ఒక పద్యములో మఱియొక పద్యము ఇమిడేటట్లు ఉండే పద్య గర్భకవిత్వము మనకు పరిచితమే. కాని ఒక వృత్తపు పాదములో మఱియొక వృత్తపు పాదము ఇమిడేటట్లు ఉండే పాద గర్భ కవిత్వమును మొట్టమొదటిసారిగా పరిచయము చేసినాను. ఇది అమరికల ఆవృత్తి వలన జనించిన ఆవృత్త వృత్తములవలన సాధ్యమైనది.
జెజ్జాల కృష్ణ మోహన రావు
- పూర్తిపేరు
- జెజ్జాల కృష్ణమోహనరావు
- ఇతరపేర్లు
- J K Mohana Rao
- సొంత ఊరు
- మద్రాసు
- ప్రస్తుత నివాసం
- ఫ్రెడరిక్, మేరీలాండ్, US
- వృత్తి
- స్ఫటిక శాస్త్రజ్ఞుడు, జాతీయ క్యాన్సర్ సంస్థ
- ఇష్టమైన రచయితలు
- అందరు మహానుభావులు
- హాబీలు
- సాహిత్యము, సంగీతము, ముగ్గులు
జీవిత విశేషాలు
జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు.