మనకనువుగా దూరాలు సంకోచించుకుని
సుదూర నక్షత్ర మండలానికి
దారి సుగమం అవుతుందట
జులై 2005
ఈ సంచికలో తానా కథల పోటీలో బహుమతులొచ్చిన కథలు ప్రచురించటానికి తానా సాహితీ శాఖ వారు అనుమతించారు. అందుకు వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. ప్రత్యేకంగా, శ్రీ జంపాల చౌదరి గారికి మా అభివాదాలు. ఆనవాయితీగా, ఆటా వారిపోటీ బహుమతి కథలు, తానా వారి కథలూ ఈ-మాట లో ముందుగా ప్రచురితమవడం మాకు ఎంతో ఆనందదాయకం.
ఇవి కాక, ఈ మాట చదువరులకి పరిచయస్తుల కథలు, కవితలూ ఈ సంచికలో పొందుపరుస్తున్నాము. ఈ కథలపై పాఠకుల అభిప్రాయాలు, విమర్శలు, సహృదయ సమీక్షలూ వస్తాయని తలుస్తున్నాం. ఇది ఈ-పత్రిక. మీ విమర్శలు,అభిప్రాయాలూ కుదించి రాయవలసిన అవసరం లేదు. మాకు కాగితపు కొరత లేదని మీకు తెలుసు. అందుచేత మీ అభిప్రాయాలు సుదీర్ఘంగా వుంటే బాగుంటుంది. ఏదో రకమైన రాజకీయావశ్యకత వుంటే తప్ప, విమర్శకులు తమ పూర్తి పేరు రాస్తే బాగుంటుంది. ఈ విమర్శలు వ్యాసాల్లా రాస్తే, వాటిని రాబోయే సంచికలలో ప్రచురిద్దామని అనుకుంటున్నాము.
కాత్యాయనీ విద్మహే చాలా చక్కని విమర్శకురాలు. సాంప్రదాయ సాహిత్యం ఆధునిక సాహిత్యం చక్కగా చదువుకున్న రచయిత్రి. కాకతీయవిశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్. చాలా సాహితీ వ్యాస సంపుటాలు ప్రచురించారు. సాంప్రదాయ సాహిత్యంలో స్త్రీవాద దృక్పథం మీద ఆవిడ వ్యాస సంపుటి అందరూ చదవ వలసిన పుస్తకం. ఈ సారి తానా సభలకి ఆమెని ఆహ్వానించారు. ఆమెని పరిచయం చేస్తూ, మరొ ప్రసిద్ధ స్త్రీవాద రచయిత రెంటాల కల్పన ఒక చిన్న వ్యాసం రాసారు. కాత్యాయని గారి రచనమీద మరో పెద్ద వ్యాసం (?) రాస్తానన్న హామీ కూడా ఇచ్చారు. కల్పన గారికి నా కృతజ్ఞతలు.
ఈ సంచికను యూనీకోడ్ లో ప్రచురించడానికి ఎంతగానో ఉపయోగపడ్డ సాప్ట్ వేర్ కు సృష్టికర్త నాగార్జున వెన్న. ఈమాట తరఫున నాగార్జునకు నా కృతజ్ఞతలు.
కొత్త రచయితలనీ, కొత్త విమర్శకులనీ, ముఖ్యంగా Telugu diaspora సాహిత్యాన్నీ ప్రచురిద్దామనే ఉద్దేశ్యంతో ఈ-మాట మొదలయ్యింది. ఇందుకు మీ సహకారం ఎంతో అవసరం.
—
కోటి ఆలోచనలతో
ఏటి ఒడ్డున
బరువుగా తిరగళ్ళ చప్పుడు
ఆ గాలి పాడితే ఈ గజల్
డిట్రాయిట్ నగరంలో, జులై 1,2,3 తేదీలలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 15వ సమావేశం జరుపుకోబోతుంది. ఈ సందర్భంగా, తానా ప్రచురణల కమిటీ, […]
కథా సమీక్ష విముక్తుడు (రచయిత్రి: జొన్నలగడ్డ రామలక్ష్మి) ఓ చేయితిరిగిన రచయిత చదివించే గుణంతో ఓ చిన్న విషయం గురించి రాసిన కథ. కేన్సరుతో […]
That infamous Thelugoo Cockroach Castle?!”
“Yes! Its a dead place now”
ఇక జీవితమంతా వాళ్ళు తెలుగు పద్యాలు పాడుకుంటూ తెలుగు సంస్కృతి గురించి జపిస్తూ, తెలుగుదనం కారిపోయే దుస్తులు, ఆభరణాలు ధరిస్తూ జీవచ్ఛవాలుగా తిరగబోతున్నారు!
ఇప్పుడే అర్థమయింది నాకు నేను చేసిన తప్పు. తను చెయ్యకూడని పని ఎదటివాళ్ళ సంతోషం కోసం కూడా చెయ్యకూడదు అని.
నాకెందుకో న్యాయ నిర్ణేత అన్న పదం చాలా అన్యాయంగా వాడుతున్నారని పిస్తుంది. వాళ్ళు ఏం న్యాయ నిర్ణయం చేస్తారు ? ఒక కథ మంచి, లేక చెడ్డ దా అనా ?
మనకి గతశతాబ్దంలో మహాకవులు ఇద్దరే: విశ్వనాథ, శ్రీశ్రీ.
ప్రాచీన సాహిత్యాన్ని పరమ పవిత్రమని నెత్తిన పెట్టుకోవడమో, లేదా పరమ ఛాందసమని తీసిపారేయ్యడమో కాకుండా ఒక సమన్వయంతో, సదసద్వివేచనతో ప్రాచీన సాహిత్యాన్ని ఆధునిక దృష్టి కోణం నుండి చూడాల్సిన అవసరాన్ని గుర్తించి ఆ దిశగా తన విమర్శనా మార్గాన్ని ఎన్నుకున్నారు విద్మహే.
సంగీతరావుగారి వంటి అనుభవజ్ఞులతో మాట్లాడినా, వారి జ్ఞాపకాల గురించి చదివినా తెలుగువారి సంగీతసాంప్రదాయం గురించి మనకు కొంత తెలుస్తుంది.
గమనాన్నీ, యానాన్నీ, ప్రవాహాన్నీ అక్షరాలలో చిత్రించాలని — అంతర్ బహిర్ వర్తనాల మధ్యన వుండే గొలుసు పొరలు చిరగకుండా వొక్కొక్కటె విప్పి, యేదో శూన్య రహస్యాన్ని తెలుసుకోవాలన్న కోర్కె తో రాసిన అస్తిత్వ వాద మనోవైజ్ఞానిక నవల హిమజ్వాల