గాథాసప్తశతి శతకం


రఇ-కేలి-హిఅ-ణిఅంసణ-కర-కిసలఅ-రుద్ధ-ణఅణ-జుఅలస్స
రుద్దస తఇఅ-ణఅణం పవ్వఇ-పరిఉంబిఅం జఅఇ

రతి-కేలి-హృత-నివసన-కర-కిసలయ-రుద్ధ-నయన-యుగలస్య
రుద్రస్య తృతీయ-నయనం పార్వతీ-పరిచుంబితం జయతి


రతికేళివేళ బట్టల
పతి విప్పగ లజ్జితయయి పార్వతి మూసెన్
బతి కందోయిని, ముద్దిడె
నతిగా నపు డగ్గి కంటి, నది జయ మవుతన్!
… 5-55

As Siva disrobed her to make love
the bashful Parvati
closed His two eyes
and then kissed His third eye –
the eye of fire!
May Siva’s third eye be victorious
and bring prosperity!



ఆవణ్ణఇఁ కులాఇం దో వ్విఅ జాణంతి ఉణ్ణఇం ణేఉం
గోరిఅ హిఅఅ-దఇఓ అహివా సాలాహణ-ణరిందో

ఆపన్నాని కులాని ద్వావేవ జానీత ఉన్నతిం నేతుం
గౌర్యా హృదయ-దయితోऽథవా శాలివాహన-నరేంద్రః


పలు కష్టమ్ములతో బ్రదుకున
నిలుచుచు పోరాడుచుండు నిర్భాగ్యులకున్
దొలగించు గష్టము శివుడు, కు-
వలయాధీశుండు శాతవాహనుడు సదా
… 5-67

For those who have fallen behind
and are down with their luck
only two offer succour …
Lord Shiva and King Satavahana!



ఆఅంబ-లోఅణాణం ఓల్లంసుఅ-పాఅ-డోరు-జహణాణం
అవరహ్ణ-మజ్జిరీణం కఏ ణ కామో వహఇ చావం

ఆతామ్ర-లోచనానామాద్రాంశుక-ప్రకటోరు-జఘనానాం
అపరాహ్ణ-మజ్జనశీలానాం కృతే న కామో వహతి చాపం


అరుణమ్మగు కన్నులతో
తరుణులు తమ మొలల దొడల తడిబట్టలతో
చెరువున జూపుచు నాడగ
విరియమ్ముల మదను డెక్కు పెట్టక విడునా
… 5-75

With reddening eyes
the young women are bathing at noon time
and the clinging wet clothes
reveal their thighs and hips
How can the love god keep quiet
and not act
without aiming his arrows –
the arrows of flowers?



అణ్ణా వరాహ-కువిఓ జహతహ కాలేణ గమ్మఇ పసాఅం
వేసత్తణావరాహే కువిఅం కహఁ తం పసాఇస్సం

అన్యాయాపరాధకుపితో యథాతథా కాలేన గచ్ఛతి ప్రసాదం
ద్వేష్యత్వపరాధే కుపితం కథం తం ప్రసాదయిష్యామి


అపరాధములన్ జేయగ
కుపితుని కృప జూప జేయు గుట్టు నెఱుగుదున్
విపరీత ద్వేష మ్మది
కుపితుని జేయంగ నెట్లు కోపము కరగున్
… 5-88

When he becomes cross with me
I know the tricks to pacify him
But
he is jealous and suspicious
and is consumed by anger
How to cool him now?