గూగోళ జ్ఞానంమన అనుభవాలను గుర్తుంచుకోవడం కోసం భాషలను పుట్టించుకొని, వ్రాయటం నేర్చుకొని సమాచారాన్ని పెంచుకోవడం పంచుకోవడమే మన లక్ష్యంగా, సమాచారమే మన ఉనికికి ప్రమాణంగా చేసుకున్నాం. సమాచార జీవితం యదార్థం గానూ, యదార్థ జీవితం సమాచారంగా మారడానికి పనికొచ్చే జ్ఞాపకంగా మాత్రమే మనం బ్రతుకుతున్నాం.

తిరగబడ్డ తొమ్మిదిఇప్పుడీ సంగతి నాకు కాక నీకొక్కడికే తెలుసు. ఇంకెవరికీ చెప్పకు! నువ్వు మర్చిపోకు! నువ్విందాక అన్నావే కంప్యూటర్లు, సూపర్ కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ బుర్రలు, వాటిని నడిపే మేధావులందర్నీ వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని లెక్కలేసుకోమను. కానీ ఇప్పుడు అర్థమయిందా మన లెక్కలన్నీ శుద్ధ తప్పని?

పద్దాలుగాడు తాగుబోతు. పచ్చి దొంగ. తాగినప్పుడు రంగిని చితక తంతాడు. రంగి ఒక్కత్తే కాదు; మరొక ఆడదానితో పోతాడు. అయినా రంగికి వాడంటే ఉన్న ఆకర్షణ ఏమిటో బోధపడలేదు. వాడు దొంగతనం చెయ్యడానికి సహాయం కూడా చేస్తుంది. వాడితో ఎన్ని అవస్థలు పడ్డా మళ్ళీ వాడి పక్కకే చేరటం నాకు నచ్చలేదు. రంగి మానసికస్థితి ఒక పట్టాన బోధపడలేదు.

స్వతహాగా సత్య వీరనారి. నరకుని లాంటి వీరునితో యుద్ధం చేసే అవకాశం వచ్చింది. ఆ ఉత్సాహం కొంత. తన పరాక్రమం భర్త ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు భర్త ముందు ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఆ ఆనందం కొంత. ఇటు శత్రువును చూస్తూ, అటు ప్రియుని చూస్తూ ఏకకాలంలో వీరాన్నీ, శృంగారాన్నీ ప్రదర్శిస్తున్నది.

రాజీ! నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే లోపలికి వెళ్ళి ముఖం కడుక్కొని చీర మార్చుకుని రా. మన ప్లాను ప్రకారం సినిమాకి వెళ్తున్నాం. ఈ ఉంగరం సంగతి పూర్తిగా మర్చిపో. కాసేపట్లోనే ఉన్నట్లుండి కలగన్నట్లు ఎక్కడ పెట్టావో జ్ఞాపకం వస్తుంది. పోగొట్టుకున్న వస్తువును కని పెట్టడానికి ఇది ఒక దారి.

ఇంగ్లీషు పొయిట్రీ క్లాసు చెప్పే ఎస్.వి.ఎల్.ఎన్ గారి క్లాసులో పాఠం కంటే హస్కే ఎక్కువ. దీపావళికి ఎవరెవరో ఏం కాల్చారూ అని అడుగుతూ ఆయన చిన్నప్పటి సొంత గోల చెప్పడం మొదలు పెట్టాడు. మిగతా స్టూడెంట్లూ ఎవరికి తోచినవి వాళ్ళు మధ్య మధ్యలో చెబుతున్నారు. శీనుగాడు మాత్రం మౌనంగా ఉన్నాడు.

ఫెళ ఫెళ ఉరుముల్తో టప టప చినుకుల్తో వాన
ఊరంతా ముంచేసే వాన కాలవలన్నీ ఉప్పెంగే వాన
పైర్లన్నింటినీ కళకళలాడించే వాన
నాలుగు నెలలుగా చూసినా రాని వాన

మొట్టమొదటగా పికాసో చిత్రాలను చూచి సంభ్రమాశ్చర్యాలను పొందాడు బ్రాక్. తాను ఇంతవరకు చూడని క్రొత్త పద్ధతి, పికాసో యొక్క చిత్రకళా విధానం ఇతన్ని కలవరపరిచినై. తాను చేసే ఫావిౙమ్ పద్ధతితో ఇక లాభం లేదు, ఏదో మార్పు తేవాలి తన చిత్రాలలో అనుకున్నాడు. అందుకే ద్విగుణీకృత నిశ్చయంతో చిత్రాలను వెయ్యడం ప్రారంభించాడు.

