నీ తల్లితనము ఒల్లనవ్వ!
మనసు మనసుతో ముడివడినప్పుడు
తలపులు ఘనముగ అలవడినప్పుడు
ఆ అనుభవమునకే అవధులుండునా?
ఓ అవ్వా! వెర్రిదానవే నవ్వా!
నా దేవుడు చెన్నమల్లికార్జునుని వలచి
నెరగా నేనే మారిపోతినవ్వ!
నీ తల్లితనమింక నేనొల్లనవ్వ, వెళ్ళవమ్మా!
మన మన తార్కణెగొండు అనుభవిసలు,
నెనహె ఘనవహుదల్లదె అదు హవణదల్లి నిలువుదె?
ఎలె అవ్వా, నీను మరుళవ్వె.
ఎన్న దేవ చెన్నమల్లికార్జునయ్యగొలిదు
సలె మారుహోదెను.
నిన్న తాయితనవనొల్లె హోగా.
(320)
చెడకయ్యా చెడకయ్యా!
చెడకయ్యా, చెడకయ్యా మృడుని అడుగులను విడకయ్యా!
దృఢము కాదు వడలిపోవు నీ ఒడలు తిరము కాదు
కడమ రాదు సుడివడు సంసార సుఖము తిరము కాదు
చెన్నమల్లికార్జునుని వ్రాతలన్ని చెడక మునుపె
తడయక ఆ జడముడినే శరణనవయ్యా!
కెడదిరె కెడదిరె మృడనడియ హిడియిరే.
దృఢవల్ల నోడిరె నిమ్మొడలు.
దృఢవల్ల నోడిరె సంసారసుఖవు.
చెన్నమల్లికార్జున బరెద అక్షరవు
తొడెయద మున్న బేగ బేగ శివశరణెన్ని.
(175)
గుణదోషవివేచన
గుణదోషవివేచన కలిగేవరకు
కామపుటొడలు క్రోధపు గురుతు
లోభపుటిరువు మోహపు నెలవు
మదావరణము మత్సర యవనిక
తీరని కోర్కెలు తీరగలేవు
తడయని తలపులు తొలగగలేవు
చెన్నమల్లికార్జునుని ఎరుగగ లేము!
గుణ దోష సంపాదనెయ మాడువన్నక్క
కామద ఒడలు, క్రోధద గొత్తు, లోభద ఇక్కె,
మోహద మందిర, మదదావరణ, మత్సరద హొదకె.
ఆ భావవరతల్లదె చెన్నమల్లికార్జునన అరివుదక్కె
ఇంబిల్ల కాణిరణ్ణా.
(191)
చదివి చదివి వేదములు …
చదివి చదివి వేదములు వాదములే తెచ్చెను
వినగ వినగ శాస్త్రములు సందేహము లిచ్చెను
అరయ అరయ ఆగమములు అరిగి సగములాయెను
పూరించగ పురాణములు పూర్వ దారి పట్టెను
నేనెవ్వరు? తానెవ్వరు? బొమ్మ బట్టబయలు చెన్నమల్లికార్జునా!
ఓది ఓది వేద వాదక్కిక్కిత్తు.
కేళి కేళి శాస్త్ర సందేహక్కిక్కిత్తు.
అరిదెహె అరిదెహెనెందు
ఆగమ అరెయాగి హోయిత్తు.
పూరైసిహె పూరైసిహెనెందు
పురాణ పూర్వద బట్టెగె హోయిత్తు.
నానెత్త తానెత్త?
బొమ్మ బట్టబయలు చెన్నమల్లికార్జున.
(130)
తవుడు నూకల దంపుడు
వేదశాస్త్ర ఆగమ పురాణములెల్ల
తవుడు నూకల దంపుడే సుమీ!
దంచుటెందుకు? చెరుగుటెందుకు?
చెదిరే మనసును నిలుపగలిగిన
అంతా బట్టబయలు చెన్నమల్లికార్జునా!
వేద శాస్త్ర ఆగమ పురాణగళెల్లవు
కొట్టణవ కుట్టిద నుచ్చు తౌడు కాణిభో.
ఇవ కుట్టలేకె కుసుకలేకె?
అత్తలిత్త హరివ మనద శిరవనరిదడె
బచ్చబరియ బయలు చెన్నమల్లికార్జునా.
నిరాకార లింగము
ఆకారము లేనిదే నిరాకార లింగము
చేతబట్టి మెడనుగట్టి తిరుగువారిదే అజ్ఞానము
హరిబ్రహ్మలే అరయని లింగము
వేద పురాణములు ఎరుగని లింగము
భక్తికి ఫలము లింగము కాదు
జ్ఞానుల విజ్ఞానము లింగము కాదు
కర్మల ప్రతిఫలము లింగము కాదు
తన్ను తానరసి తాదెలిసినచో
చెన్నమల్లికార్జునుడు తానేనని తెలియును కాదా!
ఆకారవల్లద నిరాకార లింగవ
కైయల్లి హిడిదు కట్టిదెవెంబరు అజ్ఞాని జీవిగళు.
హరిబ్రహ్మరు వేద పురాణ ఆగమంగళు
అరసి కాణద లింగ.
భక్తిగె ఫలవల్లదె లింగవిల్ల.
కర్మక్కె నరకవల్లదె లింగవిల్ల.
జ్ఞానక్కె పరిభ్రమణవల్లదె లింగవిల్ల.
వైరాగ్యక్కె ముక్తియల్లదె లింగవిల్ల.
ఇదు కారణ తన్న తానరిదు తానాదడె
చెన్నమల్లికార్జున తానె బేరిల్ల.