రచయిత వివరాలు

వేలూరి వేంకటేశ్వర రావు

పూర్తిపేరు: వేలూరి వేంకటేశ్వర రావు
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:

 

రెండవ సర్గలో తొమ్మిదవ శ్లోకం నుండి పదిహేనవ శ్లోకం వరకూ తెలుగు ప్రతిపదార్థాల దగ్గిర నా చదువు కుంటుపడింది. రెండు క్రౌంచపక్షులు, రతిక్రీడలో పారవశ్యంతో ఆనందిస్తూ వుండగా ఒక బోయవాడు (నిషాదుడు) మొగ క్రౌంచపక్షిని నిర్దాక్షిణ్యంగా చంపుతాడు. అది చూసి వాల్మీకి శోకించి ‘మానిషాద’ అని మొదలు పెట్టి బోయవాడిని శపిస్తాడు. ఈ శ్లోకం సంస్కృతసాహిత్యంలో మొట్టమొదటి శ్లోకంగా పరిగణిస్తారు.

మనం సాధారణంగా ఇగ్నోర్ చేసే వ్యక్తులు, పరిసరాలు అంటే ఒక చిన్న ఆడపిల్ల, ఒక చిన్న ఊరిలో ప్రాథమిక పాఠశాల, రిటైర్డ్ సేల్స్‌మన్ – ఇలాంటి వారి జీవితాలని జాగ్రత్తగా చూసి, ఆమె వారి గురించి వ్రాసింది. ఆమె వాళ్ళ జీవితాలను సీరియస్‌గా తీసుకుంది. అందువల్ల, ఒక్కొక్కసారి వారి పాత్రలు వారి కంటే పెద్దవిగా, ఘనంగా కనిపిస్తాయి. అది, కాల్పనిక సాహిత్యంలో మన్రో చేసిన గొప్ప పని. నిజం చెప్పాలంటే, ఆవిడ రాసిన ప్రతి ఒక్క కథా ఒక నవలగా మలచవచ్చు.

కొన్ని పాతజ్ఞాపకాలు ఏనాటికీ మరుపురానివి! ఆరోసారో పదహారోసారో చూస్తున్న ‘రోమన్‌ హాలిడే’ లాంటివి. మహాకవిని వోక్స్‌వేగన్‌ బగ్‌లో మేడిసన్‌ తీసుకొని వెళ్ళటం, జీడిమామిడి చెట్లకింద కూచొని మరోకవితో డైలన్‌ థామస్‌‌ని చదవటం, టెన్సింగ్‌ నార్కేకి షేక్‌ హాండ్ ఇవ్వడం, ఇండియా నించి కొత్తగా అమెరికా వచ్చిన ప్రొఫెసర్‌‌‌ని మంగలి షాపుకి తీసికెళ్ళి తెల్ల అమ్మాయి చేత క్షవరం చేయించటం, ప్రసిద్ధ భారతీయ చిత్రకారుడితో మస్తుగా స్కాచ్‌ పట్టించడం, వగైరా!

ఉరి ఉచ్చు గట్టిగా బిగించే తాడు వెతకలేదు.
బలమైన కొమ్మలతో ఎత్తైన చెట్టు వెతకలేదు.
ఉన్నట్టుండి వేలాడపడే చావు బరువుని
తట్టుకోగలిగే చేపుగా పెరిగిన చెట్టును వెతికి పట్టుకోలేదు.

In all the faiths, the wedding ceremony is considered as a solemn occasion. The vows taken by the bride and groom in the presence of the invited guests are considered sacred. The Hindu marriage ceremonies are usually elaborate and the undue importance given to the pompous exhibition of wealth, often subjugates the solemnity.

చిత్రానికి బలం ఆంబోతు, పీడిత గుర్రం, దిష్టిబొమ్మల్లా మనుషులు–ఇవన్నీ క్రూరమైన వక్రీకరణల నుండి ఉద్భవించాయి. ఈ రూపాల్లో పికాసో ప్రజా అరాచకాలకీ , దురాక్రమణకీ ఆత్మాశ్రయసమానత చూపించాడు. గ్వెర్నికా అత్యంత విషాదార్థాలకి, సామూహిక అవివేకతకి ప్రత్యేక ప్రతీక. మరో రకంగా చెప్పాలంటే, ఇది దాదాపు ఒక సైకాటిక్ డ్రాయింగ్.

మార్కులూ, ఎంగిల్‌లూ,
మావోలూ, మిన్హాలూ
బ్రాహ్మణీయం భూస్వామ్యం
సమాజాల వాచాలం
విప్లవీకం వర్వరీయం
ఒకటేమిటి, అన్నీ అన్నీ
విన్నాన్‌ విన్నాన్‌ చదివాన్‌ చదివాన్‌!

ఆ ఇల్లంతటికీ మిగిలింది
ఆ మూడంతస్తుల మెట్లే.
బారగా తలుపు తీసి
బైట ఆకాశం కేసి
కళ్ళు విప్పార్చి చూసింది
ఆవెఁ.

అనంత ప్రపంచం
అంతమైంది ఇక్కడే.

నువ్వొచ్చి నన్ను ఎలా చూస్తావు? ఏ రూపంలో?
మబ్బుల్లేని నక్షత్రం లాగానా, లేక నీళ్ళమీద పొరలాగా
అంచెలంచెలుగా తాకుతూ పరుగెత్తే చిల్లపెంకు లాగానా?
నీకు ఏదైతే బాగుండదో నాకు తెలుసు,
కోయిల కుహూ కుహూల మధ్య నిశ్శబ్దం, నీకు బాగుంటుంది.

ఎవ్వరయినా సరే!
‘బావిదగ్గిర నీళ్ళకోసం’
మరొక కొత్త బొమ్మ గీయాలి.
లేకుంటే, ఏ ఆస్కార వైలుడో
రాజరాజనగరంలో పాతబొమ్మని
చీరి చింపేయచ్చు.

డిలన్ పాటకుడా, కవా? 1996నుంచీ ప్రతి సంవత్సరం డిలన్‌ని నోబెల్ బహుమతికి నామినేట్ చెయ్యటం, దానితోపాటు ఈ ప్రశ్న ఉద్భవించటం ఆనవాయితీ అయ్యింది. డిలన్‌ని అడిగినప్పుడు ఏదయితే నేను పాడగలనో దానిని పాట అంటాను; ఏదయితే నేను పాడలేనో దానిని కవిత అంటాను, అన్నాడు.

