65

The air is full of the pollen
of the sweet Kadamba blossoms
You inhaled it so deeply
that your eyes became moist
you cannot see through
the translucent film
Rest a while
and then behold!
the beautiful visage
of your beloved
will appear before you



పంక-మఇలేణ ఛీరేక్క-పాఇణా దిణ్ణ-జాణు-వడణేణ
ఆనందిజ్జఇ హలిఓ పుత్తేణ వ సాలి-ఛేత్తేణ

పంకమలినేన క్షీరైకపాయినా దత్తజానుపతనేన
ఆనంద్యతే హాలికః పుత్రేణైవ శాలిక్షేత్రేణ


అడుసున బ్రాకుచు, పాలను
కుడుచుచు ప్రాకెడు కొమరుడు, కుడుచుచు నీటిన్,
యడుసున గింజల నిండిన
మడిబై, రొసగెను ముదమును మఱి రైతునకున్
… 6-67

The crawling little one
besmirched with mud and dust all over the body
and drinking milk
The bent paddy with grains in the muddy field
fed by water –
The farmer’s heart
jumped with joy!



వాఆఇ కిం భణిజ్జఉ కేత్తిఅ-మేత్తం వ లిక్ఖఏ లేహే
తుహ విరహే జం దుక్ఖం తస్స తుమం చేఅ గహిఅత్థో

వాచయా కిం భణ్యతాం కియన్మాత్రం వా లిఖ్యతే లేఖే
తవ విరహే యద్దుఃఖం తస్య త్వమేవ గృహీతార్థః


ఏమని జెప్పుదు నేనిం-
దేమని జెప్పుదు పదముల దెలుపగ వశమా
నా మానస దుఃస్థితి నే
నేమని జెప్పుదు విరహము నీ నా లేఖన్
… 6-71

What can I say
How can words express this misery
How can I describe this separation from you
This is just a letter
I don’t want to go on further
You know the rest



రుందారవింద-మందిర-మఅరందాణందిఆలి-రింఛోలీ
ఝణఝణఇ కసణ-మణి-మేహల వ్వ మహుమాస-లచ్ఛీఏ

బృహదరవింద-మందిర-మకరందానందితాలిపంక్తిః
ఝణఝణాయతే కృష్ణ-మణి-మేఖలేవ మధుమాస-లక్ష్మ్యాః


మధురమ్ముగ కమలమ్ముల
సుధ గ్రోలుచు మోదమొంది చొక్కుచు వడిగా
రొద జేసెడు భ్రమరమ్ములు
మధులక్ష్మికి నీలవర్ణ మణిమేఖలయో
… 6-74

Intoxicated with the honey of the lotus
the swarm of bees were ecstatically buzzing around
looking like a waistband of blue diamonds
to the goddess of spring



ఆమ బహలా వణాలీ ముహలా జల-రంకుణో జలం సిసిరం
అణ్ణ-ణఈణఁ వి రేవాఇ తహ వి అణ్ణే గుణా కే వి

సత్యం బహలా వనాలీ ముఖరా జలరంకవో జలం శిశిరం
అన్య-నదీనామపి రేవాయాస్తథాప్యన్యే గుణాః కేऽపి


కలవు నదీతీరమ్ములు
కలవు వనమ్ములు జలములు గలవు మధురమై
కలవా కలకల సడులున్
గలదా రేవానదివలె కన నీ వసుధన్
… 6-78

There are several rivers
There are several riverbanks with woods
There are several rivers with sweet waters
There are several rivers with mellifluous sounds
But is there another river like Narmada?



మేహమహిస్స ణజ్జఇ ఉఅరే సురచావ-కోడి-భిణ్ణస్స
కందంతస్స సవిఅణం అంతం వ పలంబఏ విజ్జూ

మేఘమహిషస్య జ్ఞాయతే ఉదరే సురచాపకోటిభిన్నస్య
క్రందంతః సవేదనమంత్రమివ ప్రలంబతే విద్యుత్


హరివిల్లు యెక్కు పెట్టిన
శరమొక్కటి చీల్చగ మహిషమ్మును వేగన్
ధర గడుపునుండి పడు యా
చిఱు ప్రేగన దోచె మించు జెలగుచు నింగిన్
… 6-84

The lightning was like the intestines
that fell to the ground
when an arrow from the rainbow
hit a buffalo



మణ్ణే ఆసాఓ చ్చిఅ ణ పావిఓ పిఅఅమాహర-రసస్స
తిఅసేహిఁ జేణ రఅణాఅరాహి అమఅం సముద్ధరిఅం

మన్యే ఆస్వాద ఏవ న ప్రాప్తః ప్రియతమాధరరసస్య
త్రిదశైర్యేన రత్నాకరాదమృతం సముద్ధృతం


అధరమ్ములలో గల స-
న్మధు రసముల సుధ తెలియును మానవులకె యా
త్రిదశు లెఱుంగరు కావున
నుదధిని చిలికిరి యమృతము నొందుట వఱకున్
… 6-93

Not even the gods tasted the sweetness
of the lips of their beloved
Poor souls
they strove hard
to churn the oceans
to obtain ambrosia!



