ఈమాట పత్రికా సౌధానికి కనిపించని పునాదులైన SCIT, తెలుసా, రచ్చబండల ద్వారా మేము అలవర్చుకున్న విలువలే ఈమాట పదేళ్ళుగా మనగలగడానికి దోహదం చేసాయి.
మే 2009 సంచిక విడుదల
వస్తున్న వసంత ఋతు శుభాకాంక్షలతో ఈమాట మే 2009 సంచికకు స్వాగతం.
కొత్తగా:
– ప్రత్యేకంగా ఈమాటలోనే ఒక సాహిత్య చర్చావేదికను ఏర్పాటు చేశాం.
– అభిప్రాయ నియమావళి అవసరాన్ని వివరిస్తూ పాఠకుల కోసం ఈమాట సంపాదకుల వ్యాసం. చర్చకు ఆహ్వానం.
– పొరపాటున బహిర్గతమైన ప్రైవేటు ఉత్తరం– ఈమాట ముఖ్య సంపాదకుడు, ప్రచురణకు వచ్చే రచనలపై తన సంపాదక బృందానికి రాసిన మెమో. ఇంకా…
లోలకంలా గాలిలో వూగుతున్న
కాగితాన్నొదిలిన పూర్తికాని వాక్యం
ఎంతో మురిపెంగా నాలుగు రోజులు మునిపత్నులతో గడిపి వద్దామని బయలుదేరిన సీతకు ఈ ఆజ్ఞ వినడం పిడుగుపాటే అయింది. తాను ఏ నేలమీద నిలబడి ఉన్నదో ఆ నేల గభాలున పగిలి తానందులో కూరుకొని పోతున్నట్లుగా అనిపించింది.
“అత్తమ్మా, రామన్నున్నడా?”
బడినుంచి రాంగ రోజడిగెటోణ్ణి
ఏవో సమాధుల్లోంచి, ఎక్కడో గంటల్లోంచి వస్తూ
చిత్తడిలో పొంగుకొచ్చే ఆక్రందనలా
జడివానలా
అంతెందుకు గాలీ వానా వొస్తే
ఉంటుందని హామీ ఏమీ లేదు –
కాని ఇది నీ ఇల్లు.
సుమారుగా 1940 నుండి 1960ల పూర్వార్ధపు మధ్యకాలం చిత్రసంగీతానికి స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఆ కాలంలో అన్ని భాషలలోనూ ఎన్నో మధురమైన పాటలు వచ్చాయి. […]
ఇంతలో ఓ పిల్లాడి గాలిపటం ఎంతో ఎత్తున ఎగురుతూంటే మరో గాలిపటం వచ్చి తగులుకుంది. దాంతో అంత ఎత్తునున్న గాలిపటం తెగిపోయింది.
మనలో చాలామంది వాడుక భాషలో రాస్తారు. అయినా, మాట్లాడినట్టుగానే రాయరు. రాసేటప్పుడు వాక్యనిర్మాణం మాట్లాడేటప్పటి వాక్యనిర్మాణంలా ఉండదు.
మైడియర్ సంపాదకులూ: నా బాధ్యతగా, కొన్ని సూత్రాలను ఈ మెమోతో జత చేస్తున్నాను. వీటిని అమలు చేస్తే చీవాట్ల మాటెలావున్నా శ్రమ ఖచ్చితంగా తగ్గుతుందని నా స్వానుభవం. – ముఖ్య సంపాదకుడు
రోజూ తను చేసే పనుల్ని గోడ మీదనుంచి గమనించడం, పనులు ఆలస్యమవుతూంటే మౌనంగా హెచ్చరించడం – ఆ గడియారం లతకు నేస్తంలా కనిపిస్తుంది.
ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకొని ఈమాట పాఠకులైన మిమ్మల్ని చర్చకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. మీ అభిప్రాయాలు మాకు చెప్పండి, వీలైనంత వివరంగా.
అపుడపుడు మా ఇంటి వసారా గూట్లోంచి గుమ్మం ముందు పడిపోయే రెక్కలు రాని పిచుకపిల్ల కళ్ళముందు కదలాడి, కడుపులో దేవినట్టు అయ్యింది.