‘లెటర్స్ టు ది ఎడిటర్’ అనేది పత్రికలలో ఒక సంప్రదాయం. సంపాదకుడిని సంబోధిస్తూ వివరంగా వ్రాసే ఉత్తరాల ద్వారానే చక్కటి సాహిత్యచర్చ సాధ్యం అని నమ్మిన పాఠకుల కోరిక ప్రకారం ఈ శీర్షిక ప్రారంభిస్తున్నాం.  ఈ విభాగంలో ప్రచురించే ఉత్తరాల ద్వారా సంపాదకులతో నేరుగా ఒక సంభాషణ సాధ్యమవుతుంది.

కాలక్రమేణా రామాయణాలు మారుతూ వచ్చాయి, కొత్తగా పుడుతూ వచ్చాయి, కొత్త కొత్త కథనాలు, దృక్కోణాలు వాటిలో ప్రక్షిప్తమయ్యాయి, అవుతూనే ఉంటాయి. రామాయణం ఏ కొందరి సొత్తో కాదు. సీతారాములు ఏ కొందరికో మాత్రమే దేవుళ్ళు కారు. మరెందరికో కేవలం దేవుళ్ళు మాత్రమే కారు. ఇది రామాయణానికి, వాల్మీకికీ అశేష భారతం చూపుతూనే ఉన్న గౌరవం. ఎప్పుడైతే ఇది మరిచిపోయి రాముడు ‘మా’వాడు, రామాయణం ‘మాది’, ‘మాకు నచ్చిందే, మేము చెప్పిందే రామాయణం’ అన్న దౌర్జన్యం ప్రబలుతుందో అప్పుడు సమాజంలో భిన్నవర్గాల మధ్య ఘర్షణ అనివార్యమవుతుంది. ఈ పోరులో మనగలిగితే, మానవజాతి సజీవంగా ఉన్నంతవరకూ రామాయణం కూడా సజీవంగా ఉంటుంది. లేదూ, ఒక నిర్జీవ కావ్యంగా మాత్రమే మిగిలిపోతుంది.

సంస్కృత గ్రంథాలు, వాటి సమయ సందర్భాలు తెలియని అజ్ఞానం కారణం గానూ, భారత దేశానికి పాశ్చాత్య ప్రపంచం కన్నా గొప్ప నాగరికత వున్నదని అంగీకరించడానికి తమ గర్వం అడ్డు రావడం కారణం గానూ, కొందరు పాశ్చాత్యులు చేసిన దుర్వ్యాఖ్యానాలని సహేతుకంగా కాదనగలగడం శ్రీరామచంద్రుడు చేసిన మహోపకారం. ఈ పని, భారత దేశంలో ప్రతిదీ గొప్పది, పాశ్చాత్యమైనది ప్రతిదీ చెడ్దది అనే చెక్కపడి పద్ధతిలో కాకుండా, సహేతుకంగా, సున్నితంగా చెయ్యడం ఆయన ప్రత్యేకత.

తెలుగు నేర్చుకోవడం మూలంగా తెలుగులో వున్న పుస్తకాలు చదవడం మూలంగా ప్రపంచ విజ్ఞానాన్ని పెంచగలమని మన దేశపు విజ్ఞానులు ప్రపంచానికి ప్రదర్శించగలరా? నువ్వు ఏ భాష వాడివైనా తెలుగులో రాసిన పుస్తకాలు చదవకపోతే నీ విజ్ఞానానికి ఈ రకంగా లోపం వస్తుంది, అని మనం చెప్పగలిగిన రోజున, ఆ మాట ప్రపంచం లోని విజ్ఞానులు విన్న రోజున, వాళ్ళు తెలుగు పుస్తకాలు చదివి అందువల్ల గ్రహించిన విజ్ఞానాన్ని ప్రపంచ విజ్ఞానంలో భాగం చేసిన రోజున — తెలుగు ప్రపంచ భాష అవుతుంది.

