ఈ వ్యాసపు ముఖ్యాశయం వాడుక భాషలో తెలుగు కవిత్వం ఎలా మెల్లమెల్లగా వికసించి నేటి స్థితికి వచ్చిందన్న విషయాన్ని సోదాహరణంగా వివరించడమే. వ్యాసం కొద్దిగా పొడవైనా ఈ ఉదాహరణలు పాఠకుల ఆసక్తిని ఎక్కువ చేస్తాయని నా నమ్మకం.

పరిషత్తు వారు చాలా ధనము కర్చుపెట్టి చాలా శ్రమపడి వ్యావహారిక భాషాభ్యాసమువల్ల సారస్వతము నశించి దేశమునకు ఉపద్రవము కలుగుతుందని ప్రజలను, ప్రభుత్వమువారిని, విద్యాధికారులను నమ్మించుటకై చెప్పిన మాటలన్నీ యధార్థమైనవి కావనిన్నీ, దురభిమానముచేత తాము మోసపోయి లోకమును మోసపుచ్చినారనిన్నీ ఈ వ్యాసము నందు ఋజువు చేస్తాను.

వాడుకలో నున్న భాషను తృణీకరించి ప్రాచీన భాషను ఆదరించడము బ్రతికియున్నవారికి తిండిపెట్టక చచ్చిన వారికోసము సంతర్పణ చేసినట్టు కాదా? ఆదికవులకు ఇట్టి దురభిమానముంటే తెలుగులో గ్రంథములే లేకపోవును గదా?

కవిత్వభాషకీ, వ్యావహారిక భాషకీ మధ్యనున్న తేడాలు, భాషలో ఉన్న వివిధ ప్రత్యేకాంశాలు కవిత్వంలో సాధించే ప్రయోజనము గూర్చి యీ వ్యాసంలో నాకు తెలిసినంతలో విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.

భాష స్వభావం తెలుసుకోకుండా గ్రంధస్థ భాష లో వున్న ప్రత్యయాలకి మాత్రమే ఆ గౌరవం కలిపిస్తే, దానివలన భాషకి చాలా నష్టం ఉంది. పిల్లలకి అటువంటి భాష నేర్పరాదు. ఆ భాష తగినంత జీవం గల భాష అయి ఉండాలి. నిర్జీవమైతే గ్రాంధిక భాష అయినా పిల్లలకు నేర్పకూడదు.

వ్యవహారములో ననేక రూపము లిట్లే కాలక్రమమున మార్పు జెందినవి. ఇట్టి వ్యావహారిక భాషారూపము లనేకములు నేడు పలువురువ్రాయు వ్యాసములలో గానవచ్చుచు ప్రామాణికత్వమును బడయగలిగిన స్థితిని బొందుచున్నవి. శిష్టవ్యవహారమే ప్రామాణికత్వమునకు మూలముగదా.

గిడుగు, గురజాడలు సమకాల విశ్వసారస్వత స్థితిగతులను పరిశీలించిన వాళ్ళు. వారి ప్రతికక్షులకు ఏ విధమైన విశాల దృక్పథంగాని ఇరుగు పొరుగుల అనుభవాలను గమనించటంగాని అలవాటు లేదు. ఇదే తీవ్ర వాదోపవాదాలకు దారి తీసింది. దృష్టి భేదాలు అనుభవ భేదాలూ ఘర్షణకు దిగాయి.

భద్రిరాజు గారి అశీతితమ జన్మదిన సందర్భంగా ఆయన గురించి చేకూరి రామారావు, వెల్చేరు నారాయణ రావు, కె. కె. రంగనాథాచార్యులు, ఆరుద్ర, బూదరాజు రాధకృష్ణ గార్లు రాసిన వ్యాసాలను ఈ సంచికలో చివరి విడతగా మీకు అందజేస్తున్నాము. సమయాభావం వల్ల, ఈ ప్రత్యేక సంచికకోసం మాకు పంపించిన కొత్త రచనలన్నింటిని ప్రచురించలేక పోయాము. మిగిలిన రచనలను జులై సంచికలో తగుమాత్రంగా సమీక్షించి ప్రచురిస్తాము. ఈ సంచికకోసం పాత వ్యాసాలను సేకరించడంలో మాకు ఎంతగానో సహాయ పడ్డ వాడపల్లి శేషతల్పశాయి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు.

జనులు వాఙ్మయము నర్థము చేసికొనలేక పోయినచో వారలకుఁదమ పూర్వ వృత్తాంతము, పూర్వ మర్యాదలు తెలియక పోవును. తమ పూర్వ వృత్తాంతము మఱచిపోవుట కంటె ఘోరతరమైన విపత్తేజాతివారికిని దటస్థింపఁబోదుకదా!

ఏమార్పులు చేసినను నియమములకు లోబడి యుండవలెను గాని విచ్చల విడిగా నుండరాదు. ఇట్టి మార్పులు భాషాభివృద్ధికి దోడ్పడవు.

భాషలో వ్యాకరణ విషయమైన మార్పులు సేయునప్పుడు మిక్కిలి ప్రయాసతో ఆజన్మాంతము భాషాపరిశ్రమము చేసిన పండితకోటి యొక్క యభిప్రాయము ననుసరించి చేయవలెనుగాని ప్రతి గ్రంథకర్తయు తనకు దోఁచిన మార్పులతో పుస్తకముల వ్రాయఁ దొడంగినచో భాషకు గొప్ప యనర్తకము వాటిల్లును.