కాఠిన్య కాంస్యభూమిని చూసి గాలి, నక్షత్రాలు,
సరివిచెట్టు, హోటల్, బ్రతుకు కదలికలు,
సర్వావయాలూ నిజంగానే రవంత నిర్జీవమైనాయి,
రాయిగామారిన అహల్య ఏ రాముడికోసమో ఎదురుచూస్తున్నది.

నిన్న ఏ సమయంలో నువ్వు నాతో తిరగడానికి
బయలుదేరావో ఏడణాలిచ్చి రిక్షా ఎక్కి
అకస్మాత్తుగా సముద్రపు వడ్డుకు,

Did you know, that I would suddenly die,
wouldn’t be alive to break bread with you?

సరమాగో ప్రారంభంలో రాస్తాడు: “భూతకాలం రాళ్ళు రప్పలతో కప్పబడ్డ విశాలమైన భూమి. చాలామంది జోరుగా కారుల్లో ఏమీ పట్టించుకోకండా పోతారు, ఆ రాళ్ళమీద! కొద్దిమంది మాత్రం ఓపిగ్గా ఒక్కొక్క రాయీ ఎత్తి ఆ రాయి క్రింద ఏమున్నదో అని జాగ్రత్తగా చూస్తారు. ఒక్కోసారి తేళ్ళు, మరొక్క సారి జెర్రులు, గొంగళీ పురుగులూ, గమ్మనకండా కూచున్న గూటిపురుగులూ కనిపిస్తాయి. అసాధ్యం కాదు గాని, ఒకే ఒక్కసారైనా సరే, ఒక ఏనుగు కనిపించవచ్చు…”

మార్చ్ 26న అట్లాంటా నగరంలోని ఎమరీ యూనివర్సిటీలో తెలుగు ఆచార్య పదవి నెలకొల్పబడబోతున్న సందర్భంగా ప్రత్యేక ప్రకటన ఈమాట పాఠకులతో పంచుకోడం కోసం.

మాండిల్‌స్టామ్ గురించి సోవియట్ రచయితల సంఘం ఎందుకు తన దగ్గిరకి రాయబారానికి రాలేదు? అని స్టాలిన్ అడిగితే, 1927 నుంచీ రచయితల సంఘం ఇటువంటి విషయాలలో జోక్యం కల్పించుకోవటల్లేదని పాస్టర్నాక్ చెప్పాడు. ఈ విషయమై, నేను ప్రత్యేకంగా నీతో మాట్లాడాలని ఉన్నది అని పాస్టర్నాక్ అనంగానే, స్టాలిన్ టెలిఫోను పెట్టేశాడట!

సాహిత్యంలో పూర్తి మాతృక అన్నది నిజం కాదని గుర్తిస్తే చాలు. నమ్రత ఉన్న ప్రతి కథకుడికీ ఈ విషయం తెలుసు. మంచి రచయిత అయితే, వాడి చేతిలో ఆ పాత కథే, కొత్త కొత్త ప్రతిధ్వనులని వినిపిస్తుంది. కథలో రకరకాల అందమైన లోతులు కనిపిస్తాయి. విడమర్చి చెప్పాలంటే, ఒక కథ మరొక కథ నుంచి ఎదుగుతుంది. ఒక పద్యం మరొక పద్యం నుంచి ఎదుగుతుంది. ఒక్కొక్కసారి ఒక కథ నుంచి మరొక పద్యం, ఒక పద్యం నుంచి మరొక్క కథ ఎదుగుతాయి.

మన కాలంలో, కాపీ రైటు చట్టాలు, అనుకరణ నిషేధాలూ ఉన్నప్పుడు కూడా బాపూ తన బొమ్మలని గాలి, నీరు, వెలుతురూ లాగా తెలుగు దేశం అంతటా పంచి పెట్టేశాడు. అక్కడే కాదు, తెలుగువాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ దాకా తన బొమ్మలని పట్టుకో పోనిచ్చాడు.

హోమర్ పనిచేసే న్యూక్లియర్ పవర్ ప్లాంటుకి హెన్రీ కిసింజర్ వస్తాడు. ఈ కథనం ప్రారంభంలో కిసింజర్ ట్రేడ్మార్క్ కళ్ళజోడు టాయిలెట్లో పడిపోతుంది. ఎవరికన్నా చెపితేనవ్వుతారని కిమ్మనకుండా ఆయన బయటికి వస్తాడు. తరువాత హోమర్ ఆ టాయిలెట్ గుంటలో కళ్ళజోడు తీసి తను పెట్టుకుంటాడు. అంతే! అక్కడే ఒక గణితసూత్రం నెమరువెయ్యడం మొదలుపెడతాడు, హోమర్. ఒక సమద్విభుజత్రికోణము లో ఏ రెండు భుజముల వర్గమూలము కూడినా… అని.

మూడో రోజున భాగ్యనగరంలో పుట్టిన చీలిక బాగా పెద్దదయ్యింది. ఉత్తర భాగ్యనగరం సుమారు అరవై అడుగులు పైచిలుకు (భౌతిక శాస్త్ర పరిభాషలో ఇరవై మీటర్లు) వెడల్పుగా పెరిగి పెద్ద గండిగా తయారయ్యింది. ఈ రెండు భాగాలనీ గొలుసులతో కట్టి పెట్టటానికి ప్రభుత్వం దేశంలో ఉన్న ఇంజనీర్లు అందరికీ ఫర్మానా పంపింది.

కథలో, అడపా తడపా కుముదం, నేను పాత్ర, సుమారు ఇరవైఏళ్ళలో ఒక మూడు నాలుగు సార్లు కలుస్తారు. మాట్లాడుకుంటారు. కలిసిన ప్రతిసారీ, కుముదం జీవితంలో మనిషిగా ఎంత ఎత్తు ఎదిగిందో, ‘నేను’ ఎంత కిందకి దిగజారిందో అంచెలు అంచెలుగా కనపడుతుంది.