ఎమర్జన్సీ సడలించిన తరువాత 1977లో గౌతమరావు లోక్‌సభకి జనతా పార్టీ నుండి పాత మిత్రుల ప్రోద్బలంతో బలవంతంగా పోటీ చేశారు. రాజకీయంగా ఆయనని ప్రభావితం చేసింది జయప్రకాశ్ నారాయణ్. ఆ ఎన్నికలప్పుడు ఆయన ఇచ్చిన ఉపన్యాసం హృదయాన్ని కదిలించి వేసిందని ఎంతో మంది ఎన్నో ఏళ్ళు చెప్పుకోగా నేను విన్నాను.

ఆగస్టు నెలలో తెలుగుదేశం పలువురు ప్రముఖుల్ని కోల్పోయింది. అందరి గురించి తెలుగు పత్రికలు నిడివైన వార్తలనే అందించాయి, వారి వారి అభిమానులు, శిష్యులు ఘనంగా నివాళులర్పిస్తూ వివరంగానే వ్యాసాలు రాశారు, ఒక్క కమలా చంద్రబాబు గారి విషయంలో తప్ప.

దాదాపు 35,000 సంవత్సరాల క్రితమే చంద్రుని గమనాన్ని మానవుడు అర్థం చేసుకున్నాడనడానికి మనకు ఆధారాలున్నాయి. ఆఫ్రికాలో దొరికిన లెబోంబో ఎముకపై వరుసగా 29-గీతలు ఉండడం శాస్త్రజ్ఞులను ఆశ్చర్య పరిచింది. ఇది ఆ కాలంలో చంద్రుని గమనానికి, స్త్రీల ఋతుచక్రంలో రోజులను లెక్కించడానికి ఉపయోగించి ఉండవచ్చునని శాస్త్రజ్ఞుల ఊహ.

వ్యవహార భాషావాదం పుట్టి నలభై యేళ్ళ పైచిలుకైనా ఆ వ్యవహారభాషంటో ఏమిటో, దాని సమగ్ర స్వరూపమేమిటో నిర్ణయించినవారెవరూ ఇంతవరకు లేరు. ఆంధ్ర కావ్యభాషకే సరి అయిన వ్యాకరణం మనకు ఇంతవరకూ లేదు. భాష యొక్క సమగ్రస్వరూపం నిర్ణయించడమనేది సుఖసుఖాల మీద తేలేపని కాదు. కావ్యభాష సంగతే ఇట్లా వుంటే దారీ తెన్నూ లేని వ్యావహారిక భాషను వ్యాకరించ బూనుకోవటం సంగతి వేరే చెప్పనక్కఱ లేదు.

ఈ తెలుగు దేశములో అసలు గ్రంథము చదువకనే, చక్కగా అధ్యయనము చేయకనే దానిని గూర్చి స్వేచ్ఛగా వ్రాయుటయో, మాట్లాడుటయో మిక్కిలిగా అలవాటు అయినది. ఈ రామాయణ కల్పవృక్షము సంస్కృత కావ్యమున కనువాదమనుట అటువంటి వానిలో నొకటి. అయినను దోషము లేదు. కాదు కనకనే కాదని చెప్పుట. కథారంభములోనే ఇది స్వతంత్ర్య కావ్యమని స్పష్టముగా దెలియును.

జువ్వాడి గౌతమరావు పద్యపఠనానికి సుప్రసిద్ధులు. వారు పఠించిన రుక్మిణీ కళ్యాణం పూర్తి పాఠం (ఇంట్లో పాడుతుండగా రికార్డు చేసినది,) జువ్వాడి రమణ గారి సౌజన్యంతో ఈమాట పాఠకులకు అందిస్తున్నాం.

2012 బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ ఆవార్డ్లు ప్రకటించాము. వీటికి గాను ఆలూరి భుజంగరావు గారు, రామినేని లక్ష్మి తులసి ఎంపికైనారని చెప్పడానికి సంతోషిస్తున్నాము. ఈ ప్రకటనతో పాటు తులసి కవిత్వ తత్వాన్ని పాఠకులకు పరిచయం చేస్తున్నాము.