అకఅణ్ణుఅ ఘణవణ్ణం ఘణ-పణ్ణంతరిఅ-తరణిఅర-ణిఅరం
జఇ రే రే వాణీరం రేవా-ణీరం పి ణో భరసి

అకృతజ్ఞ ఘనవర్ణ ఘన-పర్ణాంతరిత-తరణికర-నికరం
యది రే రే వానీరం రేవా-నీరమపి న స్మరసి


రవికిరణమ్ముల ప్రభతో
నవిరళ వంశీదళముల యందము మఱచే
వవలీలగ, రేవానద
భవ జలముల మఱువ నీకు వశమె కృతఘ్నా
… 6-99

The dark dense bamboo grove
lit with sunshine
(where we made love) –
you don’t seem to remember at all
Fair enough!
But
how can you forget
the waters of the life-giving
Narmada river flowing nearby?



గేహం వ విత్తరహిఅం ణిజ్ఝర-కుహరం వ సలిల-సుణ్ణవిఅం
గోహణ-రహిఅం గోట్ఠం వ తీఅ వఅణం తుహ విఓఏ

గృహమివ విత్తరహితం నిర్ఝరకుహరమివ సలిలశూన్యం
గోధనరహితం గోష్ఠమివ తస్యా వదనం తవ వియోగే


ధనరహితమ్మగు గృహమై
వనరహితమ్మగు నదియయి పశురహితమ్మై
మను గోశాలగ నుండెను
గన నామె ముఖమ్ము నీవు కనరాకుండన్
… 7-09

As an empty home without any wealth
As an empty river without any water
As an empty cowshed without any cows
Without you, her face has a vacuous stare



ణలిణీసు భమసి పరిమలసి సత్తలం మాలఇం పి ణో ముఅసి
తరలత్తణం తుహ అహో మహుఅర జఇ పాడలా హరఇ

నలినీషు భ్రమసి పరిమృదునాసి సప్తలాం మాలతీమపి నో ముంచసి
తరలత్వం తవాऽహో మధుకర యది పాటలా హరతి


భ్రమరమ్మా, చంచలవై
కమలమ్ముల నాని, మల్లికల నూని, వనిన్
రమియింతువు జాజుల, మఱి
గమనించవు పాటలి లలి కరువాయె గదా
… 7-19

O bumble bee
you’re quite fickle
you jump from flower to flower
You are on the lotus
then move on to one variety of jasmine
then go to another kind of jasmine
But
you seem to have totally ignored
this red rose
Why?



వాఉలిఅ-పరిసోసణ కుడంగ-పత్తలణసులహ-సంకేఅ
సోహగ్గ-కణఅ-కసవట్ట గిమ్హ మా కహ వి ఝిజ్జిహిసి

స్వల్పరవాతికాపరిశోషణ నికుంజపత్రకరణ సులభసంకేత
సౌభాగ్యకనకకషపట్ట గ్రీష్మ మా కథమపి క్షోణో భవిష్యసి


ఎండిన బావుల, చివురుల
బండిన వెదురుపొదల, పలు వలపుల కిరవై,
నిండు సిరి గీటురాయగు
యెండాకాలమ శుభమ్ము లీయుచు మనుమా
… 7-26

The wells are dry
But
the bamboo is sprouting with tender leaves
offering ample privacy for trysts of love
It is indeed a touchstone
for the gold of life’s riches
May you prosper
O season of summer



దుస్సిక్ఖిఅ రఅణ-పరిక్ఖఏహిఁ ఘిట్టోసి పత్థరే జావా
జా తిలమేత్తం వట్టసి మరగఅ కా తుజ్ఝ ముల్ల-కహా

దుఃశిక్షిత-రత్న-పరీక్షకైర్ఘృష్టోऽసి ప్రస్తరే తావత్
యావత్తిలమాత్రం వర్తసే మరకత కా తవ మూల్యకథా


తరిఫీదు లేని వారలు
మరకతమును గీచిగీచి మఱిమఱి రుద్దన్
చిఱు నువ్వుగ మారు నదియు
నెఱుగగ దాని విలువింక నెవరికి దరమౌ
… 7-27

Imagine
people without proper skills and training
placing a price on an emerald
endlessly rubbing it on a touchstone
Fools!
will there be any precious stone left at the end?
(So is the case of an exhausted woman
if an inexperienced lover makes love to her)