ఎనిమిదేండ్లకు పైగా ఈమాట ముఖ్యసంపాదకుడిగా శ్రమించిన వేలూరి వేంకటేశ్వర రావుగారు ఈ సంచికతో సంపాదకీయ బాధ్యతలనుండి వైదొలిగారు. వారికి మా హార్దిక కృతజ్ఞతలు. వారు ఇప్పటికీ ఎప్పటికీ ఈమాట కుటుంబ పెద్దలే. వారి మాట మాకు శిరోధార్యమే. – సం.

సాంఘికంగా మార్పు చెందుతున్న స్త్రీ రూపం మనలో ఒక రకమైన అవ్యవస్థని సృష్టించింది. ఒక సమస్యతో జీవిస్తున్నంత కాలం, రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చెయ్యడం మానవ సహజం. కాని, నిజం చెప్పాలంటే, మనలో ఎవ్వరికీ — భర్తలుగా, భార్యలుగా, ప్రేమికులుగా, చిత్రకారులుగా, విమర్శకులుగా — ఈ విషయాలపై సంపూర్ణ జ్ఞానం లేదు అని ఒప్పుకోవటం కష్టం.

కథ అని అనిపించుకోటానికి ఒక రచనకి ఉండవలసిన సహజమైన లక్షణాలు మనకి, పాశ్చాత్యులకీ ఒకటే! ఆ మాట కొస్తే, కథకి ఉండే లక్షణాలు, పాశ్చాత్యుల దగ్గిరనుంచే మనం నేర్చుకున్నాం. కాని, ఆ లక్షణాలని ఒక బిగువైన చట్రంలో బంధించి కథని చూడటం, విమర్శించడం మనం ఇంకా మానేయలేదు. అంతే కాకుండా, కథ లక్షణాలుగా మనం భావిస్తూ, ప్రచారం చేస్తున్నవి బాగా పాతపడిన పద్ధతులని మనం తెలుసుకోవడం అవసరం.

నారాయణ రావు ఒక సిద్ధాంతానికి, ఒక కాలానికీ పరిమితమై పోయేవాడు కాడు. గొప్ప రచయితలకి సిద్ధాంతాల చట్రాలు పట్టవు అని గుర్తు చేసుకోవడం ఎంతైనా అవసరం. దక్షిణ భారత సాహితీ సంస్కృతి, చరిత్ర అవగాహనలో ఒక విప్లవం తీసుకొని వచ్చిన నారాయణ రావు వంటి సాహిత్య మేధావి విషయంలో మరీ మరీ అవసరం.

నారాయణ రావు రోజుకో కవిత రాసేవాడని చెపితే మీరు నమ్మరు. రాజు, నేను ఆ కవిత చదవటం; ‘చెత్త, చింపెయ్యండి,’ అని అనడం మామూలు. నవ్యకవితలు కాకండా సంప్రదాయ కవిత్వం వల్లించినప్పుడు మాత్రం మాకు చిరాకేసేది; నిజం చెప్పొద్దూ! అవి మనకి అవసరం అని ఆయన ఆ రోజుల్లో అనేవాడు. ఇప్పుడు కదూ తెలిసింది అదెంత నిజమో!

పద్దాలుగాడు తాగుబోతు. పచ్చి దొంగ. తాగినప్పుడు రంగిని చితక తంతాడు. రంగి ఒక్కత్తే కాదు; మరొక ఆడదానితో పోతాడు. అయినా రంగికి వాడంటే ఉన్న ఆకర్షణ ఏమిటో బోధపడలేదు. వాడు దొంగతనం చెయ్యడానికి సహాయం కూడా చేస్తుంది. వాడితో ఎన్ని అవస్థలు పడ్డా మళ్ళీ వాడి పక్కకే చేరటం నాకు నచ్చలేదు. రంగి మానసికస్థితి ఒక పట్టాన బోధపడలేదు.

పొద్దున్నే ఎనిమిదయ్యింది. బల్లుల్లా రకరకాల సైజుల కారులు, పెద్దవీ, చిన్నవీ, బుల్లిబుల్లివీ! గోడమీద బల్లులు పురుగు కనిపించంగానే దబుక్కున దూకినట్టు ముందుకారు వెనకాతల కాస్త […]

కన్నయ్య, భార్య బుల్లెమ్మ, వాళ్ళ జీవితంలో మొట్టమొదటిసారిగా బుల్లెమ్మకి ఓ చీరె కొందామని వస్తారు. ఆ కొట్టు, ఆ లైట్ల హడావిడి చూడంగానే కన్నయ్యకి భయంవేస్తుంది, తనని బయటికి గెంటేస్తారేమోనని! భయపడుతూ భయపడుతూ ” మా ఆడోళ్ళకి చీరెలు కొనాలండి,” అంటాడు, కొట్లో గుమాస్తాతోటి, అదేదో తప్పుచేసిన వాడిలా!

మొదటి ప్రపంచ యుద్ధ ప్రారంభ కాలం నుండి, ఇప్పటివరకూ, అంటే ఈ నూరు సంవత్సరాలలో ప్రచురించబడ్డ ‘చారిత్రక నవలల’కు లూకాచ్ చెప్పిన లక్షణాలు ఉన్నాయా, లేవా? అనే ప్రశ్నకి సమాధానం వేరే మరొక వ్యాసం మరొకరు రాయవలసి ఉంటుంది. అసలు, లూకాచ్ ఉద్ఘాటించిన లక్షణాలు ఈ కాలపు చారిత్రక నవలలకి ఆపాదించవచ్చా అన్నది మౌలిక మైన ప్రశ్న.

“స్త్రీల విషయంలో మనుష్యులు ఆచరించని దోషం ఏదయినా వుందా? నిజం చెప్పండి.” అని వరాహమిహిరుడి శ్లోకం మకుటంగా ఈ కథ ప్రారంభమవుతుంది. కథా వస్తువు ముందుగానే తెలిసిపోతుంది. కథ అంతా చదివిన తరువాత, బహుశా ఆ వాక్యం ఆఖరిగా రాసి వుంటే బాగుండేదేమో ననిపించింది, నాలో ‘విమర్శకుడి’కి.

