గత నూరు సంవత్సరాలుగా, మన ప్రాంతీయ భాషలు “ప్రేయసి మెల్లకన్ను మీద” బస్తాల కొద్దీ కవిత్వాన్ని ఉత్పత్తి చేశాయి తప్ప, ఆధునిక నాగరికత, విజ్ఞానాన్ని వివరించి చర్చించే విధంగా అభివృద్ధి చెందలేదు. ఇది శోచనీయం. అయినా నిజం.
ఆగస్ట్ 2025
ఆగస్టు 30, 2025 నాటికి, రచయిత, పండితుడు, హేతువాది, మూఢనమ్మకాలను నిర్మొహమాటంగా విమర్శించిన ఎం. ఎం. కల్బుర్గి (మల్లేశప్ప మడివాళప్ప కలబుర్గి) హత్య జరిగి పదేళ్లు పూర్తవుతాయి. అతని హత్య కేవలం ఒక వ్యక్తిపై జరిగిన హింసాకాండ మాత్రమే కాదు; అది ప్రజాస్వామ్య సమాజానికి జీవనాడి అయిన వాక్స్వాతంత్ర్యంపై జరిగిన ప్రత్యక్ష దాడి. తాము వెలిబుచ్చిన అభిప్రాయాల కారణంగా హత్యకు గురైన వారిలో కల్బుర్గి మొదటివాడు కాదు. ఆఖరివాడు కూడా కాలేకపోయాడు. కల్బుర్గి హత్యకు ఒకటి, రెండు సంవత్సరాల ముందు వెనుకలుగా నరేంద్ర దభోల్కర్, గోవింద్ పన్సారే, గౌరి లంకేశ్ వంటి ఇతర రచయితలను కూడా దాదాపు ఇదే రకమైన దాడులతో కాల్చి చంపారు. ఈ రచయితల హత్య జరిగిన ఈ దశాబ్ద కాలంలో, ఈ హత్యల గురించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుండి, న్యాయస్థానాల నుండి స్పందన మాత్రం నిస్తేజంగా ఉంది. దర్యాప్తులు నత్తనడకన సాగాయి. శిక్షలు అరుదుగా పడ్డాయి. ద్వేషాన్ని పెంచి పోషించే విస్తృత వ్యవస్థలు మాత్రం చెక్కుచెదరకుండా ఉన్నాయి; బహుశా మరింత బలోపేతం అయ్యాయి. ఆధునిక సమాజంలో, భావ ప్రకటనా స్వేచ్ఛ కేవలం ఒక హక్కు మాత్రమే కాదు, అది జాతి పురోగతికి, వ్యక్తిగత స్వేచ్ఛకు కీలకమైన పునాది. ఎలాంటి ప్రతీకార చర్యలకు భయపడకుండా పౌరులు సాహిత్యం ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా ప్రభుత్వాలను, సంస్థలను విమర్శించగలగడం అనేది అధికారులను, రాజకీయ నాయకులను జవాబుదారీగా ఉంచగలిగే ప్రాథమిక సాధనం. అంతేకాకుండా, ఈ స్వేచ్ఛ సమాజంలో పాతుకుపోయిన ఆధిపత్య ధోరణులను, మతం, సంప్రదాయం అనే ముసుగులో జరిగే ఘోరాలను, అత్యాచారాలను సవాలు చేయడం ద్వారా సత్యాన్వేషణకు మార్గం సుగమం చేస్తుంది. భారతదేశంలో ఈ రకమైన భావప్రకటనా స్వేచ్ఛ నిజానికి ఏ ఆధునిక పాశ్చాత్య దేశాలనుండి దిగుమతి చేసుకొన్న భావన కాదు. అది భారతదేశ తాత్విక, ఆధ్యాత్మిక సంప్రదాయాలలోనే నిక్షిప్తమై ఉంది. ఉపనిషత్తులలో కనిపించే సంవాద చర్చల నుండి భక్తి కవుల వరకు, బుద్ధుడి కర్మకాండల తిరస్కరణ నుండి బసవన్న ప్రతిపాదించిన కులవ్యతిరేక సంస్కరణల వరకు