జీవితాంతమూ అనాదరణకి గురైన ఫ్రేగె ఆధునిక కంప్యూటర్ కి మూలమైన తార్కిక గణితానికి సంస్థాపకుడిగా, అరిస్టాటిల్ స్థాయి మేధావిగా, వైశ్లేషిక తత్వానికి (analytic philosophy) మూలపురుషుడిగా గుర్తిస్తారు.

పౌరాణిక ఇతివృత్తాన్ని తీసుకొని సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల సమస్యను లోతుగా చర్చించి, ”భారతీయులంతా ఒక్కటే” అనే జాతీయతా వాదాన్ని స్థాపించే నాటకంగా దీన్ని అభివర్ణించవచ్చు.

మల్లికార్జున భట్టు పద్యాన్ని మొల్ల చూసే ఉంటుంది. చూసింతర్వాత ఆకర్షింపబడి కొద్ది మార్పులతో తన పద్యాన్ని తాను వ్రాసుకొని పైపద్యం మీద తన గౌరవం ప్రకటించింది.

ఉన్నట్లుండి, “ఫ్రాంక్, నిజం చెప్పు. నేను ‘సెన్సిటివ్’నా కాదా” అని శాల్ అడిగింది.
“నువ్వు సెన్సిటివ్వే. కాదని ఎవడన్నాడు? నా రోజెలా గడిచిందని అడుగుతావు, అది సెన్సిటివ్వేగా. పైగా నువ్వు కిటికీలోంచి బయటకి చెత్త పారేయడం నేనెప్పుడూ చూడలేదు”
“అబ్బా, సెన్సిటివ్ అంటే అది కాదు. …”

వ్యావహారిక భాషలో పద్యాలను రాయడంవల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. భాషపైన, వ్యాకరణంపైన అంతగా అధికారం లేకున్నవారు కూడా పరిశ్రమించవచ్చు. దీనివల్ల ఛందస్సు ప్రక్రియ ఏ కొందరికో మాత్రమే కాక అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ కళకు మళ్ళీ ఒక నవజీవనం కలుగుతుంది, నవ చైతన్యం పుడుతుంది.

జ్యోతిష్కులు భ్రమల్లోనూ, అజ్ఞానంలోనూ బ్రతుకుతున్నారని సైన్సు అంటుంది. కాదని జ్యోతిష్కులు నిజంగా భావిస్తే నిరూపించవలసిన బాధ్యత వారి మీదే ఉంటుంది. ఏది ఏమైనా మన నమ్మకాలని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే తప్పేముంది?

అనువాద రచనలు మూల భాష తెలిసిన వారిని,అనువాద భాష మాత్రమే తెలిసిన వారిని సమానంగా రంజింపజెయ్యాలని ఎలా ఆశిస్తామో, అలాగే అనుభవాల గురించి రాసిన రచనలు కూడా ఆ అనుభవాల నెరిగిన వాళ్ళకి, ఎరగని వాళ్ళకి కూడా సంతృప్తి నియ్యాలని ఆశించటంలో తప్పులేదు.

రాగం, స్వరం, తాళం, లయ అన్నిటిమీదా బాలమురళికి ఎంతో అధికారమూ, నియంత్రణా ఉన్నాయి. ఆయనను మైలు దూరానికి కూడా సమీపించగల కర్నాటక గాయకులు లేరు. ఆయనకు సమకాలికులం అయినందుకు మనమంతా గర్వపడాలి.

“వ్యాపారంలో ఒకడిమీద మరొకడికి నమ్మకం ఉండాలి. రాతకోతలు, రసీదులు ఇవ్వడం పుచ్చుకోవడం నాకు పనికిరాదు. అది నావ్యాపార సరళి కానేకాదు. నాజీవితంలో నేను ఒక్క డికి కూడా రసీదు ఇవ్వలేదు; ఒక్కడిదగ్గిరనుంచి కూడా రసీదు పుచ్చుకోలేదు.

సాధారణ పాఠకుడికి పుస్తక పరిచయం కనీసం మార్గదర్శకం అవుతుంది. పుస్తకాలమీద ఎంత మమకారం ఉన్న పాఠకులైనా, ( వీళ్ళని ప్రస్తుతానికి ” అసాధారణ పాఠకులు” అని అందాం!) ప్రచురించబడ్డ అన్ని పుస్తకాలూ చదవలేరు.

మా సంస్థకి పదేళ్ళు నిండిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు సాహిత్యాభిమానులందరితో సమావేశమై ఒక వారాంతమంతా తెలుగు సాహిత్యపు వెల్లువలో మునిగి తేలాలని కోరిక కలిగింది.

త్యాగరాజు జీవితంలో జరిగిన చిన్న చిన్న సంఘటనలకి దైవత్వం ఆపాదిస్తూ, త్యాగరాజు జీవిత కథని భక్తి పురాణ గాధగా మార్చేసారు ఆయన శిష్యులు. వాటికి భిన్నంగా వీలైనన్ని చారిత్రక ఆధారాలు చూపిస్తూ, ఒక వాగ్గేయకారునిగా త్యాగరాజునీ, ఆయన జీవితాన్నీ అందించాలన్నదే ఈ చిన్న ప్రయత్నం.

మా ముగ్గురి లోకి మొదట తేరుకున్న వెంకట్ “ఒరేయ్, ఎదవల్లారా, ఏమిటా చూపులు? ఇక్కడ అరకోటి కారు నొదిలేసి” అంటూ మమ్ముల్ని మళ్ళీ ఈ పాపపంకిలపు లోకం లోకి లాగాడు.