రామారావు లండన్‌కి కనీసం కుంచెలు కూడా తీసుకొని పోకుండా ఉట్టి చేతులతోనే వెళ్ళాడు. పాశ్చాత్య చిత్రకళారీతులను అక్కడి గురువుల నుండి మళ్ళీ కొత్తగా మొదటినుండీ నేర్చుకోడానికే నిర్ణయించుకోడమే ఇందుకు కారణం. అతని ప్రయత్నమంతా అక్కడ ఒక ఆధునిక చిత్రకారుడిగా ఎదగడమే.

బ్రహ్మ వేసిన లెక్కల ప్రకారం దక్షిణభారతదేశాగ్రంలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంగా రావాలి. అదెలాగంటే, శంబళ అనే కుగ్రామంలో విష్ణుయశుడనే వాడికీ, వాడిభార్య సుమతికీ శిశువుగా ఆయన జన్మమెత్తాలి. ఆయనకి కవి, ప్రాజ్ఞుడు, సుమంతుడు అనే ముగ్గురన్నలుండాలి. అతగాడు, పరశురాముని దగ్గిర విద్యాభ్యాసం చెయ్యాలి. ఇది కర్మానుగుణ్యంగా జరగవలసిన వరస.

మత రాజకీయాలని, విద్వేషాలనీ అవతలకి నెట్టి ఈ కథ చదవవలసిన అవసరం ఉన్నది. ఈ కథని చదవవలసిన నేపథ్యం కూడా వేరే! మహాత్మా గాంధీ అంటే సాధారణ భారతీయులకి ఎంత ఆదర్శమూర్తో, మహమ్మదాలీ జిన్నా పాకిస్థానీయులకి అంత ఆత్మీయుడు. నెహ్రూని పక్కకి తప్పించి జిన్నాని మొదటి ప్రధానిగా చెయ్యటానికి కూడా గాంధీ సిద్ధపడ్డాడు. అయితే, జిన్నా గురించి హిందువులకి ఉన్న అభిప్రాయాలు వేరు.

మాటలు పద్యాన్ని చెప్పవు. పద్యంలో మాటలు అర్థాన్నివ్వవు. ఆకారం అసలే ఉండదు. రూపం శూన్యం. మాటల్ని గట్టిగా పట్టుకొని చలిమిడి ముద్దలా పిసకండి. పోనీ, మాటల్ని పంచరంగుల ప్లే డౌ లా పిసకండి. పిసకగా పిసకగా పద్యానికి ఆకారం వస్తుంది. అప్పుడు కనిపిస్తుంది కవితలో విశ్వరూపం.

“కాస్త నమ్మకంగా, ఖచ్చితంగా రెండువారాల కొకసారి వచ్చి లాన్‌ చేసే వాడిని, మరొకణ్ణి చూసుకోవాలి,” అని ఇద్దరూ అనుకుంటారు, గోమెజ్ రానప్పుడల్లా! గోమెజ్ రాగానే ఇద్దరూ ఆ విషయం మరిచిపోతారు! కారణం, వచ్చినప్పుడు లాన్‌ పని బాగా చేస్తాడు. పై పై పనులెన్ని చెయ్యమని చెప్పినా విసుక్కోడు.

కొత్తసంవత్సరం ప్రారంభంలో అనేకమైన తీర్మానాలు చేసుకోవటం ఆనవాయితీ. బరువు తగ్గుదామని, బీడీలు తాగటం మానేస్తానని, బడికో, గుడికో దానధర్మాలు చేస్తాననీ… రకరకాల ప్రతిజ్ఞలు చేసుకోవటం మనకి తెలియని విషయం కాదు. అయితే అది వ్యక్తిగతమని, ఈ మాట పత్రికనీ కొందరు, నవ్వచ్చు; మరికొందరు కామెంటేతర్లు వెటకారం చెయ్యవచ్చు.

నిజం చెప్పాలంటే మన రాజకీయ నాయకులకి మన సంస్కృతి , మన భాష – ఈ రెండూ అవసరం లేదు. చప్పట్ల కోసం చెప్పటం తప్ప, ఈ రెండింటి పైనా ఏ విధమైన గౌరవమూ లేదు. వాళ్ళ లాగానే మన సంస్థలు కూడా ఈ పడికట్టు మాటలు వల్లెవేయడం నేర్చుకున్నాయి. అంతే!

మొదటి భాగంలో కప్పని మింగుతున్న పాము గురించి వెంకటాద్రికి వాడి అమ్మ కనకమ్మ చెప్పడం, ప్రతీకగా దాని అవసరం కథాంతంలోగాని బయట పడదు. ఈ రకమైన ‘ట్విస్ట్’ అలనాటి పాతకథల్లో మామూలు. ఇప్పటి కొన్ని కొత్త కథల్లోనూ ఈ రకమైన ‘విరుపు’ కనిపిస్తుంది.

గూగుల్ మొదలుపెట్టిన పథకం ఒక రకంగా మంచి పథకమే. కోట్లకొద్దీ జనానికి మరో ప్రచురణకి నోచుకోని లక్షల కొద్దీ పరిశోధన గ్రంథాలు అందుబాటులోకి వచ్చేవి. రచయితలకి డిజిటల్ పుస్తకాలు ‘అమ్ముడు’ పోవడం మూలంగా డబ్బులొచ్చేవి. కొద్ది రుసుము కట్టుకుంటే గ్రంథాలయాలకి లక్షల గ్రంథాలు అందుబాటులో వుండేవి.

ఎన్ని సంవత్సరాల నుంచీ ఆ గోరీలు అక్కడ ఉన్నాయో ఖచ్చితంగా ఎవడికీ తెలియదు. సుబ్బయ్య నాయుడు ముత్తాత ఇల్లు కట్టుకోక పూర్వంనుంచే అక్కడ ఏడు గోరీలు ఉన్నాయని వాదు.

ఏ దేశంలోనన్నా యుద్ధం వస్తే, యుద్ధపరంగా సాహిత్యం రావడం సహజం. ఆ విషయంలో మన తెలుగు సాహిత్యం కుంటుపడే ఉన్నది. బహుశా తెలుగునాడు నుంచి మిలిటరీలోకి వెళ్ళినవారు తక్కువై ఉండవచ్చు.

