రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

బాపూ

రచన: వేలూరి వేంకటేశ్వర రావు
సెప్టెంబర్ 2014

తెలుగులో వేమన పద్యాలు వినని వాళ్ళుండరు. బాపూ బొమ్మలు చూడని వాళ్ళూ లేరు. వేమన పద్యాలు నిజంగా ఎవరు రాశారో తెలియదు. కాని, బాపూ బొమ్మలు వేసింది సత్తిరాజు లక్ష్మీనారాయణ అనే ఆయన అని చెప్పితే ఎవరూ నమ్మరు. ఎందుకంటే బాపూ అనే పేరే ఆయన నిజం పేరయిపోయింది.

వేమన పద్యాలు ఎవరు ఎక్కడ ఏ సందర్భంలో వాడుకున్నా ఎవరూ కాదనరు. వేమన, నా పద్యాలు నన్నడక్కండా వేశారేం అని కోప్పడడు. మన కాలంలో, కాపీ రైటు చట్టాలు, అనుకరణ నిషేధాలూ ఉన్నప్పుడు కూడా బాపూ తన బొమ్మలని గాలి, నీరు, వెలుతురూ లాగా తెలుగు దేశం అంతటా పంచి పెట్టేశాడు. అక్కడే కాదు, తెలుగువాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ దాకా తన బొమ్మలని పట్టుకోపోనిచ్చాడు.

బొమ్మ అడగడం తడవు — ఆశు కవిత్వం చెప్పే కవికన్నా వేగంగా బొమ్మలు వేసే బాపూ — తన బొమ్మలని తెలుగు మాటలు బతికున్న ప్రతిచోటికీ, మాటలకన్నా వేగంగా ప్రసారం కానిచ్చాడు.

తెలుగు వాళ్ళు వేమన లాంటి కవులకి సన్మానాలు చెయ్యలేదు. వాళ్ళని తమ మామూలు మాటల్లో కలిపేసుకొని సొంతం చేసుకున్నారు, అంతే! బాపూ కూడా అలాంటి వాడైపోయాడు. చిత్రకారుడుగా అతన్ని పనికట్టుకొని ఎవరూ పొగిడినట్టు లేదు. కాని, అతని బొమ్మలు లేకండా ఎవరూ ఏ పనీ చెయ్యరు. పత్రిక పెట్టినా, ఫ్లైయర్ పంపినా, పుస్తకం అచ్చేసుకున్నా, బాపూ గీత లేనిదే అది మనకి పూర్తి కాదు.

“బాపూ గొప్పవాడు. మనం పట్టంకట్టి నువ్వు గొప్పవాడివి అని చెప్పవలసిన అవసరం లేనంత గొప్పవాడు,” అని నేను 1983 తెలుగు వెలుగు (షికాగో) రాత పత్రికకి సంపాదకుడిగా రాశాను. మా పత్రికకి మీ బొమ్మలు కావాలి, అని అడగంగానే, పాతిక పైచిలుకు బొమ్మలు – అట్టమీద వేసుకోడానికి గాను పెద్ద సైజు బొమ్మలు – గ్యాప్ ఫిల్లర్స్ లాగా వాడుకోటానికి మరోపాతిక చిన్న సైజు బొమ్మలు, పంపించాడు బాపూ.

తరువాత, ఆ బొమ్మలన్నీ సెయింట్ లూయిస్ తానా వాళ్ళకిచ్చాను, ప్రదర్శన కోసం! అంతే! ఆ బొమ్మలే కొన్ని సంవత్సరాలపాటు అమెరికా తెలుగు పత్రికలన్నింటినీ అలంకరించాయి.

1985లో లాస్ ఏంజలిస్ తానా సభలు అయిన తరువాత, ఒక వారం రోజులుండేట్టు చికాగో వస్తున్నానని చెప్పాడు. ఆయన్ని అప్పుడు అడిగాను, అక్కడ బొమ్మల కొలువు పెట్టారా? అని. సంతృప్తికరమైన జవాబు ఇవ్వలేదు. వెంటనే, విశాల షికాగో తెలుగు సంస్థ ఆధ్వర్యంలో ఒక బొమ్మల కొలువు పెట్టాం. దగ్గిర దగ్గిర మూడువందలమంది వచ్చారు, బొమ్మలు చూడటానికి!

తరువాత, ఆయన్ని చాలాసార్లు కలిశాను; భారతంలోను, అమెరికాలోనూ!

