మ్యాపులు పెట్టుకుని తనంత తను సునాయాసంగా డ్రైవ్ చేసుకుని వెళ్తున్న కూతురి గురించి గర్వపడుతూ తన పక్కనే కూర్చున్నాను.
ఈమాట నవంబర్ 2010 సంచికకు స్వాగతం!
ఈ సంచికలో:
- ‘కథ నచ్చిన కారణం’ కొత్త శీర్షిక ప్రారంభం. పాల్గొనమని మా పాఠకులకు ఆహ్వానం.
- విన్నకోట రవిశంకర్ కవిత్వ పరిశీలన, నాటికి నేడు రేడియో నాటిక, దేశికాచారి, వైదేహి శశిధర్, పాలపర్తి ఇంద్రాణి తదితరుల కవితలు. జెజ్జాల కృష్ణ మోహనరావు తిరుక్కుఱళ్ అనువాదం కామవేదం. ఇంకా…
పెద్దల్లో మద్యపాన వ్యసనం వారి పిల్లలపై ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపిస్తుందో, ఆ పిల్లలు ఎటువంటి వ్యక్తిత్వపు ముసుగులలో దాక్కుని పెరుగుతారో ఎంతో చక్కగా వివరించే ఈ పుస్తకం, ప్రతి ఒక్కరూ చదవ వలసినది.
అంతవరకూ శ్రీరాముడు తల్లిదండ్రుల చాటు బిడ్డ. అదే ప్రథమంగా రాజభవనాల్లోంచి విశాల ప్రపంచంలోకి ఒక బాధ్యతను నెత్తిన వేసుకొని రావడం.
మునులచందము గానల మనుచునున్న
గిరికుమారుల మస్తిష్కసరణులందు
మెఱపుతీవలవోలె సంస్ఫురితమైన
భావబింబములొకొయీ ప్రపాతతతులు!
అన్నీ పరస్పర విరోధాలే ఈ మన్మధునివి. సున్నితమైన వాటితోటే కొడతాడు. వీడి బాణాలేమో మరీ విడ్డూరం! ఏం చెప్పను? మహా బాధ పెడతాయి ఆ బాణాలు.
– (హాలుని గాథా సప్తశతి ఆధారంగా వ్రాసిన ఈ శృంగార ఖండిక రచయిత ఎవరో మీకేమైనా తెలుసా?)
ఇంతకు ముందు వచ్చిన సంకలనాలకీ దీనికీ మధ్య నాకు గోచరించే ఒక పెనుమార్పు, కవి తన ఉనికిని హృదయస్థం చేసుకోవటం. అది ‘ఇక్కడే’ అని గ్రహించటం.
అతిశయంతో తొణికిసలాడే
ఈ యవ్వన కలశం తెలియకుండానే
నిశ్శబ్దంగా నిండుకుంటుంది.
దూరంగా తాగుబోతు కేక
లీలగా మనుషుల ఊసు
చీకట్లో ఒకటే
మొరుగుతోంది ఊరకుక్క
మావాడు మాటలాపి
సూపు తాగుతున్నాడు.
చెట్టుకు కట్టేయబడ్డ సీతారాఁవుడి
శరీరం వైపుకి తూటాలు మాత్రం
దూసుకొని వస్తూనే ఉన్నాయి.
పగలంతా పాలవాసన వెంట / పరుగులెత్తిన ఈమె/ సగం రాత్రి వేళ పారిజాతమై పరిమళిస్తుంది. – ఈ మధ్య కాలంలో ఇంతకన్నా మంచి ప్రేమ కవిత చదివిన గుర్తు లేదు.
“అసలు పేరేదో తెలీదు గానీ మావాడు ఆమెను ముద్దుగా లిల్లీ అని పిలిచేవాడు. లిల్లీ అంటే జాబిల్లి లోని చెవులపిల్లిట” – ఈ నాటిక వింటూ మీరొకసారైనా నవ్వకపోతే మీకు నవ్వడం తెలీదన్నమాట!
పెళ్ళయినప్పుడు మొదటి రాత్రి నన్ను చూసి
పోతపోసిన బంగారమన్నాడు
పూతపూసిన సింగారమన్నాడు
పెరిగి పెద్దయినప్పుడు
ఈ రాత్రి ఎప్పుడు తెల్లవారుతుందా…
అని ప్రతి రాత్రీ అనిపిస్తుంది
ఒక కథ నచ్చడానికీ నచ్చకపోడానికీ మనకు ఎన్నో కారణాలుంటాయి. నచ్చనివాటిని కాసేపు పక్కన పెట్టి, ఏదైనా కథ మీకెందుకు నచ్చిందో ఆ కారణాల గురించి ముచ్చటించుకోడం కోసమే ఈ శీర్షిక.
కథలో చదరంగం ఆడుతున్న తాతగారు ఒక ముఖ్య పాత్ర. చదరంగం ఎత్తులు, పైఎత్తులూ కథ నడకకి పరోక్షంగా దోహదం చేస్తున్నాయి. కథలో తాతగారికి అన్నీ తెలుసు.
వికృత నామ సంవత్సరానికి గాను ఇస్మాయిల్ అవార్డుకు గండేపల్లి శ్రీనివాస రావును, బ్రౌన్ పండిత పురస్కారానికి దీవి సుబ్బారావుని ఎంపిక చేశాము.
తిరుక్కుఱళ్‌లో నేడు 1330 పద్యాలు దొరుకుతాయి. వీటిని మూడు వర్గాలుగా విభజిస్తారు, అవి – అఱత్తుప్పాల్ (ధర్మ వేదము), పొరుట్పాల్ (అర్థ వేదము), కామత్తుప్పాల్ (కామవేదము). కామత్తుపాల్ అనబడే కామవేదములో 250 పద్యాలు ఉన్నాయి.
పసిపాపతో కలిసి
మరో పాపవైపోగలిగిన
ప్రతిసారి
కొత్తగా చిగురిస్తున్నట్టే…
నీ తొలి తలపుల జాడలలో
మాయని వలపుల చాయలివి
ఏ నడలో ఏ ఎడలో!
తీయని ఆ కధలేవి ప్రియా?
గతంలో ఎన్నో క్లిష్టమయిన కేసులు నేను గెలిచాననీ సులోచనకి తెలుసు. సులోచన ఎవర్నీ నాకు సిఫార్సు చెయ్యదు.