అలాంటి ఇళ్ళని సినిమాల్లో తప్పాచూడని మంగ ఒక్క మాట కూడా మాట్లాడ కుండా చూస్తోంది. ఇళ్ళనీ, ఇళ్ళలో ఉన్న కార్లనీ, రక రకాల మొక్కల్నీ. ఇరుకు అపార్ట్ మెంట్లోంచి వచ్చిన మంగకి, వేరే ఏదో దేశం వెళ్ళినట్టుగా ఉంది.
జులై 2006 సంచిక విడుదల
“ఈ మాట” పాఠకులకు స్వాగతం! ఈ సంచికకు సంబంధించి ఎన్నో విశేషాలున్నాయి.
- ఈ వారాంతంలో జరుగుతున్న “ఆటా” సంబరాల సందర్భంగా నిర్వహించిన పోటీలలో బహుమతి పొందిన కథలు,కవితలు,వ్యాసాలు, నవలికలతో పాటు మొత్తం ఆటా సూవనీర్ గ్రంథాన్ని (కబురు) ఈమాట సాహితీ గ్రంథాలయం ద్వారా అందజేయడం. ఇందుకు కారకులైన మురళీ చందూరి గారికి మా కృతజ్ఞతలు.
- ఈ మధ్యే కన్ను మూసిన ప్రముఖ భాషావేత్త బూదరాజు రాధాకృష్ణగారికి, ప్రఖ్యాత సినీ సంగీతదర్శకుడైన నౌషాద్ గారికి నివాళులుగా వారి విశిష్ట వ్యక్తిత్వాన్ని విశదపరిచే రెండు వ్యాసాలు.
- ఈజిప్ట్ పై యాత్రావ్యాసం
- నిడుదవోలు మాలతి, సావిత్రి మాచిరాజు, అక్కిరాజు భట్టిప్రోలు, లైలా యెర్నేని గార్ల కథలు
- ఇంకా ఎన్నో కవితలు, వ్యాసాలు, సమీక్షానువాదాలు.
పాత సంచికల యూనికోడీకరణ దాదాపుగా పూర్తి కావచ్చింది. తప్పొప్పులను సమీక్షించి రెండు, మూడు వారాల్లోగా పాత సంచికలన్నింటినీ మీ అందుబాటులోకి తీసుకురాగలమని అనుకుంటున్నాము.ఈ ప్రాజెక్ట్ పూర్తి బాధ్యతలను స్వీకరించి హైదరాబాద్ లోని తన ఉద్యోగుల ద్వారా గత పదిహేను రోజుల్లోనే ఎనమిది వందల పైచిలుకు రచనలను తర్జుమా చేయించిన verudix.com కంపెనీ వ్యవస్థాపకుడు శ్రీధర్ పాలెపు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ సంచిక మీకు నచ్చుతుందనీ, దీనిలో రచనలపై విరివిగా అభిప్రాయాలు, విస్తారంగా విమర్శలూ, సహృదయ సమీక్షలు వస్తాయనీ ఆశిస్తున్నాము.
మరుసటి సంచిక విడుదల సెప్టెంబర్ 1, 2006.
జులై 2006 సంచిక | | | ATA 2006 సూవనీర్ (కబురు) | ||||||
కథలు | | | కవితలు | | | వ్యాసాలు | | | అనువాదాలు | | | సమీక్షలు |
గీరతం తెలుగుసాహిత్యంలో ఒక విలక్షణమైన రచన. అది రెండు పక్షాల కవుల మధ్య జరిగిన సంఘర్షణని చూపిస్తుంది. ఇందులో ఒకరు తిరుపతి వెంకట కవులు. రెండవ వారు వెంకటరామకృష్ణ కవులు. వీరిద్దరి వివాదాంశం చాలా విచిత్రమైంది.
మరి ఇక దొర గారంటే అచ్చమైన ఇంగ్లీషు కదా మాట్లాడేది! దేవుడే దిగి వచ్చినట్లనిపించింది నాకు.
రహస్యం దాచలేని సంగతి అలాఉంచి, నువ్వుగింజ నానదు అనెందుకన్నారో, నాకు ఇప్పటికీ బోధపడలేదు.
ఈ చెట్టు రెమ్మల చివర్లలో పేలిన రంగుతూటాల్లా మొగ్గలు!
డెట్రాయట్ తెలుగు వారు నాందీ వాక్యం పలికారు. వాళ్ళని అభినందించి తీరాలి. ఇదేవిధంగా, అమెరికా వ్యాప్తంగా, దక్షిణ ఆసియా భాషల్లోను, సంస్కృతంలోనూ బోధన స్థిరపడ్డ ప్రతి విశ్వవిద్యాలయంలోనూ తెలుగు భాషా బోధనకి, తెలుగు సాహిత్య పరిశోధనకీ, అవకాశం కల్పించవలసిన అవసరం ఉన్నది.