వాదప్రతివాదాలకు, చర్చోపచర్చలకు ఎప్పుడూ పెద్దపీట వేసే ఘనమైన సంప్రదాయం భారతదేశానిది. ఈ విషాద వార్షికోత్సవం సందర్భంగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న: మనం ఎలాంటి ప్రపంచాన్ని కోరుకుంటున్నాం? ఎటువంటి సామాజిక వ్యవస్థలను సమర్థిస్తున్నాం? ఎటువైపు పయనిస్తున్నాం? ప్రపంచవ్యాప్తంగా జాతీయవాద దృక్పథాల పేరిట ఆరోగ్యకరమైన దేశభక్తిని దాటి, స్వ-పర భేదాలతో మనుషులను విభజించుకొని, “అన్య” వర్గాలపై విద్వేషాన్ని మరింత బలోపేతం చేసే సమాజాల వైపా? లేక, బహుళత్వాన్ని, మానవ సమాజంలో ఉన్న పలు జాతి, వర్గ వైవిధ్యాలను, పలు మత, ఆధ్యాత్మిక, తాత్విక సాంప్రదాయాలను, విజ్ఞానశాస్త్రాలను ఉమ్మడి మావనీయ సంపదలుగా, మనందరినీ కలిపే వారధులుగా భావించి భవిష్యత్తులో ఉమ్మడిగా సవాళ్ళను ఎదుర్కొనగలిగే స్వేచ్ఛాయుత ప్రపంచాన్ని అందజేసే సమాజాల వైపా?
నిన్నంతా కురిసి కురిసి వాన అలసిపోయిందేమో – ఆ ఉదయాన వాన ఛాయలు వెదుకుదామన్నా కనిపించలేదు. గొప్ప ఉపశమనం. సంతోషం. అప్పటిదాకా మొహం చాటేసిన సూర్యుడు కూడా తన పూర్ణస్వరూపం చూపించడానికి తొందరపడసాగాడు. గొప్ప వాతావరణం. వెచ్చని ఎండలో, చక్కని వెలుగులో హిమశిఖరాల మధ్య ట్రెకింగ్ చెయ్యడమంటే స్వర్గసమానమే.
ఆకలిగొన్న మంటలా నన్ను నేను తింటూ వెలుగుతాను.
నేను పట్టుకున్న ప్రతిదీ వెలుగు. నేను వదిలిన ప్రతిదీ బూడిద.
నిశ్చయంగా నేను నిప్పు
ఒక పద్యములో మఱియొక పద్యము ఇమిడేటట్లు ఉండే పద్య గర్భకవిత్వము మనకు పరిచితమే. కాని ఒక వృత్తపు పాదములో మఱియొక వృత్తపు పాదము ఇమిడేటట్లు ఉండే పాద గర్భ కవిత్వమును మొట్టమొదటిసారిగా పరిచయము చేసినాను. ఇది అమరికల ఆవృత్తి వలన జనించిన ఆవృత్త వృత్తములవలన సాధ్యమైనది.
వోల్టా కప్ప మీదనేకాక తన మీద కూడా ప్రయోగం చేసుకున్నాడు. నాలుక చివరన తగరపు ముక్కని పెట్టి, నాలుక మధ్యలో వెండి నాణాన్ని ఉంచి, నాలుకతో తగరాన్ని వెండి తో కలిపితే, నాలుక నరంలో విద్యుత్తు ప్రవహించి, నాలుకకి లోహపు రుచి కాకుండా ఓ ఆమ్ల రుచి తెలుస్తుందన్నాడు.
‘మా అమ్మ బంగారం’ అంటారందరూ
పోల్చడానికి ఈ ప్రపంచంలో
అంతకంటె విలువైనది మరొకటి లేదన్నట్టు
నీకేమీ కాని, నీతో అంత దగ్గరితనమూ లేని
ఓ పెద్దాయన విషయాలు తరచి తరచి అడుగుతూ
నువ్వు చేసిన ఒకానొక పనికి తల్లడిల్లి
ఆ పని తన కొడుకో, కూతురో చేసినట్టు
నిన్ను గట్టిగా మందలించాక
తలుపు చాటున నక్కిన భావం
మధుపాత్రలో దూకి చచ్చిపోయింది.
