వేకువనొదిలే చీకటివవ్వక
మెలకువలోనూ ఒక కలగా
ఇంకా ఎందుకు మిగిలావు.. ?
ఈమాట మే 2010 వసంత ఋతు సంచికకు స్వాగతం
ఈ సంచికలో మీకోసం: సుప్రసిద్ధ హిందీ కవి బాబా నాగార్జున కవిత్వాన్ని, అంతస్సు – బాహ్యప్రపంచాల సంబంధాల్ని విశ్లేషిస్తూ చాకిరేవు ఉపేంద్ర సమగ్ర వ్యాసం; శబ్దతరంగాలలో రమేష్ నాయుడు ప్రత్యేక జనరంజని ఆడియో; వసంత ఋతువుని సాహిత్యంలో సంగీతంలో పరిచయం చేస్తూ జెజ్జాల కృష్ణ మోహనరావు వ్యాసం; ఇంకా ఎన్నో కవితలు, కథలు, శీర్షికలూ…
అప్పట్లో అమెరికాకు, బెంగుళూర్నుంచీ నేరు ప్లైటు కాదు కదా, రెండు మూడు సార్లు కాక, వెళ్తున్న స్థలాన్ని బట్టి కనీసం ఏడెనిమిదిసార్లు విమానాలు మారవలసి వచ్చేది.
నీళ్ళేవు నిప్పుల్లేవు ఎల్లండెల్లండి!
ఎర్రటెండల్లంట
మీకెవుల్రమ్మన్నారు?
నలుగురూ చేరి శ్రీరంగశయనంగారిని రెక్క పుచ్చుకు బలవంతాన లేవదీశారు, మిట్టమధ్యాన్నానికయినా దహనం అయిందనిపిస్తే, ఆ తరవాత ఇంకా చేయవలసిన విధులు చాలా ఉన్నాయని. ముత్తయిదువులు శవానికి స్నానం చేయించి, కొత్తచీరె కట్టి, పసుపూ, కుంకమలతో, పువ్వులతో అలంకరించి పాడెమీద ఉంచేరు. కర్మకాండ పూర్తయేసరికి నాలుగయింది.
దుర్భరమైన కష్టాల్ని, వేదనను స్వయంగా అనుభవించేవాళ్ళు సైతం సృజనశీలురైతే ఆ దు:ఖం అంతర్లీనంగా ప్రవహిస్తూ వాళ్ళ సృజనకు వన్నె తెస్తున్నాది. ఎలాగో?!
నాకు కొన్నాళ్ళు ఎక్కడికన్నా ఎవరికీ కనిపించనంత దూరంగా వెళ్ళాలని ఉంది. కానీ, అంత దూరాన్ని ఎక్కడ వెదుక్కోను? శాశ్వతంగా ప్రపంచం నుండి సెలవు తీసుకోడానికి ధైర్యం చాలట్లేదు.
నేను పొరబడ్డానేమో అనుకున్నాను. ఇంటికొచ్చి అదేదో ఆఫీసు పార్టీలో మా పిల్లలతో కలిసి మృణాలిని తీయించుకున్న ఫోటో వెతికి తీసాను. సందేహం లేదు, అతనే!
వనిత ముఖంబుచేత నొక పద్మము, నాఱగు వారిజంబులన్
కనుఁగవచేతఁ, గోమలయుగాంఘ్రులచేత, శయద్వయంబుచే
నీకన్నా ముందు పుట్టిన బంధం నీపైనే కత్తి దూయడం నువ్విపుడు తీర్చేస్తున్న ఋణం
నమస్కరించినా మోమైనా ఎత్తి చూడలేదే అని ఒళ్ళు మండుతుంది దేవదేవికి. ఈ స్వామి దొంగస్వామి అని తేల్చేస్తుంది. అక్క కాదని చెప్పినా వినదు. స్వామి నిజంగానే విరాగి.
కూడనట్టి పనులెన్నో కూరిమితో చేసినాము వలసినవన్నీ చేదగు
నా కవిత్వం సహనంతో వేచివుంటుంది, తనను తాను ఆవిష్కరించుకునే ఓ అద్భుతమైన క్షణం కోసం
మేఘసందేశం (1983) చిత్రానికి జాతీయ అవార్డు గెలుచుకున్న సంగీత దర్శకుడు రమేష్ నాయుడు ప్రత్యేక జనరంజని ఆడియో.
“ఈనాడు ‘రిథమ్’ విని ఎక్కువమంది ఆనందిస్తున్నామని అనుకుంటున్నారు కానీ ‘మాధుర్యం’ ప్రధానంగా వున్న పాటలే చిరకాలం నిలుస్తాయి”
అప్పట్లో వైద్యనాథయ్యరుకి పోటీ లేదని ఒకసారి మైసూరు మహారాజు అంటే, సుబ్రమణ్యయ్యరు ఒక ప్రత్యేకరాగంలో పాట కట్టి ఆశువుగా కచేరీలో పాడాడు.
మన ఈ గాంధర్వవివాహానికి
ఆకాశమే పందిరి పక్షులే సాక్షులు
లోలోపల ఏ దీపం ఎప్పుడు వెలిగిందో
జ్ఞాపకాల మిణుగురులు అంటుకుని
వేడిమి లేదు;
ఒకసారి, బహదిన్ షా సూఫీ సూత్రాలు, సూఫీ పద్ధతులపై ఉపన్యాసం ఇచ్చాడు. ఒక తెలివైన పెద్దమనిషి బహదిన్ పై విమర్శ విసిరాడు: “ఈ బహదిన్ షా ఎప్పుడైనా, కనీసం ఒక్కసారైనా కాస్త కొత్త విషయాలు చెప్పితే బాగుండును. ఎప్పుడూ చెప్పిందే, చెప్పిందే చెప్పుతాడు.”