సంపత్కుమార కన్యాశుల్కం నాటకాన్ని రకరకాల కోణాలనుంచి పరిశీలించి తన అభిప్రాయాలని సూటిగా చెప్పారు. ఆ వ్యాసాలపై వచ్చిన విమర్శలన్నిటికీ సమాధానంగా రాసిన ఈ వ్యాసానికి, నిజంగా తగిన గుర్తింపు రాలేదు.

పగలంతా పాలవాసన వెంట / పరుగులెత్తిన ఈమె/ సగం రాత్రి వేళ పారిజాతమై పరిమళిస్తుంది. – ఈ మధ్య కాలంలో ఇంతకన్నా మంచి ప్రేమ కవిత చదివిన గుర్తు లేదు.

కథలో చదరంగం ఆడుతున్న తాతగారు ఒక ముఖ్య పాత్ర. చదరంగం ఎత్తులు, పైఎత్తులూ కథ నడకకి పరోక్షంగా దోహదం చేస్తున్నాయి. కథలో తాతగారికి అన్నీ తెలుసు.

ఒక గొప్ప కవిగారి పేరు, మీపేరూ అనుకోకండా ఒకటే అయితే ప్రమాదమే! శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రపంచప్రసిద్ధి పొందితే, శ్రీభాష్యం శ్రీనివాసులు, ఏదైనా అడపా తడపా రాసి ఏ పత్రికకన్నా శ్రీశ్రీ అన్న పేరుతో పంపిస్తే, మందలించని సంపాదకుడు ఉండడనుకుంటాను.

సాహిత్యమండలి సంక్రాంతి సంబరాలలోకవి సమ్మేళనం ఆనవాయితీ. మొదటిరోజున, మల్లెపువ్వులాంటి తెల్లటి గ్లాస్గో ధోవతి, అంతకన్న తెల్లటి లాల్చీ వేసుకొని సభవెనకాల నిలబడ్డ స్ఫురద్రూపిని నేను మొదటిసారిగా చూసాను. ఇటువంటి సభల్లో వెనకాల చేరి అల్లరి చేసే వయస్సు నాది.

ముకుంద రామారావు ఆయన ఉద్దేశంలో కవిత్వమంటే ఏమిటో ప్రారంభంలోనే చెప్పారు: “మనస్సు, హృదయం, ఆత్మల సమ్మిశ్రితం బహుశా కవిత్వం” అని. అంతే కాదు. తాను కవిత్వం రాయడానికి ప్రేరణ కూడా చెప్పారు.

ఈ ఆఖరి నాలుగు పాదాలూ అచ్చంగా కవిత్వం. చిన్నచిన్న మాటలు అతి జాగ్రత్తగా వాడటం అఫ్సర్ కి తెలుసు. పద్యం ఆఖర్న పాఠకుడి మనస్సుకి ఒక కుదుపు ఇస్తాడు. ఇది అఫ్సర్ ప్రత్యేకత.

ఈ మాట ప్రారంభమైనప్పటినుంచీ, ఇప్పటి వరకూ సంపాదకత్వ బాధ్యతలు (సంపాదక బాధలు అనడం ఉచితమేమో!) నిర్వహిస్తున్నవారందరూ సైంటిస్టులు, ఇంజనీర్లూ. పీర్ రివ్యూ అన్న పదం ఇంత ఘర్షణకి మూలకారణం అవుతుందని వాళ్ళు కలలో కూడా ఊహించలేదు.

ఒకసారి, బహదిన్‌ షా సూఫీ సూత్రాలు, సూఫీ పద్ధతులపై ఉపన్యాసం ఇచ్చాడు. ఒక తెలివైన పెద్దమనిషి బహదిన్‌ పై విమర్శ విసిరాడు: “ఈ బహదిన్‌ షా ఎప్పుడైనా, కనీసం ఒక్కసారైనా కాస్త కొత్త విషయాలు చెప్పితే బాగుండును. ఎప్పుడూ చెప్పిందే, చెప్పిందే చెప్పుతాడు.”

నా ఉద్దేశంలో ఇక్కడ కథలు రాస్తున్నవాళ్ళల్లో చాలామంది భౌతికంగా (ఫిజికల్‌ గా) అమెరికాలో ఉన్నారు కానీ, మానసికంగా, ఇంకా ఆంధ్రాలోనే ఉన్నారు.

ప్రపంచస్థాయికి ఎదిగి, తెలుగునేల మీద నిలకడగా నిటారుగా నిలబడ్డవాడు శ్రీశ్రీ. అందుకే కాబోలు ఆయన కవిత్వం అనువాదం కాకపోయినా తెలుగు రాని వాళ్ళని కూడా ఆకట్టుకుంది.

బాలగోపాల్ బహుముఖప్రజ్ఞుడు అనడం అతిశయోక్తి కాదు. సాహిత్య విమర్శకుడిగా, తత్వశాస్త్రవేత్తగా, సామాజికశాస్త్ర వ్యాఖ్యాతగా తెలుగునాట ప్రసిద్ధికెక్కాడు.

సర్వ సమగ్రమైన తెలుగు నిఘంటువు ప్రచురించటానికి సుమారు నలభై సంవత్సరాలు పట్టింది. అది ఈరోజు కొనదల్చుకున్నా దొరకదు. మనకి ఉన్న ఈ ఒకే ఒక సమగ్రమైన నిఘంటువు ఈ రోజున మనకు దొరకదు. ఇది హాస్యాస్పదమే కాదు; అవమానకరం కూడాను!

ఎయిర్‌మెయిల్‌ ఉత్తరం. పార్‌ అవియన్‌ లోగో. ఎక్కడనుంచి వచ్చిందో సరిగా తెలియటల్లేదు. అరడజను పోస్టల్‌ ముద్రలున్నాయి. కవరు తెరిచే ఉంది.

మైడియర్ సంపాదకులూ: నా బాధ్యతగా, కొన్ని సూత్రాలను ఈ మెమోతో జత చేస్తున్నాను. వీటిని అమలు చేస్తే చీవాట్ల మాటెలావున్నా శ్రమ ఖచ్చితంగా తగ్గుతుందని నా స్వానుభవం. – ముఖ్య సంపాదకుడు

విజ్ఞానం ప్రజల సొత్తు. ప్రపంచ ప్రజల సొత్తు. సమాజంలో ఏదోరకమైన ఆధిక్యత ఉన్న ప్రత్యేక వర్గాలు ‘ఇదంతా మాది’ అని గుత్తకి తీసుకోవడం అధర్మం, అన్యాయం. ఇవి అందమైన నినాదాలు. విజ్ఞానం అందరికీ అందుబాటులోకి తేవడం అనే కోరిక అద్భుతమైన కోరిక.

