మహాయాన బౌద్ధానికి చెందినదీ టిబెటియన్ బుద్ధిజం. జాతకకథల్లో చెప్పినట్టు బుద్ధుడు అనేక అవతారాలు ఎత్తిన మహనీయుడు అని వీరు నమ్ముతారు. అందులో కొన్ని జంతురూపపు అవతారాలు కూడానట. వాటి వాటి గుణధర్మాలు సామాన్యులు గ్రహించి అనుసరించాలన్నది ఆ అవతారాల ఉద్దేశ్యమట.

కాలాపత్థర్ శిఖరంనుంచి ఎవరెస్ట్, ఇతర శిఖరాలు ఎంతో స్పష్టంగా కనిపించాయి. ఎదురుగా నిలిచి పలకరించే శిఖరాలేగాకుండా దిగువన ఘనీభవించిన పచ్చల తటాకాలు, గ్లేషియర్లు కనిపించి మురిపించాయి. సాయంకాలపు ఎండలో బంగరుకాంతితో నిండిన ఎవరెస్ట్, సభాగారంలో ముఖ్యాసనంలో కూర్చున్న మహారాజులా కనిపించింది.

గిరియందు గాక గడ్డిదిబ్బల మీద ఆడునా నెమలి?
కొలనులో గాక చిన్నికాల్వల నీరాడునా కలహంస?
మావిచిగుళ్ళు మెసవక మోమెత్తి పాడునా కోకిల?
పరిమళములు లేని పూలపై వ్రాలునా తుమ్మెద?
నా దేవుడు చెన్నమల్లికార్జునుని గాక నా మనసు
ఇతరుల నెట్లు చేరగలదో? చెప్పరమ్మా?

ధైర్య సాహసాలు, మొక్కవోని పట్టుదలలూ ఉన్న ఎందరో అనుభవజ్ఞులు హిమాలయాల్లో ప్రాణాలు కోల్పోయారన్నది కఠోర వాస్తవం. వారి కథలు తలచుకుంటే ప్రకృతి ముందు ఎంతటివారైనా తల వంచవలసిందేగదా అనిపిస్తుంది. ‘ఎంత అనుభవం ఉన్నా ప్రతి యాత్రా ఒక నూతన ప్రయత్నం. ప్రమాదభూయిష్టం.

చిటచిట నిప్పులు రేగిన
నా ఆకలి తీర్చుట కనుకొందును!
పెళపెళ మొయిళ్ళు కురిసిన
నా స్నానము కొరకే ననుకొందును!
తొటదొట రాళ్ళే పైబడిన
రాలిన పుష్పములనుకొందును!

నిత్యజీవితంలో మనం చూసేదీ పాల్గొనేదీ ఎడతెగని పరుగుల ప్రక్రియలో. చేయవలసిన పనులు, వాటి గడువులు, టార్గెట్లు, ఎపాయింట్‌మెంట్లు – పరుగులే పరుగులు. ఇష్టమున్నా లేకపోయిన ఆ బాణీ కార్యకలాపాలలోకి అడుగు పెట్టినపుడు మన సమయం మన చేతుల్లోంచి జారిపోతుంది. నిలబడి, స్థిరంగా ఆలోచించి ముందుకు సాగే అవకాశం కోల్పోతాం.

ఆశ్రమానికి చెందిన ఒక పెద్దాయన వచ్చి యువరాజ్ భుజాలను తాకి, “రాజా సార్” అని పిలిచారు. యువరాజ్ మేల్కొని లేచి, ఏమీ అర్థం కానివాడిలా ఆయన్ను, రమణుల చిత్రపటాన్ని చూశారు. దీర్ఘ నిశ్వాసంతో తన కళ్ళను, చెంపలను తుడుచుకొంటూ, పైకి లేచి తన జుబ్బాను కిందకు లాగి సర్దుకున్నారు. ఆయన ముఖం తేటపడింది. రమణులను చూసినప్పుడు ఆయన ముఖంలో సన్నని చిరునవ్వు మొలకెత్తింది.

మొన్నటికి మొన్న, రెండు నెలలైనా తిరగలేదు, వాళ్ళు దయ్యాల గురించి మాటలాడుకున్నారు. సాధారణంగా సమావేశాల్లో బంకు బాబు నోరు విప్పేవాడు కాదు. ఆ రోజు ఏమయిందోగాని, నోరు తెరిచి ‘నాకు దయ్యాలంటే భయం లేదు’ అన్నాడు. అంతే! అది చాలు, తక్కిన వాళ్ళకి బంగారం లాంటి అవకాశం దొరికింది. రాత్రి అతను ఇంటికి తిరిగి వెళుతుంటే అతని మీద ఒక దయ్యం దాడి చేసింది. పాపం అతనికి గాయాలయ్యాయి.

ఈ పర్వతాల రంగులు కూడా వివిధ సమయాల్లో వివిధ రకాలుగా మనకు కనబడతాయి. సూర్యోదయ సమయంలో నారింజరంగు కలసిన పసిడి వర్ణం, మధ్యాహ్న సమయంలో మచ్చ లేని ధవళ వర్ణం, సూర్యాస్తమయ సమయంలో ధగధగల బంగారు వర్ణం… క్రమక్రమంగా అరుణారుణ గిరిశిఖరం!