ప్రాచీన కవిత్వం ఎందుకు చదవాలంటే ఎట్లా రాయకూడదో తెలుసుకోవడానికి అని ఎవరో కాదు సాక్షాత్తు శ్రీశ్రీయే అన్నాడు. ఆయన మాత్రం ప్రాచీన సాహిత్యం చదివి పాండిత్యాన్ని, భాషాపాటవాన్ని పెంచుకున్నాడు.

మన కాలంలో, కాపీ రైటు చట్టాలు, అనుకరణ నిషేధాలూ ఉన్నప్పుడు కూడా బాపూ తన బొమ్మలని గాలి, నీరు, వెలుతురూ లాగా తెలుగు దేశం అంతటా పంచి పెట్టేశాడు. అక్కడే కాదు, తెలుగువాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ దాకా తన బొమ్మలని పట్టుకో పోనిచ్చాడు.

మారిపోతున్న సాహిత్య సామాజిక పరిస్థితులు, సాంకేతిక అవసరాల వల్ల, ఈమాటలో కూడా కొన్ని మార్పులు తప్పనిసరి అవుతున్నాయి. ఈమాట రచయితలకు, పాఠకులకు వీలైనంత వరకూ ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఈ మార్పులని ప్రవేశపెట్టటానికి ప్రయత్నిస్తున్నాం. ఈమాట నిర్వహణలో మేము తరచూ తీసుకొనే నిర్ణయాలు కూడా ఇందులో భాగమే. ఇకనుంచీ ఈమాట పద్ధతులు, నియమాలలో కొన్ని మార్పులను మీ దృష్టికి తెస్తున్నాం.

ఎనిమిదేండ్లకు పైగా ఈమాట ముఖ్యసంపాదకుడిగా శ్రమించిన వేలూరి వేంకటేశ్వర రావుగారు ఈ సంచికతో సంపాదకీయ బాధ్యతలనుండి వైదొలిగారు. వారికి మా హార్దిక కృతజ్ఞతలు. వారు ఇప్పటికీ ఎప్పటికీ ఈమాట కుటుంబ పెద్దలే. వారి మాట మాకు శిరోధార్యమే. – సం.

“మనకంటూ స్వర్ణ యుగం అనేది ఉండేదో లేదో మనకిక ఎప్పుడూ తెలియదు. వేల సంవత్సరాల భారతీయ సంస్కృతి మనది అని గొప్పలు చెప్పుకోడానికి బాగున్నా, మన సంస్కృతి గురించి మనం తెలుసుకోగలిగినది గత ఐదు లేదా ఆరు శతాబ్దాల దాకానే. అంతకు ముందు చరిత్ర అని మనం అనుకుంటున్నది కేవలం మన ఊహాసృష్టి.”

నారాయణ రావు రోజుకో కవిత రాసేవాడని చెపితే మీరు నమ్మరు. రాజు, నేను ఆ కవిత చదవటం; ‘చెత్త, చింపెయ్యండి,’ అని అనడం మామూలు. నవ్యకవితలు కాకండా సంప్రదాయ కవిత్వం వల్లించినప్పుడు మాత్రం మాకు చిరాకేసేది; నిజం చెప్పొద్దూ! అవి మనకి అవసరం అని ఆయన ఆ రోజుల్లో అనేవాడు. ఇప్పుడు కదూ తెలిసింది అదెంత నిజమో!

వ్యక్తిగతంగానో, ఆయన రచనల ద్వారానో తెలిసినవారికే కాదు, ఈమాటకు మాత్రమే కాదు, తెలుగు సాహిత్యానికీ రోహిణీప్రసాద్ ఆకస్మిక మరణం ఒక పిడుగుపాటు. ఈమాటకు రోహిణీప్రసాద్‌ లేని లోటు ఇంకెవరూ, ఇంకెప్పటికీ పూడ్చలేనిది.

అమెరికా నించి కృష్ణమూర్తిగారు తిరిగి వచ్చిన తరవాత తెలుగుశాఖ వాళ్ళే ఆయనని తమ శాఖలో కలుపుకుని ఉంటే ఏమయి ఉండేది అన్న ప్రశ్న నన్నెప్పుడూ ఆలోచింపజేస్తూ ఉంటుంది. మొదటిది, పరిశోధనలో అంతర్జాతీయంగా ఒప్పుకున్న ప్రమాణాలు ఆయన తెలుగుశాఖలలో అమలులోకి తెచ్చేవారు.