ఒకసారి ఆయన, పెమ్మరాజు వేణుగోపాల రావు, నేనూ హ్యుస్టన్లో సదస్సుకి వచ్చాం. కారులో ఆయన్ని, రావుగారినీ సదస్సుకి తీసికెళ్ళాలి. “బాపూ! మీరు వెనక సీటులో కూచోండి. రావు గారు ముందు కూచుంటారు. ఆయన నాకు డైరెక్షన్లు చెప్పాలి,” అన్నాను. “ నేనూ డైరెక్టరునే! ఆపని నేను చెయ్యలేననుకున్నావా?” అన్నాడు. మాకు నవ్వాగలేదు.

ఇప్పుడు బాపూ లేడు. అమెరికా తెలుగు వాళ్ళ ఇళ్ళల్లో వేమన పద్యాల పుస్తకం ఉండక పోవచ్చు. బాపు వేసిన బొమ్మ ఉండి తీరుతుంది.

    
   

7అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Siddineni Bhavanarayana September 1, 2014 12:23 pm

    వేలూరి వేంకటేశ్వర రావు గారూ,

    సృజనాత్మకంగా ఊహించడం లోనూ,ఊహని కళాత్మకంగా ఆవిష్కరించడం లోనూ ఆయన ఈ యుగానికి ఒక్కడే. తెలుగు అక్షరానికి ఒయ్యారం, తూపూ, సొగసూ ఒనగూర్చడం లోనూ అంతే. ఎంతొ ప్రత్యేకమైన ఆయన set of tastes ని తెలుగు సినీమా కూడా corrupt చెయ్యలేక పోయింది. ఈ జాతి నష్థం తీరేది కాదు.

  2. 2
    తాడిగడప శ్యామలరావు September 30, 2014 1:09 pm

    పరిచయం అక్కరలేని రెండు తెలుగుపేర్లు బాపు, రమణ.
    ఇంక ఏమీ వ్రాయనక్కరలేదు.

  3. 3
    వంగూరి చిట్టెన్ రాజు October 20, 2014 1:02 am

    “బాపు” గారి మీద వేలూరి గారి వ్యాసం ఇప్పుడే చూశాను. అందులో ఆయన యాదాలాపంగా ప్రస్తావించిన హ్యూస్టన్ సదస్సు పేరు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నిర్వహించిన ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు. ఆయన పస్తావించిన కారు ప్రయాణం డ్రైవర్ పేరు వంగూరి చిట్టెన్ రాజు. అప్పుడు వారు ముగ్గురూ మా ఇంట్లోనే ఉన్నారు.

    ఈ వ్యాసమూ, చేకూరి గారి మీద వ్యాసమూ చూడగానే అసలు ఆశ్చర్యం ఏమిటంటే అదే పెమ్మరాజు వేణు గోపాల రావు గారు మరణించిన అతి కొద్ది రోజులలో వెలువడబోతున్న “ఈ మాట” లో ఆయన మరణ వార్త ప్రకటించమని ప్రత్యేకంగా కోరినప్పుడు “We don’t publish obituaries in Emaata” అనే సమాధానం వచ్చింది.

    అదీ సంగతి.

  4. 4
    v r veluri October 20, 2014 4:27 pm

    వంగూరి చిట్టెన్‌రాజు గారు పంపిన కామెంటు పై నా సవరణ అవసరం అనిపించి ఈ మూడు మాటలూ రాస్తున్నాను.

    హ్యూస్టన్‌ సదస్సు అని అనడం నా పొరపాటే. క్షమార్హుణ్ణి.
    అది వంగూరి ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన సాహితీ సదస్సు.

    మేము ముగ్గురమూ, అంటే, బాపుగారు, పెమ్మరాజు గారు నేనూ అద్దె కారులో ప్రయాణం చేసాము. సదస్సు జరిగే స్థలానికి రావుగారు, తిరిగి వచ్చేటప్పుడు నేనూ, కారు తోలినట్టు నాకున్న జ్ఞాపకం. వంగూరి గారు మాతో వచ్చినట్టు నాకు గుర్తు లేదు.

    ఆ సందర్భంలో బాపూ గారితో ఇంకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం — ముఖ్యంగా నవతా కృష్ణంరాజు గురించి. వంగూరి ఫౌండేషన్‌ వారి సదస్సు ముగిసిన తరువాత ఆ అద్దె కారు తిరిగి ఇచ్చెయ్యడానికి మాకు నానా యాతనా అయ్యింది. అప్పుడూ నేనే డ్రైవర్ని.