గఅ-వహు-వేహవ్వఅరో పుత్తో మే ఏక్క-కండ-విణివాఈ
తహ సోహ్ణాఇ పులఇఓ జహ కండ-కరండఅం వహఇ

గజ-వధూ-వైధవ్యకరః పుత్రో మే ఏక-కాండ-వినిపాతీ
తథా స్నుషయా ప్రలోకితో యథా కాండ-సమూహం వహతి


ఒక బాణముతో గరిణిని
వికలముగా విధవ జేయు పేరిమి పుత్త్రుం
డిక నీ కోడలి సొబగును
బ్రకటితముగ జేసె పులకలందు నిజమ్మై
… 7-30

With one arrow
he can kill an elephant
and make its mate a widow
Alas
such a steady guy, my son,
is having goose-bumps
at the sight of this
beautiful girl, my daughter-in-law



ణ అ దిట్ఠిం ణేఇ ముహం ణ అ ఛివిఉం దేఇ ణాలవఇ కిం పి
తహ వి హు కిం పి రహస్సం ణవ-వహు-సంగో పిఓ హోఇ

న చ దృష్టిం నయతి ముఖం న చ స్ప్రష్టుం దదాతి నాలపతి కిమపి
తథాపి ఖలు కిమపి రహస్యం నవ-వధూ-సంగః ప్రియో భవతి


కనులెత్తి చూడదు, మొగ-
మును దాకగ వద్దను, కడు ముద్దుగ మాటల్
దను బలుకదు, మఱి ప్రియతమ
యనెదరు జను లీయమను రహస్యమ్మేమో?
… 7-45

She does not lift her head
nor does she allow me
to hold her face in my hands
nor does she utter endearing words
Still people praise her so much
what is the secret behind all this –
I know not!



పచ్యూసాగఅ రంజిఅ-దేహ పిఆలోఅ లోఅణానంద
అణ్ణత్త ఖవిఅ-సవ్వరి ణహ-భూసణ దిణవఇ ణమో దే

ప్రత్యూషాగత రక్తదేహ ప్రియాలోక లోచనానంద
అన్యత్ర క్షపితశర్వరీక నభోభూషణ దినపతే నమస్తే


అరుదెంతువు వేకువ నీ
వరుణాంగములన్ గనులకు వరమగు ప్రభలన్
బరదేశములన్ రాత్రుల
నరిగెడు దివమణి దినమణి కంజలు లిత్తున్
… 7-53

Every morning you rise
as a red globe
filled with radiance
a treat to the eyes
Every night you visit distant lands
You’re the light of the sky
You’re the light of the day
I prostrate before you



జం జం ఆలిహఇ మణో ఆసావట్టీహిఁ హిఅఅ-ఫలఅమ్మి
తం తం బాలో వ్వ విహీ ణిహుఅం హసిఊణ పమ్హుసఇ

యద్యాదాలిఖతి మన ఆశావర్తికాభిర్హృదయఫలకే
తత్తద్బాల ఇవ విధిర్నిభృతం హసిత్వా ప్రోచ్ఛతి


హృదయఫలకమున జిత్రము
ముదమున నాశాపిచులము బూని రచించన్
విధి తుడుచు నకస్మాత్తుగ
బెదవులపై నవ్వు జిందు పిన బాలుడనన్
… 7-56

On the easel of the heart
as one paints happily
with the brush of desire,
Fate
like a little boy with an innocent smile
wipes it off …
all of a sudden, cleanly!



తస్స కహా-కంటఇఏ సద్దా అణ్ణణసమోసరిఅ-కోవే
సుముహాలోఅణ-కంపిరి ఉవఊఢా కిం పవజ్జిహిసి

తస్య కథా-కంటకితే శబ్దాకర్ణనసమపసృతకోపే
సమ్ముఖాలోకన-కంపనశీలే ఉపగూఢా కిం ప్రపత్స్యసే


వాని గుఱించిన మాటల
మేను చలించెను, కినుక శమించె బలికినన్,
వాని గనగ గంపింతువు
తా నాలింగించ నేమి తరుణీ యగునే
… 7-59

If we just mention his name
you get goose-bumps
and if he speaks with you
your anger melts away
and if he stands before you in person
you’re shaken and confused
what is going to happen if he hugs you …
Girl, tell us!