మొదటి ప్రపంచ యుద్ధ ప్రారంభ కాలం నుండి, ఇప్పటివరకూ, అంటే ఈ నూరు సంవత్సరాలలో ప్రచురించబడ్డ ‘చారిత్రక నవలల’కు లూకాచ్ చెప్పిన లక్షణాలు ఉన్నాయా, లేవా? అనే ప్రశ్నకి సమాధానం వేరే మరొక వ్యాసం మరొకరు రాయవలసి ఉంటుంది. అసలు, లూకాచ్ ఉద్ఘాటించిన లక్షణాలు ఈ కాలపు చారిత్రక నవలలకి ఆపాదించవచ్చా అన్నది మౌలిక మైన ప్రశ్న.

కొత్తసంవత్సరం ప్రారంభంలో అనేకమైన తీర్మానాలు చేసుకోవటం ఆనవాయితీ. బరువు తగ్గుదామని, బీడీలు తాగటం మానేస్తానని, బడికో, గుడికో దానధర్మాలు చేస్తాననీ… రకరకాల ప్రతిజ్ఞలు చేసుకోవటం మనకి తెలియని విషయం కాదు. అయితే అది వ్యక్తిగతమని, ఈ మాట పత్రికనీ కొందరు, నవ్వచ్చు; మరికొందరు కామెంటేతర్లు వెటకారం చెయ్యవచ్చు.

నిజం చెప్పాలంటే మన రాజకీయ నాయకులకి మన సంస్కృతి , మన భాష – ఈ రెండూ అవసరం లేదు. చప్పట్ల కోసం చెప్పటం తప్ప, ఈ రెండింటి పైనా ఏ విధమైన గౌరవమూ లేదు. వాళ్ళ లాగానే మన సంస్థలు కూడా ఈ పడికట్టు మాటలు వల్లెవేయడం నేర్చుకున్నాయి. అంతే!

గూగుల్ మొదలుపెట్టిన పథకం ఒక రకంగా మంచి పథకమే. కోట్లకొద్దీ జనానికి మరో ప్రచురణకి నోచుకోని లక్షల కొద్దీ పరిశోధన గ్రంథాలు అందుబాటులోకి వచ్చేవి. రచయితలకి డిజిటల్ పుస్తకాలు ‘అమ్ముడు’ పోవడం మూలంగా డబ్బులొచ్చేవి. కొద్ది రుసుము కట్టుకుంటే గ్రంథాలయాలకి లక్షల గ్రంథాలు అందుబాటులో వుండేవి.

ఏ కవితనో చదువుతున్నప్పుడు మనందరికీ ఎప్పుడో ఒక్కప్పుడు వచ్చే సందేహం – ఇదసలు కవితేనా, లేకపోతే వాక్యాన్ని పొట్టీ పొడుగూ ముక్కలుగా విరక్కొట్టి ఇది కవితే అని రాసినవారు బుకాయిస్తున్నారా అని. అది కవిత్వమే అయితే, కవి ఏ ఆధారంతో ఆ కవితలో పాదాలని విరక్కొడుతున్నాడు? అని.

ఒక కథ నచ్చడానికీ నచ్చకపోడానికీ మనకు ఎన్నో కారణాలుంటాయి. నచ్చనివాటిని కాసేపు పక్కన పెట్టి, ఏదైనా కథ మీకెందుకు నచ్చిందో ఆ కారణాల గురించి ముచ్చటించుకోడం కోసమే ఈ శీర్షిక.

ఒక గొప్ప కవిగారి పేరు, మీపేరూ అనుకోకండా ఒకటే అయితే ప్రమాదమే! శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రపంచప్రసిద్ధి పొందితే, శ్రీభాష్యం శ్రీనివాసులు, ఏదైనా అడపా తడపా రాసి ఏ పత్రికకన్నా శ్రీశ్రీ అన్న పేరుతో పంపిస్తే, మందలించని సంపాదకుడు ఉండడనుకుంటాను.