    శలవు –వే వే

  5. 5
    Madhav October 20, 2014 8:24 pm

    చిట్టెన్రాజు గారు,

    పెమ్మరాజు గారి విషయమై మీరు ఎవరితో సంప్రదించారో చెప్పగలరా దయచేసి? I do not have any record of your communication with eemaata in my emails. Could you please forward that correspondence to the editors? Thank you.

  6. 6
    వంగూరి చిట్టెన్ రాజు October 20, 2014 11:11 pm

    మాధవ్ గారూ,

    పెమ్మరాజు వేణుగోపాల రావు గారు పోయినప్పుడు నేను ఇండియాలో ఉన్నాను. ఆ తరువాత వారం రోజులలోపుగా అనుకుంటాను…ఈమాట కొత్త సంచిక విడుదల అయినప్పుడు అందులో కనీసం ఆయన మరణం గురించిన వార్త కూడా లేకపోతే ఆశ్చర్య పోయాను. అప్పటి నా సమాచారం ప్రకారం ఆయన తమ్ముడు శ్రీరామారావు గారు అప్పటి ఎడిటర్ గారిని ఫోన్ చేసి అడిగినట్టూ, ఆ సమాధానం వచ్చినట్టూ నాకు పెమ్మరాజు గారి భార్య చెప్పారు. ఈ విషయంలో ఇ-మెయిల్ ఏమీ లేదు. ఈ మాట వార్తా పత్రిక కాదు అని తెలిసినా, ఈ విషయంలో ఎక్కడో, ఏదో తేడా ఉంది అని నాకు ఇప్పటికీ అనిపిస్తుంది.

    [అప్పటి ఎడిటర్ నేనే కాబట్టీ ఈ విషయంలో ఎక్కడో, ఏదో తేడా ఉంది అని నాకూ అనిపిస్తోందండీ – మాధవ్.]

  7. 7
    వంగూరి చిట్టెన్ రాజు October 20, 2014 11:37 pm

    వేలూరి గారూ,

    నాక్కూడా తొమ్మిదేళ్ళ క్రితం భాపు గారిని ఎవరు, ఎక్కడికి డ్రైవ్ చేశారూ అనే వివరాలు అంతగా గుర్తు లేవు. మీకెంత గుర్తో నాకూ అంతే గుర్తు…ఏది ఏమైనా ఏమీ పరవా లేదు.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • అర్థంకాని మాటలు – అర్థమవని కవితలు –
  • ప్రచురణకి వచ్చే రచనల గురించి
  • ఆధునిక చిత్రకళలో స్త్రీ మూర్తి
  • వార్ధక్యం
  • అమరు శతకం గురించి మూడుమాటలు

ఇటువంటివే…

  1. శ్రీశ్రీ కవితకు బాపూ బొమ్మ
  2. నా గురించి నేను

సెప్టెంబర్ 2014 సంచికలో ...

  • జ్ఞాపకాల వాసన
  • అక్కర లేని సంగతుల
  • అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: బరువు!
  • ఆచార్య చేకూరి రామారావు భాషాశాస్త్ర పరిశోధన, మార్గదర్శనం
  • ఇంకో సాయంత్రం
  • ఈమాట సెప్టెంబర్ 2014 సంచికకు స్వాగతం!
  • ఉండు
  • ఎడబాటు
  • కాళోజీ కవిత్వంలో మనిషి
  • కోనసీమ కథలు: రెండు ప్రేమ కాట్లు
  • తెలుగులో గ్రంథ పరిష్కరణ గురించి కొన్ని ఆలోచనలు
  • దేశభక్తి గేయాలు
  • నా గురించి నేను
  • నాకు నచ్చిన పద్యం: నన్నయ్య తీర్చిన గడసరి సొగసరి
  • నిప్పులు
  • పార్వతి తపస్సు: నన్నెచోడుని కుమారసంభవము
  • పుస్తక పరిచయం: The Simpsons and Their Mathematical Secrets (2013)
  • బాపూ
  • భక్తకవి బొప్పన గంగనామాత్యుని శ్రీ మహాభాగవత పంచమ స్కంధం
  • మంజుఘోష
  • మనిషికెంత భూమి?
  • మలయాళ ఛందస్సు – ఒక విహంగ వీక్షణము
  • విశ్వస్వరూపం: టెలిస్కోపులు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

జ్ఞాపకాల వాసన
నా గురించి నేను

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.