ఎంతసేపట్నించో
ఎదురు చూస్తున్న చిట్టితల్లిలా
కళ్ళమీంచి చేతులుతీసి
కిలకిలా నవ్వుతుంది.
ఈమాట జులై 2011 సంచికకు స్వాగతం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా (TANA) తమ 18వ ద్వైవార్షిక సమావేశోత్సవాన్ని జులై 1-3న శాంటా క్లారా, కాలిఫోర్నియాలో జరుపుకుంటున్నది. వారికి మా శుభాకాంక్షలు. ఈ సమావేశాలకు తెలుగు దేశం నుంచి ఎందరో రాజకీయ కళా సాంస్కృతిక రంగాల ప్రముఖులు అతిథులుగా వస్తున్నారు. తానా సాహిత్య సమావేశంలో మేడసాని మోహన్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, కాత్యాయనీ విద్మహే, మృణాలిని, వాసిరెడ్డి నవీన్ తదితరులు పాల్గొంటున్నారు. బాపూ బొమ్మల కొలువు ఈ సమావేశంలో ఒక ప్రత్యేక ఆకర్షణ.
ఈ సందర్భంగా కె.వి. గిరిధరరావు సంపాదకత్వంలో ప్రచురింపబడిన జ్ఞాపిక తెలుగు పలుకు లోని సాహిత్యాన్ని ఈమాట గ్రంథాలయంలో పొందు పరిచాము. ఇలా సావనీరులో ప్రచురించబడిన రచనలను మరెందరో పాఠకులు చదవగలిగే ఈ ప్రతిపాదనకు సాదరంగా అంగీకరించి సహకారం అందించిన తానా వారికి మా కృతజ్ఞతలు.
తెలుగు పలుకు – తానా 2011 ప్రత్యేక సంచిక
ఈ సంచికలో మీకోసం – ఆర్. దమయంతి వానజల్లుల జ్ఞాపకాలు; వేలూరి చెప్పిన కథ నచ్చిన కారణం; భైరవి రాగంపై రోహిణీప్రసాద్ సంగీత వ్యాసం; ఇంద్రాణి, ఉదయకళ, కృష్ణదేశికాచార్యుల కవితలు; మరి కొన్ని అపురూపమైన గొంతుకల ఆడియోలు; కనకప్రసాద్ శబ్ద సాహిత్యం; పాత సినిమా పత్రిక కినిమా నుంచి సేన్ గుప్తా వ్యాసం; తదితర రచనలు.
ఆనాడు అర్ధంతరంగా ఆపేసిన గీతాలన్నీ ఇన్నాళ్ళ తర్వాత
ఆలపించటానికి మళ్ళీ ఉత్సాహంగా గొంతులు సవరిస్తాం
గుంట్నాకొల్లందరు అవి తినీసి రొబోలకెల్తామనుకుంట్నారు గావాలని, ఐస్క్రీములన్ని కారు బైటే తిని, చేతులు మూతులు కాయితాల్తోటి తుడుసుకున్నాక సెప్పీనాది సావుకబురు చల్లగాన. ‘టిక్కట్లైపోయ్యంటఱ్ఱా పిల్లలూ! ఇంకెప్పుడైనా చూడొచ్చులే రోబో, సరేనా?’ అనీసి.
“అదేమిటి? ఇద్దరమే కూచుని గంటల తరబడి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. సినిమాకి వెళితే నా పక్కనే కూచునేదానివి. గుర్తుందా ఒకసారి వానలో ముద్దముద్దగా తడిసి వస్తుంటే “రిం ఝిం గిరె సావన్” పాట పాడుతూనే ఉన్నావు దారంతా? నేను అడగ్గానే ఏ పాటయినా పాడేదానివి!”
పుస్తకం కొనుగోలు, పఠనానుభవం – బాగున్నాయి. పైగా, లీగల్ గా కొంటున్నాం కనుక, ఆత్మసంతృప్తి కూడానూ! బయటి రాష్ట్రాల్లో, దేశాల్లో ఉండేవారికి ఇది ఉపయోగకరమే. అయితే, ఈ పుస్తకం కొనుగోలు చేయడం లో ఉన్న తతంగం అంతా సామాన్య ప్రజలకి అంత తేలిగ్గా అర్థం కాదేమో అని నా అనుమానం.