మీరు నమ్మండి, నమ్మకపొండి. నేను నడకకి వెళ్ళిన ప్రతి రోజూ – దరిదాపుగా ప్రతిరోజూ – దారిలో నేల మీద ఒక పెన్నీ (సెంటు లేదా పైస) కనిపించి తీరుతుంది. కరువు రోజుల్లో పుట్టి పెరిగిన శాల్తీనేమో, ఒంగుని పెన్నీని తీసి జేబులో వేసుకుంటాను.
ముకేశ్‌కు తారస్థాయిలో అపస్వరాలు పలుకుతాయని నౌషాద్కు కొన్ని అభ్యంతరాలుండేవి. అందుకనే అందాజ్, మేలా మొదలైన సినిమాల్లో ముకేశ్ చేత అతను మంద్ర స్థాయిలో పాడించాడు. ఒక్క “తూ కహే అగర్” పాట కోసమని ముకేశ్ నౌషాద్ ఇంటికి వచ్చి 23 సార్లు రిహార్సల్ చేశాడట. అప్పటి కమిట్మెంట్ అటువంటిది.
ఇలాంటి దుఃఖం కలిగినప్పుడల్లా ఏదోఒక వెకిలి పద్యం రాసుకోవడం బూదరాజు గారి అలవాటు.
రాలిన కేశాల్లా కోరికలు బరువైన కన్నీళ్ళకి దోసిలొగ్గాయి.
మీ అందరి మాటలూ వింటూంటే, నేనిక్కడకి రావడంలో పెద్ద పొరపాటు చేశాననిపిస్తోంది. కొత్త మూలాన తికమకగా ఉందనుకున్నానుగానీ, ఎప్పటికీ ఇక్కడ ఇమడననీ, ఎప్పుడూ ఒంటరిగా ఉంటాననీ తల్చుకుంటే చాలా భయంగా ఉంది.
పర్ల్ హార్బర్ దగ్ధమయ్యింది
బర్కిలీలో, మా కొట్లో
మాంసపు ముద్దల పక్కన
మేమూ తలకిందలయ్యాం
రెండవ ప్రకరణం మన ఆగంతకుడు వచ్చి వారం రోజులకు పైగా అయింది. అతనికి బండీ ఎక్కి సాయంకాలపు పార్టీలకు వెళ్ళటంతోనూ, విందులు కుడవటంతోనూ కాలం […]
“ప్రతి శిశు జననం మానవ జాతి మీద భగవంతునికి మిగిలి ఉన్న నమ్మకాన్ని నిరూపిస్తుంది” అన్నట్టే ప్రతి కవిజననం మన భాష మీద మనకున్న ఆశను రెట్టింపు చేస్తుంది.
దాన్ని తీసినప్పుడల్ల
పైనున్న దుమ్ము చెదిరిపోయి
మన చిన్నతనం
మాసిపోతుందేమోనని
నాకు ఒకటే రంది.
గది గోడలకైన గాయాలు
మానిపోతున్నాయి.
ఆకాశం పురివిప్పుకుని
సూర్యుడిని దాచేసినప్పుడు..
అసలు ఆయనే కాదు ఆయింట్లో ఎవరికీ నార్మల్ వాయిస్ వున్నట్టు లేదు. అందరివీ కాకలీ స్వనాలే! 90 డెసిబెల్స్‌కి పైమాటే!
ఎంత ప్రేమించినా ఏముంది
అడుగుల సడికే పక్షులన్నీ
హడావుడిగా ఎగిరిపోతాయి.
రావోయి చందమామ
నీ వెన్నెల కౌగిట్లో మద్యం సేవిస్తాను
నేను ఎన్ని సంవత్సరాలు కస్టపడి ఈ కంపెనీకి పని చేశాను. ఈ స్థాయికి చేరుకున్నాను. మా వంటి వాళ్ళ వల్లే గదా కంపెనీ ఇంత మంచి పేరు తెచ్చుకుంది. ఈ ఊరికి కూడా పేరు వచ్చింది. ఇప్పుడు ఈ కంపెనీ తో కొంచెం కూడా సంబంధం లేని ఎవరో ఒకతను — వెధవ , వేరే ఊరి నుండి వచ్చి, ఈ ఊరిలో ఇన్నాళ్ళుగా పని చేసి పేరు తెచ్చుకున్న నన్ను ఉద్యోగం నుండి తీసి వేశాడు. ఎంత ధైర్యం!
ఆధునిక మెట్రిక్ కొలమాన పద్ధతులు ప్రవేశించకముందు తెలుగు ప్రజలకు ఒక ప్రామాణికమైన కొలమాన పద్ధతి ఉండేదని చాలామందికి తెలియదు.
ఎన్ని ఫొటోలు, టీవీ ప్రోగ్రాములు, వీడియోలు చూసినా, ప్రత్యక్షంగా పిరమిడ్లని చూస్తే కలిగే అనుభూతుల్ని వర్ణించటం కష్టం!
మళ్ళీ వాన కురిసి తెరపిస్తే ఎంత బాగుంటుంది!