ప్లేన్ ఎక్కాను. ఇండియా నుండి ఇరవై వరకూ మిసెడ్ కాల్స్. అమ్మకేమవ్వచ్చు? హార్ట్ అటాక్? కిడ్నీ ఫెయిల్యూర్? అమ్మకేమీ కాదు. జెనీవాలో ఆ పార్క్ లో బొమ్మను చూడగానే అమ్మే అని అనిపించింది. తల కిందకు వంచి, భుజాలు వంగిపోతూ, చేతులు మోకాళ్ళపై పెట్టుకొని కూర్చున్న బొమ్మ. ఆడో మగో తెలిసే వీలు లేని బొమ్మ. ఛాతీ లేదు. పక్క ఎముకలు లేవు. పొట్ట లేదు. బొడ్డు లేదు. మెడ నుండి తుంటి వరకూ పెద్ద సున్నా. అంతా ఖాళీ.

ఈ చుట్టుకుచుట్టుకు పోతున్న
అల సొరంగమే అయితేనా
నువ్వూ నేనూ అందులో
ఒకళ్ళనొకళ్ళు అల్లుకుపోయి
పడుకుని…
ఎవరికి తెలుస్తుంది
సముద్రం హోరు

వీధిలో పచార్లుచేస్తున్న పెదరాజుగారు పరిపరివిధాల ఆలోచిస్తున్నారు. ‘ఏమయ్యుంటది? ఎలా అని వెదకడం? ఎక్కడని వెదకడం. ఆ రేవు దాటి పోతానన్న బాబయ్యని అనవసరంగా ఇలా రమ్మని గొప్పకి గొరిగించుకున్నాను. ఈ సంగతేంటో తేలకుండా ఆయన వచ్చేస్తే… విషయం ఆయన చెవిన పడితే… ఇంటి పరువు ఇద్దరి నుంచి అద్దరిదాకా గోవిందా గోవింద!

వాడు నాగరికుడు
వాడిక్కొంచం తేనీరు కావాలి
కూర్చున్న కుర్చీని
పెద్దమోతతో వెనక్కి తోసి లేస్తాడు
బాత్రూమ్ తలుపును
గట్టిగా తెరచి ఆపైన
ఢామ్మంటూ మూస్తాడు

ఆదిరప్పళ్ళి తలపోత తుంపరలకింద
వళ్ళంతా తడిసి ముద్దైన తీయటి కలలు
పిల్లల్లా తుళ్ళి ఆడటం మానేసి
పక్కపక్కనే పడుకున్న చెక్క గది కిటికీలోంచి
ఊగే వక్క చెట్లపై పడి వెన్ను విరిగిపోయాయి

ఆవల దూరంగా
విరిసిన ఇంద్రధనువోటి
నన్నిట్టే పట్టేస్తుంది
పరిగెట్టి పట్టాలని
నీవగుపడలేదని
వెతుకుతాను

చెస్‌తో పాటుగా ఆయన వైకుంఠపాళి కూడా తెచ్చాడు. రంగురంగులుగా ఉండి, అదే నచ్చింది ముందు; కానీ ఆ ఆట ఎందుకాడాలో మాత్రం అతనికి అర్థం కాలేదు. ఎలాగూ పాము నోట్లోంచి జారి క్రింద పడేటప్పుడు, నిచ్చెనెక్కి ఆనందపడ్డం ఎందుకో. అదే చదరంగమైతే! ఆ నలుపూ తెలుపూ గళ్ళ మీద ఎన్ని యుద్ధాలు చెయ్యచ్చు. ఎన్నెన్ని గెలుపోటముల్ని మూటగట్టుకోవచ్చు! ఆలోచిస్తూ, తల గోక్కున్నాడు.

చెక్కిళ్ళపై నీ పెదవుల
రాతలను వెతికిన
చెట్టు కొమ్మల్ని చిరుగాలి
తాకకుండా ముద్దాడిన
చేతిలో నీ ఉత్తరం
కాగితం పువ్వులా
రెపరెపలాడిన

నాకర్థం అయ్యింది. నన్ను పిచ్చివాడని అనుకుంటున్నాడు. పాపం, పిచ్చోడు! ఎక్కువ బేరం చెయ్యకుండా, “సరే. కానీ నా అమ్మకం షరతులకి ఒప్పుకుంటేనే,” అన్నాను. అవేమిటన్నట్టు నా వంక ప్రశ్నార్థకంగా చూశాడు. పాల్కురికి విరాట్ ప్రసాదరావు షరతులా! మజాకా! నా సిగరెట్ దమ్ము లాగాను. శరీరమంతా గాలిలో తేలిపోతోన్న భావన. నెమ్మదిగా, నా వేళ్ళ మధ్యనున్న సిగరెట్‌ని అతనికి అందించాను.

ఎనిమిది వందల సంవత్సరాలనాటి విషయాల గురించి, బౌద్ధం నుంచి సామ్రాజ్యవాదం, రాచరికం, ఫ్యూడలిజం, కమ్యూనిజం, నక్సలిజం వరకూ వివిధ నేపథ్యాలలో కథలు కట్టాలంటే ఎంతో సాహసం కావాలి. దాన్ని మించిన ఆత్మవిశ్వాసం ఉండాలి. ఈ రెంటినీ మించిన అధ్యయనం, పరిశీలన, సాంఘిక ఆర్థిక రాజకీయ తాత్వికతా ఉండాలి.