అత్థక్క-రూసణం ఖణ-పసింజణం అలిఅ-వఅణ-ణిబ్బంధో
ఉమ్మచ్ఛర-సంతావో పుత్తఅం పఅవీ సిణేహస్స

ఆకస్మిక-రోషకరణం క్షణ-ప్రసాదనమలీక-వచన-నిర్బంధః
ఉన్మత్సర-సంతాపః పుత్రక పదవీ స్నేహస్య


ఒకతరి కోపముతో, మఱి
యొకతరి చిఱునగవుతోడ నుండినచో, వే-
ఱొకతరి వంకలతో, నిం-
కొకతరి ద్వేషించ నామె కోరును నిన్నే
… 7-75

Young man, don’t fret
if she is
angry one moment
happily smiling the next moment
giving lame excuses yet another moment
hating you the very next moment
she is only loving you …
very dearly!



పుసఉ మహం తా పుత్తి అ వాహోఅరణం విసేస-రమణిజ్జం
మా ఏఅం చిఅ ముహ-మండణం త్తి సో కాహిఇ పుణో వి

ప్రోచ్ఛస్వ ముఖం తత్పుత్రి చ బాష్పోపకరణం విశేష-రమణీయం
మా ఇదమేవ ముఖ-మండనమితి కరిష్యసి పునరపి


కన్నుల నీవిట నీరిడు
చున్నావుగదవె కుమారి చూచిన ప్రియుడున్
కన్నీ ళ్ళొక చెలువమ్మను
కొన్నాడో, నిన్ను బాధ గొనునే తెలుసా
… 7-81

For some reason you’re crying
and your face is besmirched with tears
But
your husband may think that this is
one more way of making yourself pretty
If he entertains such thoughts
you’re in trouble
as he’ll start pestering you for love!



సచ్చం సాహసు దేఅర తహ తహ చడుఆరఏణ సుణఏణ
ణివ్వత్తిఅ-కజ్జ-పరమ్ముహత్తణం సిక్ఖిఅం కత్తో

సత్యం కథయ దేవర తథా తథా చాటుకారకేణ శునకేన
నిర్వర్తితకార్యపరాఙ్ముఖత్వం శిక్షితం కస్మాత్


కుక్కయు కామక్రీడను
మక్కువతో జేసి పిదప మలయుచు దానున్
ప్రక్కకు మొగమును త్రిప్పే
నెక్కడ నేర్చినదొ నెఱుగ నిది నే మఱదీ
… 7-88

The dog made love
and turned its head away
It must have learned it somewhere
Do you know
from whom and from where
my dear husband’s brother!
(Is it from you?)



ణిప్పణ్ణ-సస్స-రిద్ధీ సచ్ఛందం గాఇ పామరో సరఏ
దలిఅ-ణవ-సాలి-తండుల-ధవల-మిఅంకాసు రాఈసు

నిష్పన్న-సస్య-ఋద్ధిః స్వచ్ఛందం గాయతి పామరః శరది
దలిత-నవ-శాలి-తండుల-ధవల-మృగాంకాసు రాత్రిషు


నవముగ పండిన బియ్యమొ
దివమున వెన్నెలయు జూడ దీపితమయ్యెన్
భువిపై శరత్తులో గ నె
నవనవలాడెడు పొలమును, నగుచును బాడెన్
… 7-89

The harvest moon’s light
was as white as
the newly harvested rice
The farmer surveyed
the flourishing crop in his field
and
a happy tune emanated from his throat



దిఅహే దిఅహే సూసఇ సంకేఅఅ-భంగ-వడ్ఢి ఆసంకా
ఆవండురో-ణఅ-ముహీ కలమేణ సమం కలమగోవీ

దివసే దివసే శుష్యతి సంకేతక-భంగ-వర్ధితాశంకా
ఆపాండురావ-నత-ముఖీ కలమేన సమం కలమగోపీ


కోతకు వచ్చిన వరి ధర-
ణీతలి దాకంగ వంగె నిస్తేజముగా
నా తరుణి యటులె నుండే
నా తఱి సంకేతము వెలి యగునో యంచున్
… 7-91

The crop is ready for harvest
bent, dry and colorless
The lot of the poor young woman
is no different –
bent, dry and colorless
Yes, the crop will be harvested
and
those trysts with the secret lover
will be a thing of the past



ధణ్ణా బహిరా అంధా తే చ్చిఆ జీఅంతి మాణుసే లోఏ
ణా సుణంతి పిసుణ-వఅణం ఖలాణం ఋద్ధిం ణా పేక్ఖంతి

ధన్యా బధిరా అంధాస్త ఏవ జీవంతి మానుషే లోకే
న శృణ్వంతి పిశున-వచనం స్వాలామృద్ధిం న ప్రేక్షంతే


పెను నీచుల సిరి గాంచరు
వినరా మాటల బధిరులు వెగటుగ బల్కన్
గన నట్టివారు ధన్యులు
మనుచుందురు నిజము ధర్మ మార్గమునందున్
… 7-95

The blind do not witness the wealth of fools
The deaf do not listen to their worthless prattle
They are the most contented folks on earth
ever following the righteous path

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...