మొట్టమొదటిసారి ఈ కథ వ్రాతప్రతిలోచదివినప్పుడు, కథావస్తువులో స్పష్టంగా చలంగారు కనిపించారు. బహుశా ఇప్పుడూ చలంగారు కనిపిస్తారు.

పదహారు సంవత్సరాలు నిండితే కానీ జ్ఞానదంతాలు రావు. అయితే, చిన్నతనమేలే అని అశ్రద్ధ చెయ్య కూడదు. రాబోయే ఆరేళ్ళూ ఆ దంతాలు కొక్కిర్లు లేకండా సరిగా పెరిగేట్టు చూసుకోవాలి. జాగ్రత్త పడాలి.

కవిత్వాస్వాదనకు ఉపయోగపడే పరికరాలు తిరిగి గుర్తొచ్చే వెనకటి జ్ఞాపకాలు – recovered memories. ఒక కవిత చదవగానే పాఠకుడికి వెలికి వచ్చిన జ్ఞాపకాలు, ఆ కవితని అనుభవించి ఆనందించడానికి ఉపయోగపడే సాధనాలు.

“వ్యాపారంలో ఒకడిమీద మరొకడికి నమ్మకం ఉండాలి. రాతకోతలు, రసీదులు ఇవ్వడం పుచ్చుకోవడం నాకు పనికిరాదు. అది నావ్యాపార సరళి కానేకాదు. నాజీవితంలో నేను ఒక్క డికి కూడా రసీదు ఇవ్వలేదు; ఒక్కడిదగ్గిరనుంచి కూడా రసీదు పుచ్చుకోలేదు.

సాధారణ పాఠకుడికి పుస్తక పరిచయం కనీసం మార్గదర్శకం అవుతుంది. పుస్తకాలమీద ఎంత మమకారం ఉన్న పాఠకులైనా, ( వీళ్ళని ప్రస్తుతానికి ” అసాధారణ పాఠకులు” అని అందాం!) ప్రచురించబడ్డ అన్ని పుస్తకాలూ చదవలేరు.

పత్రికా రచయితలందరూ మడికట్టుకున్న మహానుభావులని, నిస్స్వార్థపరులనీ, దుడుకుగా, రుజువులు లేకుండా ఎప్పుడూ రాయరనీ అనుకోవడం వ్యామోహమే! పత్రికలన్నీ వర్గరాజకీయాలకి (ఆంధ్రదేశంలో అయితే కులమత రాజకీయాలకి కూడా!) అతీతం అని అమాయకుడు కూడా నమ్మడు.

బ్లాగులతో ఒక సుఖం ఉంది. ఏ భాషలోనైనా సరే, నీ ఇష్టమైనట్టు రాసుకోవచ్చు. నీ ఇష్టమైనప్పుడు రాసుకోవచ్చు. నీ ఇష్టమైన విషయం గురించి ఎక్కడో మొదలెట్టి మరెక్కడో ముగించవచ్చు. అసలు ముగించక పోవచ్చు. ముఖ్యంగా, బ్లాగన్నది ‘నీ కోసం నువ్వు రాసుకుంటున్నమాటల మూట.’

ఎవరైనా కొత్తవాళ్ళు ఒక్కసారి తూర్పునుంచి పడమరదాకా, ఉత్తరం నుంచి దక్షిణందాకా ఈ దేశంలో చూస్తే ఒక్క సంగతి స్పష్టంగా బోధపడుతుంది. ఇక్కడి తెలుగు సంస్థల్లో మూడు రకాల తెలుగు వాళ్ళు ఉన్నారు.

దక్షిణ ఆసియా విభాగాలున్న పది పన్నెండు అమెరికన్‌ విశ్వవిద్యాలయాలలో తెలుగు పరిశోధనాపీఠాలు నెలకొ్ల్పడానికి స్థానికంగా ఉన్న తెలుగు సంస్థలు పూనుకొంటే, దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు సహకరిస్తే, దశాబ్దాలుగా ఈ ఆలోచనలు చేస్తున్నవారు ముందుకు వచ్చి కార్యసాధనకు నడుము కడితే, ఐదు సంవత్సరాలలో తప్పక ఈ పరిశోధనాపీఠాలు నెలకొల్పగలమని నానమ్మిక.

గోవిందరావు హైదరాబాదులో విమానం దిగి, భోషాణాల్లాంటి రెండు పెద్ద సూటుకేసులూ ట్రాలీ మీదకెక్కించి బయటకి రాగానే వాడి నాన్న, అమ్మ, మేనత్త కనిపించారు, చేతులూపుతూ! అమ్మకి కళ్ళనిండా నీళ్ళు నిండాయి. ఐదేళ్ళయ్యిందాయె, ఒక్కగానొక్క కొడుకునీ చూసి!

నారాయణరావు గారి అనువాదం కన్యాశుల్కం నాటకాన్ని మళ్ళీ చదివించింది. అనువాదమే కాదు; ఆయన రాసిన వెనుక మాట (The Play in Context) నూతన ప్రేరణనిచ్చి, తిరిగి ఆలోచించవలసిన అవసరం కల్పించింది. వెనుక మాటలో నారాయణరావుగారు ఒక సరికొత్త ప్రతిపాదన చేసారు. ఒక రకంగా ఇది విప్లవాత్మకమైన ప్రతిపాదన. తన ప్రతిపాదనని సోపపత్తికంగా సమర్థించారు.

కన్యాశుల్కం నాటకం పై గత 50 సంవత్సరాలుగా వచ్చిన పొగడ్తలు, విమర్శలు, ప్రతివిమర్శలు నుండి పాఠకులకు పనికివచ్చే కొటేషన్లు పొందుపరచడం కోసం ఈ అనుబంధంలో నేను సాధ్యమైనంతవరకు మూల వ్యాసాలను చూడటానికి ప్రయత్నించాను.