ఇల్ మాత్రిమోనియో సెగ్రేతో అనునది జొవాన్ని బెర్తాతి ఇటాలియను భాషలో వ్రాసిన గేయరూపకమునకు సుప్రసిద్ధ ఇటాలియను సంగీతకర్త యగు దొమీనికో చిమరోసా అను నతడు సంగీతరచన చేసిన సుప్రసిద్ధమైన సంగీతరూపకము . హాస్యరసాన్వితమైన అన్ని ఆపెరాలకును ఇది తలమానికమైనదని సంగీతపండితుల అభిప్రాయము.

ఆరుబయలు ఆటస్థలాలు,
ఆకుపచ్చని పరిసరాలు,
సుతిమెత్తని నీటి ప్రవాహాలు
పంచే సందడిని ప్రేమించాను.
ఓటి మాటల చప్పుడు జొరబడకుండా
కొన్ని పరిధులనూ పెట్టుకున్నాను!

ఈ శ్యామలా దండకమును మహాకవి కవికులతిలకుడు కాలిదాసు వ్రాసినాడని ప్రతీతి. ఈ చాటుకథ జగద్విదితమే. మూర్ఖుడైన కాలిదాసు సౌందర్యవతి, విద్యావతియైన రాజుగారి కుమార్తెను వివాహమాడి ఆమెచే కనుగొనబడి కాళికాదేవివద్ద పంపబడి ఆ దేవిని ధ్యానించి ఆ దేవిచే నాలుకపైన బీజాక్షరములను వ్రాయించుకొని ఆ దేవిని ఈ దండకము ద్వారా స్తుతించినట్లు కథ. ఇక్కడ రెండు సందేహాలు ఉదయిస్తాయి.

రెండు రోజులు భీకరంగా జరిగేక రెండు వైపులా జవాన్లు చాలామందే పోయారు. కాల్పులు విరమించమని ఆర్డర్ వచ్చి, యుద్ధం దాదాపు అయిపోయేసరికి అబ్దుల్ కరీమ్‌కి కాలులోకి బులెట్లు దిగబడి బాగా గాయాలయాయి. శ్రీవాత్సవ ట్రాన్స్‌మిటర్‌లో ఆర్మీ మెడిక్స్‌కి సమాచారం అందించేడు. కాసేపట్లో హెలికాప్టర్ పంపుతామన్నారు.

మారన ఒక సంస్కృత పురాణాన్ని తెనిగించిన తొలి తెలుగు కవి. ఈయనకు తిక్కనగారంటే మహా గౌరవము. ‘తిక్కన సోమయాజి ప్రసాదలబ్ధ సరస్వతీపాత్రుడ’నని తన కావ్యంలోని ఆశ్వాసాంత గద్యల్లో చెప్పుకున్నాడు. అన్నట్టు ఈయన తండ్రి పేరు కూడా తిక్కనామాత్యుడే. తన మార్కండేయ పురాణం అనువాదాన్ని మారన ప్రతాపరుద్ర చక్రవర్తి సేనానాయకుడైన గన్న సేనానికి అంకితమిచ్చాడు.

“రాజా! ఒక విషయంలో మొదటిసారి పొరపడితే అది అనుభవరాహిత్యం. రెండోసారి పడితే మూర్ఖత్వం. నిన్నటి పొరపాటు ఇవ్వాళ జరగకుండా నువ్వు తీసుకున్న జాగ్రత్త చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. మరీమరీ నీతో ముచ్చటలాడాలనిపిస్తోంది. అదే పని పదేపదే చేస్తున్న నీకు విసుగు కలగకుండా మన అభిమాన పాఠకరావు ధోరణిలో మరో వింత కోణాన్ని ఈ రోజు నీ ముందు ఆవిష్కరిస్తాను. విను.”

2003లో హైదరాబాదులో కె.వి.రావుగారు, మరికొందరు సంగీతాభిమానులు కె.రాణి, ఎ.పి.కోమల, సి. కృష్ణవేణిగార్లను ఆహ్వానించి ఒక మంచి కార్యక్రమం జరిపారు. వ్యక్తిగతంగా ఆ రోజుల్లో నేను, మిత్రులు మధుసూదనశర్మగారితో కె. రాణిగారిని రెండుసార్లు హైదరాబాదులో కలిశాను. చాలా బాగా మాట్లాడేవారు.

క్రితం సంచికలోని గడినుడి 22కి మొదటి పదిరోజుల్లోనే అయిదుగురినుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపిన అయిదుగురు: సుభద్ర వేదుల, శైలజ, జంధ్యాల ఉమాదేవి, విజయాదిత్య, భమిడిపాటి సూర్యలక్ష్మి. విజేతలకు మా అభినందనలు.

గడి నుడి 22 సమాధానాలు, వివరణ.

డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి ఇరవై ఏళ్ళ పండగ సందర్భంగా సెప్టెంబరు 29-30, 2018న జరుగుతున్న సదస్సులకు సాదర ఆహ్వానం. మా ఆహ్వానాన్ని మన్నించి తెలుగు సాహిత్యాభిమానులందరూ రావాలని కోరుతున్నాం, వస్తారని ఆశిస్తున్నాం.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.