వీధికుక్క అరుపులకు భయపడి,
పల్లకిలో ఊరేగుతున్న ఆశయాలు
ముద్దగా వాకిలిలో కూలబడ్డాయి.
తెల్ల మబ్బు తునక
ఇటు నుంచి అటు
రహస్యమేదో తేలుతూ ఇలా!
పొట్ట విచ్చిన పుచ్చపూలను
రివ్వు రివ్వున రువ్వినట్టుగ
నవ్వుజల్లులు కురియు వెన్నెల
నీడలో అభిసారిక!
నాలుగు కాళ్ళు
ఇద్దరు మనుషులు
పెనవేసుకున్న ప్రబంధ దృశ్యం
హత్యకు గురైన దేహపు కళ్ళను చూసి
మీరు దాక్కోనక్కర్లేదు
మీ దుర్వాసనలేవీ
దాని ముక్కుపుటాలకు అందవు
నిశ్శబ్దం ఎక్కడ?
పురుగుదో పిట్టదో
ఏదో ఒక పాట
వినిపిస్తునే ఉంటుంది
పన్నెండవశతాబ్దికి చెందిన సంఘసంస్కర్త, కవి అయిన బసవణ్ణ, కులవ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించాడు. శ్రమైకజీవనమే పూజ అని నమ్మిన కులరహిత సమాజ నిర్మాణానికి ఆయన కృషి చేశాడు. బ్రాహ్మణీయ వర్ణవ్యవస్థపై తిరుగుబాటు చేసి, ‘తక్కువకులస్థుల’తో మమేకమయ్యాడు. ఒక ‘వచనం’లో ఆయన, తను మదర చెన్నయ్య సేవకుడికీ, కాకయ్యవద్ద చర్మకారవృత్తిచేసే పనిపిల్లకు పుట్టినవాడినని చెప్పుకునేంతగా సాహసించాడు.
ప్రసిద్ధ తమిళ నవలా రచయిత జయమోహన్ రాసిన వెళ్ళైయానై అన్న తమిళ నవలకు తెలుగు అనువాదం అయిన ‘తెల్ల ఏనుగు’ ఆగస్టు 9న విడుదల అవుతోంది. ఆ సందర్భంగా ఆయన ఈమాటకు ఇచ్చిన ఇంటర్యూ.
అప్పుడు జరిగింది అనుకోని సంఘటన. రోడ్డుపైన గుంతల్ని, స్పీడు బ్రేకర్లని అడ్డంగా వచ్చే వాహనాలను దాటుకుంటూ ఇంటికి ఇంకా పావు కిలోమీటరు దూరం ఉన్నప్పుడు జరిగింది. అంత జరిగినా ఉరుము ఉరమ లేదు. పిడుగు పడలేదు. తాను ఇంకా ఓడి పోలేదన్నట్లు వర్షం ఇంకా జోరుగా కురుస్తుంది. ఆ జరిగిన సంఘటన చూసినా ఎవరూ పట్టించుకోలేదు. లోకం తీరే అంత. ఏం జరిగిందంటే, ఉన్నట్టుండి కరెంటు పోయింది. దారి కనిపించడం లేదు. స్పీడుగా వస్తున్న యాదయ్య సైకిల్ అడుగులోతు గుంతోలో పడి ఫెడెల్ ఊడిపోయింది.
నాన్న మమ్మల్ని దగ్గరకు తీసుకొని ముద్దు చేసిన జ్ఞాపకమే లేదు. ఆయన ఇంటికి రావడమే అరుదు. ఎక్కువభాగం ప్రయాణాల్లోనే ఉండేవారు! ఆ రోజుల్లో, పాలక్కాడు కొండ ప్రాంతాలలో ఊరూరా తిరుగుతూ దొంగతనాలు చేసే బందిపోట్ల బెడద విపరీతంగా ఉండేది.