తానా వారు వెల్చేరు నారాయణరావుగారికి Lifetime Achievement Award ఇస్తున్న సందర్భంలో, తెలుగునాడి సంపాదకులు జంపాల చౌదరి గారి ప్రేరణ పై జులై 2007 తెలుగునాడి సంచికకి రాసిన సంక్షిప్త వ్యాసం ఈ వ్యాసానికి మూలం.

మొన్న మొన్నటి దాకా, మన పక్కింటి వాడి ధర్మవా అని, తెలుగుని ప్రాచీన భాషగా గుర్తించాలని నానా రకాలవాళ్ళూ, నానా రకాల వాదాలు, వివాదాలు, నినాదాలూ అల్లేశారు, వల్లించేశారు. అదికొంత సద్దుమణిగిందనుకుంటే, దానికి తోడుగా ఇప్పుడొక సరికొత్త నినాదం తెలుగునాట తయారయ్యింది.

– తెలుగు భాష అంతర్జాతీయ భాషగా గుర్తించాలి – అని.

కవులు, కథకులూ, వ్యాస రచయితలూ, చాలా సున్నితమైన వాళ్ళు. విమర్శలు సునిశితంగాను, సూటిగాను,పెళుసుగా లేకుండానూ చెయ్యడం అవసరం. ఈమాట అభిప్రాయవేదికలో వ్యక్తిగత దూషణకి తావు లేదు. ఓక్కొక్క సారి, పొరపాటున దూకుడుగా అనాలోచితంగా రాసిన వాక్యాలు కత్తిరించకండా ప్రచురించడం జరిగింది. అందుకు నా క్షమాపణలు. ఇక ముందు కత్తిరించవలసిన పరిస్థితి రాకుండా సహకరించమని నా మనవి.

హయగ్రీవశాస్త్రి ఇప్పుడు అనాధశవం. హనుమంతుకి పురాణం శాస్తుర్లు గారు ఎప్పుడో పురాణంలో పిట్ట కథలా చెప్పింది గుర్తుకొచ్చింది. అనాధ ప్రేత సంస్కారాత్ కోటియజ్ఞ ఫలం లభేత్, అని.

అమరు శతకం పేరిట సంస్కృతంలో ఒక వంద పైచిలుకు శృంగార రసప్రధానమైన శ్లోకాలు ప్రసిద్ధికెక్కాయి. అలంకారశాస్త్ర గ్రంధకర్తలు అమరు శతకం లోని శ్లోకాలు ఉదాహరణలుగా ఇచ్చారు కూడాను.

అసాధ్యంకాని ఆదర్శాలనికూడా ఆచరణలో పెట్టడాని కొచ్చేటప్పటికీ,మన సంస్థలు,ముఖ్యంగా దేశవ్యాప్తంగా పెద్దయెత్తున ప్రతి ఏటా ఉత్సవాలు జరుపుకొనే స్థోమత ఉన్నసంస్థలు,– తానా,ఆటా లు రెండూ అడవిలో అబ్బా అంటున్నాయా అన్న సందేహం రాక మానదు.

బుల్లి భూషయ్యకి మహరాజవుదామని కోరిక పుట్టింది. ఒకటే ఉబలాటం. ఇదేమీ కొత్తగా పుట్టిన కోరిక కాదు. అన్నయ్య చిన భూషయ్య ఆరేళ్ళకిందట అనుకోకండా మహరాజుగా ఎంపిక అయినప్పటినుంచీ, తను కూడా మహరాజవ్వాలని తహ తహలాడటం మొదలెట్టాడు. తనకేం తక్కువయిందని? చదువులేదా? చక్కని సంసారం లేదా?

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈమాటకి ఎనిమిదేళ్ళునిండాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఈ ఎనిమిది ఏళ్ళల్లో ఈమాట పరంగా ఎన్నో మంచి విశేషాలు […]

“చావందరికీ ఒకటే అయినా, అందరి చావూ మనకొక్కటికాదు,” అని ఎప్పుడో చదివిన వాక్యాలు కళ్ళముందు తారట్లాడాయి.

శ్రీరాముడు నదిలో సంధ్య వార్చి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చాడు. లక్ష్మణుడు “మమ” అనుకున్నాడు. సీత, లక్ష్మణుడు నీరు త్రాగి,దప్పిక తీర్చుకున్నారు. ఏమయిందో కాని, ఇక్కడనుంచి లక్ష్మణుడు సీత వెనుక నడవడం మొదలెట్టాడు! విడ్డూరం!!

ఐదవ తెలుగు సాహితీ సదస్సు, హ్యూస్టన్ లో చదివిన కీలకోపన్యాసం –నూరు సంవత్సరాల క్రితం ప్రబంధ సాహిత్యంపై వచ్చిన విమర్శని స్థూలంగా పరిశీలించడం; ప్రస్తుతం వస్తున్న సాహిత్య విమర్శనలగురించి ముచ్చటించడం; ఈ విమర్శనా ధోరణుల వలన సాహిత్యానికి, సాహిత్య విమర్శకీ వచ్చిన, వస్తూన్న నష్టాలని గుర్తించడం, నా ముఖ్యోద్దేశం. ఈ పరిస్థితిని మార్చడానికి కావలసిన ప్రేరణ, తగిన శిక్షణల గురించి సాహితీపరులందరూ, ముఖ్యంగా diaspora సాహితీపరులందరూ ఆలోచించడం ఆవశ్యకం

ఎంతయినా తెలుగు వాడే కదా! ఆయన ఇట్టే పసిగట్టేశాడు. “ఏమిటి? ఈ పేపర్లు మనదేశంలో లాగా అమ్ముదామని దాస్తున్నావా?” అని నవ్వుతూ అడిగాడు.

పద్యం పదిమందినోటిలో పడి, నలిగి, పదికాలాలపాటు ప్రజలు నెమరువేసుకుంటూ ఆనందించగల కవితలు రాసిన వాడు నిజమైన ప్రజాకవి. ఈ దృష్టితో చూస్తే, మనకి నిజమైన ప్రజాకవులు తిరుపతి వెంకట కవులు.

