నేను, నాకు నచ్చినవే నచ్చుకునే కవులు కొందరం తరచు కలుసుకొంటూ, మేం రాసినవి ఒకళ్ళవొకళ్ళం మెచ్చుకుంటూ, మాకు నచ్చనివాళ్ళని, వాళ్ళ సృజనల్నీ వేళాకోళం చెయ్యటం – సాయంత్రాలు ఇలా గడిపేవాళ్ళం. ఈ గుంపులోనే మళ్ళీ అక్కడ ఎదుట లేనివాళ్ళని చాటుగా వేళాకోళం చేసుకోవటమూ ఉండేది.

ఆధునిక సమాజాల్లోన ప్రాధమిక అవసరాలు దాదాపుగా అందరికీ తీరుతున్నాయి. కాని, సాంఘిక అసమానతలు ఇదివరకటిలాగే ఉన్నాయి. వివక్షకు, పీడనకు గురయ్యే వర్గాల్లోన సృజనశీలురైన వాళ్ళందరికీ ఈ స్పృహ, వేదన ఉండితీరుతాయి. ఆ కష్టం ఏమిటో అనుభవించనివాళ్ళకి తెలిసే అవకాశం తక్కువ.

పదాల వ్యుత్పత్తిని శాస్త్రీయంగా ధాతువుల ద్వారా నిరూపించే నిరుక్త శాస్త్రం తరువాతి రోజుల్లో భాష్యకారుల కృత్తిమ వ్యుత్పత్తులతో వారు తమ పాండిత్యాన్ని ప్రదర్శించడానికి ఒక వినోద సాధనంగా మారిపోయింది. సాధారణ వివరణ ఇస్తే, నిరుక్తంలో వారి నిపుణత మనకెలా తెలుస్తుంది చెప్పండి?

ద్రావిడ భాషలలో ఒకటి నుండి పది వరకు, వందకు ప్రత్యేక పదాలు కనిపిస్తాయి. వెయ్యికి ఒక్క తెలుగులో మాత్రమే ద్రావిడ పదం కనిపిస్తుంది. అయితే, సాహిత్య రహిత భాషలలో ద్రావిడ సంఖ్యాపదాలు ఏడు దాటి ఉండవు.

ఒక మందు వ్యాపార యోగ్యం కావడానికి కనీసం పది నుండి పదిహేను ఏళ్ళు పడుతుంది. ఒక్క వ్యాధికి వేల వేల రసాయన మిశ్రణాలను పరీక్షిస్తే ఒక్కటి చివరకు ప్రభుత్వ ఆమోదాన్ని పొందవచ్చు. ఈ వ్యవహారానికంతటికీ కొన్ని కోట్ల డాలర్లు ఖర్చవుతుందని ఔషధ పరిశ్రమ అంచనా.

మస్తానీ బాజీరావుల ప్రణయగాథ రతీమన్మథుల కథవలె భారతీయులకు చిరస్మరణీయమైనది. ఈతడు బుందేలుఖండము నేలుచుండిన హిందూప్రభువైన ఛత్రసాలునికి పారసీక వనితవల్ల గల్గిన మస్తానీయను ముస్లిముకాంతను వివాహమాడెను.

నేను రాసిన ఆర్టికల్ గురించి తెలిసి వెంకట్రామయ్య నాతో మాట్లాడ్డం మానేసాడు. వాడి కుటుంబాన్ని బజారు కీడ్చానని, వాళ్ళ అమ్మాయి గురించి తెలిస్తే ఎవడూ పెళ్ళి చేసుకోవడానికి ముందుకు రాడనీ నన్ను చెడామడా తిట్టేడు. ఇహ నా మొహం చూపించద్దనీ స్నేహాన్ని తెంపేసాడు.

కాస్త ధైర్యం కలిగింది, అమ్మయ్య అంటూ నిట్టూర్చాడు. అప్పుడు తన చాక్లెట్ డ్రింక్ కప్పుని అందుకుని హాల్లోకి నడిచాడు. టి.వి ఆన్ చేయగానే, సినిమాలో మొదటి సీన్ – గాంధీ గారి హత్య సన్నివేశం వస్తోంది.

కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైన మూడోరోజు భీష్ముని యుద్ధపరాక్రమం భయంకరంగా ఉంది. అర్జునుడు ఎదుర్కొన్నాడు కానీ భీష్ముడు విజృంభిస్తున్నాడు. సారధి అయిన కృష్ణుడిని కూడా ముప్పుతిప్పలు పెడుతున్నాడు.

కొన్ని అపురూపమైన తెలుగువారి గొంతుకలు – ఆచంట లక్ష్మీపతి, టంగుటూరి ప్రకాశం పంతులు, గుఱ్ఱం జాషువా, జరుక్ శాస్త్రి, వేదుల సత్యనారాయణ శాస్త్రి, స్వామి శివశంకర్, విస్సా అప్పారావు, మొక్కపాటి నరసింహ శాస్త్రి, దామోదరం సంజీవయ్య మరి కొంతమందివి.

దాదాపు అర్థ శతాబ్దం క్రితం వ్రాసిన ఈ కథల్లో కనిపించే ప్రాంతాలు, పరిసరాలు నాకు పరిచయం లేనివి. కానీ పరిసరాలను, పాత్రలను కళ్ళ ముందు నిలిపేందుకు వాడిన భాష, వాక్యాలు నిత్యనూతనం.

గూగుల్ మొదలుపెట్టిన పథకం ఒక రకంగా మంచి పథకమే. కోట్లకొద్దీ జనానికి మరో ప్రచురణకి నోచుకోని లక్షల కొద్దీ పరిశోధన గ్రంథాలు అందుబాటులోకి వచ్చేవి. రచయితలకి డిజిటల్ పుస్తకాలు ‘అమ్ముడు’ పోవడం మూలంగా డబ్బులొచ్చేవి. కొద్ది రుసుము కట్టుకుంటే గ్రంథాలయాలకి లక్షల గ్రంథాలు అందుబాటులో వుండేవి.