1952-53 ప్రాంతాల చందమామతో బాటుగా నాగిరెడ్డిగారు ప్రచురించిన సినీ మాసపత్రిక ‘కినిమా’లో ట్రిక్‌ఫోటోగ్రఫీ దగ్గర్నుంచీ అనేక సాంకేతికవిషయాలూ, అప్పుడే పైకొస్తున్న సినీప్రముఖుల వివరాలూ అన్నీ ఉండేవి.
చెదరి పడే ముంగురులలరిచి పోరా
చేతుల గోరింట తడియారదూ
చెదరి పడే ముంగురులలరిచి పోరా.
ఈ గొంతుకలన్నీ ఆకాశవాణి వారు వేరువేరు సందర్భాల్లో రికార్డు చేసినవి. ప్రముఖుల గళాలు అన్న శీర్షికన శంకరమంచి సత్యం ప్రసారం చేసిన ఒక కార్యక్రమం ఈ ఆడియోల సంకలనం.
పూనాలో పుట్టి పెరిగిన ఆమె తండ్రి మరాఠీ స్టేజి నాటక సంగీతప్రియుడు. భైరవి రాగం పేరు అతనికి తెలియడం అతని సంస్కారాన్ని సూచిస్తుందని నేను సమాధానం చెప్పాను. ఆ తరం మహారాష్ట్రులకు నాట్యసంగీత్ అంటే వల్లమాలిన అభిమానం.
అంత అద్భుతంగా ఎంత కాలమో జరగలేదు. ఆ తర్వాత, పెరిగి పెద్దవుతున్న కొద్దీ పరిస్థితుల్లో, ఆలోచనల్లొ మార్పులొచ్చాయి. మబ్బులాకాశం, పిల్ల తెమ్మెరలు, వీచే గాలులు భవిష్యత్తు మీద కొత్త ఆశల్ని రేపేవి. చూసినప్పుడల్లా ప్రియమైన వారి గుర్తులేవో మోసుకొస్తున్న భావన కలిగేది.
నిజం చెప్పొద్దూ! అంతకన్నా ఎక్కువ బాధ కలిగించింది, నా గురించి నాలుగు ముక్కలు నేనే రాసి పంపించవలసిందని మీ అధ్యక్షులవారి తాఖీదు లాటి విన్నపం. ఇది నిజంగా నా హృదయాన్ని తొలిచివేసి గుండె పోటు తెప్పించిందంటే నమ్మండి.
మొదటి భాగంలో కప్పని మింగుతున్న పాము గురించి వెంకటాద్రికి వాడి అమ్మ కనకమ్మ చెప్పడం, ప్రతీకగా దాని అవసరం కథాంతంలోగాని బయట పడదు. ఈ రకమైన ‘ట్విస్ట్’ అలనాటి పాతకథల్లో మామూలు. ఇప్పటి కొన్ని కొత్త కథల్లోనూ ఈ రకమైన ‘విరుపు’ కనిపిస్తుంది.
తన దృష్టికి వచ్చిన ప్రతి రచననూ, రచయితనూ ఇది మంచిది, అది మంచిది కాదు, ఈ సృజనకి నావి ఇన్ని మార్కులు! అని నిర్ణయించి తీరాలన్న నమ్మకం. చర్చకు వచ్చిన అన్ని విషయాల మీదా, తనకూ చుట్టూ ఉన్నవాళ్ళకు కూడా ఇదమిద్ధం అని స్పష్టమైన అభిప్రాయాలు ఉండే తీరాలన్న ఊహ.
అమ్మా, నాకేం పేరు పెడతావు …
సుధ అంటావా, మధు అంటావా
నిధినా లేక నిశినా
రత్ననా, రశ్మినా
హిమాలయాల్లో ప్రవరుడు, భగీరథుడు తపస్సు చేసిన చోటు, శివుని కంటిమంటకు మన్మధుడు బూడిద అయిన చోటు, సప్తర్షుల భార్యలను మోహించి అగ్నిదేవుడు విరహం అనుభవించిన చోటు, కుమారస్వామి పుట్టిన చోటు – ఇలా చాలా ప్రదేశాలు చూస్తాడు.
పొగలూరే పొయ్యి కింద
తాపీగా కాలుతాయి కట్టెలు
విసన కర్ర చెప్పినట్టల్లా
తలలాడిస్తాయి మంటలు
కిసలంబుల వసనంబులు
కుసుమాభరణంబులు,పికకులభాషణముల్
లసితంబగు కనకాంగము
పొసగ న్నారామలక్ష్మి పొంపెసలారెన్.