డెట్రాయట్ తెలుగు వారు నాందీ వాక్యం పలికారు. వాళ్ళని అభినందించి తీరాలి. ఇదేవిధంగా, అమెరికా వ్యాప్తంగా, దక్షిణ ఆసియా భాషల్లోను, సంస్కృతంలోనూ బోధన స్థిరపడ్డ ప్రతి విశ్వవిద్యాలయంలోనూ తెలుగు భాషా బోధనకి, తెలుగు సాహిత్య పరిశోధనకీ, అవకాశం కల్పించవలసిన అవసరం ఉన్నది.

కారణమేమిటో తెలియదు, కథలు రావడం కుంటుపడుతున్నది. తెలుగు diaspora అనుభవాలు మరొకరు చెప్పలేరు. ఇక్కడి తెలుగు వారే చెప్పగలరు. అది మన ప్రత్యేకత. ప్రతి ఒక్కరూ ఒక కథ బాగా చెప్పగలరు అని నానుడి. ఆ కథ వారి స్వంత కథ, వారి స్వానుభవం.

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని సామెత. అదెంతనిజమో తెలియదు గానీ, చిన భూషయ్య పుట్టగానే, ‘ధరణి కంపించింది. కులపర్వతాలు వణికిపోయాయి. సముద్రంలో పెనుతుఫానులొచ్చాయి. ఆకాశంలో తోకచుక్కలు పొడిచాయి. ఫెళఫెళమని పిడుగులు పుడమిన పడ్డాయి.’

తెలుగు భాష వేదాల కన్నా పాతదని, మనిషి పుట్టుకకు పూర్వమే పుట్టిందని వికారమైన వాదాలు మొదలయ్యాయి. “శ్రీకృష్ణుడు తెలుగువాడే,” అన్నవాదం నుంచి “అస్సిరియా నుండి ఆస్ట్రేలియా దాకా తెలుగే మాట్లాడేవారట” అనేటంత వెర్రి వాదాలు కూడా వచ్చే సూచనలు కనపడుతున్నాయి.

పాఠకుల విమర్శలు రచయితలకీ సంపాదకులకీ ఎంతో అవసరం. సహృదయంతో చేసిన విమర్శలు సూటిగా నిష్కర్షగా ఉండచ్చు. అందులో తప్పేమీ లేదు.

పౌరహక్కుల న్యాయం కోసం తుపాకులు అక్కరలేదు, తూటాలు అక్కరలేదు. విప్లవం విప్లవం అంటూ గొంతుచించుకొని అరవక్కరలేదు

నేను ప్రస్తావించబోయే ప్రార్థన పద్యాలు, మనం చిన్నప్పుడు నేర్చిన పద్యాల వంటివి కావు. అంతేకాదు. మనం పెద్దైన తరువాత, ఏ కావ్యాలనుంచో, ప్రబంధాలనుంచో, నేర్చుకున్న పద్యాలూ కావు.

ఈ సంచికలో తానా కథల పోటీలో బహుమతులొచ్చిన కథలు ప్రచురించటానికి తానా సాహితీ శాఖ వారు అనుమతించారు. అందుకు వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. […]

జరిగిన విషయం తిరిగి చెప్పినచోట్లు చాలా ఉన్నాయి, భారతంలో. ఒక ఉదాహరణకి, శకుంతలోపాఖ్యానం చూడండి. అయితే మక్కీకి మక్కీ గా అప్ప చెప్పలేదు. ఏది ఏమయితేనేం? నాకు తెలిసినంతలో, భారతంలో ఇల్లా మక్కీకి మక్కీ రిపీట్ అయిన పద్యం లేదనే అనుకుంటున్నా. ఇది పరిశోధించవలసిన విషయమే.

ఈమాట మార్చ్‌ 2005 సంచికలో పాఠకులకి పరిచితులైన రచయితలనుంచి కొత్త కథలు, వ్యాసాలు, కొత్త రచయితలనుంచి సరికొత్త కవితలూ కథా ఉన్నాయి. ఈ సారి […]

1930 లో గాంధీ గారి పిలుపు విని ఉప్పు సత్యాగహంలోకి దూకి, శ్రీకృష్ణజన్మస్థానాన్ని దర్శించారు, మా తెలుగు మేష్టారు! ఆయన జైలు కథ మీకు చెప్పితీరాలి.

“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం! మే నెల సంచికను అనివార్య కారణాల వల్ల మీ ముందుకు తీసుకురాలేక పోయాం. ఇకముందు అలాటి అవాంతరాలు కలగకుండా జాగ్రత్తచర్యలు […]

ఇస్మాయిల్‌ గారు పోయారని వినంగానే, “కీర్తిశేషుడైన కవి కాలసాగర తీరాన కాస్సేపు పచార్లు చేసి గులకరాయొకటి గిరవాటేసి తిరిగి వెళ్ళిపోయాడు,” అన్న కవిత పెదాలపై […]

రెండేళ్ళ క్రిందట, చికాగోలో రెండవ అమెరికా తెలుగు సదస్సు నాందిగా, “మనం డయాస్పోరా రచయితలం. ఈ సదస్సు ముఖ్యోద్దేశం, తెలుగు డయాస్పోరా రచయితలని ఒకచోట […]

విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లనో, కాలేజీల్లో పండితులనో, మీరుగనక ఈమధ్యకాలంలో పలకరించి ఉంటే తెలుగు భాష ఎవ్వడికీ అక్కరలేనిదయ్యింది, తెలుగు భాషకి తెలుగు దేశంలోనే భవిష్యత్తు లేదు, […]

” అమ్మాయీ! కాస్త ఆ అంటు చెయ్యి కడుక్కోని మరీ వడ్డించమ్మా, నీకు పుణ్యం వుంటుంది. నీ మైల కూడు తినలేక చస్తున్నాను, ఇదెక్కడి […]

క్లబ్బులో చెట్టు కొట్టేశారని రెడ్డి మేష్టారు రాజు గారింట్లో చెప్పంగానే, నా కుడిచెయ్యి కొట్టేసినట్టనిపించింది.  కుడి చేతిలో స్కాచ్‌ గ్లాసు జారిపోతుందేమోనని భయపడి, గట్టిగా […]

(వేలూరి వెంకటేశ్వరరావు గారు అమెరికా తెలుగు సారస్వత తారల్లో ప్రముఖులు. వీరు “తెలుసా” లోనూ, ఇతర చోట్ల లోనూ రాసిన వ్యాసాలు లోతుగానూ ఆలోచనాత్మకం […]