ఆవిధంగా నేను బాగా గమనించింది ఏంటంటే, N ఏమాత్రమూ ఏదీ పట్టించుకునే పరిస్థితిలో లేడు, తన కుర్చీ చేతులను గట్టిగా పట్టుకుని అటూ ఇటూ మెలికలు తిరుగుతున్నాడు, కనీసం ఒక్కసారి కూడా నావైపు తలెత్తి చూళ్ళేదు, అయోమయంగా అగమ్యగోచరంగా ఉన్నాయి అతని చూపులు, శూన్యంలో దేనికోసమో వెతుకుతున్నట్టు, నేను మాట్లాడేదాంట్లో ఒక్క అక్షరం కాదు కదా అసలు నా ఉనికి కూడా ఆయన ఎఱుక లోకి కూడా వెళ్ళుండదు.

తోటాన్ అందులోకి కనెక్ట్ చేసుకుని రిసీవర్ చెవికీ భుజానికి మధ్య నొక్కి పట్టుకుంటారు. అదే ఒకే తీరున చెవిలో ర్‍ర్‍ర్‍ర్ర్‍ర్‍ మంటూ మోగడం మొదలవుతుంది. తోటాన్ అది వింటూ ఉంటారు. ఆయన తల వేలాడదీసిన లోలకంలా అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది. కాసేపటికి ఒక పక్కకు ఒరిగిపోతుంది. కళ్ళు మూసుకుపోయి, నోరు తెరుచుకుని, భుజాలు సడలి పక్కనున్న ఆలివ్ గ్రీన్ బీరువా మీదకు ఒరిగిపోయి కూర్చునుంటారు.

పట్టుపురుగు కోరి యిల్లు కట్టుకొనగ
తనదు పట్టు తననె చుట్టి చచ్చినట్లు
మదిని రేగు కోర్కెలు మనిషిని బంధించునయ్య!
నా మనసు దురాశల నాశమొందగజేసి
నీ దరిని జూపు చెన్నమల్లికార్జునయ్య!

సామాన్యంగా అందరూ ఎవరెస్ట్ అని పిలచుకొనే శిఖరాన్ని నేపాల్‌లో సగర్‌మాథా అంటారు. స్వర్గశీర్షమని దాని అర్థం. టిబెట్‍లో ఆ శిఖరాన్ని చోమో లుంగ్మా (పర్వతరాణి) అని పిలుస్తారు. మనిషి కంట అంత సులభంగా పడకపోవడంవల్ల కాబోలు – హిందూ పురాణాలలో ఎవరెస్ట్ ప్రస్తావన దాదాపు లేదు.

మహాకవి కాళిదాసు ఐదవ శతాబ్దంలో తన సంస్కృత కావ్యం కుమారసంభవంలోనూ, అలాగే మన అల్లసాని పెద్దన పదహారవ శతాబ్దంలో మనుచరిత్రలోనూ చూపించిన హిమాలయాల పదచిత్రాలు నా మనసులో నాటుకుపోయాయి. ఆ వర్ణనలలో అతిశయోక్తులు ఉండి ఉండవచ్చు – కానీ అవి అద్వితీయం.

ఇజ్రాయిల్ పౌరులు ఇక్కడ్నుండి ప్రవేశించలేరు. అరబ్బులు దేశంనుండి బయటకు వెళ్ళలేరు. ఇరువైపులా వాహనాల రాకపోకలు పూర్తిగా రద్దు చేశారు. కానీ నాలాంటి విదేశీ ప్రయాణికులు పాస్‌పోర్ట్ చూపించి, సరిహద్దు ప్రాంతం దాటి మరో వాహనం ఎక్కి పాలస్తీనాలోకి ప్రవేశించవచ్చు. ఈ సరిహద్దును దాటేందుకు కావలసిన ఏర్పాట్లన్నీ జియాద్ చేసిపెట్టేశాడు. నేను పెద్దగా చెయ్యాల్సిందేమీ లేదు. వాడు పంపే కారు ఎక్కి కూర్చుంటే చాలు.

లీలాశుకుడు 17వ శతాబ్దపు కవి. యౌవనోద్రేకంలో వేశ్య చింతామణిని తగులుకొని దారి తప్పాడు. ఒక భయంకరమైన తుఫాను రాత్రి నానా అగచాట్లూ పడి ఆమె ఇంటికి పోతే ఆమె కాస్తా ఈ మాంసపుముద్దకోసం మనసుపడి యింత తుఫానునూ లెక్కచేయకుండా వచ్చావే, ఈ మనసుని ఆ భగవంతునిపై నిలుపరాదా అన్నది. అంతే ఆయన తక్షణం విరాగియై భగవన్నామస్మరణలో పడ్డాడు. ఎంతో మధురమైన భక్తికవిత్వం చెప్పాడు.

మనసు తరచూ మరో ప్రశ్న వేస్తుంది. ఈ ప్రశ్నకు నా మనసిచ్చే జవాబు – ఖర్చులూ ఫలితాల సంగతి నాకు అనవసరం. ఏదో సాధించాలని నేను ప్రయాణం చెయ్యడం లేదు. ప్రయాణమే నా జీవితం కాబట్టి ప్రయాణాలు చేస్తున్నాను. జీవించడానికి నాకు తెలిసిన ఒకే ఒక మార్గం ప్రయాణం…

మరుసటి రోజు పెద్దమ్మ ఉత్సాహంగా కనబడింది. కైండ్ అయిన కోడిని, కాకిని, పనిపిల్ల కుంజమ్మను, కొబ్బరికాయల వ్యాపారి అర్జునన్ నాడార్‌ను, భిక్షం అడుక్కోడానికి వచ్చిన పచ్చతలపాగా కట్టుకున్న ఫకీరునూ వేలెత్తి ఆమె వాళ్ళు కైండ్ అన్నట్టు చూపెట్టింది. ఆ రోజు మేఘాలు కమ్ముకుని ఉండటంతో ఎండ కాయలేదు. చల్లటి గాలిలో సన్నటి నీటి చెమ్మ వ్యాపించి ఉంది.