“వాళ్ళ తాతలు,తండ్రులు, అందరూ ఈ ఊళ్ళోనే పుట్టారు. ఈ ఊళ్ళోనే చనిపోయారు. వాళ్ళది ఈ వూరు కాకపోతే నీది మాత్రం ఈ వూరు ఎలా అవుతుంది. మీ నాన్న ఎక్కడి నుండో ఉత్తరాదినుండి ఇక్కడకు వచ్చాడు. అక్కడ ఉత్తరాదిలో ఏ వూరో కూడా నీకు తెలియదు.అట్లాగే చిన మస్తాన్ పూర్వీకులు ఎక్కడినుండి వచ్చారో మస్తానుకూ తెలీదు. నీది ఈ వూరైతే, మస్తాన్ దీ ఈ వూరే. మస్తాన్ తాతలు, తండ్రులు అందరూ స్వామివారికి నాద స్వరం తో అర్చన చేస్తూ వచ్చారు. ఖాదర్ వాళ్ళూ అంతే! మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కుదరదు” అన్నాడు రామినాయుడు.
నేను కవినీ కాదు, విమర్శకుడినీ కాదు; కేవలం ఓ సామాన్య పాఠకుడిని. ముకుంద రామారావు గారి “అదే ఆకాశం: అనేక దేశాల అనువాద కవితలు,” గ్రంథాన్ని సమీక్షించడానికి ఎందుకు సాహసించానంటే, ఈ పుస్తకంలో అనేక దేశాల కవితలు అందమైన తెలుగులో ఉన్నాయి; రోర్టీ అన్నట్లు వాటిని నెమరేసుకుంటే దగ్గరి స్నేహితులతో గడిపినట్లే.
తెలుగు భాషపై వివిధ భాషలు చూపిస్తున్న ఆధిపత్యాన్ని గురించి మొదట అర్థం చేసుకోవాలి. అయితే ఈ ఆధిపత్యాలు అన్నిటికీ వలసవాద భావజాలమే కారణం. తెలుగు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మాటలు ఇవి: “సనాతనుల దృష్టిలో సంస్కృతం నేర్చిన వాళ్లే చదువుకున్నవాళ్లు. అధునాతనుల దృష్టిలో ఇంగ్లీష్ నేర్చుకున్నవాళ్లే చదువుకున్నవాళ్లు. ఆ సనాతనులు, అధునాతనులు తెలుగువాళ్లే. మళ్లీ ఈ మధ్య హిందీ మానసపుత్రులు బయలుదేరారు. వారికి తెలుగు బతికి ఉండడమే పనికిరాదు.” అంటారు శ్రీపాద.
“సంఘటనలు కథలుగా మారకుండా చూసుకోవాలి. ఒకసారి కథలుగా అయ్యాయంటే, రెండు సమస్యలు. ఒకటి కాదన లేవు. రెండు నిరూపించ లేవు.” ఈ నవలాకథనానికి మూలసూత్రం అదే.
తెలుగు సాహిత్యంలో పండితుల ప్రశంసలను, పాఠకుల ఆదరణను పొందిన గ్రంథం పోతన భాగవతం. రెండు మూడు దశకాల పూర్వం వరకూ పోతన పద్యాలను వల్లెవేయని తెలుగు వారు వుండేవారు కాదన్నది అతిశయోక్తి కాదు.
పరహితం, లోకహితమే కాకుండా సన్నిహిత మిత్రులకి సదా శ్రేయోభిలాషిగా ఉండే విద్యార్థి గారు 80 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకి హృదయపూర్వకమైన అభినందనలు, శుభాకాంక్షలు!
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ.
2025వ సంవత్సరానికి ‘ఇంద్రగంటి శ్రీకాంత శర్మ సాహితీ పురస్కారం’ ప్రముఖ కవి శ్రీ విన్నకోట రవి శంకర్ గారికి ఇవ్వడానికి అవార్డు కమిటీ నిర్ణయించింది.
ఈమాట – సెప్టెంబర్ 2025 ఆలూరి బైరాగి ప్రత్యేక సంచికకు రచనల ఆహ్వానం