కర్నాటక సంగీతంలోని గాఢ ఫణితులుగాని, హిందుస్తానీ బాణీలోని బిరకాలుగాని, లలిత సంగీతంలోని మధుర ధోరణులుగాని, అతి సహజంగా దొర్లిపోయే కంఠం ఆమెది.
ఈమాట మార్చి 2010 సంచికకు స్వాగతం
ఈ సంచికలో మీకోసం…
ద్రౌపది నవల పై చెలరేగుతున్న వివాదంపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ వేలూరి వేంకటేశ్వర రావు సంపాదకీయం ఇతిహాసాలూ, ప్రబంధాలూ; జయదేవుని అష్టపది సా విరహే తవదీనా పై పాటలతో, అనువాదాలతో జెజ్జాల కృష్ణ మోహన రావు, సాయి బ్రహ్మానందం గొర్తి వ్రాసిన వ్యాసం; సహజగాయని ఎస్.వరలక్ష్మి పాడిన అపురూపమైన పాటలు కొన్ని అందిస్తూ పరుచూరి శ్రీనివాస్ శబ్దతరంగాలలో; ఇంకా కవితలు, వ్యాసాలూ, శీర్షికలూ….
ఇప్పుడు గంటలకొద్దీ ఆఫీసు బ్రేక్ టైముల్లో మొబైల్ ఫోన్స్ మీద ఉండే యువతీ యువకులను చూస్తే అప్పుడు ఫోన్లో మాట్లాడే వీలుకూడా లేని మా ఆఫీసు ప్రేమికులను గుర్తు చేసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది.
సకల ప్రాణులను సంతోషపెట్టిన
ఆ స్వచ్చమైన వర్షపు చినుకులు-
నాకు మాత్రం …
హస్తగతదీపకాంతుల నరయలేని
అంధులంబోలె నూరక యఱతురేల?
గొడ్డు గోదా, ఆస్తీ పాస్తీ
ఇంట్లో విలువైన మనుషులూ
అందరి మీదకి ఆయుధాలు వచ్చేస్తాయి.
నాటకం బలిజేపల్లి లక్ష్మీకాంత కవిది. కాటి సీనులో బలిజేపల్లి వారి పద్యాలతో పాటు మరో మహాకవి పద్యాలు – కేవలం శ్మశానాన్ని వర్ణించేవి – నటకులు పాడటం పరిపాటి అయింది.
నా ఉద్దేశంలో ఇక్కడ కథలు రాస్తున్నవాళ్ళల్లో చాలామంది భౌతికంగా (ఫిజికల్ గా) అమెరికాలో ఉన్నారు కానీ, మానసికంగా, ఇంకా ఆంధ్రాలోనే ఉన్నారు.
సృజన ఎక్కడ్నుంచి పుట్టిందనేది ఎలాగయితే ఒక అంతుచిక్కని విషయమో, సృజించేది ఎవరు అనేది కూడా అంతే నిగూఢమైన సంగతి. రాస్తున్నది ఎవరు?
శృంగారరస ప్రధాన ప్రబంధంలో ఎంత శృంగారం ఉచితం, ఎంత శృంగారం కావలసిన మోతాదులోనే ఉన్నది అన్న ప్రకటనలు, వాఙ్మూలాలు వివాదాస్పదాలు.
అతను ఒక చేత్తో పుస్తకం చదువుతూ రెండో చేత్తో సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. ఆ తెల్ల బొచ్చు కుక్క అతని మీద పడి అల్లరి చేస్తోంది.
సీతారామారావుని అసమర్థుడిగా మొదలుపెట్టబోయినా ఆ తర్వాత గోపీచంద్ విఫలమైనాడనీ, అది ఆ రచయితకూ తెలుసనీ, కానీ అతనేమీ చేయలేదనీ నా అభియోగం.
ఇక్కడ అసమర్ధతకు, మానసిక ఋగ్మతకు పెద్ద తేడా కనిపించకపోవచ్చు గాని, తెలిసీ, ఎటూ తేల్చుకోలేక వేదన పడే సందిగ్ధ స్థితి అది. సాంప్రదాయపు పొరలను ఛేదించుకుని కాలానికి పరిస్థితులకీ అనుగుణంగా జీవించలేకపోవడం అతని అసమర్ధత.